‘మంత్రులు గన్‌పార్క్‌కు కాదు.. జూపార్క్‌కి వెళ్లాలి’ | KTR Comments On Revanth Reddy And Jupally Krishna Rao | Sakshi
Sakshi News home page

‘మంత్రులు గన్‌పార్క్‌కు కాదు.. జూపార్క్‌కి వెళ్లాలి’

Jul 2 2026 4:51 PM | Updated on Jul 2 2026 7:06 PM

KTR Comments On Revanth Reddy And Jupally Krishna Rao

సాక్షి, హైదరాబాద్‌: మంత్రులు తొడ కొట్టడం ఎందుకు? తోక మూడవటం ఎందుకు?. చేత కానప్పుడు.. మంత్రులు ఎందుకు సవాళ్లు విసిరారు అంటూ మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తప్పుల మీద.. మా మీద వేస్తున్న అప్పులు నిందల గురించి సవాల్ చేశాను. టైము, డేటు, ప్లేస్ రేవంత్‌నే చెప్పమన్నా.. మధ్యలో జూపల్లి దూరారు’’ అంటూ కేటీఆర్‌ దుయ్యబట్టారు.

‘‘జూపల్లి ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తున్న అని తొడగొట్టారు.. జూపల్లికి స్వాగతం చెబుదామని శాలువా, దండలు రెడీ చేసుకుంటే తోక ముడిచి పారిపోయి గాంధీభవన్‌లో దాక్కున్నాడు. మంత్రులు రావాల్సింది గన్ పార్క్‌కు కాదు.. జూ పార్క్‌కి.. విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్‌లో పెట్టాలి. గన్ పార్క్‌కి బయలుదేరితే మా వాళ్లని అరెస్ట్ చేశారు.. పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు.’’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకోవటానికి కాదు ఇక్కడ ఉన్నది కేసీఆర్ దళం.. తెలంగాణ అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ ఏం చెప్పింది?. పార్లమెంట్‌లో చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు.. రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్ల అంటాడు.. భట్టి విక్రమార్క 7 లక్షల కోట్ల అప్పంటాడు. రేవంత్ రెడ్డికి అప్పులు చేయటం.. భూములను అమ్మటం, అనుముల బ్రదర్స్‌కి దోచి పెట్టడం ఇదే తెలుసు.’’ అంటూ కేటీఆర్‌ ఆరోపించారు.

మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement