కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్‌డేట్స్..
సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్..
- అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్
- తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
- కాంగ్రెస్‌తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.
- సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.
- సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.
- చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.
- బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.
- చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.
- చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.
- సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.
- ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.
- విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.
- చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.
- ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.
- మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.
- అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.
- గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్‌రావును అరెస్ట్ చేశారు.
- తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి అన్నారు.
- తెలంగాణ భవన్‌కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.
- దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.
- గన్‌పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.
- మేం గన్‌పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.
- చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.
- అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.
- లేదంటే మా వాళ్లను కంచన్‌బాగ్‌కు పంపించారు కదా..
- అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.
- సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.
- ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.
- హరీష్‌రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు.
జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..
- మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్‌లో ఎదురుచూస్తున్న కేటీఆర్
- తెలంగాణభవన్‌లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.
- సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..
- హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాం
- ముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాం
- హరీష్, కేటీఆర్ చర్చకు రాలేదు
- బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధం
- పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు.
అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..
- హరీష్ రావు సహా బీఆర్‌ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- హరీష్‌ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు.
- హరీష్ కామెంట్స్..
- మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానన్నారు.. తోక ముడిచారు.
- గురుకులాలపై చర్చలకు గన్‌పార్క్‌కు రమ్మన్నారు.
- మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.
- చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.
- అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.
- పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
- ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం.
- మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు.

దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..
- గన్‌పార్క్ బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.
- పాదయాత్రగా గన్‌పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.
- హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్ శ్రేణులు.
- పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.
- ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్
మంత్రి జూపల్లి కామెంట్స్
- గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి
- హరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారు
- బావ బామ్మర్దులు ఇద్దరు రండి
- నేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నాను
- వారి సవాల్‌కు సమాధానం అక్కడే ఇస్తాను
- బావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.
- ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.
- హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..
- ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు...
తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..
- కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.
- మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.
- పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.
- మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..
- పోలీసులతో హరీష్ వాగ్వాదం..
- పోలీసుల అదుపులో హరీష్.
- పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు.
హరీష్‌రావు అడ్డగింత..
- గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.
- పోలీసులతో బీఆర్‌ఎస్ శ్రేణుల వాగ్వాదం
- మంత్రులే గన్‌పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదం
- మా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు.
గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్
- మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు
- మంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందం
- తెలంగాణభవన్‌లోనే కేటీఆర్ ఉంటారు.
- ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.
- గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.
- చర్చకు మేం సిద్ధం.
- మంత్రులు అక్కడే ఉండాలి.
- మీ చాలెంజ్‌లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరి
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నం
- అవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం
తెలంగాణలో పొలిటికల్ హీట్..
- తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..
- సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.
ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు
- కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్
- గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్
- గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్
- మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్
- దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు
గన్‌పార్క్ చేరుకున్న మంత్రులు..
- గన్ పార్క్‌కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలు
- చర్చకు రావాలంటూ బీఆర్‌ఎస్ నేతలకు సవాల్..
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..
- కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.
- తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలు
- మినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్‌కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్
రాష్ట్ర అప్పులపై సవాళ్లు..
- రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.
- 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
- చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి.
- రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్
- కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.
మంత్రులు వర్సెస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
- గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
- గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
- అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.
- సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.
మంత్రి అడ్లూరి కౌంటర్..
- దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.
- ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.
- ఆర్‌ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉంది
- అందరి లెక్కలు తేలుస్తాం.


