బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతున్న ప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడా లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022–23 నుంచే బీఆర్‌ఎస్ గళమెత్తుతోందని, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పున రుద్ఘాటించారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టి న ఈ బిల్లులో ఉన్న అస్పష్టతపై ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం నగరంలోని పీర్జాదిగూడలో కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ.. 1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపది కన జరిగిందని గుర్తు చేశారు. ఐదు దశాబ్దా లుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. జాతీయ జనాభా విధానాన్ని తూ.చ. తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం లోక్‌సభ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24 శాతం ఉందని, దాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని చెప్పారు.
‘0.01 శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఆరు దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 24శాతం కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. మీరు నిప్పుల కుంపటి మీద కూర్చున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది‘ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
మహిళా బిల్లుకు మద్దతు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని, తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి, పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?‘ అని కేటీఆర్ నిలదీశారు.
రేవంత్ వైఖరిలో స్థిరత్వమేదీ?
సీఎం రేవంత్ రెడ్డిని ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి‘గా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆరోపించారు. ‘ఉద యం ఆయన కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఉంటారు, సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది‘ అని వ్యాఖ్యానించారు.
సీఎం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని విమర్శించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్యమంత్రి, హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మీకో విధానం, ఇతరులకో విధానమా అని నిలదీశారు.


