KTR: పార్టీ పేరు మార్పుపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | KTR made key comments on the BRS party name change | Sakshi
Sakshi News home page

KTR: పార్టీ పేరు మార్పుపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 12 2026 6:42 PM | Updated on Apr 12 2026 9:03 PM

KTR made key comments on the BRS party name change

సాక్షి,మంచిర్యాల: పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో బీఆర్‌ఎస్‌ కారకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయాం. మళ్లీ టీఆర్‌ఎస్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. మేం తప్పులు చేశాం.. అందుకే ఓడిపోయాం. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు.. బాధపెట్టొద్దు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది.. ఓట్లు వేయాలి కదా. మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement