ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్‌కు ఓ బాలిక కృతజ్ఞత | Brain tumour survivor thanks KTR for treatment help | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్‌కు ఓ బాలిక కృతజ్ఞత

May 4 2026 7:59 AM | Updated on May 4 2026 8:38 AM

Brain tumour survivor thanks KTR for treatment help

హైదరాబాద్: ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్న ఓ బాలిక నాటి మంత్రి కె. తారక రామారావు అందించిన సాయంతో కోలు కొని ప్రస్తుతం కొత్త జీవితం అనుభవిస్తోంది. హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ బాలంరాయ్‌ ప్రాంతానికి చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య ప్రాణాంతక బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడగా ప్రైవేటు ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు రూ. లక్షల వైద్య ఖర్చు భరించడం సాధ్యంకాలేదు. 

ఆ కష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌.. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శరణ్యకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారు. కాలక్రమంలో శరణ్య పూర్తిగా కోలుకొని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 384 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్‌ను తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించగలగడం నా అదృష్టం. శరణ్య ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement