కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్ | Police Halt BRS Convoy At Pembarthi, KTR Engages In Heated Argument, More Details Inside | Sakshi
Sakshi News home page

కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్

Jul 5 2026 11:25 AM | Updated on Jul 5 2026 3:29 PM

Police Halt BRS Convoy, KTR Enters Heated Argument

కేటీఆర్‌ కన్నెపల్లి పర్యటన అప్‌డేట్స్‌

  • కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

  • వృథాగా పోతున్న జలాలను పరిశీలించిన కేటీఆర్

  • కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్

పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం

పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  శాంతిభద్రతల దృష్ట్యా కేవలం కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులు, కార్యకర్తల వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

పోలీసుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్.. తన వాహనాన్ని రహదారిపైనే నిలిపివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను నెట్టేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement