కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌ | Ktr Key Announcement On Kcr Bus Yatra | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

Jun 12 2026 3:16 PM | Updated on Jun 12 2026 3:30 PM

Ktr Key Announcement On Kcr Bus Yatra

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్‌ఎస్‌కు మంచిది.

..అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేశారు. మెట్రో పూర్తయి ఉంటే ట్రాఫిక్ చిక్కులు తగ్గేవి. హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మేము నగరంలో వంద చెరువులు బాగుచేశాం.. కానీ చెప్పుకోలేదు. రెండు చెరువులు బాగు చేసి ఉదరగుడుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది సమయం కేసీఆర్‌ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సర్‌ సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహించాము. మిగతా 59 నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘‘రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ అంతకంటే లేదు. జులై లో డీలిమిటెషన్‌ బిల్లు చేస్తారని సమాచారం ఉంది. దేశంలో డీలిమిటేషన్ చేయక పోయినా రాష్ట్ర విభజన అంశంలోనే పొందుపరిచారు కాబట్టి  రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని ఉంది. డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు ఎవరికి అనేది ఆలోచిస్తాం. అమ్మిన భూముల డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు కొత్త పథకాలు అమలు చేయడం లేదు’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement