హైడరాబాద్: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. యువ ఇంజనీర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం: హరీష్
ఉద్యోగులకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు హరీష్‌రావు.


