‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు’ | Ktr Fires On Revanth Reddy Government | Sakshi
Sakshi News home page

‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు’

Apr 22 2026 6:29 PM | Updated on Apr 22 2026 6:48 PM

Ktr Fires On Revanth Reddy Government

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్‌ ఇచ్చిందే’’ అని కేటీఆర్‌ తేల్చి చెప్పారు.

‘‘అది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్‌. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్‌అండ్‌టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టారు.

..ఎస్‌బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్‌లో చెక్‌డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్‌పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్‌, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్‌ హితవు పలికారు.

 

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement