తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోంది | KTR reacts on MP Tejaswi Suryas comments | Sakshi
Sakshi News home page

తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోంది

Apr 17 2026 4:29 AM | Updated on Apr 17 2026 4:29 AM

KTR reacts on MP Tejaswi Suryas comments

కేటీఆర్‌ మండిపాటు 

ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ బేషరతుగా తెలంగాణకు క్షమాపణ చెప్పాలి

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై బీజేపీ నేతలు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య .. తెలంగాణ ఏర్పడటాన్ని భారత్‌ – పాకిస్తాన్‌ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహoకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గురు వారం ఒక ప్రకటనలో కేటీఆర్‌ పేర్కొ న్నారు. 

‘బీజేపీ నాయ కులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అల వాటుగా మార్చుకు న్నారు. స్వయంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని తేజస్వీ సూర్య వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందింది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీల మౌనం సిగ్గుచేటు: ‘పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలు.. తేజస్వీ వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణం. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేక పోయిన వీరు ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్యతో పాటు బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement