‘రేవంత్‌ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’ | ktr slams cm revanth reddy | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’

Apr 26 2026 5:24 PM | Updated on Apr 26 2026 5:32 PM

ktr slams cm revanth reddy

సాక్షి,హైదరాబాద్‌: దుర్మార్గ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్‌నగర్‌లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 

2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్‌లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్‌ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి  25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంది.

సీఎం రేవంత్‌రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్‌ ఉంది.. అందుకే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్‌ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్‌ నేత కమల్‌హాసన్‌ను మించి యాక్టింగ్‌ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement