breaking news
Sports
-
ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి పుష్కరం గడిచింది. అతని సమకాలీకులు రాహుల్ ద్రవిడ్ (2012లో ఆఖరి మ్యాచ్), సౌరవ్ గంగూలీ (2008లో) తమ ఆటను ముగించి చాలా కాలమైంది. ఈతరం దిగ్గజం ధోని కూడా మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు. కానీ క్రికెట్ అభిమానుల్లో వీరందరి పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆటకు సంబంధించిన లేదా క్రికెటేతర కార్యక్రమం అయినా సరే...వీరు హాజరైతే చాలు, దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ దిగ్గజ క్రికెటర్లకు వాణిజ్యపరంగా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పని చేస్తుండటం విశేషం. పైగా ఆయా బ్రాండ్లకు అంబాసిడర్లుగా మాత్రమే కాకుండా చాలా వ్యాపారాల్లో సహ భాగస్వాములుగా తాము కూడా మార్కెట్‌ను శాసిస్తున్నారు. – సాక్షి, క్రీడా విభాగంముగ్గురూ ముగ్గురేసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం 25 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో 10 కంపెనీల్లో అతను సహ భాగస్వామి. సగం వాటిలో అతను కేవలం పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టగా... మరో సగం కంపెనీ వ్యవహారాల్లో తన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ చురుకైన భాగస్వామిగా ఉన్నాడు.మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా 42 బ్రాండ్స్‌తో జత కట్టాడు. రెగ్యులర్‌గా ప్రకటనల్లో కనిపించే బ్రాండింగ్ కాకుండా ప్రీమియం స్పోర్ట్స్ టూరిజం కంపెనీ ‘డ్రీమ్ సెట్ గో’ను సొంత వ్యాపారంలా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ వీరిలో మరింత ప్రత్యేకం. ఈ మిస్టర్ డిపెండబుల్ కనీసం సోషల్ మీడియాలో కూడా లేడు. కానీ 24 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా నెమ్మదైన స్వభావానికి బ్రాండ్ అంబాసిడర్‌లాంటి ద్రవిడ్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ‘క్రెడ్’కోసం ‘నేను ఇందిరానగర్ గూండాను..’అంటూ చేసిన యాడ్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరు ప్రఖ్యాతలే పెట్టుబడిగా...క్రికెట్ నుంచి తప్పుకొని చాలా రోజులైనా ఈ మాజీలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. దీనిపై వ్యాల్యుయేషన్ రంగంలో నిష్ణాతులైన హర్‡్ష తలికోటి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కెరీర్లో వారు సాధించిన ఘనతలతో వచ్చిన పేరుప్రఖ్యాతులే కాదు.. ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్లీన్ ఇమేజ్, అభిమానులకు వారంటే ఉన్న గౌరవం, ఏళ్లు గడిచాక కూడా తమను తాము మార్చుకుంటూ ప్రస్తుత సెలబ్రిటీల్లో కూడా తమ ప్రత్యేకత నిలబెట్టుకోవడమే అందుకు కారణం’అంటాడు. పైగా తాము నమ్మిన, విశ్వాసం ఉన్నవాటితోనే జత కట్టడానికి వీరు సిద్ధమవుతారు. ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌ను తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా వాడుతున్నాను కాబట్టి దానికి ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు ద్రవిడ్ చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.ధోని, విరాట్, రోహిత్ఈతరం అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లి ప్రస్తుతం చెరో 45 బ్రాండ్లతో కలిసి పని చేస్తుండటం విశేషం. ఇటీవల ‘ఎజిలిటాస్’స్పోర్ట్స్ కంపెనీలో కోహ్లి రూ.40 కోట్లతో భాగస్వామిగా చేరి అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. 10 స్టార్టప్‌లలో అతను పెట్టుబడులు పెట్టాడు. ధోని కూడా ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరో స్పేస్ కంపెనీల్లో భాగమయ్యాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా క్రేజ్ తగ్గలేదు. అడిడాస్, సియట్, నిస్సాన్ వంటి అనేక ప్రముఖ కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్నాడు. సుమారు 20 బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నాడు.ఉభయతారక ఒప్పందాలుభారత్లో క్రికెటర్లకు పాన్ ఇండియా విలువ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఒక్కో ప్రాంతం లేదా భాషకే పరిమితమయ్యే సినిమా తారలతో పోలిస్తే క్రికెటర్ల ప్రకటనలే పెద్ద సంఖ్యలో జనానికి చేరతాయని ప్రకటన రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు ఉభయతారకంగా ఉంటూ అటు ప్లేయర్లకు, ఇటు కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉండటం కారణంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ కాలపు అనుబంధం కొనసాగుతోంది.ధోని బ్రాండింగ్ చేస్తున్న ఏరో స్పేస్ కంపెనీ ‘గరుడ’ఆదాయం ఏడాది తిరిగే లోగా రూ.15 కోట్ల నుంచి రూ. 123 కోట్లకు చేరగా, తర్వాతి సంవత్సరమే కంపెనీ పూర్తిగా లాభాల్లోకి మళ్లింది. కోకాకోలాతో గంగూలీ అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగుతుండగా, పవర్ కంపెనీ ల్యుమినస్ 15 ఏళ్లుగా సచిన్‌తో కలిసి ఉంది. ఆటకు గుడ్‌బై చెప్పినా మార్కెటింగ్, బ్రాండింగ్‌ను తాము శాసించగలమని ఈ దిగ్గజాలంతా నిరూపిస్తున్నారు.⇒ ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌కు చెందిన ల్యూబ్రికెంట్స్ యాడ్‌లో ద్రవిడ్ నటించిన తర్వాత అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయని స్వయంగా కంపెనీ వెల్లడించింది. కర్ణాటకలో ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌తో ద్రవిడ్ జతకట్టిన తర్వాతే అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి.⇒ ‘గరుడ’బ్రాండ్‌తో వచి్చన డ్రోన్ల వ్యాపారం పెరుగుదలకు ధోని మాత్రమే కారణమని ఆ సంస్థ సీఈఓ అగీ్నశ్వర్ వెల్లడించడం ‘కెప్టెన్ కూల్’విలువేమిటో చెబుతుంది. -
సరిగ్గా... సమంగా...
లార్డ్స్ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్‌లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్ చేసిన స్కోరునే భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. తొలి సెషన్లో రాహుల్–పంత్‌ల భాగస్వామ్యం, రెండో సెషన్లో జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిల నిలకడ... భారత్ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్‌పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.లండన్: బుమ్రా తన బౌలింగ్‌తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్‌ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్ చేసిన స్కోరే చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్ ఒక ఓవర్లో వికెట్ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్), డకెట్ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్‌ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. రిషభ్ పంత్ ఫిఫ్టీ ఓవర్‌నైట్ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్ సహకారంతో ఓపెనర్ రాహుల్, రిషభ్ పంత్ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్‌ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్ అసాంతం భారత్‌దే పైచేయి అయింది. ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్‌ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు పంత్ వికెట్ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్... స్టోక్స్ విసిరిన డైరెక్ట్ త్రోకు వికెట్‌ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రాహుల్ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు. రాహుల్ శతక్కొట్టిన వెంటనే... రెండో సెషన్లో రాహుల్‌తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్ రాహుల్... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్‌కిది పదో సెంచరీ కాగా... క్రికెట్ మక్కా లార్డ్స్‌లో రెండో శతకం. 2021–22 సీజన్లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్ ఇంగ్లండ్ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్న నితీశ్ వికెట్ కూడా భారత్ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్ కుమార్ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్ ముగిసింది. జడేజా అర్ధ సెంచరీ టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్ వికెట్‌ను పారేసుకున్నాడు. స్టోక్స్ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్ కీపర్ స్మిత్ చేతికి క్యాచ్ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్ సుందర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్ తీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్ దీప్ (7), బుమ్రా (0) సుందర్ వికెట్లను కోల్పోవడంతో భారత్ సరిగ్గా 387 పరుగుల వద్దే ఆలౌటైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 387; భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (సి) బ్రూక్ (బి) బషీర్ 100; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; శుబ్‌మన్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ రనౌట్ 74; జడేజా (సి) స్మిత్ (బి) వోక్స్ 72; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) స్టోక్స్ 30; సుందర్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 23; ఆకాశ్ (సి) బ్రూక్ (బి) కార్స్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) వోక్స్ 0; సిరాజ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.బౌలింగ్: వోక్స్ 27–5–84–3, ఆర్చర్ 23.2–6–52–2, కార్స్ 24–5–88–1, స్టోక్స్ 20–4–63–2, బషీర్ 14.5–2–59–1, జో రూట్ 10.1–0–35–0. ఇంగ్లండ్ రెండోఇన్నింగ్స్: క్రాలీ బ్యాటింగ్ 2; డకెట్ బ్యాటింగ్ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా) 2/0. బౌలింగ్: బుమ్రా 1–0–2–0. -
Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వింబుల్డన్-2025 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతంచేసుకుంది. రెండు సెట్లలోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిలవలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. -
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడ్డాడు. 78వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా షాట్ ఆడాడు.ఈ క్రమంలో బంతిని ఆపే ప్రయత్నంలో అతడి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. దీంతో బషీర్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో రాకముందే తనంతట తానే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సామ్ కూక్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఇంగ్లండ్‌కు ఇది నిజంగా గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జట్టులో బషీర్ ఏకైక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. అతడు బయటకు వెళ్లిపోవడంతో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ రూట్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.కాగా సెంచూరియన్ కేఎల్ రాహుల్‌ను బషీర్ అద్బుతబ బంతితో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. 109 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(72), సుందర్(19) ఉన్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
'అంత తొందర ఎందుకు పంత్.. రూట్‌ను చూసి నేర్చుకో'
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎడమ చేతి వేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 112 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కన్పించిన రిషబ్ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అవసరంలేని రన్‌కు పరిగెత్తి తన వికెట్‌ను పంత్ కోల్పోయాడు. ఈ క్రమంలో పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శించారు. లంచ్ విరామానికి ముందు పంత్ అనవసరంగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడని కుంబ్లే మండిపడ్డాడు."రిషబ్ పంత్ అనవసరంగా ఔటయ్యాడు. అస్సలు అక్కడ పరుగు వచ్చే ఛాన్స్ లేదు. పంత్ మొదట పరుగుకు పిలుపిచ్చి, వెంటనే తన మనసు మార్చుకున్నాడు. కానీ పంత్ పిలుపుతో కేఎల్ రాహుల్ వెంటనే నాన్ స్ట్రైక్ నుంచి రన్ కోసం పరిగెత్తాడు.దీంతో ప్రారంభంలో పంత్ కాస్త సంకోంచి పరిగెత్తడంతో రనౌట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇది అనవసరం. ఎందుకంటే మరో మూడు బంతులు ఆడి ఉంటే, లంచ్ బ్రేక్‌కు వెళ్లిపోయేవారు. ఆ తర్వాత తమ ప్రణాళికలను అమలు చేసి ఉంటే సరిపోయిండేది.అంతకుముందు జో రూట్ 99 పరుగుల వద్ద ఉండగా ఆట ముగిసింది. తన సెంచరీ కోసం అతడు ఒక రాత్రి వేచి ఉండాల్సి వచ్చింది. కానీ అతడు ఎక్కడ కూడా తొందరపడి ఆడలేదు. పోప్, స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే వారు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడింది" అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 కెప్టెన్ ఆయూష్ మాత్రే ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్-19 జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయూష్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే వన్డే తరహాలో కేవలం 107 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభంలోనే టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వికెట్‌ను కోల్పోయింది.14 పరుగులు చేసిన సూర్యవంశీ.. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో ఆయుష్ మాత్రే తన అద్భుత బ్యాటింగ్‌తో ముందుండి నడిపించాడు. నంబర్ త్రీ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి మూడో వికెట్‌కు 173 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.తన సూపర్ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ జట్టు బౌలర్ల సహనాన్ని ఈ సీఎస్కే బ్యాటర్ పరీక్షించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి యువ భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజులో అభిజ్ఞాన్ కుండు(33), రాహుల్ కుమార్(32) ఉన్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాAyush Mhatre 💯 💥👏👏pic.twitter.com/fQxUEU707v— м α н ι z н α ηメ🐘ᵀⱽᴷ (@_Mahizhan) July 12, 2025 -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్బుతమైన నాక్ ఆడాడు. ఓవైపు చేతి వేలి గాయంతో పోరాడుతూనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 15 టెస్టులు ఆడిన పంత్.. 36 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది.రిచర్డ్స్ తన17 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఇంగ్లండ్‌పై 36 టెస్టులు ఆడి 34 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన పంత్.. విండీస్ గ్రేట్‌ను ఆధగమించాడు.👉అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక యాభైకి పైగా స్కోర్లు పర్యాటక వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ఇంగ్లండ్‌లో ధోని 8 సార్లు ఏభైకి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఎనిమిది సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. మరో ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధిస్తే ధోనిని ఆధిగమిస్తాడు.ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే35 రిషబ్ పంత్34 వివ్ రిచర్డ్స్30 టిమ్ సౌతీ27 యశస్వి జైస్వాల్26 శుభమన్ గిల్భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(31), నితీశ్ కుమార్(13) ఉన్నారు. -
అయ్యో రాహుల్.. సెంచరీ చేయగానే ఇలా అయిందేంటి?
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకంతో మెరిశాడు. లార్డ్స్‌లో నిలకడైన ప్రదర్శనతో 176 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్లో పదో సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌లో ఓవరాల్‌గా నాలుగోది. అదే విధంగా.. లార్డ్స్‌లో ఇది రెండోది కావడం విశేషం. తద్వారా దిలీప్ వెంగ్‌సర్కార్ తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ అవుటయ్యాడు. ఇంగ్లండ్ యువ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న రాహుల్.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నిరాశగా రాహుల్ క్రీజును వీడాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మక విజయంతో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరుజట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తైన వెంటనే పెవిలియన్ చేరాడు. ఇక భారత బ్యాటర్లలో మిగతా వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 74 పరుగులు చేశాడు. 74 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు వీరే🏏దిలీప్ వెంగ్‌సర్కార్- 3🏏కేఎల్ రాహుల్-2🏏వినూ మన్కడ- 1🏏గుండప్ప విశ్వనాథ్- 1🏏రవిశాస్త్రి- 1🏏మహ్మద్ అజారుద్దీన్- 1🏏సౌరవ్ గంగూలీ- 1🏏అజిత్ అగార్కర్-1🏏రాహుల్ ద్రవిడ్-1🏏అజింక్య రహానే-1.చదవండి: IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా At Lords, @klrahul delivered yet again, his 2nd century on this historic ground, becoming only the 2nd Indian to do so. #ENGvIND 👉 3rd TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/YhqadvE3Be pic.twitter.com/IvPIBFIBKY— Star Sports (@StarSportsIndia) July 12, 2025 -
ఓ వైపు గాయం.. అయినా విధ్వంసకర ఇన్నింగ్స్! శెభాష్ రిషబ్
ఓ వైపు తీవ్రమైన గాయం.. అయినా నేను ఉన్నా అంటూ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చాడు. అతడికి తన గాయం కంటే జట్టు గెలవడమే ముఖ్యం. తన విరోచిత పోరాటంతో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. గాయంతో పోరాడుతూనే జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చేతి వేలి నొప్పితో బాధపడుతూనే ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అతడే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేటట్లు కన్పించిన పంత్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గాయాన్ని లెక్కచేయని పంత్..తొలి రోజు ఆట సందర్బంగా పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత ప్రాక్టీస్‌లో కూడా పంత్ చేతి వేలి నొప్పితో బాధపడుతూ కన్పించాడు. దీంతో అతడు బ్యాటింగ్‌కు వస్తాడా రాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ పంత్ మాత్రం తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే జైశ్వాల్, గిల్ వికెట్లను కోల్పోయిన భారత జట్టును పంత్ ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. రాహల్‌లో కలిసి నాలుగో వికెట్‌కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ అద్బుతంగా ఆడుతున్న సమయంలో రనౌట్ రూపంలో పంత్ మైదానం వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పంత్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ రిషబ్ అంటూ కొనియాడుతున్నారు.సెంచరీకి చేరువలో రాహుల్..మూడో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 139 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(98) సెంచరీకి చేరువలో ఉన్నాడు. -
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
ఇంగ్లండ్ అండర్-19తో యూత్ టెస్టు సిరీస్‌ను భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పేలవంగా ఆరంభించాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి యూత్ టెస్టులో భారత్ అండర్-19, ఇంగ్లండ్ అండర్-19 జట్లు తలపడతున్నాయి.అయితే వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. ఈ తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఇంగ్లండ్ పేసర్ అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి తన వికెట్‌ను వైభవ్ కోల్పోయాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఎంత పనిచేశావు వైభవ్, నిన్నే నమ్ముకున్నాముగా అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.12 ఓవర్లు ముగిసే సరికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో విహాన్ మల్హోత్రా(6), ఆయూష్ మాత్రే(18) ఉన్నారు.వన్డేల్లో విధ్వంసం..ఈ సిరీస్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన యూత్ వన్డేల్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు. ఇక మూడో యూత్ వన్డేల్లో ఈ బిహార్ ఆటగాడు కేవలం 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అనంతరం నాలుగో వన్డేలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది 355 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్లో ఈ యువ సంచలనం రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.తుది జట్లుఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): జైద్న్ డెన్లీ, ఆర్చీ వాఘన్, హంజా షేక్(కెప్టెన్), రాకీ ఫ్లింటాఫ్, బెన్ మేయెస్, థామస్ రెవ్(వికెట్), ఎకాన్ష్ సింగ్, రాల్ఫీ ఆల్బర్ట్, జాక్ హోమ్, జేమ్స్ మింటో, అలెక్స్ గ్రీన్ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్త్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), అంబరీష్, మహ్మద్ ఈనాన్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అన్మోల్జీత్ సింగ్చదవండి: #Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కీలక నిర్ణయం.. -
బాబూ చిట్టీ.. ఇలాగైతే కష్టమే..!
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు. కానీ అతడికి రెండుసార్లు లక్ తగిలింది. ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుని సెకండ్ చాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఈ అవకాశాన్ని కూడా జారవిచుకునే పరిస్థితిలో నిలిచాడు. అతడు ఎవరో కాదు టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్. ఊహించని విధంగా టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన ఈ విదర్భ క్రికెటర్.. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంతో అతడిని టీమ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు రోజురోజుకు అధికమవుతున్నాయి.బ్యాటింగ్ భారం మోస్తాడనుకుంటే..33 ఏళ్ల కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపికై తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. 3006 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి సెలెక్టర్ల కంట్లో పడడడంతో ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ భారాన్ని మోస్తాడన్న భరోసాతో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. అయితే గత 2 టెస్టుల్లో అతడి తీరు స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు సాధించాడు. 5 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌లో శుబమన్ గిల్ 601 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీని బట్టే చూస్తే కరుణ్ ఎంతగా విఫలమయ్యాడన్నది అర్థమవుతుంది.ఇలాగైతే కష్టమే..మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కరుణ్ ఆటతీరు ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానం గల్లంతయ్యే అవకాశం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయితే ముప్పు తప్పదని చతేశ్వర్ పూజారా (cheteshwar pujara) అభిప్రాయపడ్డాడు. భారీ స్కోరు చేయడంలో కరుణ్ విఫలమవుతున్నాడని, అనవసర తప్పిదాలతో వికెట్ పారేసుకుంటున్నారని పూజారా వ్యాఖ్యానించాడు. రెండంకెల స్కోరును భారీ స్కోరుగా మలచడానికి అతడు ప్రయత్నం చేయాలని సూచించాడు. క్రీజులోనే పాతుకుపోవడం ద్వారా తప్పిదాలకు ఆస్కారం కలుగుతోందని విశ్లేషించాడు. బ్యాక్‌ఫుట్ చురుగ్గా కదపడం ద్వారా పరుగులు సాధించొచ్చని సలహాయిచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కరుణ్ ఎక్కువ స్కోరు చేస్తాడన్న ఆశాభావాన్ని పూజారా వ్యక్తం చేశాడు. కరుణ్ లాంటి బ్యాటర్‌కు సిరీస్‌లో తనదైన ముద్ర వేయడానికి ఆరు ఇన్నింగ్స్‌లు సరిపోతాయని వ్యాఖ్యానించాడు.చదవండి: అతడిని నాలుగో టెస్టులోనూ ఆడించాల్సిందేకరుణ్ ప్లేస్‌లో ఎవరు?తర్వాతి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే దానిపై కరుణ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అతడి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మొదటి టెస్ట్‌లో బాగానే ఆడినప్పటికీ జట్టులో స్థానం కోల్పోయిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ మళ్లీ చోటు దక్కించుకోవడానికి వేచిచూస్తున్నాడు. మరో టాలెంటెడ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా జట్టులో స్థానం సంపాదించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధ సెంచరీలతో సహా 227 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రేసులో ఉన్నాడు. కాబట్టి కరుణ్‌కు ఇది పరీక్షా సమయం. తనకు స్థాయికి తగినట్టు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టులో అతడి చోటుకు భరోసా ఉంటుంది. లేకపోతే పునరాగమనం మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. చూద్దాం నాయర్ ఏం చేస్తాడో! -
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కీలక నిర్ణయం..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకొన్నాడు. యాషెస్ సిరీస్, వేసవి బీజీ షెడ్యూల్ దృష్ట్యా అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కమ్మిన్స్ గత కొంత కాలంగా ఆ విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు.ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్రస్తుతం మూడు మ్యాచ్లటెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. శనివారం నుంచి ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. విండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు కూడా అతడు దూరంగా ఉండనున్నాడు."రాబోయే రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వేసవిలో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సిద్దమైందుకు నాకు దాదాపు 7 వారాల సమయం దొరికింది. అయితే ఈ సమయంలో బౌలింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయకపోవచ్చు. కానీ జిమ్ వర్క్ మాత్రం ఎక్కువగా చేస్తాను. న్యూజిలాండ్, భారత్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లలో తిరిగి ఆడే అవకాశముంది. ఆ తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీషెఫీల్డ్ షీల్డ్, యాషెస్ సిరీస్‌లతో బీజీబీజీగా గడపనున్నాను" అని విండీస్‌తో మూడు టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో కమ్మిన్స్ పేర్కొన్నాడు.కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియాకు రానుంది. ఆగస్టు 10న డార్విన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్తొలి టీ20- ఆగస్టు 10, ఆదివారం-డార్విన్రెండో టీ20-ఆగస్టు 12, మంగళవారం-కైర్న్స్మూడో టీ20-ఆగస్టు 16,శనివారం-కైర్న్స్తొలి వన్డే-ఆగస్టు 19, మంగళవారం-కైర్న్స్రెండో వన్డే-ఆగస్టు 22, శుక్రవారం-మక్కేమూడో వన్డే-ఆగస్టు 24, ఆదివారం-మక్కేచదవండి: కేఎల్ రాహుల్, గిల్ తప్పుల వల్లే ఇలా జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం -
కేఎల్ రాహుల్ వల్లే నష్టం జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా రెండు ప్రధాన తప్పిదాలు చేసిందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వాటి వల్లే ఇంగ్లండ్ 350 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగిందని అభిప్రాయపడ్డాడు.కేఎల్ రాహుల్ పొరపాటుతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు నిలువరించే వీలు లేకపోయిందని ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు మొదలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), సెంచరీ వీరుడు జో రూట్ (104)లను భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా త్వరత్వరగానే పెవిలియన్ చేర్చాడు.ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (51), టెయిలెండర్ బ్రైడన్ కార్స్ (56) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. నిజానికి జేమీ స్మిత్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు.మరోవైపు.. రెండో రోజు ఆటలో కేవలం 63 డెలివరీలు సంధించిన తర్వాతనే బంతిని మార్చాలంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టుబట్టాడు. అప్పటికి బుమ్రా ఆ బంతితో బాగానే రాణిస్తున్నా.. గిల్ అంపైర్‌తో వాదనకు దిగి మరీ బంతిని మార్పించాడు. అయితే, దురదృష్టవశాత్తూ పాత బంతి కంటే అంపైర్ ఇచ్చిన కొత్త బంతి మరింత వాడినదానిలా ఉండటంతో టీమిండియాకు షాక్ తగిలింది. మొమెంటమ్ మారిపోయింది.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘రెండోరోజు టీమిండియా చేసిన రెండు తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేసే అవకాశం చేజారింది. కేఎల్ రాహుల్ జేమీ స్మిత్ క్యాచ్ జారవిడవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. అక్కడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.స్మిత్ ఐదు పరుగుల వద్ద ఉన్నపుడు రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. ఆ తర్వాత అతడు బ్రైడన్ కార్స్‌తో కలిసి అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ గనుక అప్పుడే క్యాచ్ అందుకుని ఉంటే ఇలా జరిగేది కాదు.ఇక రెండోది... అసలు బంతిని మార్చమని ఎందుకు అడిగారో అర్థం కాలేదు. అప్పటికే తొలి సెషన్లోనే మూడు వికెట్లు తీశారు. అలాంటపుడు బంతిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ సమయంలో.. ఒకవేళ బంతి ఆకారం మారినా దానితో పెద్దగా వచ్చే నష్టం ఏముంది?ఓ బౌలర్‌గా చెప్తున్నా.. బంతి వల్ల మనకు ఏమాత్రం ఉపయోగం లేదనిపించినప్పుడు మాత్రమే మార్చమని అడుగుతాము. ఒకవేళ ఆ బంతి మరీ అంత చెత్తగా ఉండి ఉంటే మీకు ఉదయాన్నే మూడు వికెట్లు ఎలా దొరికేవి?.. అసలు బంతిని ఎందుకు మార్చమన్నారు?’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. -
‘అతడొక ఫెయిల్యూర్.. అయినా సరే నాలుగో టెస్టులోనూ ఆడించాలి’
ఇంగ్లండ్ సిరీస్‌తో సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన.. టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) వరుసగా విఫలమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతున్నాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టు తుదిజట్టులో భాగమైనకరుణ్.. రీఎంట్రీలో డకౌట్ అయ్యాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇరవై పరుగులు చేయగలిగాడు. అయితే, ఆ తర్వాత కూడా కరుణ్ నాయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడు చేసిన పరుగులు వరుసగా 31, 26. అయితే, ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Test)లో జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎట్టకేలకు కనీసం 40 పరుగుల మార్కులార్డ్స్లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో కనీసం అర్ధ శతకమైనా చేయకుండానే కరుణ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఇంగ్లండ్‌లో ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కరుణ్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.తుదిజట్టు నుంచి తప్పించండి!అయితే, యువ ఆటగాడు సాయి సుదర్శన్‌పై వేటు వేసి.. సీనియర్ అయిన కరుణ్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నా.. అతడి ఆట మెరుగుపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు నుంచి అతడిని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.ఫెయిల్యూరే.. కానీ.. నాలుగో టెస్టులోనూ ఆడించండికరుణ్ నాయర్ విఫలమవుతున్న మాట వాస్తవమేనని.. అయితే, నాలుగో టెస్టులో కూడా అతడిని ఆడిస్తేనే బాగుంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు అంత గొప్పగా ఆడటం లేదు. అలా అని అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగానూ లేదు.నిజానికి అతడి అదృష్టం అస్సలు బాలేదు. కరుణ్ ఇచ్చిన క్యాచ్‌లు సులువైనవి కాకపోయినా ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్బుత రీతిలో వాటిని ఒడిసిపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఓలీ పోప్.. ఇప్పుడు రూట్.కరుణ్ మరీ ఎక్కువగా పరుగులు చేయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించాలని అంటున్నారు.అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడిని తదుపరి మ్యాచ్‌లో తప్పక ఆడించాలి. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో గనుక కనీసం 30- 40 పరుగులు చేసినా అతడు నాలుగో టెస్టు ఆడేందుకు అర్హుడే అవుతాడు’’ అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఏదేమైనా కరుణ్ నాయర్ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే తన థర్టీస్, ఫార్టీస్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మలచాల్సి ఉంటుందన్నాడు ఆకాశ్. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 23- 27 మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి 145 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: MLC 2025: పొలార్డ్ విధ్వంసం... సూపర్ కింగ్స్ అవుట్... ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ -
అదొక చెత్త నిర్ణయం.. గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం!
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తీరును ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఓవైపు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. బంతిని మార్చాలంటూ అంపైర్‌ను ఒత్తిడి చేయడం సరికాదన్నాడు. అనవసరంగా బంతిని మార్చుకుని పెద్ద మూల్యమే చెల్లించారంటూ చురకలు అంటించాడు. అసలు విషయమేమిటంటే..ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ లార్డ్స్ (Lord's Test) వేదికగా మూడో మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా వరుస షాకులిచ్చాడు.వరుస షాకులిచ్చిన బుమ్రాబెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లను పెవిలియన్‌కు పంపిన ఈ రైటార్మ్ పేసర్.. ఈ మేరకు కీలక వికెట్లు కూల్చి టీమిండియాలో జోష్ నింపాడు. అయితే, అదే సమయంలో అంటే రెండో రోజు 10.4 ఓవర్ల ఆట తర్వాత బంతిని మార్చాలని భారత్ కోరగా.. అంపైర్ హూప్ టెస్టు నిర్వహించాడు. బంతి ఆకారం మారిందని గుర్తించి మరో కొత్త బంతినిచ్చాడు.అయితే, అంపైర్ ఇచ్చిన బంతితో కెప్టెన్ గిల్, మరో పేసర్ మహ్మద్ సిరాజ్ సంతృప్తి చెందలేదు. మునుపటి బంతి కంటే ఇది మరింత పాతదిలా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గిల్ అంపైర్‌తో కాసేపు వాదించాడు కూడా!..అదొక చెత్త నిర్ణయంఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. గిల్ తీరును తప్పుబట్టాడు. ‘‘బంతిని మార్చుకోవాలనే టీమిండియా నిర్ణయం వింతగా అనిపించింది. ఒకవేళ బంతి ఆకారం మారిందనుకుంటే అంపైరే స్వయంగా బంతిని మారుస్తాడు. లేదంటే.. ఉన్న బాల్‌తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని కెప్టెన్ భావిస్తే బంతిని మార్చమని కోరతాడు.ఈ రెండు సందర్భాల్లోనే బంతిని మారుస్తారు. కానీ.. తొలి సెషన్లో బంతి బాగానే ఉంది. 63 డెలివరీలో మాత్రమే సంధించారు. అప్పటికి బుమ్రా ఆ బంతితోనే అద్భుతమైన స్పెల్ వేశాడు. కానీ మరో ఎండ్‌లో సిరాజ్ మాత్రం క్యాచ్‌లు డ్రాప్ చేశాడు.బంతి వికెట్ కీపర్ చేతికి కూడా బాగానే వచ్చింది. అంతా సజావుగా సాగుతోన్న సమయంలో బంతిని మార్చాలని కెప్టెన్ కోరాడు. అంతటితో అతడు ఆగలేదు.. అంపైర్‌తో గొడవ కూడా పడ్డట్లు కనిపించింది. అయితే, మార్చుకున్న బంతి మరింత పాతదానిలా ఉంది. దీంతో వాళ్లు మరోసారి అసహనానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ నిర్ణయాలు నాకైతే కాస్త చెత్తగానే అనిపించాయి.బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. ఎందుకిలా చేశావు?ఒకటి బంతిని మార్చమని అడిగి టీమిండియా తప్పటడుగు వేసింది. అందుకోసం అంపైర్‌తో వాదనకు దిగడం రెండో తప్పు. కొత్త బంతి పాత బంతి కంటే మరింత ఎక్కువగా వాడిన బంతిలా ఉండటంతో.. మంచి బంతిని చేజార్చుకున్నట్లయింది. ఇది మీ మూడో తప్పు. ఓవైపు బుమ్రా ఆ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. అనవసరంగా మార్చి ప్రత్యర్థికి మంచి అవకాశం ఇచ్చారు’’ అని నాసిర్ హుసేన్ గిల్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌట్ కాగా.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 19 పరుగులు, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ అర్ధ శతకం (53)తో క్రీజులో ఉన్నారు.చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
పిరియడ్స్లోనూ ‘హాఫ్ ఐరన్‌మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్‌మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్‌లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.ఏమిటీ ‘ఐరన్ మ్యాన్70.3’ ‘ఐరన్‌మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్‌మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్లో నిర్వహించిన ఈ రేస్‌లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.సయామీ సీనీ నేపథ్యంనాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది. -
చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ శతకం (147) సాధించాడు.తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగితొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్‌గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.ఇక తాజాగా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.ఆసియా తొలి కెప్టెన్‌గా..అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...👉ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు. చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
ICC T20 WC 2026: ఇరవైలో అర్హత సాధించిన 15 జట్లు ఇవే
ఇటలీ క్రికెట్ జట్టు (Italy Cricket Team) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి నెదర్లాండ్స్‌తో పాటు ఇటలీ మెగా ఈవెంట్లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. యూరప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ నెదర్లాండ్స్‌తో తలపడింది.భారత్- శ్రీలంక వేదికగా..అయితే, ఈ మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ.. పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. కాగా భారత్- శ్రీలంక (India- Sri Lanka) వచ్చే ఏడాది సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.ఆ ఏడు జట్లు కూడా..ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్ల హోదాలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, శ్రీలంక నేరుగా ప్రపంచకప్-2026కు అర్హత సాధించాయి. ఇక వీటితో పాటు టీ20 ప్రపంచకప్-2024లో టాప్-7లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయ్యాయి.మరోవైపు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో పోటీపడేందుకు బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక అమెరికా క్వాలిఫయర్స్ నుంచి కెనడా.. తాజాగా యూరప్ క్వాలిఫయర్ నుంచి నెదర్లాండ్, ఇటలీ కూడా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాయి.20 జట్లలో 15 ఖరారుకాగా ఈ మెగా టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొననుండగా.. ఇప్పటికి పదిహేను జట్లు ఈ మేర అర్హత సాధించగా.. ఇంకో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల కోసం సౌతాఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, ఉగాండా, టాంజానియా, కెన్యా, జింబాబ్వే, బోత్స్వానా, నైజీరియా పోటీపడుతున్నాయి.ఇక మిగిలిన మరో మూడు స్థానాల కోసం ఆసియా- ఈఏపీ క్వాలిఫయర్స్ (అక్టోబరు 1-17) నుంచి నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, సమోవా, కువైట్, మలేషియా, జపాన్, కతార్, యూఏఈ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఇదిలా ఉంటే.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా రెండోసారి పొట్టి ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా 2007లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ పోటీ ప్రవేశపెట్టగా ధోని సారథ్యంలో నాడు భారత్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026లో ఇప్పటికి అర్హత సాధించిన జట్లు ఇవే..టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను: బుమ్రా
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టోక్స్ బృందానికి తన పేస్ పదును రుచిచూపించి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించి ఆనర్స్ బోర్డు (Lord's Hounours Board)పై తన పేరును లిఖించుకున్నాడు.స్పందించిన బుమ్రాఈ నేపథ్యంలో మూడో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా డ్యూక్స్ బాల్ (Dukes Ball) నాణ్యత, బంతి మార్పుపై చెలరేగుతున్న వివాదంపై ఈ పేస్ గుర్రం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో బంతిని మార్చడం సహజమే.ఆ విషయంలో నేనేమీ చేయలేను. అంతేకాదు.. ఈ వివాదంపై స్పందించి నా డబ్బును పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే.. నేను మ్యాచ్‌లో చాలా ఓవర్లపాటు బౌలింగ్ చేసేందుకు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాను.చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడనుకాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో నా మ్యాచ్ ఫీజును తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. ఏదేమైనా.. మాకు ఇచ్చిన బంతితోనే మేము బౌలింగ్ చేస్తాము. బంతి మార్పు అంశంలో ఆటగాళ్లుగా మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకోసం మేము పోరాడలేము కూడా!ఒక్కోసారి మనకు అనుకూలంగా ఫలితం రావచ్చు. మరోసారి చెత్త బంతినే మన చేతికి ఇవ్వవచ్చు’’ అని బుమ్రా విలేకరుల ప్రశ్నకు బదులిచ్చాడు. 2018లో తాను ఇంగ్లండ్‌లో ఆడినపుడు డ్యూక్స్ బాల్‌ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. బంతి అప్పట్లో బాగా స్వింగ్ అయ్యేదని.. తాను అప్పుడు అవుట్స్వింగర్లనే ఎక్కువగా సంధించేవాడినని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.1-1తో సమంగా సిరీస్‌కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం చేసింది. బుమ్రాకు ఐదు వికెట్లు.. ఇంగ్లండ్ 387 ఆలౌట్ఇక లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.టీమిండియా @145ఇదిలా ఉంటే... తొలి టెస్టు నుంచి డ్యూక్స్ బాల్ నాణ్యత విషయంలో టీమిండియా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎర్ర బంతి త్వరగా రూపు మారడంతో పదే పదే బాల్‌ను మార్చాల్సి వస్తుండగా.. ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలో తమకు అనుకూల ఫలితం రాకపోవడంతో బంతిని నేలకేసి కొట్టిన పంత్‌ను ఐసీసీ మందలించింది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ జమచేసింది.ఇక లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా గిల్, సిరాజ్ బంతి మార్పు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బంతిని మార్చినప్పటికీ పాత బంతితో దానికి ఏమాత్రం పోలిక లేదంటూ ఇద్దరూ అసహనానికి గురయ్యారు. ఇదే విషయమై బుమ్రాను ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డ్యూక్స్ బాల్ అంటే..మొదట్లో డ్యూక్స్ కుటుంబం ఎర్ర బంతులను తయారు చేసేది. చేతితో ఆరు వరుసల దారంతో వీటిని కుడతారు. సీమ్‌కు అనుకూలంగా ఉండే ఈ బంతి దీర్ఘకాల మన్నికకు పెట్టిందిపేరు. ఇంగ్లిష్ కండిషన్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, తాజా సిరీస్‌లో త్వరత్వరగా బంతి రూపు మారడం వివాదానికి, బంతి నాణ్యతపై చర్చకు దారి తీసింది. ప్రస్తుతం డ్యూక్స్ బాల్ తయారీ కంపెనీ దిలీప్ జగ్‌జోడియా చేతిలో ఉంది.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!DAY 1 ➡ 1 Wicket𝐃𝐚𝐲 𝟐 ➡ 𝐍𝐚𝐦𝐞 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝'𝐬 𝐇𝐨𝐧𝐨𝐮𝐫𝐬 𝐁𝐨𝐚𝐫𝐝 🎖@Jaspritbumrah93, yet again, stole the show with a fiery 5/74 on Day 2 & etched his name into Lord’s rich legacy 💪#ENGvIND 👉 3rd TEST, DAY 3 | SAT, 12th JULY, 2:30 PM | Streaming on… pic.twitter.com/X3jqiobSko— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్‌లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్‌ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
పొలార్డ్ విధ్వంసం.. దంచికొట్టిన పూరన్.. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్- టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ పాటిల్ (9) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమ్ రంజానే (1), మార్కస్ స్టొయినిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.రాణించిన డుప్లెసిస్..బ్యాట్ ఝులిపించిన అకీల్ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plesis) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్ అకీల్ హుసేన్ బ్యాట్ ఝులిపించాడు.కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్ నాటౌట్‌గా నిలవగా.. డొనొవాన్ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్ ఉగార్కర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ ఆరంభంలోనే క్వింటన్ డి కాక్ (6) రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.పూరన్ ధనాధన్‌ఈ క్రమంలో మరో ఓపెనర్ మోనాంక్ పటేల్ (49) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. నికోలస్ పూరన్ (Nicholas Pooran) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC— MI New York (@MINYCricket) July 12, 2025పొలార్డ్ విధ్వంసంమరోవైపు.. సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్ కింగ్స్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్‌తో కలిసి ఎంఐ న్యూయార్క్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్, పొలార్డ్ ధనాధన్ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్లో రెండోసారి ఫైనల్ల్లో అడుగుపెట్టింది.DeathTaxesPollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025 కాగా టెక్సాస్ సూపర్ కింగ్స్- వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్ (16) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్ రూపంలో సూపర్ కింగ్స్‌కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. తాజాగా సూపర్ కింగ్స్‌పై కూడా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్‌లో ఆదివారం (జూలై 13) టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
‘రికార్డులు ఉన్నది తిరగరాయడానికే’
జొహన్నెస్‌బర్గ్: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.అయితే అందుకు భిన్నంగా ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు. మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్ ఐదో స్థానానికి చేరాడు. -
జోరు సాగనీ...
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌పై తొలి టి20 సిరీస్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాలని ఆశిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3–1తో దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... శనివారం ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. గతంలో ఇంగ్లండ్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత జట్టు... తాజాగా తొలి టి20 సిరీస్ ఖాతాలో వేసుకుంది. టాపార్డర్ చక్కటి ఫామ్‌లో ఉండగా... స్పిన్నర్లు సత్తా చాటుతుండటంతో టీమిండియా ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలిగింది. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే... మనవాళ్ల ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది. నాలుగో టి20ని పరిశీలిస్తే... బౌండరీకి సమీపంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి చూడచక్కని క్యాచ్‌లు అందుకోగా... 30 గజాల సర్కిల్లో రాధా యాదవ్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో కట్టిపడేసింది. ఫలితంగానే ఇంగ్లండ్ జట్టు 126 పరుగులకు పరిమితమైంది. అనంతరం టాపార్డర్ రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. అదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని హర్మన్‌ప్రీత్ బృందం భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల భారత పురుషుల జట్టు రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్ కౌర్ నిలకడ కనబరుస్తున్నారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఆమె స్థాయికి అది తక్కువే. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు హర్మన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు జైత్రయాత్ర వెనక స్పిన్నర్ల కృషి ఎంతో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి స్పిన్నర్లే 22 వికెట్లు తీశారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీ చరణి ప్రత్యర్థిని తన మాయాజాలంతో ముప్పుతిప్పలు పెడుతోంది. రాధా యాదవ్, దీప్తి శర్మ కూడా మంచి లయలో ఉన్నారు. మరోవైపు సొంతగడ్డపై గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తోంది. -
స్వింగ్ 'స్టార్క్' సెంచరీ
అతడు లయలో ఉన్నాడంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే! అతడు కొత్త బంతి అందుకున్నాడంటే జట్టుకు శుభారంభం దక్కాల్సిందే! యార్కర్‌ను ఇంత కచ్చితంగా కూడా వేయొచ్చా... అని క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన నైపుణ్యం అతడిది. ఇన్‌స్వింగర్ ఇంత అందంగా కూడా విసరొచ్చా అనే పనితనం అతడి సొంతం. 30 అడుగుల రనప్ నుంచి బంతి వేసేందుకు అతడు సిద్ధమవుతున్నాడంటేనే... క్రీజులో ఉన్న బ్యాటర్ మదిలో ఎన్నో సవాళ్లు! ఒకే బంతిని వేర్వేరుగా ఎలా వేయొచ్చో ఆధునిక క్రికెట్లో అతడికంటే బాగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇన్‌స్వింగర్, అవుట్ స్వింగర్, యార్కర్ ఇలా అతడి అమ్ములపొదిలోని అ్రస్తాలకు కొదవేలేదు. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఆ్రస్టేలియా పేస్ స్టార్ మిచెల్ ఆరోన్ స్టార్క్ గురించే! ఆటను కేవలం ఇష్టపడితే సరిపోదు... దాన్ని గౌరవించాలి అని బలంగా నమ్మే ఈ ఆ్రస్టేలియా పేసర్ 100వ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. నేడు కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో మొదలయ్యే మూడో టెస్టు (డే–నైట్) స్టార్క్ కెరీర్లో 100వ టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో స్వింగ్ స్టార్ స్టార్క్ గురించి తెలుసుకుందామా! - సాక్షి క్రీడా విభాగం2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్... తొలి ఓవర్ వేసిన స్టార్క్ ఐదో బంతికి న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సారథి రెప్పవేసేలోపు... లోపలికి దూసుకొచ్చిన రిప్పర్ అతడి వికెట్లను చెల్లాచెదురు చేసింది. ‘ఆదిలోనే హంసపాదు’ అన్నట్లు ఆరంభంలోనే దెబ్బతిన్న న్యూజిలాండ్ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ టోర్నీ ఆసాంతం యార్కర్ల పండగ చేసుకున్న స్టార్క్ వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఖాతాలో వేసుకున్న ఈ ఆసీస్ పేసర్... 2024 ఐపీఎల్ ఫైనల్లోనూ దాదాపు ఇదే తరహా బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్... ఫైనల్ తొలి ఓవర్ ఐదో బంతికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆఫ్వికెట్ను గిరాటేశాడు. ఇక ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన రైజర్స్ రన్నరప్‌గానే సీజన్‌ను ముగించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టిన ఘనత స్టార్క్‌దే. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటి ఎన్ని అద్భుతాలు చేసినా... టెస్టు క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ఒక పేస్ బౌలర్ 100వ టెస్టు మ్యాచ్ ఆడటం అంటే ఆషామాషీ కాదు. ఆస్ట్రేలియా తరఫున మెక్‌గ్రాత్ తర్వాత 100వ టెస్టు ఆడుతున్న రెండో పేస్ బౌలర్‌గా స్టార్క్ నిలువనున్నాడు. మెక్‌గ్రాత్ బాటలో... ఆ్రస్టేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఆటకు వీడ్కోలు పలికిన నాలుగేళ్ల తర్వాత 2011లో స్టార్క్ టెస్టు అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మెకల్లమ్‌ను అవుట్ చేసి తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న స్టార్క్... రోజు రోజుకూ మరింత మెరుగవుతూ ముందుకు సాగాడు. క్రమశిక్షణకు కష్టపడేతత్వం తోడైతే ఫలితాలు సాధించొచ్చు అని నిరూపించిన స్టార్క్ అనతి కాలంలోనే ఆస్ట్రేలియా ప్రధాన పేసర్‌గా గుర్తింపు పొందాడు. 14 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్‌గా కొనసాగి... ఆ తర్వాతే బౌలర్‌గా మారిన స్టార్క్ బరిలోకి దిగిన ప్రతీసారి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తు... అందులోనూ ఎడంచేతి వాటం... ఇంకేముంది వాయువేగంతో అతడు విసిరే బంతికి బదులు చెప్పాలంటే ప్రత్యర్థి బ్యాటర్ ఎంతగానో శ్రమించాల్సిందే. ముఖ్యంగా స్టార్క్ గురిచూసి వేసే యార్కర్‌కు ప్రత్యేక ‘ఫ్యాన్ బేస్’ ఉందనడంలో అతిశయోక్తి లేదు. కళ్లు మూసి తెరిచేలోపు లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను ఎగరేసే విధానం చూసి తీరాల్సిందే. స్టార్క్ మనసు పెట్టి ఇన్‌స్వింగర్ సంధిస్తే అది వికెట్లను గిరాటేయాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత ప్రమాదకర బౌలర్‌గా ఎదిగిన స్టార్క్... కెరీర్లో పలుమార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో ప్రభావం చూపలేడని పక్కన పెట్టడం... భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి నిలిచిన స్టార్క్... తన బౌలింగ్‌తోనే విమర్శకులకు సమాధానాలు ఇచ్చాడు. స్టార్క్ భార్య అలీసా హీలీ కూడా మేటి క్రికెటర్ కావడంతో క్లిష్ట సమయాల్లో అతనికి కుటుంబం నుంచి కూడా అండదండలు లభిస్తున్నాయి. ఐపీఎల్‌ను కాదని...ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనాలని పోటీపడుతుంటే... స్టార్క్ మాత్రం జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు కొన్ని సీజన్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉండటం అతడి నిబద్ధతను చాటుతోంది. ‘అతడు చాలా ప్రత్యేకం. ఆస్ట్రేలియా వంటి పేస్ పిచ్‌లపై ఎక్కువ బాధ్యతలు మోస్తూ 100 మ్యాచ్‌లు ఆడటం చాలా గొప్ప. అతడి సన్నద్ధత, వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి.పనిభారం దృష్ట్యా పలు సీజన్ల పాటు ఐపీఎల్‌కు సైతం అతడు దూరమయ్యాడు. అలాంటి ‘మ్యాచ్ విన్నర్’ జట్టులో ఉండటం ఆ్రస్టేలియా అదృష్టం. సుదీర్ఘ కాలంగా అతడు చూపిన పట్టుదలకు 100వ టెస్టు రూపంలో ఫలితం దక్కుతోంది’ అని ఆ్రస్టేలియా హెడ్ కోచ్ మెక్‌డొనాల్డ్ అన్నాడు. 2021 నుంచి గణాంకాలను పరిశీలిస్తే... అత్యధిక (1066) ఓవర్లు వేసిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన స్టార్క్... వికెట్ల వేటలోనూ ముందు వరుసలో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటి వరకు 395 వికెట్లు పడగొట్టిన స్టార్క్... 100వ మ్యాచ్‌లోనే 400 వికెట్ల మైలురాయిని దాటాలని భావిస్తున్నాడు. ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ కంగారూ పేసర్... గాయాలతో సతమతమవుతున్న సమయంలోనూ బాధ్యతలను పక్కన పెట్టలేదు. 2022లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరిగిన వేలుతోనే బౌలింగ్ చేసిన స్టార్క్... 2023 యాషెస్ సిరీస్ సందర్భంగా గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్న జాతీయ విధులను విస్మరించలేదు. 35 ఏళ్ల వయసులో ఓ పేస్ బౌలర్ తన అత్యుత్తమ ప్రదర్శన సాగించడం విస్మయానికి గురిచేస్తోందని సహచర పేసర్, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కితాబిచ్చాడు. ‘145 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒక పేసర్ 100 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. అతడో యోధుడు. ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉండటం అతడికే సాధ్యం’ అని కమిన్స్ అన్నాడు. మరెంత కాలం కెరీర్ కొనసాగిస్తాడో ఇప్పుడే చెప్పలేకపోయినా... ప్రస్తుతానికి మాత్రం అతడే ఆ్రస్టేలియా ప్రధాన అస్త్రం. బ్యాటింగ్‌లోనూ భళా... ప్రపంచ క్రికెట్‌కు ఆ్రస్టేలియా అందించిన మరో ఆణిముత్యమైన స్టార్క్... కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఉపయుక్తకర బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. మామూలుగా సుదీర్ఘంగా బౌలింగ్ చేసే పేసర్లు నెట్స్‌లోనూ పెద్దగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయరు. కానీ స్టార్క్ తీరు అందుకు భిన్నం. కిందివరస బ్యాటర్లు జతచేసే పరుగులు జట్టుకు ఎంతో విలువ చేకూరుస్తాయి అని నమ్మే స్టార్క్... అవసరమైనప్పుడల్లా తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటాడు. అంతెందుకు ఇటీవల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ స్టార్క్ తన బ్యాటింగ్ నైపుణ్యం చూపెట్టాడు. స్టార్ ఆట గాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు చేరుతున్న సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి ఎదురునిలిచి అతడు చేసిన అర్ధశతకమే మ్యాచ్‌లో ఆసీస్‌ను పోరాడే స్థితికి చేర్చింది. సుదీర్ఘ ఫార్మాట్లో స్టార్క్ బ్యాట్‌తో 2311 పరుగులు చేశాడు. ఓ ప్రధాన పేసర్ ఇన్ని పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇక ‘డే అండ్ నైట్’ టెస్టుల్లో అయితే స్టార్క్‌కు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. గులాబీ బంతితో అత్యంత ప్రమాదకారి అయిన స్టార్క్... ఫ్లడ్ లైట్ల వెలుతురులో కరీబియన్ బ్యాటర్లతో ఓ ఆటాడుకోవడం ఖాయమే.16 టెస్టు ఫార్మాట్లో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 16వ ఆ్రస్టేలియా క్రికెటర్‌గా స్టార్క్గుర్తింపు పొందనున్నాడు. పాంటింగ్ (168), స్టీవ్ వా (168), అలెన్ బోర్డర్ (156), షేన్ వార్న్ (145), లయన్ (139), మార్క్ వా (128), మెక్‌గ్రాత్ (124), ఇయాన్ హీలీ (119), స్టీవ్ స్మిత్ (118), మైకేల్ క్లార్క్ (115), డేవిడ్ వార్నర్ (112), బూన్ (107), లాంగర్ (105), మార్క్ టేలర్ (104), మాథ్యూ హేడెన్ (103) ఈ జాబితాలో ఉన్నారు.83 టెస్టు క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 83వ క్రికెటర్‌గా స్టార్క్ ఘనత సాధించనున్నాడు.11 ఇప్పటి వరకు 82 మంది క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయి దాటారు. ఇందులో 10 మంది మాత్రమే స్పెషలిస్ట్ పేస్ బౌలర్లు (అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, కొట్నీ వాల్‡్ష, మెక్‌గ్రాత్, చమిందా వాస్, షాన్ పొలాక్, టిమ్ సౌతీ, ఇషాంత్ శర్మ, వసీం అక్రమ్, మఖాయ ఎన్తిని) ఉన్నారు. స్టార్క్ 11వ పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. -
సెమీస్‌లో జొకోవిచ్‌కు షాక్
లండన్: కెరీర్లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్, ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) అద్భుతంగా ఆడి 6–3, 6–3, 6–4తో వరుస సెట్లలో జొకోవిచ్‌ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2017 తర్వాత వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరుకోకపోవడం ఇదే తొలిసారి. గత రెండేళ్లు ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్ 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. జొకోవిచ్‌తో 1 గంట 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ 12 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు 28 అనవసర తప్పిదాలు చేశాడు. ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై అల్కరాజ్ గురి తొలి సెమీఫైనల్లో 2023, 2024 చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 2 గంటల 49 నిమిషాల్లో 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్‌తో అల్కరాజ్ తలపడతాడు. అల్కరాజ్ గెలిస్తే... జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ తర్వాత వింబుల్డన్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X అనిసిమోవా (అమెరికా) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టి20 ప్రపంచకప్ టోర్నీకి ఇటలీ అర్హత
ద హేగ్ (నెదర్లాండ్స్): మీరు చదువుతున్నది నిజమే... క్రికెట్ క్రీడలో ఇటలీ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీకి యూరోప్ జోన్ నుంచి ఇటలీతోపాటు నెదర్లాండ్స్ జట్లు అర్హత పొందాయి. ఫుట్‌బాల్‌లో ఇటలీకి ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు ప్రపంచకప్‌ను సాధించడంతోపాటు రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఏ స్థాయి క్రికెట్లో అయినా ఇటలీ జట్టు వరల్డ్‌కప్ బెర్తు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్న 25వ జట్టుగా ఇటలీ నిలిచింది. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయినప్పటికీ... గ్రూప్‌లో 4 మ్యాచ్‌లాడిన ఇటలీ 2 విజయాలు, 1 పరాజయం, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ముందంజ వేసింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో ఇటలీపై గెలిచిన నెదర్లాండ్స్ 6 పాయింట్లతో దర్జాగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. తద్వారా గత నాలుగు టి20 ప్రపంచకప్‌లలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మెగా టోర్నీ ఆడే అవకాశం కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు జెర్సీ జట్టు చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడింది. దీంతో పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమై వరల్డ్‌కప్‌నకు దూరమైంది. -
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌కాగా... ‘మిక్స్డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్‌లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో... పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్బీక్ తొలి గాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాడు. -
బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి
మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్‌తోనే సత్తా చాటుకున్నాయి. లండన్: భారత ప్రీమియర్ బౌలర్ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే అవుట్ చేశాడు. భారత్ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్‌ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ జో రూట్ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్ కీపర్ జేమీ స్మిత్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్ బ్రైడన్ కార్స్ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు), కరుణ్ నాయర్ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్... స్టోక్స్, రూట్ క్లీన్‌బౌల్డ్ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్ స్టార్ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (44) వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్ వికెట్ పడింది. ఈ ఇద్దరూ క్లీన్ బౌల్డయ్యారు. రూట్ అవుటైన మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా పేస్‌కు విలవిలలాడిన ఇంగ్లండ్‌కు స్మిత్ క్యాచ్ నేలపాలవడం వరమైంది. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్‌లైన్‌తో కార్స్‌తో కలిసి ఇంగ్లండ్ పోటీ స్కోరుకు స్మిత్ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్కే అతని వికెట్ దక్కింది. బుమ్రా... ఆర్చర్ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్ అతన్ని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.యశస్వి, గిల్ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్‌తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్‌కు కరుణ్ నాయర్ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్ వికెట్ తీసిన స్టోక్స్ రెండో వికెట్‌కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్ (19 బ్యాటింగ్; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి) సబ్–జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బి) బుమ్రా 104; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బి) బుమ్రా 44; స్మిత్ (సి) సబ్–జురేల్ (బి) సిరాజ్ 51; వోక్స్ (సి) సబ్–జురేల్ (బి) బుమ్రా 0; కార్స్ (బి) సిరాజ్ 56; ఆర్చర్ (బి) బుమ్రా 4; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్: బుమ్రా 27–5–74–5, ఆకాశ్‌దీప్ 23–3–92–0, సిరాజ్ 23.3–6–85–2; నితీశ్ కుమార్ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్ 10–1–21–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (బ్యాటింగ్) 53; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; గిల్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్: వోక్స్ 13–1–56–1, ఆర్చర్ 10–3–22–1, కార్స్ 8–1–27–0, స్టోక్స్ 6–2–16–1, బషీర్ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా జో రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ (భారత్) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు.⇒ 11 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్ వాన్, జాక్ హాబ్స్, దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ ఘనత సాధించారు. -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కారణంగా ఫీల్డింగ్‌కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తిరిగి బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు పంత్ ప్యాడ్స్ కట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా తొలి రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్‌లో పంత్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అతడి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన పంత్..అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిషబ్ పంత్.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ పర్యవేక్షణలో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్బంగా అతడు కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు.ఇంకా అతడికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి తగ్గనట్లు తెలుస్తోంది. అయినప్పటికి జట్టు అవసరం దృష్ట్యా అతడు బ్యాటింగ్‌కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
జో రూట్ ప్రపంచ రికార్డు..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.భారత తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ క్యాచ్‌ను తీసుకున్న తర్వాత ఈ ఫీట్‌ను రూట్ సాధించాడు. సెకెండ్ స్లిప్‌లో రూట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రూట్ ఇప్పటివరకు ఔట్ ఫీల్డ్‌లో 211 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(210) పేరిట ఉండేది.తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో రూట్(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే..211*జో రూట్210 రాహుల్ ద్రావిడ్205 మహేల జయవర్ధనే200 స్టీవెన్ స్మిత్200 జాక్వెస్ కాలిస్196 రికీ పాంటింగ్ -
నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే భారత్‌కు షాకిచ్చాడు
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్.. తన వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఆర్చర్ అందించాడు.తొలి ఇన్నింగ్స్‌లో తన వేసిన మొదటి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(13)ను ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్చర్.. మూడో బంతిని జైశ్వాల్‌కు 145 కి.మీ వేగంతో సీమ్ ఆప్ డెలివరీగా సంధించాడు.ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని జైశ్వాల్ బ్యాక్ ఫుట్ నుంచి లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ చేతికి వెళ్లింది. దీంతో 1596 రోజుల తర్వాత అతడి ఖాతాలో తొలి టెస్టు వికెట్ చేరింది.ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఏడాది క్రితం వైట్‌బాల్ జట్టులోకి వచ్చినప్పటికి.. టెస్టుల్లో మాత్రం ఆడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి.ఇంగ్లండ్ స్కోరంతంటే?తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.Pace is pace man, Jaiswal had no reply to Jofra Archer.He is making a comeback after long 4 years & bowled as if he never gone anywhere. True cricket fans missed 4 years of peak Archer, god please bless him now for next few years❤️🧿pic.twitter.com/aSrOEdqe2B— Rajiv (@Rajiv1841) July 11, 2025 -
అతడి పని పట్టాలంటే బుమ్రా తర్వాతే ఎవరైనా!.. మైండ్ బ్లాంక్ అయ్యేలా!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన పేస్ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ (Lord's)మైదానంలో తన తొలి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. కాగా లార్డ్స్ టెస్టులో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (11)ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ఆది నుంచే తన ప్రతాపం చూపించాడు.తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (44)ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. సెంచరీ వీరుడు జో రూట్ (104)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. అనంతరం ఈ రైటార్మ్ పేసర్.. క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పదిహేనోసారికాగా టెస్టుల్లో జో రూట్‌ను బుమ్రా అవుట్ చేయడం ఇది పదకొండోసారి కావడం విశేషం. అదే విధంగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో రూట్‌ను ఈ పేస్ గుర్రం వెనక్కిపంపడం పదిహేనోసారి. వన్డేల్లో మూడు, టీ20లలో రెండుసార్లు బుమ్రా ఈ పని చేశాడు. తద్వారా.. యాక్టివ్ ‘ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, స్మిత్, రూట్, విలియమ్సన్)’లో ఒకడైన రూట్‌ను అత్యధికసార్లు పెవిలియన్‌కు పంపిన తొలి బౌలర్‌గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.ఈ మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జో రూట్‌ను ఇప్పటికి 14సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో బుమ్రాతో కలిపి 11సార్లు రూట్‌ను వెనక్కిపంపిన కమిన్స్.. వన్డేల్లో మూడుసార్లు అతడిని అవుట్ చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్లు వీరే🏏జస్ప్రీత్ బుమ్రా (ఇండియా)- 15 సార్లు🏏ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 14 సార్లు🏏జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 13 సార్లు🏏రవీంద్ర జడేజా (ఇండియా)- 13 సార్లు🏏ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 12 సార్లు.ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (104) సెంచరీ చేయగా.. జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ధ శతకాలతో రాణించారు.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!#JaspritBumrah gets the better of England's centurion, #JoeRoot! 🤩The momentum is well and truly in #TeamIndia's favour! 🇮🇳#ENGvIND 👉 3rd TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/mg732Jcoq5 pic.twitter.com/rrINEm6bBK— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు.నిప్పులు చెరిగిన బుమ్రా..రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పులు చెరిగాడు. బుమ్రా ఆరంభంలోనే బెన్ స్టోక్స్, రూట్, వోక్స్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను కార్స్, స్మిత్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని సిరాజ్ బ్రేక్ చేశాడు. అనంతరం ఆర్చర్‌ను ఔట్ చేసిన బుమ్రా.. లార్డ్స్‌లో తొలి ఫైవ్ వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్ దక్కింది.చదవండి: IND vs ENG: బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్ -
అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మరోసారి అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పదే పదే ఇలా చేయడం సరికాదంటూ ఫీల్డ్ అంపైర్ వ్యవహారశైలిని విమర్శించాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య లార్డ్స్ వేదికగా గురువారం (జూలై 10) మూడో టెస్టు మొదలైంది.ఆదిలోనే షాకులుటాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా ఆదిలోనే షాకులు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లు కూల్చి బ్రేక్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 91వ ఓవర్ మధ్యలో కొత్త బంతి కావాలని టీమిండియా అడిగింది. 10.4 ఓవర్ల తర్వాత బంతిని మార్చాలని కోరగా.. అంపైర్ నుంచి వెంటనే సానుకూల స్పందన రాలేదు. అయితే, హూప్ టెస్టులో బంతి ఫెయిల్ కాగా.. అంపైర్ కొత్త బంతి ఇచ్చాడు. అయితే, అది చూసిన గిల్.. పాత బంతితో దీనికి ఏమాత్రం పోలిక లేదంటూ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు.పాతబడిన బంతిలా ఉందా? నిజమా?ఇంతలో బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా వచ్చి.. ‘‘ఇది పది ఓవర్ల తర్వాత పాతబడిన బంతిలా ఉందా? నిజమా?’’ అంటూ సెటైర్ వేశాడు. అతడి మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఏదేమైనా అంపైర్ ఇచ్చిన కొత్త బంతితో గిల్, సిరాజ్ అసంతృప్తి చెందినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు ఈ నేపథ్యంలో అంపైర్ తీరును విమర్శిస్తూ టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘ఇక్కడ కూర్చుని చూసినా.. అది పది ఓవర్లు పాత బడిన బంతిలా కాదు.. 20 ఓవర్లకు పైనే వాడిన బంతిలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే ఇండియాలో జరిగి ఉంటేనా.. బ్రిటిష్ మీడియా ఎంతలా గంతులు వేసేదో’’ అంటూ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోనూ గిల్, పంత్ బంతిని మార్చే విషయంలో అంపైర్లతో గొడవపడిన విషయం తెలిసిందే. ఇక లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం ఆటలో భాగంగా 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.చదవండి: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్Shubman Gill got angry on the field looking like Ricky Ponting is back 🥶⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/lsmX5AYZU7— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రాహుల్ విడిచిపెట్టాడు.87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్‌కు బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.బ్రాడైన్ కార్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు.. -
బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్లో అత్యత్తుమ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్ధి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అతడు మరోసారి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు.లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టోక్స్‌ను అద్బుతమైన బంతితో జస్ప్రీత్ క్లీన్ బౌల్డ్ చేశాడు.స్టోక్స్ మైండ్ బ్లాంక్..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 86 ఓవర్ వేసిన బుమ్రా.. రెండో బంతిని రౌండ్‌ది వికెట్ నుంచి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా పడిన బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.దీంతో ఒక్కసారిగా స్టోక్స్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి రోజు ఆటలో కూడా ఇదే తరహాలో హ్యారీ బ్రూక్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన అనంతరం జో రూట్(104), క్రిస్ వోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఇప్పటివరకు బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.లంచ్ బ్రేక్‌కు భారత స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్(51), బ్రాడైన్ కార్స్(33) ఉన్నారు.Jasprit Bumrah takes three big wickets Root, Stokes & Woakes in just 7 balls.He flipped the match in a single spell.⁰Game-changer. Match-winner. Jasprit Bumrah 🐐⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/Wq19z1glb5— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
IND vs ENG 3rd Test: జేమీ స్మిత్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ (Jamie Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో మూడో టెస్టు సందర్భంగా లార్డ్స్ (Lord's Test)లో జేమీ స్మిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు.సర్రేకు చెందిన జేమీ స్మిత్.. గతేడాది వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియాతో సిరీస్‌లో మాత్రం 24 ఏళ్ల జేమీ స్మిత్ దుమ్ములేపుతున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 40, 44* పరుగులు చేసిన జేమీ స్మిత్.. రెండో టెస్టులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.భారీ అజేయ శతకంతొలి ఇన్నింగ్స్‌లో భారీ అజేయ శతకం (184)తో మెరిసి ఇంగ్లండ్ ఓటమి వాయిదా పడేలా చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత అర్ధ శతకం (88) బాదినా.. పరాజయం నుంచి జట్టును తప్పించలేకపోయాడు.ఇక తాజాగా లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కుకు చేరుకున్నాడు జేమీ స్మిత్. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. ఫలితంగా లైఫ్ పొందిన జేమీ స్మిత్.. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.వరల్డ్ రికార్డుకాగా తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జేమీ స్మిత్ ఈ సందర్భంగా సమం చేశాడు. అదే విధంగా.. అతి తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏క్వింటన్ డి కాక్, జేమీ స్మిత్- 21 ఇన్నింగ్స్‌లో🏏దినేశ్ చండిమాల్, జానీ బెయిర్‌స్టో- 22 ఇన్నింగ్స్‌లో🏏కుమార్ సంగక్కర, ఏబీ డివిలియర్స్- 23 ఇన్నింగ్స్‌లో🏏జెఫ్ డుజోన్- 24 ఇన్నింగ్స్లోతక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏జేమీ స్మిత్ (ఇంగ్లండ్)- 1303 బంతుల్లోనే🏏సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్)- 1311 బంతుల్లో🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 1330 బంతుల్లో🏏నిరోషన్ డిక్విల్లా (శ్రీలంక)- 1367 బంతుల్లో🏏క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా)- 1375 బంతుల్లో.👉ఇదిలా ఉంటే.. టీమిండియా మూడో టెస్టులో భాగంగా శుక్రవారం నాటి రెండో ఆటలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 105 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్? -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprit bumrah) నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రెండో రోజు ఆటలో తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అద్బతమైన బంతితో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత జో రూట్(104), క్రిస్ వోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్‌లో బుమ్రాకి ఇది నాలుగో వికెట్. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ ఫీట్‌ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 47 టెస్టు వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్‌దేవ్ తన కెరీర్లో ఇంగ్లండ్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనతో కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ(48) అగ్రస్దానంలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితో ఇషాంత్‌ను బుమ్రా అధిగమిస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్? -
రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్?
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.టెస్టు రిటైర్మెంట్ ప్రకటనఈ రెండు సిరీస్‌లలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.టీమిండియా టెస్టు సారథిగా గిల్ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్‌గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.చారిత్రాత్మక విజయంతో..ఇక కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్‌కు గెలుపు అందించాడు.తదుపరి వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా గిల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్‌స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్‌కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్‌బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.ఇకపై ఐపీఎల్లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్‌ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025Whenever India's next odi series will be - Gill will lead— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025 -
చరిత్ర సృష్టించిన జో రూట్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్, బెన్ స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్ ఓవరాల్‌గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.ద్రవిడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా రూట్(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్‌నే టాప్‌లో ఉన్నాడు.అదేవిధంగా టెస్టుల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. రూట్ కూడా సరిగ్గా 11 టెస్టు సెంచరీలు చేశాడు.బుమ్ బుమ్ బుమ్రా..రెండో రోజులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(44), జో రూట్(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్‌కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లుజో రూట్ (ఇంగ్లండ్)- 11స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు..సచిన్ టెండూల్కర్ (భారత్) 51జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41కుమార్ సంగక్కర (శ్రీలంక) 38జో రూట్ (ఇంగ్లాండ్) 37చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే -
కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే
క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్ ముల్డర్ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ముల్డర్ ఆశ్చర్యపరిచాడు.లారా వంటి లెజండరీ బ్యాటర్ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్‌పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.లారా రియాక్షన్ ఇదేతాజాగా ఈ విషయం గురించి వియాన్ ముల్డర్ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.నా నిర్ణయం సరైందేనిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్ ముల్డర్ సూపర్స్పోర్ట్తో వ్యాఖ్యానించాడు.మిస్ చేసుకున్నావుకాగా వియాన్ ముల్డర్ గురించి మరో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్ చేశాడు.తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్‌లో 400 రన్స్ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నయా చాంపియన్ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్ మహరాజ్ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.చదవండి: ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి -
‘గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదు.. కోచ్‌గా ఉండటం కష్టం’
ఆటగాడిగా కంటే కోచ్‌గా ఉండటం అత్యంత కష్టమైన పని అని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. జట్టులోని ప్లేయర్‌గా కేవలం మన ఆటకు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అదే శిక్షకుడిగా ఉంటే జట్టులోని అందరి ఆటగాళ్ల ప్రదర్శనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అందువల్ల కోచ్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని.. అందుకే తాను ఈ మధ్య తరచుగా తన గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మార్గదర్శనంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత.. అతడి స్థానంలో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.వన్డే, టీ20లలో రైట్ రైట్శ్రీలంకలో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా తన కోచింగ్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన గౌతీ.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో వరుస విజయాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి నేతృత్వంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గడం చెప్పుకోదగినది.టెస్టులలో బ్రేకులుఅయితే, టెస్టు ఫార్మాట్లో మాత్రం గంభీర్‌కు కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా తొలిసారి 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)ని పదేళ్ల తర్వాత చేజార్చుకోవడం.. గంభీర్‌పై విమర్శలకు దారితీశాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇంగ్లండ్ టూర్‌కు వచ్చిన గంభీర్‌కు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవమే మిగిలింది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. అయితే, గత చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా తొలిసారి ఎడ్జ్‌బాస్టన్‌లో జయభేరి మోగించింది. దీంతో గంభీర్‌కు కాస్త ఊరట లభించింది.తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందిఈ నేపథ్యంలో సహచర మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గతంలో కంటే ఇప్పుడు తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది.ఆటగాడిగా ఉన్నపుడు మన ఆట గురించి మాత్రమే ఆలోచిస్తాం. అదే కోచ్‌గా మారితే.. జట్టు మొత్తానికి మనదే బాధ్యత. ప్రతి విషయానికి మనమే జవాబుదారీగా ఉండాలి. ఎలాంటి వ్యక్తిగత, ప్రత్యేక ఎజెండాలు లేకుండా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి.అయితే, కోచ్‌గా ఉండటం వల్ల అభద్రతా భావం మాత్రం ఎప్పుడూ దరిచేరదు. జట్టుతో కలిసే మనం నేర్చుకుంటాం. వారితో కలిసే ఎదుగుతాము. ఏదేమైనా ప్రతిరోజూ ఓ కొత్త సవాలే.గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదుదేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. ఇక్కడ గౌతం గంభీర్ అనే వ్యక్తి ముఖ్యం కాదు. భారత క్రికెట్ అనేదే అన్నింటికంటే ముఖ్యమైనది. డ్రెసింగ్‌రూమ్‌లో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. వారి అభిప్రాయాలు కోచ్‌గా నాకూ ముఖ్యమే. ఏదేమైనా ఆటగాడిగా ఉండటం కంటే కోచ్‌గా కష్టతరమైన పనే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి -
అరుదైన క్రికెటర్.. 34 ఏళ్లకే రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ ఆటగాడు పీటర్ మూర్ ఒకరు. మూర్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐర్లాండ్ తరఫున వరల్డ్‌కప్ ఆడాలన్న కలతో ఆ దేశానికి వలస వెళ్లిన మూర్.. ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.ఐర్లాండ్‌కు ఆడకముందు మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. మూర్ 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. నాటి నుంచి మూర్ జింబాబ్వే ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు సాధించాడు.అనంతరం మూర్ ఐరిష్ మూలాలు (నాన్నమ్మ) ఉండటంతో ఐర్లాండ్‌కు వలస వెళ్లాడు. 2023 మూర్ ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి ఆ దేశం తరఫున 7 టెస్ట్‌లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున 2024 జులైలో అతని అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. నాడు మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై మూర్ 79 పరుగులు చేశాడు. అతను చివరిగా అంతర్జాతయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్లో మూర్ తన చివరి మ్యాచ్‌ను నిన్ననే (జులై 10) ఆడాడు. ఐరిష్ దేశవాలీ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మూర్.. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినా దేశవాలీ, టీ20 లీగ్‌ల్లో కొనసాగుతునాని చెప్పాడు. -
ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి
లార్డ్స్ టెస్టులో టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిరోజు సత్తా చాటాడు. ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (18), బెన్ డకెట్ (23) వికెట్లు కూల్చి భారత్‌కు శుభారంభం అందించాడు. తద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కోసమంటూ నితీశ్ (Nitish Kumar Reddy)ను ఎంపిక చేయడం సరికాదన్న విమర్శకులకు ఆటతోనే బదులిచ్చాడు.కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటేఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టు మొదటి రోజు పూర్తయిన అనంతరం నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడికి వచ్చే ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులలో ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయని ప్యాట్ (ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ Pat Cummins)ను అడిగాను.నాకిదే తొలి ఇంగ్లండ్ పర్యటన కాబట్టి సలహాలు ఇవ్వమన్నాను. అందుకు బదులుగా.. ‘పిచ్ స్వభావంలో పెద్దగా తేడా ఉండదు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు’’ అని నితీశ్ రెడ్డి తెలిపాడు.కాగా ఐపీఎల్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ గత రెండేళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియాలోనూ ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకుంటున్నాడు.మా కోచ్ వల్లే ఇదంతా..ఇక... టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మోర్నీతో కూడా నా ఆట గురించి చాలానే చర్చించాను. ముఖ్యంగా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిలకడగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాము. గతేడాది కాలంగా ఈ విషయమై కఠినంగా శ్రమించాను.అందుకు ప్రతిఫలంగా నా బౌలింగ్‌లో రోజురోజుకీ పరిణతి కనిపిస్తోంది. ఇలాంటి కోచ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా’’ అని నితీశ్ రెడ్డి కోచ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.లార్డ్స్‌లో అమీతుమీకాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన ఈ ఓటమికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ వేదికపై తొలిసారి గెలుపు నమోదు చేసింది.ఇక ఇరుజట్ల మధ్య లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో గురువారం (జూలై 10) మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నస్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ 99, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి రెండు వికెట్లు కూల్చగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గావాట్ రా రెడ్డి, బాగుంది రా మామ👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/cH9KYukrVX— Sony Sports Network (@SonySportsNetwk) July 10, 2025 -
Viral Videos: నాటీ జడేజా.. తెలుగు మాట్లాడిన గిల్.. బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని "బౌలింగ్ బాగుందిరా మావా" అంటూ తెలుగులో ప్రశంసించాడు. ఆట చివర్లో లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) మైదానాన్ని ఆవహించి ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెట్టాయి. రూట్ 99 పరుగుల వద్ద ఉండగా రవీంద్ర జడేజా తనదైన శైలిలో "నాటీ" పనులు చేశాడు. ఇవే కాకుండా నిదానంగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌ను సిరాజ్ "బజ్‌బాల్ ఏది" అంటూ రెచ్చగొట్టాడు. మొత్తంగా తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది.బౌలింగ్ బాగుందిరా మావా..!టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తమ ఇన్నింగ్స్‌ను 13 ఓవర్ల వరకు సజావుగా సాగించింది. అయితే అప్పటివరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.GILL SPEAKING TELUGU TO NITISH KUMAR REDDY. 😂🔥 pic.twitter.com/NG5buxINBG— Johns. (@CricCrazyJohns) July 10, 2025ఈ క్రమంలో నితీశ్‌ను భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ' అంటూ ప్రశంసించాడు. అతడి మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.బజ్‌బాల్ ఏది..?టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. Siraj - "Bazball, Comeon I want to see it". 🥶🔥- It's fun at Lord's....!!! pic.twitter.com/7Ma3OiRPc2— Johns. (@CricCrazyJohns) July 10, 2025ఆ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్‌బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" అని సీరియస్‌గా అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్తొలి రోజు ఆట చివర్లో (81వ ఓవర్) మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేసే బుమ్రా లేడీబర్డ్స్ దెబ్బకు భయపడినట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతోంది.నాటీ జడేజా..!మైదానంలో సరాదాగా ఉండే రవీంద్ర జడేజా తొలి రోజు ఆట చివరి ఓవర్లో జో రూట్‌ను తనదైన శైలిలో ఆటపట్టించాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రూట్ 98 పరుగుల వద్ద ఓ పరుగు తీసి సెంచరీ పరుగు కోసం చూస్తుండగా జడేజా అతన్ని ఆటపట్టించాడు. జడేజా తనదైన శైలిలో రూట్‌తో చతుర్లాడిన సన్నివేశాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. JADEJA HAVING FUN WITH ROOT IN THE FINAL OVER 😂🔥 pic.twitter.com/zLd6ul83X9— Johns. (@CricCrazyJohns) July 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. -
ENG VS IND 3rd Test: అదే జరిగితే టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్ చేయాలి..!
లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు.ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా దృవ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. పంత్ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్‌లో పంత్ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్ మ్యాచ్‌లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ లేదా వికెట్‌కీపింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి వీలు ఉండదు. ఈ లెక్కన పంత్ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్ 10 మందితోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ సిరీస్‌లో పంత్ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 342 పరుగులు చేసి గిల్ తర్వాత ఈ సిరీస్‌లో సెకెండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్ జడేజా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
ENG VS IND: లార్డ్స్ టెస్ట్‌లో ఆసక్తికర దృశ్యాలు.. బుమ్రాను భయపెట్టిన లేడీబర్డ్స్
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో వింత దృశ్యాలు కనిపించాయి. మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పరుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో చోటు చేసుకుంది. ఆకాశ్‌దీప్ నాలుగో బంతి పూర్తి చేశాక, లేడీబర్డ్స్ ఒక్కసారిగా మైదానాన్ని ఆవహించాయి. అప్పటికీ క్రీజ్‌లో ఉన్న స్టోక్స్, రూట్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ పురుగులు స్టోక్స్ హెల్మెట్‌లోకి కూడా ప్రవేశించాయి. స్టోక్స్ కాసేపు అసహనానికి గురయ్యాడు. ఈ పురుగుల దండయాత్ర కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. తిరిగి అవి వెళ్లిపోయాక మ్యాచ్ యధాతథంగా కొనసాగింది. ఈ ఘటన తర్వాత రెండు ఓవర్లకే తొలి రోజు ఆట పూర్తియ్యింది. రూట్ 99, స్టోక్స్ 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లేడీబర్డ్స్ ఆటగాళ్లపై దాడి చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మ్యాచ్‌లు జరుగుతుండగా తేనెటీగలు, పాములు, పక్షులు మ్యాచ్‌కు అంతరయాన్ని కలిగించడం చూశాం. కానీ లేడీబర్డ్స్ దాడి చేయడం ఇదే మొదటిసారి. లండన్‌లో ఈ సీజన్లో మైదాన ప్రాంతాల్లో లేడీబర్డ్స్ గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే జనావాసాల్లో రావడం చాలా అరుదని అక్కడి జనాలు అంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట హోరాహోరీగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు సెడ్జింగ్‌తో ఒకరినొకరు కవ్వించుకున్నారు. అయితే అంతిమంగా జో రూట్ పైచేయి సాధించాడు. తొలి రోజు ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. రూట్, స్టోక్స్ చాలా సహనంగా బ్యాటింగ్ చేశారు.టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్‌కు నితీశ్ కుమార్ రెడ్డి ఆదిలోనే వరుస బ్రేక్లిచ్చాడు. నితీశ్ 14వ ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరీ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత పోప్, రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ దశలో రవీంద్ర జడేజా ఓ అద్భుతమైన బంతితో పోప్ ఆట కట్టించాడు. ఆతర్వాత కొద్ది సేపటికే బుమ్రా వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పని పట్టాడు. బుమ్రా బ్రూక్‌ను కళ్లు చెదిరే బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.తొలి రోజు రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పలు రికార్డులు సాధించాడు. 33 పరుగుల వద్ద భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 45 పరుగుల వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల స్కోర్ వద్ద ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. తొలి ఫోర్‌తో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన షకీబ్ అల్ హసన్
కరీబియన్ దీవుల్లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ న్యూజిలాండ్‌కు చెందిన సెంట్రల్ డిస్ట్రిక్స్పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. షకీబ్ క్యాపిటల్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. సెంట్రల్ డిస్ట్రిక్స్తో మ్యాచ్‌లో షకీబ్ తొలుత బ్యాటింగ్‌లో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) చేసి, ఆతర్వాత బౌలింగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (4-1-13-4) ఇచ్చాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ షకీబ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షకీబ్‌తో పాటు సెదికుల్లా అటల్ (41) కూడా రాణించాడు. నిరోషన్ డిక్వెల్లా 15, గుల్బదిన్ నైబ్ 1, కదీమ్ 3, జోర్డన్ జాన్సన్ 1, జెస్సీ బూటాన్ 20, డోమినిక్ డ్రేక్స్ 11 పరుగులు చేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ బౌలరల్లో అంగస్ షా 3, టిక్నర్ 2, ఫాక్స్‌క్రాఫ్ట్ ఓ వికెట్ తీశారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్స్ షకీబ్ మాయాజాలం దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. క్యాపిటల్స బౌలర్లలో షకీబ్‌తో పాటు తన్వీర్ (3-0-28-2), డేక్స్ (4-0-26-1), ఆర్యమాన్ వర్మ (4-0-23-1) తలో చేయి వేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ బ్రూస్ (34) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డేన్ క్లీవర్ (21), విలియమ్ క్లార్క్ (20) నామమాత్రపు పరుగులు చేశారు.వాస్తవానికి షకీబ్ ఈ టోర్నీలో రంగ్‌పూర్ రైడర్స్‌కు (బంగ్లాదేశ్) ఆడాల్సి ఉండింది. అయితే స్వదేశంలో (బంగ్లాదేశ్) అతనిపై నెలకొన్న నిషేధం కారణంగా ఇది కుదరలేదు. షకీబ్‌కు బంగ్లాదేశ్ క్రికెట్‌తో గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. రాజకీయ అనిశ్చితి కారణంగా షకీబ్ కొద్ది నెలలుగా స్వదేశంలో అడుగుపెట్టలేదు. అలాగే అతను జాతీయ జట్టు నుంచి కూడా తప్పించబడ్డాడు. షకీబ్ బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. వరుసగా రెండు ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు
క్రికెట్ చరిత్రలో ఊహలకందని అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ బౌలర్ ఓ మ్యాచ్‌లో వరుసగా రెండో ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టూ కౌంటీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీ డివిజన్-6లో భాగంగా కెస్గ్రేవ్తో జరిగిన మ్యాచ్‌లో ఐప్స్విచ్ అండ్ కోల్చెస్టర్ క్రికెట్ క్లబ్ స్పిన్ బౌలర్ కిషోర్ కుమార్ సాథక్ వరుస ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు వేసిన సాథక్ 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు కెస్గ్రేవ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఓ ఫీట్ నమోదైన దాఖలాలు ఎక్కడా లేవు. 2017లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్‌కు ఆడుతూ రెండు హ్యాట్రిక్‌లు తీశాడు. అలాగే 113 ఏళ్ల కిందట ఓల్డ్ ట్రాఫర్డ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ జిమ్మీ మాథ్యూస్ కూడా ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీశాడు.అయితే ఈ రెండు సందర్భాల్లో రెండు హ్యాట్రిక్‌లు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదయ్యాయి.కాగా, ఇంచుమించు ఇలాంటి ఘటనే ఒకటి నిన్న పొట్టి క్రికెట్లో కూడా నమోదైంది. ఐర్లాండ్ ఇంటర్ ఫ్రావిన్సియల్ టోర్నీలో ఓ బౌలర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్ కూడా) ఐర్లాండ్ జాతీయ జట్టు ప్లేయర్ కర్టిస్ క్యాంఫర్.. నార్త్ వెస్ట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కర్టిస్ 11వ ఓవర్ చివరి 2 బంతులకు 2 వికెట్లు, 13వ ఓవర్ తొలి మూడు బంతులకు 3 వికెట్లు తీశాడు. టెక్నికల్‌గా కర్టిస్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీశాడు.పురుషుల ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో (అంతర్జాతీయ క్రికెట్, దేశవాలీ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్) మునుపెన్నడూ ఏ బౌలర్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. అయితే ఓ స్థానిక మ్యాచ్‌లో మాత్రం ఇటీవలే ఈ ప్రదర్శన నమోదైంది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడే దిగ్వేశ్ రాఠీ ఒకే ఓవర్లో వరుసగా 5 వికెట్లు తీశాడు. ఇందులో తొలి నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం మరో విశేషం. -
ENG Vs IND 3rd Test: 99 నాటౌట్.. జో రూట్ సాధించిన రికార్డులు
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిన్న (జులై 10) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.రెచ్చిపోయిన నితీశ్ కుమార్13 ఓవర్ల వరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.అయితే ఓలీ పోప్.. రూట్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. అనంతరం జడేజా పోప్‌ను ఔట్ చేశాడు. 50వ ఓవర్ తొలి బంతికి జడ్డూ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పోప్ పెవిలియన్‌కు చేరాడు.ఆతర్వాత కొద్ది సేపటికే ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా అద్భుతమైన బంతితో హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో రూట్‌తో జతకట్టిన స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 79 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.ముఖ్యంగా రూట్ తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టి భారత్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. రూట్ 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించాడు. రూట్ తొలి రోజు సెంచరీ పూర్తి చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. చివరి ఓవర్లో రూట్ సెంచరీ పూర్తి చేయాలని ప్రయత్నించినా కుదర్లేదు.రూట్ సాధించిన రికార్డులుఏది ఏమైన ఈ ఇన్నింగ్స్‌తో రూట్ పలు రికార్డులను సాధించాడు. 45 పరుగుల స్కోర్ వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓ జట్టుపై ఓ బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు.ఈ ఇన్నింగ్స్‌తో రూట్ మరో 3 రికార్డులు కూడా సాధించాడు. 99 పరుగుల స్కోర్ వద్ద రూట్ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్‌తో రూట్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అలిస్టర్ కుక్ (816) తర్వాత ఈ ఫీట్‌ను నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వద్ద రూట్ భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్
పొట్టి క్రికెట్లో ఊహలకందని ఫీట్ నమోదైంది. ఓ బౌలర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఐర్లాండ్ ఇంటర్ ఫ్రావిన్సియల్ టీ20 టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్ కూడా) ఐర్లాండ్ జాతీయ జట్టు ప్లేయర్ కర్టిస్ క్యాంఫర్.. నార్త్ వెస్ట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్టిస్ జట్టు రెడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్టిస్ బ్యాట్‌తో కూడా రాణించి (24 బంతుల్లో 44) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్ 11 ఓవర్లలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఈ దశలో తన రెండో ఓవర్ వేసేందుకు బంతినందుకున్న కర్టిస్.. చివరి రెండు బంతులకు రెండు వికెట్లు (జరెడ్ విల్సన్, గ్రహం హ్యూమ్) తీశాడు.█▓▒▒░░░HISTORY░░░▒▒▓█5⃣ WICKETS IN 5⃣ BALLS? What have we just witnessed Curtis Campher 🤯SCORE ➡ https://t.co/tHFkXqkmtp#IP2025 pic.twitter.com/UwSuhbvu9k— Cricket Ireland (@cricketireland) July 10, 2025అనంతరం కర్టిస్ తన మూడో ఓవర్లోనూ (ఇన్నింగ్స్ 13వ ఓవర్) మ్యాజిక్ కొనసాగించాడు. తొలి బంతికే ఆండీ మెక్‌బ్రైన్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసిన కర్టిస్.. ఆతర్వాతి రెండు బంతులకు కూడా రాబీ మైలర్, జోష్ విల్సన్‌లను ఔట్ చేసి ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో మునుపెన్నడూ సాధ్యపడని ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు వేసిన కర్టిస్ 16 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఫలితంగా వారియర్స్ 88 పరుగులకే ఆలౌటైంది. కర్టిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో రెడ్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కర్టిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.చరిత్ర సృష్టించిన కర్టిస్ఈ ప్రదర్శనతో కర్టిస్ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు. పురుషుల ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో (అంతర్జాతీయ క్రికెట్, దేశవాలీ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్) మునుపెన్నడూ ఏ బౌలర్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. అయితే ఓ స్థానిక మ్యాచ్‌లో మాత్రం ఇటీవలే ఈ ప్రదర్శన నమోదైంది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడే దిగ్వేశ్ రాఠీ ఓ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా 5 వికెట్లు తీశాడు. ఇందులో తొలి నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.4 బంతుల్లో 4 వికెట్ల రికార్డు కూడా..!కర్టిస్ అంతర్జాతీయ క్రికెట్లోనూ ఓ సందర్భంలో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్టిస్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరుగురు బౌలర్లలో కర్టిస్ ఒకరు. -
తప్పుడు పత్రాలతో మోసగించారు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలను సృష్టించి మోసానికి పాల్పడటంతోపాటు నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన నేరంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధర్మ గురువారెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జగన్మోహన్రావు, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ సి. రాజేందర్ యాదవ్, ఆయన భార్య జి. కవితతో కలిసి ఈ కుట్రకు తెరతీసినట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్‌గా పిలిచే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి. కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను జగన్మోహన్రావు సృష్టించారు.వాటి ఆధారంగానే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగలిగినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆ తర్వా త హెచ్‌సీఏ సీఈఓ సునీల్ కంటే, ట్రెజరర్ సీఏ శ్రీనివాసరావు ఇతరులతో కలిసి నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజీ అధికారులను బెదిరించడం.. కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, కార్పొరేట్ బాక్స్‌లను అ«దీ నంలో పెట్టుకోవడం వంటివి చేసినట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రాథమిక ఆధారాల మేరకు ఈ నెల 9న జగన్మోహన్రావు, శ్రీనివాసరావు, సునీల్ కంటే, రాజేందర్‌యాదవ్, జి.కవిత లను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిష నల్ డీజీ చారు సిన్హా తెలిపారు. రూ. కోట్లలో అవినీతి! జగన్మోహన్రావు కేసులో పలు సంచలన విషయా లు బయటకు వస్తున్నాయి. రెండేళ్లలో రూ. కోట్లలో గోల్మాల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఆటగాళ్ల తల్లిదండ్రులు నుంచి హెచ్‌సీఏ సభ్యులు డబ్బు వసూలు చేశారని సీఐడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. చెక్ పవర్ దురి్వనియోగం, బీసీసీఐ ద్వారా వచి్చన నిధుల్లో గోల్మాల్, ఎస్ఆర్హెచ్ నుంచి కాంప్లిమెంట్రీ పాస్‌లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడం, క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లిమెంటరీ పాస్‌లలోనూ భారీ అవినీతి తదితర అంశాలపై సీఐడీ ఫోకస్ పెంచినట్లు సమాచారం. అదేవిధంగా తమను వేధించారంటూ జగన్మోహన్రావుపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన నేపథ్యంలో యాజమాన్యం వాంగ్మూలాన్ని సైతం సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు తెలిసింది. నిందితులకు 12 రోజుల జుడీషియల్ రిమాండ్ జగన్మోహన్రావు సహా ఇతర నిందితులను సీఐడీ గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహిళా నిందితురాలు కవితను చంచల్గూడలోని మహిళా జైలుకు మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ కోసం సీఐడీ గాలిస్తోంది. కాగా, నిందితులను మరింత లోతుగా ప్రశ్నించడం కోసం వారిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. -
లార్డ్స్‌లో సచిన్ అపు‘రూపం’
లండన్: భారత విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ లో అరుదైన గౌరవం దక్కింది. మూడో టెస్టు మొదలైన సందర్భంగా లార్డ్స్’లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మ్యూజియంలో అతని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ అనే కళాకారుడు ఈ చిత్రరాజాన్ని గీశారు. 18 ఏళ్ల క్రితం సచిన్ ఇంట్లో తీసుకున్న ఫొటోను ఆధారంగా చేసుకొని లెజెండ్ అపు‘రూపాని’కి తన కుంచెతో వన్నెతెచ్చారు. సచిన్ చిత్రరాజం ఈ ఏడాది అక్కడే ఉంటుంది. ఆ తర్వాతే పెవిలియన్‌కు మార్చుతారు. క్రీడా దిగ్గజాల చిత్రాలను గీయడంతో పియర్సన్ రైట్ది అందెవేసిన చేయి. గతంలో అతను భారత లెజెండ్స్ కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కార్ చిత్రాలను గీశారు. గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ తన సతీమణి అంజలీతో కలిసి పాల్గొన్నారు. ఇంగ్లండ్ మాజీ ప్రధాని రిషి సునాక్, దిగ్గజం ఫరూఖ్ ఇంజినీర్లు సైతం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెండూల్కర్ మాట్లాడూతూ ‘నాకు దక్కిన అపూర్వ గౌరవమిది. 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచినపుడే నాకు లార్డ్స్ గురించి తెలిసింది. మా కెప్టెన్ కపిల్ దేవ్ ప్రపంచకప్‌ను అందుకోవడం చూసిన ఆ క్షణమే నా క్రికెట్ ప్రయాణానికి నాంది పలికింది. ఈ రోజు నా చిత్రపటం పెవిలియన్‌కు వెళ్లినపుడు నా పయనం సంపూర్ణమైందనిపిస్తుంది. నా కెరీర్‌ను తలచుకున్న ప్రతిసారి నాకు నా ముఖంలో చిరునవ్వు కనబడుతుంది. నిజంగా ఇది ప్రత్యేకమైంది’ అని అన్నాడు. 1950లో మొదలైన ఈ మ్యూజియం యూరోప్‌లోనే పూరతనమైన క్రీడా మ్యూజియం. ఇందులో 3000 పైచిలుకు చిత్రమాలికలు కొలువుదీరగా... ఇందులో సుమారు 300 వరకు కుంచెనుంచి జాలువారిన చిత్రాలున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ఈ పెయింటింగ్‌లను ప్రారంభించారు. -
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
న్యూఢిల్లీ: యువ క్రీడాకారిణులు మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరముందని భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. లేకుంటే జట్టు సీనియర్ ప్లేయర్లపై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు ఎంత బాగా శిక్షణ పొందినా... ఒక్కసారి మైదానంలో అడుగు పెట్టాక అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగితేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన వెల్లడించాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో హరేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘ప్రొ లీగ్‌లో యువ జట్టుతో బరిలోకి దిగాం. పలువురు అనుభజు్ఞలైన ప్లేయర్లు గాయాలతో యూరప్ అంచె పోటీలకు దూరమవడం ఫలితాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా డిఫెన్స్ మరీ బలహీనంగా మారింది. దీంతో ప్రత్యర్థులు సులువుగా గోల్స్ చేస్తూ జట్టుపై ఒత్తిడి పెంచారు. దీనిపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది. అనుభవరాహిత్యం కారణంగా యువ ప్లేయర్లు తాము మైదానంలో ఎక్కడ ఉన్నాం... తమ బాధ్యత ఏంటి అనే విషయంలో కాస్త అయోమయానికి గురయ్యారనేది సుస్పష్టం. అందుకే పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. లేకుంటే తిరిగి సీనియర్ ఆటగాళ్లపైనే భారం మోపాల్సి ఉంటుంది. ఫీల్డ్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం పనికిరాదు. ఎంత వేగంగా స్పందిస్తే అంత మెరుగైన ఫలితం సాధించవచ్చు. ప్రత్యర్థి సర్కిల్‌లోకి ప్రవేశిస్తే... గోల్ పోస్ట్‌పై దాడులు చేసేందుకు వెరవకూడదు. పదేపదే దాడులు చేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడితేనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది’ అని అన్నాడు. సీనియర్లు అందుబాటులో లేకే... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ప్లేయర్లు వేర్వేరు కారణాలతో జట్టుకు దూరం కావడంతోనే యూరప్ అంచె పోటీల్లో భారత ఆటతీరు మరీ తీసుకట్టులా మారిందని హరేంద్ర సింగ్ అన్నాడు. ‘ప్రొ లీగ్ ప్రారంభానికి ముందు సుశీలా చాను జట్టుకు దూరమైంది. నిక్కీ ప్రధాన్, ఉదిత గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో వారికి విశ్రాంతినివ్వాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు ప్రధాన డిఫెండర్లు లేకపోవడంతో మన రక్షణ పంక్తి బలహీనపడింది. యువ స్ట్రయికర్ సంగీత కుమారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైంది’ అని హరేంద్ర వెల్లడించాడు. ప్లేయర్ల మానసిక బలాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హరేంద్ర అన్నాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లేయర్లకు మానసికంగా దృఢంగా ఉండేవిధంగా శిక్షణ ఇచ్చిన మోహన్ అనే వ్యక్తిని జట్టు సహాయక సిబ్బందిలో చేర్చినట్లు తెలిపారు. ఒత్తిడిని అధిగమించడం, తక్షణం స్పందించే గుణం వంటి పలు కీలక అంశాల్లో అతడి శిక్షణ మన ప్లేయర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు హాంగ్జౌ వేదికగా ఆసియ కప్ జరగనుండగా... ఆ లోపు ప్లేయర్లను మానసికంగా మరింత సంసిద్ధం చేస్తామని హరేంద్ర అన్నాడు. అవకాశాలను వినియోగించుకుంటేనే... ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చినా... వాటిని సది్వనియోగ పరుచుకోలేకపోయింది. అనుభజు్ఞలు లేకపోవడంతో డిఫెన్స్ విభాగంలో వెనుకబడిన టీమిండియా... అటాకింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో మనవాళ్లు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో చాలా మెరుగపడాల్సి ఉంది. మెరుగైన ప్రత్యర్థులతో తలపడుతున్నప్పుడు ప్రతి అంశంలో పక్కాగా ఉండాలి. అది లోపించడం వల్లే ప్రో లీగ్ నుంచి ఉద్వాసన ఎదురైంది. అయితే ఇక్కడితో ఆగిపోము. ఈ లోపాలను సవరించుకొని మరింత బలంగా పుంజుకుంటాం. ప్రత్యర్థికి పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇవ్వడం దెబ్బకొట్టింది. అయితే సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. మనకంటే మెరుగైన జట్లతో మ్యాచ్‌ల్లో సైతం అమ్మాయిలు ఆకట్టుకున్నారు. కొన్ని తప్పిదాలను పక్కన పెడితే ప్రపంచ స్థాయి ఆటతీరు కనబర్చారు. ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఈ తప్పులను సరిదిద్దుకుంటాం. ప్లేయర్లకు పెద్దగా అనుభవం లేదు. వారిని నిందించాలనుకోవడం లేదు. ఏడుగురు ఆటగాళ్లకు ఇదే తొలి ప్రొ లీగ్’ అని హరేంద్ర అన్నాడు. -
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ 147–144తో హజల్ బురున్ (తుర్కియే)పై, పర్ణీత్ కౌర్ 142–141తో క్యూర్ గిరిడి (తుర్కియే)పై విజయం సాధించారు. మరోవైపు రికర్వ్ విభాగంలో భారత జట్లకు నిరాశ ఎదురైంది. భారత పురుషుల, మహిళల జట్లు కనీసం మూడో రౌండ్‌కు కూడా చేరుకోలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, రాహుల్, నీరజ్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్లో 2–6 (55–56, 54–57, 57–56, 54–56) సెట్ పాయింట్ల స్కోరుతో జ్విక్ ఎలీ, మార్కస్ అల్మీదా, మథియాస్ గోమ్స్‌లతో కూడిన బ్రెజిల్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీపిక కుమారి, అంకిత, గాథ ఖడకేలతో కూడిన భారత మహిళల జట్టు కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 3–5 (58–54, 55–55, 54–55, 53–54) సెట్ పాయింట్ల స్కోరుతో అమెలీ కార్డెయు, లీసా బార్బెలిన్, విక్టోరియా సెబాస్టియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. -
ఆరు స్థానాలు పడిపోయి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరు స్థానాలు పడిపోయి 133వ ర్యాంక్‌లో నిలిచింది. గత తొమ్మిదేళ్లలో భారత్‌కిదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 4న థాయ్‌లాండ్‌తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత బృందం 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో తన పదవి నుంచి వైదొలిగాడు. 2016 డిసెంబర్లో భారత జట్టు అత్యల్పంగా 135వ ర్యాంక్‌లో నిలువగా... 1996 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని దక్కించుకుంది.1113.22 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు ఆసియాలో 24వ స్థానంలో ఉంది. 210 దేశాలు ఉన్న ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
మూడో రౌండ్లో హారిక, హంపి
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు, తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. నందిత (భారత్)తో జరిగిన రెండో రౌండ్లో హారిక 1.5–0.5తో... హంపి 1.5–0.5తో అఫ్రూజా ఖామ్దమోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. గురువారం జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లో హారిక 37 ఎత్తుల్లో నందితను ఓడించగా... అఫ్రూజాతో గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బుధవారం జరిగిన తొలి గేమ్‌లో అఫ్రూజాపై హంపి నెగ్గగా... నందితతో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంది. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మరో ముగ్గురు భారత ప్లేయర్లు వంతిక అగర్వాల్, పద్మిని రౌత్ మూడో రౌండ్లో చోటు కోసం నేడు టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు. -
అనిసిమోవా అదరహో
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా మూడోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా అద్భుత ఆటతీరు కనబరిచి టాప్ సీడ్ సబలెంకాను బోల్తా కొట్టించింది. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా 37 అనవసర తప్పిదాలు చేసింది. కెరీర్లో 22వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన 23 ఏళ్ల అనిసిమోవా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. రేపు జరిగే ఫైనల్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో అనిసిమోవా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ కేవలం 72 నిమిషాల్లో 6–2, 6–0తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. -
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0. -
కుశాల్ మెండిస్ విధ్వంసం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను శ్రీలంక అద్బుతమైన విజయంతో ఆరంభించింది. పల్లెకలె వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. 155 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది.శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(16 బంతుల్లో5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) మెరుపులు మెరిపించాడు.బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో పర్వేజ్ హుస్సేన్ ఎమోన్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నయీమ్(32), మిరాజ్(29) రాణించారు.లంక బౌలర్లలో మహేష్ థీక్షణ రెండు, వాండర్సే, షనక, తుషారా తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 13న దంబుల్లా వేదికగా జరగనుంది. ఇప్పటికే వన్డే, టెస్టు సిరీస్‌లను శ్రీలంక సొంతం చేసుకుంది.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్బుతమైన బంతితో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు టెస్టు వరల్డ్ నెం1 బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఓలీ పోప్ ఔటయ్యాక బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.అప్పటికే క్రీజులో పాతుకుపోయిన జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన బుమ్రా ఐదో బంతిని.. హ్యారీ బ్రూక్‌కు ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. 140 కి.మీ వేగంతో వేసిన ఆ బంతిని బ్రూక్ ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కాస్త లోగా వచ్చిన బంతి అతడి బ్యాట్‌ను మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్(8) ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి లార్డ్స్‌లో ఆడుతున్నాడు.68 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(62), బెన్‌స్టోక్స్(27) ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.Number 1 bowler gets Number 1 batter at Lord’s.What a delivery by Jasprit Bumrah — absolute perfection.⁰Top of off, pace, precision — vintage Bumrah.⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/kdGbLbPnND— Kavya Maran (@Kavya_Maran_SRH) July 10, 2025 -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్
భారత మహిళల-ఎ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఇండియా-ఎ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు స్పిన్నర్ రాధా యాదవ్ సారథ్యం వహించనుంది. ఆమెకు డిప్యూటీగా మిన్ను మణి వ్యవహరించనుంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న యంగ్ ప్లేయర్లు శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు.శ్రేయాంక కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా ఓపెనర్ షఫాలి వర్మ కూడా తిరిగి వన్డే ఫార్మాట్లో ఆడేందుకు సిద్దమైంది. డబ్ల్యూపీఎల్‌లో ఆకట్టుకున్న లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఆతిథ్య ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది.తొలుత టీ20 సిరీస్ ఆగస్టు 7 నుండి 10 వరకు మాకే వేదికగా జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 13-17 వరకు బ్రిస్బేన్‌లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం క్వీన్స్‌ల్యాండ్‌లోని అలన్ బోర్డర్ మైదానం వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆగస్టు 14 నుంచి జరగనుంది.ఆసీస్‌తో టీ20లకు భారత-ఎ జట్టురాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, డి. వృందా, సజన సజీవన్, ఉమా చెత్రీ , రాఘవి బిస్త్, శ్రేయాంక పాటిల్*, ప్రేమ రావత్, నందిని కశ్యప్ (వికెట్ కీపర్), తనూజా కన్వెర్, జోషితా థకేల్, షబ్నం.వన్డే, టెస్టులకు భారత జట్టు: రాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, తనుశ్రీ సర్కార్, ఉమా చెత్రీ , ప్రియా మిశ్రా*, తనుజా కన్వర్, నందిని కశ్యప్ (డబ్ల్యుకె), షబ్నమ్ గుజ్జర్, షబ్నమ్ గుజ్జర్, ధారా గుజ్జర్ టిటాస్ సాధు. -
ఇన్ స్టాల్ రీల్స్ చేసిన టెన్నిస్ ప్లేయర్.. హత్య చేసిన తండ్రి!
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. -
దమ్ముంటే ఇప్పుడు బాజ్‌బాల్ ఆడండి.. రూట్‌పై సిరాజ్ సెటైర్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ నితీశ్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 44 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఓలీ పోప్, రూట్ అదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.ఈ క్రమంలో 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్‌బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" సీరియస్‌గా అన్నాడు.ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా బ్రెండన్ మెకల్లమ్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో బాజ్ బాల్ పేరిట దూకుడుగా ఆడుతూ వస్తోంది. ఇక జో రూట్ 70 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.62 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.DSP Siraj & Joe Root are Face 2 Face 🥵⚡️This one is really Crazy 👽@mdsirajofficial ✊️ @root66#siraj #ENGvIND #3rdTest #lords #LORDS #joeRoot #MohammedSiraj #london pic.twitter.com/4maGUJnK9o— Dheeraj Tanwar (@Dheerajtan23) July 10, 2025 -
‘బాగుందిరా మావ’.. నితీష్ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన అద్బుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఒకే ఓవర్లో రెండు వికెట్లు అందించాడు. తన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు.జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వంటి పేసర్లు వికెట్ తీసేందుకు శ్రమించిన చోట.. నితీశ్ తన గోల్డెన్ ఆర్మ్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఈ ఆంధ్ర ఆల్‌రౌండ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసి జో రూట్ వంటి బ్యాటర్లకు సైతం చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో నితీశ్‌ను భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ'అంటూ ప్రశంసించాడు. అతడి మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.55 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(62), బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గామరి మనోడు ఇరగదీస్తుంటే, కెప్టెన్ గిల్ కూడా తెలుగులో మాట్లాడాల్సిందే 🤩బాగుంది రా మామా 😍👌🤌చూడండి | England vs India 3rd Test | Day 1 లైవ్ మీ JioHotstar లో#ENGvIND pic.twitter.com/aU9CmUZTd7— StarSportsTelugu (@StarSportsTel) July 10, 2025 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో 3000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు.ఓవరాల్‌గా టెస్టుల్లో ఒక జట్టుపై బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 54 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.తన అద్బుత బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. 49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌తో పాటు ఓలీ పోప్(44) ఉన్నారు. అదేవిధంగా భారత్-ఇంగ్లండ్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ వర్సెస్ భారత సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..జో రూట్ - 3007సచిన్ టెండూల్కర్ - 2535సునీల్ గవాస్కర్ - 2483సర్ అలస్టెయిర్ కుక్ - 2431విరాట్ కోహ్లీ - 1991చదవండి: IND vs ENG: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ -
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల కేసుకు సంబంధించిన వాదనలు మల్కాజిగిరి కోర్టులో ముగిశాయి. నిందితుల తరుపు న్యాయవాదుల వాదనకు కోర్టు ఏకీభవించలేదు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం ఐదుగురు నిందితులకు 12 రోజుల రిమాండ్ మల్కాజిగిరి కోర్టు విధించింది.కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ఈ నెల 12 వరకు వీరు రిమాండ్‌లో ఉండనున్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాల కేసులో జగన్మోహన్ రావు అరెస్ట్ చేసినట్లు సీఐడీ గురువారం ఉదయం ప్రకటన విడుదల ప్రకటన చేసింది. -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్‌తో విండీస్‌ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
ఆ భారత ఆటగాడికి ఇదే ఫేర్వెల్ టెస్టు?
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ఇవ్వు' అంటూ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కరుణ్ నాయర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 77 పరుగులు మాత్రమే చేశాడు.ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఈ విధర్బ ఆటగాడు.. రీ ఎంట్రీ ఇన్నింగ్స్‌లోనే డౌకటయ్యాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ అద్బుతమైన విజయం సాధించినప్పటికి కరుణ్నాయర్ ఆటపై మాత్రం సర్వాత్ర విమర్శల వర్షం కురిసింది. దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుకు అతడిపై ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేస్తుందని అంతా భావించారు.ఇదే ఆఖరి ఛాన్స్.. ?కానీ గంభీర్ అండ్ కో కరుణ్ నాయర్‌కు మరో అవకాశమిచ్చారు. లార్డ్స్ టెస్టు భారత తుది జట్టులో నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కీలకమైన మూడో స్దానంలో బ్యాటింగ్ వస్తున్న నాయర్.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిస్తే అతడికి ఇదే ఫేర్వెల్ టెస్టు అయ్యే అవకాశముంది. ఎందుకంటే జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు వేచిచూస్తున్నారు. సాయిసుదర్శన్ వంటి యువ సంచలనంపై కేవలం ఒక్క మ్యాచ్‌కే టీమ్‌మెనెజ్‌మెంట్ వేటు వేసింది. తొలి టెస్టులో మూడో స్దానంలో ఆడిన సాయిసుదర్శన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి మూడో స్ధానంలో కరుణ్‌కు అవకాశమిచ్చారు. కరుణ్ కూడా ఫెయిల్ అవడంతో సుదర్శన్‌కు మరో అవకాశాన్ని ఇవ్వాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. సుదర్శన్‌తో పాటు బెంగాల్ దేశవాళీ క్రికెట్ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ కూడా జట్టులో చోటు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.రంజీల్లో అదుర్స్..భారత జట్టులోకి పునరాగమానికి ముందు దేశవాళీ క్రికెట్లో నాయర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.చదవండి: Nitish Kumar Reddy: అతడు ఎందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే అద్భుతం -
T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్ -
అతడు ఎందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే అద్భుతం
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ బంతి(Nitish Kumar Reddy)తో అద్బుతం చేశాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు. తొలి సెషన్లో 13 ఓవర్ వరకు డకెట్, క్రాలీ తమ వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు.జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లు సైతం వీరిని ఔట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 14 ఓవర్ వేసిన నితీశ్.. మూడో బంతికి బెన్ డకెట్(23), ఆఖరి బంతికి జాక్ క్రాలీ(18) ఔట్ చేశాడు. దీంతో భారత్ మళ్లీ గేమ్‌లోకి తిరిగొచ్చింది. అయితే రెండో టెస్టులో మాత్రం నితీశ్ బ్యాట్‌తో, బంతితో రాణించలేకపోయాడు. దీంతో అతడిని లార్డ్స్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.కానీ హెడ్ కోచ్ గంభీర్, గిల్ అతడిపై నమ్మకంతో తుది జట్టులో కొనసాగించారు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీశ్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతోంది. 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేసింది. క్రీజులో రూట్(12), పోప్(1) ఉన్నారు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు -
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు
భారత అండర్-19 జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ యువ జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా వార్విక్‌షైర్‌కు చెందిన హంజా షేక్ ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్ జట్టును హంజా షేక్ లీడ్ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు దూరంగా ఉన్న షేక్.. తిరిగి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.ఇక అతడి డిప్యూటీగా తంజీమ్ అలీ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజాలు ఆండ్రూ ఫ్లింటాఫ్, మైఖేల్ వాన్ కుమారులు రాకీ ఫ్లింటాఫ్, ఆర్చీ వాన్ చోటు దక్కించుకున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాకీ ఫ్లింటాఫ్ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక సెంచరీ, అర్ధ సెంచరీతో సహా 222 పరుగులు చేశాడు.దీంతో టెస్టు జట్టులో కూడా అతడి స్దానాన్ని పదిలం చేసుకున్నాడు. డర్హామ్ ఎడమచేతి వాటం పేసర్ జేమ్స్ మింటోకు కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ 15 మంది సభ్యుల జట్టులో భారత సంతతికి చెందిన ఆర్యన్ సావంత్, ఎక్ష్ సింగ్, జై సింగ్‌లకు చోటు దక్కింది. ఇక ఈసిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబ్రిష్, సింగ్క్ చౌహాన్, హెనిల్ పటేల్, యుధాజిత్ మోల్ రాఘవ్, ప్రణమ్జెత్ గుహ, ప్రణమ్జెత్ గుహ, డి. దీపేష్, నమన్ పుష్పక్ఇంగ్లండ్ అండర్-19 జట్టుహంజా షేక్ (వార్విక్షైర్ - కెప్టెన్), తజీమ్ అలీ (వార్విక్షైర్), జయద్న్ డెన్లీ (కెంట్), రాకీ ఫ్లింటాఫ్ (లాంకాషైర్), అలెక్స్ ఫ్రెంచ్ (సర్రే), అలెక్స్ గ్రీన్ (లీసెస్టర్‌షైర్), జాక్ హోమ్ (వర్సెస్టర్‌షైర్), బెన్ మాయెస్ (హాంప్‌షైర్), సెబాస్టియన్ మోర్గాన్ (హాంప్‌షైర్), జేమ్స్ మింటో (డర్హామ్), థామస్ రెవ్ (సోమర్సెట్), ఆర్యన్ సావంత్ (మిడిల్సెక్స్), ఏకాంష్ సింగ్ (కెంట్), జయ్ సింగ్ (యార్క్‌షైర్), ఆర్చీ వాన్ (సోమర్సెట్)చదవండి: ‘ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సింది’ -
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. అతడి స్థానంలో బుమ్రా
England vs India, 3rd Test- Lord's Day 1: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. పిచ్ స్వభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. తాను టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. తమ బౌలర్లు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం తనకు సంతోషంగా ఉందన్న గిల్.. తాము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లో తొలి టెస్టు జరుగగా.. ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. ఈ వేదికపై తొలి గెలుపు నమోదు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో ఇప్పటి వరకు 19 టెస్టులు జరుగగా ఇంగ్లండ్ 12, భారత్ మూడు టెస్టు గెలువగా.. నాలుగు డ్రా అయ్యాయి. కాగా 2021లో చివరగా ఇక్కడ టీమిండియా గెలుపుబావుటా ఎగురవేసింది. తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
‘ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సింది’
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. చారిత్రాత్మక గెలుపు కారణంగా తుదిజట్టు ఎంపిక విషయంలో చేసిన కొన్ని పొరపాట్లు కనుమరుగైపోయాయని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయి ఉంటే.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా (IND vs ENG).. లీడ్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, అందుకు ప్రతీకారం తీర్చుకుని ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసి చారిత్రాత్మక విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై మాత్రం వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాల్లో ఆకాశ్ దీప్ (Akash Deep), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)లను జట్టులోకి తీసుకుంది.ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. సాయి సుదర్శన్‌పై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడిని తప్పించాల్సిన అవసరం లేదని.. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. నిజానికి కరుణ్ నాయర్ వన్‌డౌన్ బ్యాటర్ కాదని.. సాయి ఈ స్థానంలో సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. ‘‘గత మ్యాచ్‌లో టీమిండియా యాజమాన్యం కొన్ని ఆసక్తికర ఎంపికలు చేసింది. వాటితో నేను ఏమాత్రం ఏకీభవించడం లేదు. రెండో టెస్టులో గెలిచిన కారణంగా ఇవన్నీ కనుమరుగైపోయాయి.నిజానికి సాయి సుదర్శన్ విషయంలో వారు చేసింది తప్పు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ యువ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాల్సింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బాగానే ఆడాడు. కాబట్టి రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సింది.కానీ వాళ్లు అతడిని తప్పించారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ సరైన బ్యాటర్. కరుణ్ నాయర్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరికాదు. విఫలమైనా కరుణ్కి అవకాశాలు ఇచ్చినప్పుడు సాయి సుదర్శన్‌కు కూడా ఛాన్స్ ఇవ్వాల్సింది కదా!అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సిందిఅలా అని నేనేమీ కరుణ్ నాయర్‌కు వ్యతిరేకం కాదు. చాలా ఏళ్ల తర్వాత కష్టపడి అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, అతడు మాత్రం వన్‌డౌన్‌లో ఆడే బ్యాటర్ మాత్రం కాదు. నిజానికి లోయర్ ఆర్డర్లో నితీశ్ కుమార్ రెడ్డి కరుణ్ కోసం త్యాగం చేయాల్సింది’’ అని మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా లీడ్స్ టెస్టుతో టీమిండియా తరఫున సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 20 పరుగులే చేశాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌తో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు -
నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్
భారత క్రికెట్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan). టీమిండియా ఓపెనర్‌గా రాణించిన గబ్బర్.. టెస్టుల్లో అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ మూడో మ్యాచ్‌లో ధావన్.. 85 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఇక ఐసీసీ వన్డే టోర్నమెంట్లలోనూ 50కి పైగా సగటుతో 90కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన బ్యాటర్‌గానూ గుర్తింపు పొందాడు. వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలలో రాణించి ధావన్.. ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు.. తన వందో వన్డేలోనూ సెంచరీ చేసిన గబ్బర్.. ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.అదే విధంగా.. ఐపీఎల్ (IPL)లోనూ వరుసగా రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గానూ ధావన్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై శతకం (101 నాటౌట్) బాదిన గబ్బర్.. మరో మూడురోజుల్లోనే పంజాబ్ కింగ్స్‌పై 106 పరుగులు సాధించాడు.టఫెస్ట్ బౌలర్ అతడేఇలా బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక రికార్డులు సాధించిన ధావన్.. తన కెరీర్లో ఎంతో మంది మేటి బౌలర్లను ఎదుర్కొన్నాడు. అయితే, వారందరిలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న విషయాన్ని గబ్బర్ తాజాగా వెల్లడించాడు. సౌతాఫ్రికా పేస్ లెజెండ్ టఫ్ బౌలర్ అని.. అతడి వైవిధ్యభరితమైన పేస్, దూకుడు, నైపుణ్యం తన భయపెట్టేదని తెలిపాడు.ఆండర్సన్ బౌలింగ్ అంటే కూడా భయంఅదే విధంగా.. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో ఆడేందుకు కూడా ఇబ్బందిపడేవాడినని ధావన్ చెప్పుకొచ్చాడు. IANSకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ‘ది వన్’ పేరిట ధావన్ తన ఆటోబయోగ్రఫీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గబ్బర్ రాశాడు.ఇదిలా ఉంటే.. 2010 నుంచి 2022 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్.. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లోనూ గబ్బర్‌కు ఘనమైన చరిత్ర ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో 222 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 6768 పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు -
కేకేఆర్‌లోకి సంజూ శాంసన్..? ఆసక్తి రేపుతున్న సోషల్‌మీడియా పోస్ట్
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి కొద్ది రోజులు కూడా గడవకముందే తదుపరి సీజన్‌పై చర్చ మొదలైంది. పలానా ఆటగాడు పలానా ఫ్రాంచైజీకి మారతాడు, పలానా ఫ్రాంచైజీ కెప్టెన్‌ను మారుస్తుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చర్చల్లో ట్రేడింగ్ విండో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా చేజిక్కించుకోనుందని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై సంజూ శాంసన్ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సంజూ సీఎస్కే చేరతాడంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది.సంజూకు సంబంధించి తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఈ కేరలైట్ వచ్చే సీజన్లో కేకేఆర్‌కు ఆడబోతున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ బీజం వేశాడు. బిజూ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో సంజూ అతను చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో ఉంది. ఈ ఫోటోకు బిజూ "కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసి నెటిజన్లు సంజూ కోసం కేకేఆర్ పావులు కదుపుతుందని ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్ కోసం వికెట్‌కీపర్‌తో పాటు కెప్టెన్ అవసరం ఉంది. సంజూ శాంసన్ ఈ రెండు పాత్రలను న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం తప్పక భావించవచ్చు. గత సీజన్లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో చాలా ఇబ్బంది పడింది. దీంతో శాంసన్ లాంటి విజవంతమైన నాయకుడు తమ కష్టాలు తీరుస్తాడని కేకేఆర్ అనుకోవడంలో తప్పులేదు. ఎలాగూ ట్రేడింగ్ విండో ఆప్షన్ ఉంది కాబట్టి కేకేఆర్ శాంసన్ కోసం ఎంత డబ్బైనా వెచ్చించవచ్చు. ఏం జరుగుందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.కాగా, సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన జర్నీని ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలో శాంసన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ కావడంతో శాంసన్ రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మారాడు. 2018లో అతని తిరిగి రాయల్స్ గూటికి చేరాడు. 2021 సీజన్లో శాంసన్ రాయల్స్ కెప్టెన్సీని చేపట్టాడు. అతని సారథ్యంలో రాయల్స్ 2022 సీజన్లో ఫైనల్‌కు చేరింది. తాజాగా ముగిసిన సీజన్లో శాంసన్ గాయం కారణంగా పెద్దగా కనిపించలేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ మెజార్టీ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు. ఈ సీజన్లో రాయల్స్ చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.రికార్డు ధరసంజూ శాంసన్ ఐపీఎల్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ సంజూను రూ. 26.8 లక్షలకు సొంతం చేసుకుంది. కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇదే భారీ డీల్. -
IND vs ENG: భారత్ గెలుపులో వాళ్లకు కూడా క్రెడిట్ దక్కాల్సింది: యువీ
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తున్న గిల్‌ను చూస్తే గర్వంగా ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్ మరిన్ని శతకాలు బాది తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకోవాలని ఆకాంక్షించాడు.కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా జరుగుతున్న ఈ సిరీస్ సందర్భంగా యువ ఆటగాడు గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఉన్న జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తొలి టెస్టులోనే బ్యాట్ ఝులిపించాడు.చారిత్రాత్మక విజయంలీడ్స్లో ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన (147) గిల్.. సారథిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో చెలరేగి చారిత్రాత్మక గెలుపును రుచిచూశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టీమిండియాను గెలిపించిన సారథిగా చరిత్రకెక్కాడు.గర్వంగా ఉందిఈ నేపథ్యంలో గిల్ మెంటార్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని శుబ్‌మన్ సవాలుగా తీసుకున్నాడు. అతడిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒకే టెస్టు మ్యాచ్‌లో 400కు పైగా పరుగులు సాధించడం మామూలు విషయం కాదు.గిల్ ఆట నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు మరిన్ని సెంచరీలు కొట్టాలి. గిల్ తండ్రి కూడా ఎంతో గర్వించి ఉంటారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక విజయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉందన్నాడు యువీ.ఆ ఇద్దరికీ క్రెడిట్ దక్కాల్సింది‘‘టీమిండియా గెలవాలని నాతో పాటు అందరూ కోరుకున్నారు. అయితే, ఈ విజయంలో గౌతం, అజిత్ అగార్కర్‌కు దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదని అనిపిస్తోంది. ఈ జట్టును ఒక్కచోటికి చేర్చడంలో వారిదే కీలక పాత్ర. తదుపరి మ్యాచ్‌లలోనూ టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని యువీ చెప్పుకొచ్చాడు.కాగా యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో జరిగింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో పాటు విరాట్ కోహ్లి, బ్రియన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సేన కూడా ఇందులో భాగమైంది. ఈ సందర్భంగానే యువీ గిల్ గురించి పైవిధంగా స్పందించాడు.చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు -
SRHను బెదిరించి టికెట్లు పొందాలని చూశారు: సీఐడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంఛైజీ మధ్య వివాదంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావును బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం కేసులో కేసు నమోదైంది. ధరం గురువరెడ్డి ఫిర్యాదుతో 465, 468, 471, 403, 409, 420 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.ఇక విచారణలో భాగంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఉన్న గౌలిగూడ క్రికెట్ క్లబ్‌ను అడ్డుపెట్టుకుని జగన్మోహన్రావు మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ భార్య, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితతో కలిసి క్లబ్ డాక్యుమెంట్లను అతడు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటితోనే జగన్మోహన్ రావు హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తేల్చింది.అదే విధంగా.. హెచ్‌సీఏలో జగన్‌మెహన్ రావు భారీగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగానూ సీఐటీ గుర్తించింది. అసోసియేషన్ సభ్యులకు, జగన్మోహన్ రావుకు మధ్య భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా విచారణలో తేలింది.అంతేకాదు.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో బ్లాక్మెయిల్ చేయడం, కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో బెదిరింపులకు దిగడం నిజమేనని గుర్తించింది. కార్పొరేట్ బాక్సులను తమకు కేటాయించాలని.. లేదంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనివ్వబోమంటూ బ్లాక్మెయిల్ చేశారని తేలింది. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే జగన్మోహన్ రావు నేరపూరితంగా హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడని సీఐడీ గుర్తించింది.కాగా ఎస్ఆర్హెచ్తో వివాదం నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది.అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని జగన్మోహన్ రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఫ్రాంఛైజీ చెప్పినప్పటికీ.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన బెదిరింపులకు దిగారు. లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని బ్లాక్మెయిల్ చేశారు.ఇందుకు ఎస్ఆర్హెచ్ నిరాకరించగా.. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు జగన్మోహన్ రావు తాళాలు కూడా వేయించారు. ఈ నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ఎస్ఆర్హెచ్ ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి.. విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. అక్రమాలు వాస్తవమేనని తేలడంతో అరెస్టులు చేసింది.ఈ విషయం గురించి సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా వివరాలు తెలియజేశారు. ‘‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.. SRH ఫ్రాంచైజీని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారు.. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు’’ అని తెలిపారు. -
చరిత్ర సృష్టించేందుకు 45 పరుగుల దూరంలో ఉన్న రూట్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఇవాల్టి (జులై 10) నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ పలు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని రూట్.. మూడో టెస్ట్‌లో చెలరేగవచ్చు. రూట్ గత రెండు టెస్ట్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36.33 సగటున కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు.నేటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌లో రూట్ బద్దలు కొట్టే ఆస్కారం ఉన్న రికార్డులు ఇవే..!టెస్ట్‌ల్లో భారత్‌పై 3000 పరుగులులార్డ్స్ టెస్ట్‌లో రూట్ 45 పరుగులు చేస్తే భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇదే జరిగితే రూట్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 99 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతి తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లుఈ మ్యాచ్‌లో రూట్ మరో ఫోర్ కొడితే టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ను అలిస్టర్ కుక్ (816) ఒక్కడే సాధించాడు.భారత్‌పై 50 క్యాచ్లుఈ మ్యాచ్‌లో రూట్ మూడు క్యాచ్‌లు పడితే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే రూట్ టెస్ట్‌ల్లో కొన్ని సందర్భాల్లో ఇంగ్లండ్‌ను క్యాచ్‌లతోనే గెలిపించాడు.భారత్‌పై 4000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 33 పరుగులు చేస్తే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫీట్‌ను చాలా తక్కువ మంది సాధించారు.ఇంగ్లండ్‌లో 11000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 189 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లలో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కూడా చాలా తక్కువ మంది సాధించారు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ ఇవాళ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. -
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!.. టీనేజ్ స్టార్ కోసం ఏకంగా..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర.ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.సునామీ శతకంఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్‌కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్‌తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్‌తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్‌లోనూ సరికొత్త చరిత్రకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్‌కు చెందిన వైభవ్‌ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్‌లేమి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటుProof why we have the best fans 🫡🚗 Drove for 6 hours to Worcester👚 Wore their Pink🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025 -
రసవతర్త పోరులో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన బౌల్ట్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో ఇవాళ (జులై 10) రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎం న్యూయార్క్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఎంఐ చివరి ఓవర్లో గట్టెక్కి ఛాలెంజర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన యూనికార్న్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో (4-0-19-2) అదరగొట్టిన బౌల్ట్, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. THE FINISHER OF MI NEW YORK - TRENT BOULT 🥶- 22*(13) in the Eliminator in MLC...!!!! pic.twitter.com/vKw5wcr8aD— Johns. (@CricCrazyJohns) July 10, 2025132 పరుగుల స్వల్ప ఛేదనలో 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్.. 13 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 22 పరుగులు చేసి ఎంఐని గెలిపించాడు. ఈ ప్రదర్శనలకు గానూ బౌల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్‌లో ఎంఐ టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్షం దోబూచుల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌల్ట్ సహా రుషిల్ ఉగార్కర్ (3.1-0-19-3), కెంజిగే (4-0-43-2), ట్రిస్టన్ లూస్ (4-0-32-1), పోలార్డ్ (2-0-11-1) రాణించడంతో యూనికార్న్స్‌ను 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ చేసింది. 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చేతులెత్తేసిన యూనికార్న్స్‌ను జేవియర్ బార్ట్లెట్ (44), బ్రాడీ కౌచ్ (19) ఆదుకొని గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరి మినహా యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోలీ (23), హమ్మద్ ఆజమ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ఎంఐ తొలుత ఆడుతూ పాడుతూ విజయం సాధించేలా కనిపించింది. అయితే మాథ్యూ షార్ట్ (4-0-22-3), హసన్ ఖాన్ (4-0-30-4) ఒక్కసారిగా విజృంభించడంతో కష్టాల్లో పడింది. 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. గెలుపుకు ఇంకా 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌల్ట్ బ్యాట్ ఝులిపించి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. అతనికి లూస్ (8), కెంజిగే (3 నాటౌట్) సహకరించారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్ పటేల్ (33), డికాక్ (33) రాణించారు. పూరన్ (1), పోలార్డ్ (5) విఫలమయ్యారు. -
IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా (Ind vs Eng) సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించగా.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రావడం లాంఛనమే.అయితే, బుమ్రా రాక వల్ల ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తుండగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఈ విషయంపై స్పందించాడు. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)ను జట్టు నుంచి తప్పించడం ఖాయమేనని స్పష్టం చేశాడు. కాగా లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.1-1తో సమంఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తంగా పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇక సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం ఏడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ కృష్ణ మాత్రం కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. పేస్ దళంలో అతడొక్కడే ఇలా పూర్తిగా నిరాశపరిచాడు. బర్మింగ్‌హామ్‌లో మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కర్ణాటక పేసర్.. 111 పరుగులు ఇచ్చుకున్నాడు.ప్రసిద్ కృష్ణపై వేటుపడక తప్పదుఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. బుమ్రా రాక కారణంగా ప్రసిద్ కృష్ణపై వేటుపడకతప్పదు. రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.లీడ్స్‌లోనూ అంతే. వికెట్లు తీసినప్పటికీ జట్టుకు పెద్దగా ఉపయోగపడే ప్రదర్శన చేయలేదు’’ అని పేర్కొన్నాడు. కాబట్టి మేనేజ్మెంట్ అతడికి మరో అవకాశం ఇవ్వదని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. పచ్చికతో కూడుకున్న లార్డ్స్ పిచ్ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించనుందన్న విశ్లేషణల నడుమ.. నలుగురు ఫ్రంట్‌లైన్ పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఈ మేరకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పిచ్ స్వభావాన్ని బట్టి తాము 3+1 లేదంటే 3+2 కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.మూడో టెస్టుకు భారత తుదిజట్టు అంచనాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం -
సౌతాఫ్రికా టీ20 లీగ్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా టీ20 లీగ్ నాలుగో ఎడిషన్ (2025-26) షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా (CSA) బుధవారం విడుదల చేసింది. తొలిసారి ఈ లీగ్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకుండా డిసెంబర్లో మొదలవుతుంది. ఈ లీగ్ డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 మధ్యలో జరుగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ కేప్‌టౌన్ డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ పార్ల్ రాయల్స్‌తో పోటీతో సీజన్‌ను ఆరంభిస్తుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 27న జరుగనుంది.🚨 HERE IS THE FULL SCHEDULE OF SA20 2025-26 🚨 pic.twitter.com/tbEIPOMHVk— Johns. (@CricCrazyJohns) July 9, 2025డిసెంబర్లో ఎందుకు..?గత మూడు సీజన్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తదుపరి సీజన్లో మాత్రం డిసెంబర్లో ప్రారంభం కానుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 వరల్డ్‌కప్ జరునుంది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ టీ20 లీగ్‌ను ముందుకు జరిపింది. ఐదో సీజన్ నుంచి లీగ్ మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో మారుతుందని సీఎస్ఏ కమీషనర్ గ్రేమీ స్మిత్ తెలిపారు.బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్సౌతాఫ్రికా టీ20 లీగ్ డిసెంబర్‌కు ప్రీ పోన్ కావడంతో ఆసీస్‌లో జరిగే బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్ కానుంది. ఆ లీగ్ కూడా డిసెంబర్లోనే ప్రారంభమవుతుంది. బీబీఎల్ 2025-26 డిసెంబర్ 14న మొదలై వచ్చే ఏడాది జనవరి 25 వరకు సాగుతుంది.ఛాంపియన్స్ లీగ్ పునఃప్రారంభం..?2014 తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఛాంపియన్స లీగ్ 2026లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లీగ్‌లో అన్ని దేశవాలీ లీగ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శనలు (విన్నిర్) చేసిన జట్లు పోటీపడతాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి కూడా ఓ జట్టు పోటీ పడే అవకాశం ఉంది. పేరు మార్పు.. వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ఈ సారి ఛాంపియన్స్ లీగ్ పేరు కూడా మారనుందని తెలుస్తుంది. బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన ఈ లీగ్‌కు వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ అని నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌ల్లో ఛాంపియన్లు ఈ లీగ్‌లో పాల్గొంటారని సమాచారం. -
ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పీకేఎల్ వేలం ముగియగా... అన్ని ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. త్వరలోనే వేదికలతో పాటు సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘12 ఫ్రాంచైజీలు వేలంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 12వ సీజన్ కోసం అన్నీ జట్లు సమాయత్తమవుతున్నాయి. గతం కంటే మరింత రసవత్తరంగా మ్యాచ్‌లు జరగడం ఖాయం’ అని నిర్వాహకులు వెల్లడించారు. మే 31, జూన్ 1న ముంబై వేదికగా పీకేఎల్ వేలం పాట జరగగా... రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయాల కంటే ఎక్కువ ధర దక్కించుకున్నారు. వచ్చే నెల ఆఖరులో ప్రారంభం కానున్న పీకేఎల్‌లో హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక గత సీజన్లో 22 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్... 12 విజయాలు, 10 పరాజయాలతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్
లండన్: ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటలీ టెన్నిస్ స్టార్ ఫాబియో ఫాగ్నిని ప్రకటించాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫాగ్నిని తొలి రౌండ్లో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల ఫాగ్నిని ఐదు సెట్లు పోరాడాడు. ఈ ఏడాది చివర్లో ఆటకు గుడ్‌బై చెప్పాలని ఫాగ్నిని అనుకున్నాడు. అయితే ఈ సీజన్లో వరుసగా పది పరాజయాలు ఎదురుకావడంతో వింబుల్డన్ టోర్నీ సందర్భంగానే అతను రిటైర్మెంట్ ప్రకటనను జారీ చేశాడు.‘ఆటకు గుడ్‌బై చెప్పాక ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మాత్రం కుటుంబంతో గడుపుతాను’ అని కెరీర్లో 9 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫాగ్నిని తెలిపాడు. 2019లో మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఫాగ్నిని అదే ఏడాది కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2015 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)ను పెళ్లి చేసుకున్న ఫాగ్నిని తన 20 ఏళ్ల కెరీర్లో మొత్తం 63 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాడు. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ప్రస్తుతం ఫాగ్నిని 138వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన స్కాట్లాండ్కు ఊహించని షాకిచ్చింది. ఈ గెలుపుతో ఇటలీ వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లైంది. తమ చివరి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోకుంటే ఇటలీ పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించినట్లే.హాగ్ వేదికగా నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఇటలీ 12 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిలియో గే (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. ఆఖర్లో స్టీవార్ట్ (27 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో హ్యారీ మనెంటి (38) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క (3-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. బ్రాడ్ కర్రీ (4-0-38-1), మార్క్ వాట్ (4-0-24-1), క్రిస్ గ్రీవ్స్ (4-0-29-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ ఆదిలోనే తడబడింది. 29 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జార్జ్ మున్సే (72), కెప్టెన్ బెర్రింగ్టన్ (46 నాటౌట్) స్కాట్లాండ్ను విజయతీరాలవైపు తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. హ్యారీ మనెంటీ (4-0-31-5) అద్భుతంగా బౌలింగ్ చేసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. మనెంటీ ధాటికి స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ గెలిచిన అనంతరం ఇటలీ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. 🚨 ITALY STUNS SCOTLAND IN THE T20 WORLD CUP QUALIFIERS. 🚨- Italy can play the 2026 T20 WC. 🤯pic.twitter.com/t0PrGoSDj2— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2025తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం రావడంతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇటలీ జట్టుకు ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ సారథ్యం వహిస్తున్నాడు. బర్న్స్ ఆసీస్ తరఫున 23 టెస్ట్‌లు ఆడి, ఆతర్వాత ఇటలీకి వలస వచ్చాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం
మహిళల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 9) జరిగిన నాలుగో టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించకుంది. 2012 నుంచి ఇంగ్లండ్‌లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడుతున్న భారత్ తొలిసారి విజయఢంకా మోగించింది. భారత్‌కు ఇంగ్లండ్‌పై వారి దేశంలో కాని స్వదేశంలో కాని ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు. టీమిండియా ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు నాలుగు టీ20 సిరీస్‌లు ఆడగా.. ఇంగ్లండ్ 3, భారత్ 1 గెలిచాయి. 2012, 2021, 2022 సిరీస్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ప్రస్తుత సిరీస్‌లో (2025) భారత్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి మ్యాచ్ బర్మింగ్హమ్ వేదికగా జులై 12న జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. జులై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా.. టీమిండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. రాధా యాదవ్ (4-0-15-2), శ్రీ చరణి (4-0-30-2), దీప్తి శర్మ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు అమన్‌జోత్ కౌర్ (4-0-20-1), అరుంధతి రెడ్డి (3-0-16-0) కూడా పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డంక్లీ (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ బేమౌంట్ (20), అలైస్ క్యాప్సీ (18), స్కోల్ఫీల్డ్ (16), ఎక్లెస్టోన్ (16 నాటౌట్), వాంగ్ (11 నాటౌట్) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 3 ఓవర్లు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. స్మృతి మంధన 32, షఫాలీ వర్మ 31, జెమీమా రోడ్రిగెజ్ 24 (నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ 26 , రిచా ఘోష్ 7 (నాటౌట్) పరుగులు చేసి భారత్‌ను గెలపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లోట్ డీన్, ఎక్లెస్టోన్, వాంగ్ తలో వికెట్ తీశారు. -
రంగు వేసుకోవాల్సి వచ్చిందంటే...
లండన్: ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి కొద్దిరోజుల ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఎంతో ఆడగలిగే సత్తా ఉండి కూడా తప్పుకోవడం పట్ల అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కోహ్లి హాస్యోక్తంగా జవాబిచ్చాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. మైదానంలో కోహ్లి లేని లోటు కనిపిస్తోందంటూ వ్యాఖ్యాత చెప్పడంతో దానికి స్పందిస్తూ అతను తన రిటైర్మెంట్పై సరదా వ్యాఖ్య చేశాడు. ‘నా గడ్డానికి రెండు రోజుల క్రితమే రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి ఇలా గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటేనే మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి’ అని విరాట్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లి లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రిని ఉద్దేశించి మాట్లాడిన కోహ్లి అతనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘భారత జట్టు టెస్టుల్లో సాధించిన కొన్ని ఘనతలు రవిశాస్త్రి సహకారం లేకపోతే సాధ్యం కాకపోయేవి. మేమిద్దరం ఎంతో స్పష్టతతో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం. మీడియా సమావేశాల్లో కఠిన ప్రశ్నలు తనే ఎదుర్కొంటూ నాకు కూడా కీలక సమయాల్లో ఆయన ఎంతో అండగా నిలిచారు. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. నా కెరీర్ ప్రయాణంలో రవిశాస్త్రికి కూడా ప్రధాన పాత్ర ఉంది’ అని కోహ్లి చెప్పాడు. గత 15 ఏళ్ల కాలంలో భారత జట్టుపై అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడని రవిశాస్త్రి కితాబిచ్చాడు. స్టార్లు హాజరు... యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో పెద్ద స్థాయిలో జరిగింది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో సహా దీనికి హాజరయ్యాడు. కోహ్లితో పాటు పలువురు దిగ్గజాలు బ్రియాన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత క్రికెట్ టీమ్ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లు అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాతే కోహ్లి వచ్చాడు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లంతా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీపర్ రిషభ్ పంత్ పాల్గొన్న వేలం ఇక్కడ హైలైట్‌గా నిలిచింది. కళాకృతులతో ప్రత్యేకంగా రూపొందించింన ఒక బ్యాట్‌ను భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అందించే అవకాశం కోసం వేలం జరిగింది. అక్కడికి వచ్చిన అతిథులతో వేలంలో పోటీ పడిన పంత్ 17 వేల పౌండ్లకు (సుమారు రూ.20 లక్షలు) ఆ చాన్స్‌ను దక్కించుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా యువరాజ్ ఫౌండేషన్‌కు సుమారు రూ.12 కోట్ల నిధులు వచ్చాయి. -
ఇక చాలు!
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్‌బుల్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్నర్ను తొలగిస్తున్నట్లు రెడ్‌బుల్ బుధవారం ప్రకటించింది. అతడి సేవలకు ధన్యవాదాలు తెలిపిన రెడ్‌బుల్ యాజమాన్యం తప్పించడం వెనుక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘అతడు మా జట్టు చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తే’ అని ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. హార్నర్ చీఫ్‌గా ఉన్న సమయంలో రెడ్‌బుల్ జట్టు 405 రేసుల్లో పాల్గొని 124 విజయాలు సాధించింది. 8 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్, 6 కన్స్ట్రక్టర్స్ టైటిల్స్ గెలుచుకుంది. హార్నర్ స్థానంలో రెడ్‌బుల్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తమ సొంత జట్టు రేసింగ్ బుల్స్‌కు చెందిన లారెంట్ మెకీస్కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27న జరగనున్న బెల్జియం గ్రాండ్‌ప్రితో మెకీస్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ‘రేసింగ్ బుల్స్ జట్టు స్ఫూర్తి అద్భుతమైంది. ఇది కేవలం ప్రారంభమే అని బలంగా విశ్వసిస్తున్నా. రెడ్‌బుల్ అప్పగించిన బాధ్యతలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సవాలుతో కూడుకున్నదే అయినా నా వంతు కృషి చేస్తా. డ్రైవర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని సరైన దిశలో నడిపించడమే నా బాధ్యత’ అని మెకీస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే అతడు ఇందులో కనీసం హార్నర్ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక మెకీస్ స్థానంలో అలాన్ పెర్మనే రేసింగ్ బుల్స్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఆది నుంచి అతడే... రెడ్‌బుల్ జట్టు తొలిసారి 2005లో ఫార్ములావన్‌లో అడుగు పెట్టగా... అప్పటి నుంచి హార్నర్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రిలో సైతం హార్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. రెడ్‌బుల్ జట్టుకు చెందిన సెబాస్టియన్ వెటెల్, వెర్స్టాపెన్ వరుసగా నాలుగుసార్లు సార్లు చొప్పున డ్రైవర్స్ చాంపియన్‌షిప్ సాధించడం వెనక హార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు సత్తా చాటుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జట్ల విషయానికి వస్తే రెడ్‌బుల్ నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రి సందర్భంగా... వచ్చే ఏడాది రెడ్బుల్తో కొనసాగడంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని వెర్స్టాపెన్ వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రెడ్‌బుల్ జట్టు నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కారు రూపకల్పనలో నిష్ణాతుడైన అడ్రియన్ రెడ్‌బుల్‌ను వీడి ఆస్టన్ మార్టిన్ జట్టుతో చేరగా... స్పోర్టింగ్ డైరెక్టర్ జొనాథన్ వెట్లీ సాబెర్కు మారాడు. ఇక గత సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పెరెజ్‌ను రెడ్‌బుల్ జట్టు వదిలేసుకుంది. అతడి స్థానంలో లియామ్ లాసన్‌ను ఎంచుకుంది. 32 ఏళ్ల వయసులోనే... 1997లో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన హార్నర్ 2005లో రెడ్‌బుల్ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు కేవలం 32 సంవత్సరాలే. పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అందుకున్న హార్నర్ రెండు దశాబ్దాల పాటు వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆరంభంలో ‘పార్టీ టీమ్’గా ముద్ర పడ్డ జట్టును... వరుస విజయాలు సాధించే స్థాయికి తీసుకొచ్చాడు. హార్నర్ హయాంలో 2009లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్ వెటల్ చైనా గ్రాండ్ ప్రిలో విజయం సాధించగా... ఆ తర్వాత 2010 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు అతడు డ్రైవర్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2016లో రెడ్‌బుల్ తరఫున మ్యాక్స్ వెర్స్టాపెన్ అరంగేట్రం చేయగా... ట్రాక్‌పై అడుగుపెట్టిన తొలి రేసు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడి (18 సంవత్సరాలు)గా రికార్డు సృష్టించాడు. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘డ్రైవ్ టు సరై్వవ్’ తొలి సీజన్ హార్నర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. -
ఆధిక్యమే లక్ష్యంగా...
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ గ్రౌండ్‌లోనే మూడు టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ రెండుకు మించి విజయాలు సాధించలేదు. మనకు కలిసొచ్చిన వేదికపై ఇప్పుడు మరో సమరం. మ్యాచ్‌లో బుమ్రా పునరాగమనంతో పెరిగిన పేస్ బలం. గత టెస్టులో సాధించిన ఘన విజయం ఇచి్చన అంతులేని ఆత్మవిశ్వాసం. వెరసి కొత్త ఉత్సాహంతో భారత జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు బలహీనమైన ఆటతో రెండో టెస్టును కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్ కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడా ఆ జట్టు ఓడిందంటే సిరీస్ చేజారినట్లే! లండన్: భారత్, ఇంగ్లండ్ సుదీర్ఘ టెస్టు సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో సిరీస్ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మొదలవుతుంది. భారత జట్టు బర్మింగ్‌హామ్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని అస్త్రశ్రస్తాలతో ఎలాంటి లోపాలు లేకుండా జట్టు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి ఆపై సిరీస్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గిల్ బృందం మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. జట్టులో అక్కడక్కడా పూరించలేని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ప్రసిధ్ స్థానంలో బుమ్రా... సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చించింది. టాప్–6లో కరుణ్ నాయర్ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, రిషభ్ పంత్ శతకాలు బాదగా... రవీంద్ర జడేజా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసి తన బ్యాటింగ్ పదును చూపించాడు. ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌ను ఇంగ్లండ్ బౌలర్లు నిలువరించలేకపోతున్నారు. వైఫల్యాలు ఉన్నా సరే, నాయర్‌కు సిరీస్‌లో మరో అవకాశం దక్కవచ్చు. కాబట్టి బ్యాటింగ్ బృందంలో ఎలాంటి మార్పూ ఉండదు. బౌలింగ్‌లో బుమ్రా ఆడటం ఖాయం కావడంతో ప్రసిధ్ కృష్ణ స్థానంలో అతను నేరుగా జట్టులోకి వస్తాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చెలరేగిన ఆకాశ్‌దీప్, సిరాజ్‌లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్‌కు తిరుగుండదు. అదనపు స్పిన్నర్ కావాలని భావిస్తే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ మరోసారి కీలకం కానున్నారు. నాలుగేళ్ల తర్వాత... ఎప్పటిలాగే ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు రోజే తమ తుది జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని జట్టు నమ్ముతోంది. అయితే ఆర్చర్ ఏకంగా నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతను ఏమాత్రం ప్రభావం చూపుతాడనే చెప్పలేం. మరో ఇద్దరు పేసర్లు వోక్స్, కార్స్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. వీరిద్దరు సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్ గాయంతో తప్పుకోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 71 ఓవర్లలో 286 పరుగులు ఇచ్చినా స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌పైనే ఇంగ్లండ్ నమ్మకం ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్ బ్యాటింగ్ పదునెక్కాల్సి ఉంది. బ్యాటింగ్‌కు మరీ అనుకూలం కాని లార్డ్స్ పిచ్‌పై ఆతిథ్య బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ భారత పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఒలీ పోప్‌తో పాటు జో రూట్ కూడా అంచనాలను అందుకోవాల్సి ఉంది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ఫామ్ సానుకూలాంశం కాగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్ తన బ్యాటింగ్ బలాన్ని చూపించడం జట్టుకు ఎంతో అవసరం. తుది జట్ల వివరాలు భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, నాయర్, పంత్, జడేజా, సుందర్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అనుకూలతగా జీవం ఉన్న పిచ్ ఇది. ఆరంభంలోనే కాస్త పేస్‌కు అనుకూలిస్తుంది. ఆపై మంచి బ్యాటింగ్‌కు అవకాశం ఉంది. ఈసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజుల్లో వర్ష సూచన లేదు.19 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులు. 3 టెస్టుల్లో భారత్, 12 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 4 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.148 లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టులు. 97 టెస్టుల్లో ఫలితాలు రాగా, 51 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికపై ఇంగ్లండ్ 145 టెస్టులు ఆడింది. 59 టెస్టుల్లో నెగ్గి, 35 టెస్టుల్లో ఓడింది. 51 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. -
జ్యోతి సురేఖరిషభ్ జోడీ ప్రపంచ రికార్డు
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), రిషభ్ యాదవ్ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్‌లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్థియెన్–మథియాస్ ఫులర్టన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్‌లో రిషభ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్లో సురేఖ బృందం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందింది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్ సాల్వడోర్ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది. -
తొలిసారి సెమీస్‌లోకి...
లండన్: ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్‌చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు. సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు. -
క్రికెట్ టీమ్‌ను కొన్న చాహల్ గర్ల్ ఫ్రెండ్..?
సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. ఓ క్రికెట్ జట్టుకు ఆమె ఇప్పుడు యజమాని అయ్యారు. ఛాంపియన్స్ లీగ్ టీ10 టోర్నీలో ఒక జట్టు సహ-యజమానిగా ఆమె వాటా కొనుగోలు చేసింది.ఈ విషయాన్ని మహ్వాష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే జట్టు పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొట్టతొలి ఛాంపియన్స్ లీగ్ టీ10 ఎడిషన్ ఆగస్టు 22 నుండి 24 వరకు ఢిల్లీ వేదికగా జరుగుతుంది. ఈ లీగ్ కమిషనర్ భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వ్యవహరించనున్నాడు. ఇందులో ఎలైట్ ఈగల్స్, మైటీ మావెరిక్స్, సూపర్ సోనిక్, డైనమిక్ డైనమోస్, బ్రేవ్ బ్లేజర్స్, విక్టరీ వాన్గార్డ్, స్టెల్లార్ స్ట్రైకర్స్ , సుప్రీం స్టాలియన్స్ మొత్తం ఎనిమిది జట్లు పాల్గోనున్నాయి.ఈ టోర్నీలో భారత మాజీ క్రికెటర్లతో పాటు వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లోకల్ యంగ్ టాలెంట్‌కు దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈ లీగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. చాహల్, ఆర్జే మహ్వాష్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఏదో ఒక విషయంతో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా శబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా శతక్కొట్టాడు.తద్వారా ఓ టెస్టు మ్యాచ్లోఅత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో గిల్ తన ఆసాధరణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా సత్తాచాటాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.95 ఏళ్ల రికార్డుపై కన్ను..ఈ మ్యాచ్‌లో గిల్ 225 పరుగులు చేయగలిగితే.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్‌పై 810 పరుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే కేవలం రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన మ్యాచ్‌లోనైనా కచ్చితంగా గిల్ అధిగమిస్తాడు.గవాస్కర్ రికార్డుపై గురి..అదేవిధంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు చేయగా.. మరో రెండు చేస్తే వాల్కాట్ సరసన నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గానూ శుబ్‌మన్ నిలుస్తాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs ENG: రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్ -
రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. అయితే బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టుతో పాటు ఓ ప్రత్యేక ఆతిథి కసరత్తలు చేస్తూ కన్పించాడు. ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక కానప్పటికి నెట్స్‌లో జట్టుకు తన సేవలను అందించాడు. అతడే టీమిండియా, ముంబై ఇడియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్. ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు చాహర్ తన భార్యతో కలిసి లండన్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో లండన్‌లో ఉన్న భారత జట్టుతో చాహర్ కలిశాడు. ఈ రాజస్తాన్ పేసర్ జట్టుతో కలవడమే కాకుండా నెట్స్‌లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. సాధరణంగా దీపక్ చాహర్ కొత్త బంతిని అద్బుతంగా స్వింగ్ చేయగలడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశమున్నందన.. చాహర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకుముందు బర్మింగ్‌హామ్ టెస్టు సందర్భంగా పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ భారత నెట్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించి ఆశ్చర్చపరిచాడు. ఇప్పుడు చాహర్ నెట్‌బౌలర్‌గా మరి అందరికి షాకిచ్చాడు. దీపక్ చాహర్ చివరగా 2023 డిసెంబర్లో భారత తరపున ఆడాడు. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్Deepak Chahar trains with Team India at Lord’s ahead of the third Test match.[ Rahul Rawat ] pic.twitter.com/bqnASrkAJU— Jay Cricket. (@Jay_Cricket12) July 9, 2025 -
లార్డ్స్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. 2021 ఫలితం రిపీట్ అవుతుందా?
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం వేదికగా గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉండడంతో.. లార్డ్స్‌లో టెస్టులో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. అదేవిధంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో ఆడడం ఖాయమైంది.అంతకుతోడు లార్డ్స్ మైదానంలో పచ్చికతో కూడిన వికెట్‌ను తాయారు చేయడంతో ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య గట్టి పోటీ నెలకోనుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.భయపెడుతున్న గత రికార్డులు..ఈ మైదానంలో గత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి. లార్డ్స్‌లో ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింట మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 1986లో కపిల్‌దేవ్ నేతృత్వంలో లార్డ్స్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. అనంతరం చివరగా 2021లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది.గిల్ మ్యాజిక్ చేస్తాడా..?టీమిండియా లార్డ్స్‌లో చివరగా 2021లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్బుతం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కోహ్లి సేన.. ఏడేళ్ల తర్వాత లార్డ్స్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ను 120 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి తమ సత్తాను చాటింది.ఇప్పుడు యువ సారథి శుబ్‌మన్ గిల్ వంతు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు 2021 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్‌లో 2021 నాటి చారిత్రత్మక టెస్ట్ విజయంలో భాగమైన ఐదుగురు భారత ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు అప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్లు తమ స్దాయికి తగ్గట్టు రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టక తప్పుదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది. -
శ్రీలంకకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆజట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంకకు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ధ్రువీకరించాడు. మంగళవారం(జూలై 8) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో హసరంగా తొడ కండరాల గాయం బారిన పడినట్లు తెలుస్తోంది.మ్యాచ్ అనంతరం వనిందును స్కానింగ్ తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ రానిప్పటికి.. సిరీస్ సమయానికి అతడు కోలుకునే అవకాశం లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో హసరంగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 1.67 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ తొడకండరాల గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు 2023లో తన గాయానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2023కు అతడు దూరమయ్యాడు.ఆ తర్వాత తిరిగి కోలుకుని మైదానంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. ఇక బంగ్లా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు బంగ్లాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో లంక కైవసం చేసుకుంది.బంగ్లాతో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమీక కరుణా, చమీక కరుణా ఫెర్నాండో, ఎషాన్ మలింగచదవండి: రిషబ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్ -
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టు కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ బుధవారం ప్రకటించింది.స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో కన్పించనున్నాడు. యువ పేసర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చర్‌ను తుది జట్టులోకి ఇంగ్లీష్ జట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చర్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఫిట్నెస్ సమస్యల కారణంగా బెంచ్‌కే పరిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్ సిద్దమయ్యాడు. ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మినహా రెండో టెస్టులో ఆడినే జట్టును ఇంగ్లండ్ కొనసాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మరో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేటర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్. -
రిషబ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టిన రిషబ్.. రెండో టెస్టులో అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు.దీంతో చాలా మంది పంత్‌ను ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌క్రిస్ట్‌తో పంత్‌ను పోల్చడం మానేయాలని అభిమానులను అశ్విన్ కోరాడు. చాలా ఆంశాల్లో ఆసీస్ దిగ్గజం కంటే పంత్ మెరుగ్గా ఉన్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు."రిషబ్ పంత్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడికి ఉన్న స్పెషల్ స్కిల్స్ మరొకరు వద్ద లేవు. చాలా మంది అతన్ని ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. దయచేసి ఇక పై పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చొద్దు. గిల్ క్రిస్ట్ కు అంత మంచి డిఫెన్స్ ఆడే టెక్నిక్ లేదు.అదే రిషబ్ పంత్‌కు డిఫెన్స్ ఆడడంలో అత్యుత్తమ స్కిల్స్ ఉన్నాయి. అయితే నేనేమి గిల్‌క్రిస్ట్‌ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వరల్డ్ క్రికెట్లో అతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విధ్వంసానికి మారు పేరు అతడు. గిల్లీ ఒక అద్బుతమైన వికెట్ కీపర్. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలు అందించాడు. అయితే రిషబ్‌కు గిల్‌క్రిస్ట్‌కు మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. అతడి ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వస్తే.. పంత్ ఐదవ స్దానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ చేసే పనులు మరో బ్యాటర్ చేయలేడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ICC Test Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్ -
వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్(Harry Brook) సత్తాచాటాడు. ఐసీసీ ప్రకటించిన తాజాగా ర్యాకింగ్స్లలో బ్రూక్ తన సహచరుడు జో రూట్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ 886 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.అతడి తర్వాతి స్దానంలో జో రూట్ 868 పాయింట్లతో ఉన్నాడు. భారత్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్(158) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ బ్రూక్ రాణించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా అతడు అవతరించాడు.టాప్-10లో శుబ్‌మన్ గిల్..ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) సాధించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. గిల్ 807 పాయింట్లతో ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకుని తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు.ఇక గిల్‌తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో స్ధానంలో ఉండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎనిమిదవ స్దానంలో నిలిచాడు. మరోవైపు భారత్‌తో రెండో టెస్టులో సత్తాచాటిన ఇంగ్లండ్ కీపర్ జెమీ స్మిత్ 753 పాయింట్లతో 16 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.టాప్‌లోనే బుమ్రా..అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(898) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. సఫారీ పేసర్ కగిసో రబాడ(851) రెండో స్ధానంలో ఉన్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.చదవండి: ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్ -
రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్‌లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్‌లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్‌తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్‌తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్‌లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్‌లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. -
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 67 టెస్ట్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్‌ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్‌గా చూస్తే టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్‌ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్‌లో (టెస్ట్‌ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్‌లో పంత్ఇంగ్లండ్తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు అఖిల్ 14 ఏళ్లకే..!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు పద్నాలుగేళ్ల అఖిల్ ఆనంద్ ( Akhil Anand) గురించి తెలుసుకుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఏడేళ్ల వయసులోనే 2018లో, తన తండ్రి ఆనంద్ 49వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కార్డు తయారు చేసిన ఔరా అనిపించుకున్న అఖిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోబోతున్నాడు. యువ కళాకారుడిగా తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్, మోర్ఫోజెనిసిస్తో అరంగేట్రం చేయబోతున్నాడు.సోలో ఎగ్జిబిషన్ మోర్ఫోజెనిసిస్ (గణితం, పురాణాలు , ప్రకృతిని పొరల దృశ్య కథనాలలో మిళితంచేసే ఆర్ట్) తో తన కళాత్మక అరంగేట్రం చేయబోతున్నాడు.ఆగస్టు 1న చెన్నైలోని కల్పడ్రుమాలో తన తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నాడు భారతదేశపు గొప్ప జానపద, గిరిజన కళా సంప్రదాయాల రూపాయల్లో, ముఖ్యంగా మధుబని ,గోండ్ చెరియాల్ వార్లి , కాళిఘాట్ - అఖిల్ పవిత్ర జ్యామితి , ఫైబొనాక్సీ ఇలా అద్భుతమైన శైలులతో ఆర్ట్ స్టోరీ ఆధారిత కళాఖండాలను ప్రదర్శించబోతున్నాడు.దీనిపై అఖిల్ ఆనంద్ రాబోయే ప్రదర్శన గురించి మాట్లాడుతూ, , "నేను ప్రపంచాన్ని ఎలా చూస్తానో వ్యక్తీకరించడానికి కళ సహాయపడుతుంది. నేను విభిన్న శైలులు, ఆలోచనలతో పనిచేయడమంటే ఇష్టం. నేను సృష్టిస్తున్న వాటిని పంచుకో బోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కళాభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నాడు.ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ ప్రదర్శన ఉండబోతోంది. తొమ్మిదేళ్ల వయస్సు నుండి కళాకారిణి డయానా సతీష్ వద్ద శిక్షణ పొందాడు అఖిల్. భారతదేశ వారసత్వ కళలను సంరక్షించడం, ప్రాచుర్యాన్నివ్వడం అతని కళాత్మక లక్ష్యం. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డేవిడ్ అటెన్‌బరో, జేన్ గూడాల్ లాంటి ప్రముఖుల ప్రేరణతో విద్య- పర్యావరణ అవగాహన సాధనాలుగా తన కళను వినియోగించుకోవడం విశేషం. అంతేకాదు అఖిల్ ఆనంద్ అఖిలిజమ్స్ అనే సంస్థ ఫౌండర్ కూడా. భారతీయ కళను ధరించగలిగే , బహుమతిగా ఇచ్చే రూపాలుగా మార్చే వేదిక. బ్లాక్ ప్రింటింగ్‌లో నాడీ సంబంధిత సవాళ్లతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చే ఫౌండేషన్ హస్తతో కలిసి, అఖిల్ క్రాఫ్ట్, సంరక్షణ , వ్యాపారాన్ని వారధిగా చేసే బెస్పోక్ దుస్తులను డిజైన్ చేస్తాడు. అలాగే ప్రకృతిలో గణిత నమూనాలను అన్వేషించే పుస్తకం ది హార్ట్ ఆఫ్ మ్యాథ్ రచయిత కూడా. -
Viral Video: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. దెబ్బకు రెండుగా చీలిన వికెట్
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్‌లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్సెట్కు ఆడుతున్న మెరిడిత్.. నిన్న (జులై 8) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరివీర భయంకరంగా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి ఎసెక్స్ ఓపెనర్ కైల్ పెప్పర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. వికెట్ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్ బౌలర్‌కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్ కూడా దీన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.RILEY SNAPS THE STUMP DOWN THE MIDDLE 🤯Have you ever seen this before?!?#SOMvESS#WeAreSomerset pic.twitter.com/VQ244pq8RR— Somerset Cricket (@SomersetCCC) July 8, 2025కాగా, ఈ మ్యాచ్‌లో మెరిడిత్ జట్టు సోమర్సెట్ ఎసెక్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్ కోహ్లెర్ కాడ్మోర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. సోమర్సెట్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్ (2-0-22-2), క్రెయిగ్ ఓవర్టన్ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో నోవా థైన్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్‌లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్ (225) అలెన్‌దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది. -
మ్యాక్స్‌వెల్ సేనకు కలిసొచ్చిన అదృష్టం.. నేరుగా ఫైనల్స్‌కు
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 9) జరగాల్సిన క్వాలిఫయర్ (వాషింగ్టన్ ఫ్రీడం వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్) మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన వాషింగ్టన్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని టీఎస్కే జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో టీఎస్కే జులై 9న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ (శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వర్సెస్ ఎంఐ న్యూయార్క్) విజేతతో తలపడనుంది. ఛాలెంజర్‌లో గెలిచిన జట్టు జులై 13న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.ఇవాళ జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. 8:15 గంటల వరకు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం మ్యాచ్ ఆడకుండానే అదృష్టం కలిసొచ్చి నేరుగా ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. టీఎస్కే రెండో స్థానంలో నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదుశాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ మధ్య రేపు జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. డల్లాస్‌లో రేపు వాతావరణం క్లియర్‌గా ఉండనుందని వాతావరణ శాఖ నివేదించింది. ఇవాల్టి క్వాలిఫయర్ మ్యాచ్ కూడా డల్లాస్‌లోనే ఉండింది. -
కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ.. శ్రీలంకదే వన్డే సిరీస్
పల్లెకెలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (28), పర్వేజ్ (28), జాకీర్ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. మెండిస్ ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల్కు అంతర్జాతీయ క్రికెట్లో 16వది. ఈ మ్యాచ్‌లో కుసాల్ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్‌పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్‌గా నిలిచాడు. గతంలో కుమార్ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది. -
అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ.. పడిపోయిన సీఎస్కే.. భారీగా పెరిగిన పంజాబ్ విలువ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఒక్కసారి టైటిల్ సాధించకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు అభిమానుల్లో మంచి క్రేజ్ కొనసాగింది. 2025 సీజన్లో తొలి సారి విజేతగా నిలవడంతో ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా ఆ జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ విలువ అక్షరాలా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2306 కోట్లు).ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను (సీఎస్కే) వెనక్కి నెట్టిన ఆర్సీబీ టాప్కు చేరింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచిన సీఎస్కే 235 మిలియన్ డాలర్లు (రూ. 2014 కోట్లు) విలువతో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ విలువను 242 మిలియన్ డాలర్లు (రూ. 2074 కోట్లు)గా బ్యాంక్ హూలీహాన్ లెక్కగట్టింది. ఇతర ఐపీఎల్ జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 1946 కోట్లు) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 1320 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1209 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక వృద్ధి సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్ ఫైనల్‌కు చేరిన పంజాబ్ ఏకంగా 39.6 శాతం వృద్ధి సాధించింది. మరో వైపు ఐపీఎల్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు)కు చేరింది.అత్యంత విలువైన ఐపీఎల్ జట్లు1) RCB - 269 మిలియన్లు (సుమారు రూ. 2306 కోట్లు)2) MI - 242 మిలియన్లు (రూ. 2074 కోట్లు)3) CSK - 235 మిలియన్లు (రూ. 2014 కోట్లు)4) KKR - 227 మిలియన్లు (రూ. 1946 కోట్లు) 5) SRH - 154 మిలియన్లు (రూ. 1320 కోట్లు)6) DC - 152 మిలియన్లు (రూ. 1303 కోట్లు)7) RR - 146 మిలియన్లు (రూ. 1252 కోట్లు)8) GT - 142 మిలియన్లు (రూ. 1217 కోట్లు)9) PBKS - 141 మిలియన్లు (రూ. 1209 కోట్లు)10) LSG - 122 మిలియన్లు (రూ. 1046 కోట్లు) -
రైజింగ్ ‘గ్రాండ్’ స్టార్
టెన్నిస్ రాకెట్ చేతపట్టిన ప్రతి ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వింబుల్డన్‌కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్‌కు చేరిన రిత్విక్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్‌గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్అంటున్నాడు. – సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్చౌదరీ కెరీర్లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్ తొలినాళ్లలో సింగిల్స్‌పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్‌కు మారడం పరిపాటి. అయితే రిత్విక్మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్ అతడి ఖాతాలో చేరాయి. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్‌లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రిత్విక్ వింబుల్డన్‌లో మాత్రం రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ కాదని... క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్పసితనంలో అన్నీ చేస్తూ హైపర్ యాక్టివ్‌గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు.సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ మైదానం సమీపంలోని ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లో కోచ్ సీవీ నాగరాజ్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్అండర్–12, అండర్–16 స్థాయిలో జాతీయ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్‌కప్‌లో, గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన సాకేత్ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లోనే శిక్షణ తీసుకున్నారు. కోచ్ నాగరాజ్ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్ టోర్నీలు ఉన్నా వింబుల్డన్ మాత్రం ప్రత్యేకమని రిత్విక్తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్ అధికారిక వెబ్సైట్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్ సంప్రాస్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... టెన్నిస్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్‌కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘వింబుల్డన్ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్ విజయానంతరం రిత్విక్అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంటోస్తో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన రిత్విక్... రెండో రౌండ్లో ఆరో సీడ్ జోడీ జో సాలిస్బరీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. రిత్విక్వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా... వింబుల్డన్ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్‌లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్తల్లి రిత్విక్ప్రొఫైల్పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్ ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 85 కేజీలు ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2022 డబుల్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్: 65 (మార్చి;2025లో) ఏటీపీ టూర్లో నెగ్గిన డబుల్స్ టైటిల్స్: 2 (అల్మాటీ ఓపెన్–250 టోర్నీ; చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ) ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్స్: 5 ఐటీఎఫ్ సర్క్యూట్లో నెగ్గిన టైటిల్స్: 6 -
ముగిస్తారా... ఆఖరిదాకా లాక్కొస్తారా?
మాంచెస్టర్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టుకు గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఆతిథ్య ఇంగ్లండ్ బ్రేకులేసింది. దీంతో మూడో టి20 ఓటమితో ‘వాయిదా’ పడిన సిరీస్ విజయాన్ని మాంచెస్టర్‌లో రాబట్టాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అడ్డుకున్న ఇంగ్లండ్ అదే ఊపుతో ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య బుధవారం జరిగే నాలుగో టి20 ఆసక్తికరంగా జరుగనుంది. బర్మింగ్‌హామ్ (12న ఐదో టి20) దాకా సాగదీయకుండా ఎలాగైనా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని అమ్మాయిల జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన సూపర్‌ఫామ్, తెలుగమ్మాయి శ్రీచరణి స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ కంటే ఓ మెట్టుపైనే ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్, సిరీస్ విజయం ఏమంత కష్టం కానేకాదు. హర్మన్‌ప్రీత్ రాణిస్తే... పొట్టి సిరీస్‌లో ఎవరైనా ప్రదర్శన పరంగా బాకీ పడ్డారంటే అది కెప్టెన్ హర్మన్‌ప్రీతే! తొలి మ్యాచ్‌కు గైర్హాజరైన సారథి తర్వాత మ్యాచ్‌లాడినా... ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడో టి20లో హర్మన్ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి ఉంటే ఇదివరకే సిరీస్ దక్కేది. కేవలం 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గడ్డపై ‘హ్యట్రిక్’ విజయం దూరమవగా... సిరీస్ కోసం ఇంకా పోరాడాల్సి వస్తోంది. మిగతా వారిలో గత మ్యాచ్‌లో ఓపెనర్ ఫషాలీ వర్మ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఓపెనర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్, హర్మన్లు కూడా రాణిస్తే... రిచా ఘోష్ తన హిట్టింగ్తో ఆదరగొట్టేందుకు అవకాశముంటుంది. ఈ సిరీస్‌లో శ్రీచరణి అత్యంత నిలకడగా స్పిన్నేస్తోంది. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మలు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎలా చూసినా కూడా భారత బౌలింగ్ దళం మెరుగ్గానే ఉంది. సమం కోసమే సమరం ఈ సిరీస్‌లోనే నిలకడలేమి ఆటతీరుతో అగచాట్లు పడుతున్న ఇంగ్లండ్ గత మ్యాచ్ గెలిచిందంటే ఓపెనర్లే కారణం. సోఫియా డంక్లీ, డానీ వ్యాట్లు తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేశారు. కానీ గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో నిలబెట్టారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తెలివిగానే బోల్తాకొట్టించారు. ఈ నేపథ్యంలో బ్యూమోంట్ సేన అందివచి్చన అవకాశాన్ని జారవిడువకుండా వరుసగా ఈ మ్యాచ్‌లోనూ పుంజుకొంటే సిరీస్ రేసులో పడొచ్చని భావిస్తోంది. పటిష్టమైన భారత బృందాన్ని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు రాణిస్తే సరిపోదని సమష్టి బాధ్యత తీసుకోవాలని అనుకుంటుంది. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, అమన్‌జోత్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీచరణి. ఇంగ్లండ్: టామీ బ్యూమోంట్ (కెప్టెన్ ), సోఫియా డంక్లీ, డానీ వ్యాట్, అలైస్ క్యాప్సీ, స్కాలిఫీల్డ్, అమీ జోన్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, ఇసీ వాంగ్, చార్లీ డీన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్. -
‘టాప్’ ర్యాంక్‌కు చేరువగా దీప్తి శర్మ
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న భారత స్పిన్నర్ దీప్తి శర్మ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరువైంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. గత ఆరేళ్లగా టాప్–10లో కొనసాగుతున్న దీప్తి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకునేందుకు దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం దీప్తి ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 746 పాయింట్లతో పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో మరో రెండు టి20లు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీప్తి శర్మ విశేషంగా రాణిస్తే తదుపరి ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది. ‘హండ్రెడ్’ టోర్నీకి దూరం వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నీ నుంచి దీప్తి శర్మ వైదొలిగింది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీప్తి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ‘హండ్రెడ్’ టోర్నీలో భారత ప్రాతినిధ్యం ఉండటంలేదు. గత సీజన్ ఫైనల్లో దీప్తి శర్మ చివరి ఓవర్లో కొట్టిన సిక్స్‌తో లండన్ స్పిరిట్స్ జట్టు తొలిసారి ‘హండ్రెడ్’ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో లండన్ స్పిరిట్స్ జట్టు దీప్తి శర్మకు 36 వేల పౌండ్లు చెల్లించింది. -
సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెట్‌ను 6–2తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్‌లో సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్‌లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్‌లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 13 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్‌ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. -
బూమ్ బూమ్ బుమ్రా
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్‌లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా మ్యాచ్‌కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్‌తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్‌లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్‌తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్‌తో అతను బౌలింగ్ చేశాడు. నెట్స్‌కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ స్వింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజం, రిజ్వాన్‌లపై వేటు
బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. అయితే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.ఈ జట్టులో ఈ సీనియర్ త్రయానికి చోటు దక్కలేదు. పాక్ కొత్త వైట్‌బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచన మేరకు వీరిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్టులు, వన్డేల్లో మాత్రమే భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఇక ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, స్పీడ్ స్టార్ హ్యారిస్ రవూఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే వెటరన్ ఆటగాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగా జరగనున్నాయి.బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్. -
స్టోక్స్ ఇదొక కఠిన పరీక్ష.. గిల్ మాత్రం అద్భుతం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో గిల్ సేన సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ విమర్శల వర్షం కురిపించాడు. స్టోక్స్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, కెప్టెన్‌గా తన మార్క్ చూపించలేకపోతున్నాడని అథర్టన్ మండిపడ్డాడు. కాగా తొలి టెస్టులో పర్వాలేదన్పించిన స్టోక్స్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా.. ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు."ఈ సిరీస్‌కు బెన్ స్టోక్స్‌కు కఠిన పరీక్ష వంటింది. స్టోక్స్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ఫామ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు అతడి బ్యాటింగ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది.వన్డే, టీ20లకు దూరంగా ఉంటూ స్టోక్స్ కేవలం టెస్టుల్లో ఆడుతూ వన్-ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతడు జట్టును ఒక ప్రణాళికపరంగా ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడి పేలవ ఫామ్ కెప్టెన్సీపై ఇంపాక్ట్ చూపుతోంది. అంతేకాకుండా స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు.కానీ ప్రత్యర్ధి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తునప్పటకి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లార్డ్స్‌లో జరగనున్న మూడో టెస్టులో కూడా భారత్ నుంచి ఇంగ్లండ్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.ఈ మ్యాచ్‌లో స్టోక్స్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడన్నది చాలా ముఖ్యంమని" ది టైమ్స్ కాలమ్‌లో అథర్టన్ పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో స్టోక్స్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఈజ్ బ్యాక్ -
భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత మహిళలతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది.అదేవిధంగా సోఫీ ఎకిలిస్టోన్, బౌచర్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎకిలిస్టోన్ దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.కానీ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని సోఫీ మార్చుకుంది. ఈ క్రమంలోనే వన్డే జట్టులోకి ఆమె తిరిగొచ్చింది. ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2025 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. జూలై 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.వన్డే సిరీస్ షెడ్యూల్:1వ వన్డే – జూలై 16, ది అగేస్ బౌల్, సౌతాంప్టన్2వ వన్డే – జూలై 19, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్3వ వన్డే – జూలై 22, సీట్ యూనిక్ రివర్సైడ్, చెస్టర్-లె-స్ట్రీట్భారత్తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్(కెప్టెన్),ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్భారత మహిళల వన్డే జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, అరుంధతి రెడ్డి, కె. సత్ఘరేచదవండి: IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం? -
జింబాబ్వేను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సిరీస్ క్లీన్ స్వీప్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 236 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 456 రన్స్ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆతిథ్య జింబాబ్వే.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలింది.సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు పడగొట్టగా.. సేనురన్ ముత్తుసామి మూడు, కోడీ యూసఫ్ రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో నిక్ వెల్చ్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రెయిగ్ ఎర్విన్(49), కైతానో(40) పర్వాలేదన్పించారు.ముల్డర్ ట్రిపుల్ సెంచరీ..అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 626/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు)చెలరేగాడు.అతడితో పాటు డేవిడ్ బెడింగ్హమ్ (82), లుహాన్ డ్రి ప్రిటోరియస్ (78), డెవాల్డ్ బ్రెవిస్ (30), వెర్రిన్ (42) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ సాధించాడు.అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ బౌలర్లలో సుబ్రేయన్ నాలుగు.. ముల్డర్, యూసఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా జింబాబ్వే ఫాలో ఆన్ ఆడింది. ఫాల్ ఆన్‌లో కూడా విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ రెండు అవార్డులు కూడా ముల్డర్కే దక్కాయి.చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా? -
సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండిస్.. రెండో శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పల్లెకలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మెండిస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో మెండిస్ 95 బంతుల్లో తన ఆరో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యా టర్ సహచర ఆటగాళ్లు పాథుమ్ నిస్సాంక, చరిత్ అసలంకతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.ఓవరాల్‌గా 114 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 18 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్‌పై 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో శ్రీలంక క్రికెటర్‌గా మెండిస్ నిలిచాడు. కుశాల్ ఇప్పటివరకు బంగ్లాపై మూడు ఫార్మాట్లు కలిపి 2032 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర(3090) అగ్రస్దానంలో ఉన్నాడు.బంగ్లాదేశ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన శ్రీలంక ఆటగాళ్లు వీరేకుమార్ సంగక్కర – 3090కుసాల్ మెండిస్ - 2032దిల్షాన్ - 1903మహేల జయవర్ధనే - 1723ఉపుల్ తరంగ – 1507బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్‌తో పాటు నిస్సాంక(35), అసలంక(58) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, మెహాదీ హసన్ మిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీమ్, తన్వీర్, షకీబ్ చెరో వికెట్ సాధించారు.చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా? -
లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?
‘‘ట్రిపుల్ సెంచరీ సంగతేమో గానీ డబుల్ సెంచరీ చేస్తానని కూడా కలలో అనుకోలేదు. లారా ఒక దిగ్గజం. 400 రికార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయంపై కోచ్‌తో చర్చించా. దిగ్గజాల పేరిటే అలాంటి రికార్డు ఉండటం సబబని భావించాం. ఆ ఘనత లారా పేరిట ఉండటమే సరైంది’’.. జింబాబ్వేపై త్రిశతకం బాదిన తర్వాత సౌతాఫ్రికా స్టార్ వియాన్ ముల్డర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తనకు క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. లారా మీద గౌరవంతో మాత్రమే.. ఆ ఫీట్ జోలికి వెళ్లలేదని చెప్పాడతడు.ఈ నేపథ్యంలో వియాన్ ముల్డర్‌పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే లాంటి పసికూన మీద ట్రిపుల్ సెంచరీ బాదడం కాస్త సులువేనని.. అయినా.. 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే దానిని త్యాగం అంటారు గానీ.. 367 వద్ద డిక్లేర్ చేయడం ఏమిటంటూ అతడి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్గాఇంతకీ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుపై తొలి టెస్టులో గెలిచిన ప్రొటిస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టెస్టులో ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బులవాయో వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేయగా.. సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.కాగా సోమవారం నాటి రెండో రోజు ఆటను వియాన్ ముల్డర్ ఓవర్‌నైట్ స్కోరు 264తో మొదలు పెట్టాడు... రెండో రోజు మరో 38 బంతులు ఆడే సరికి అతడి ‘ట్రిపుల్ సెంచరీ’ పూర్తయింది... మరో 5 బంతుల తర్వాత దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో టాప్ స్కోరర్ రికార్డు సొంతమైంది... ఆ తర్వాత మరిన్ని రికార్డుల వేట మొదలైంది... జోరు కొనసాగిస్తూ దిగ్గజాలను దాటుకుంటూ పోయాడు... సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, గూచ్, డాన్ బ్రాడ్‌మన్, మార్క్ టేలర్, హనీఫ్, జయసూర్య, గ్యారీ సోబర్స్... ఇలా అందరిని అధిగమించి టాప్–5లోకి వచ్చేశాడు. 367 పరుగులకు చేరాక లంచ్ విరామం వచ్చింది.మరో 34 పరుగులు చేస్తే చాలుఇక తదుపరి లక్ష్యం బ్రియాన్ లారా 400 పరుగుల ఘనత... మరో 34 పరుగులు చేస్తే చాలు టెస్టు చరిత్రలో అతను శిఖరాన నిలిచిపోతాడు. కానీ దక్షిణాఫ్రికా శిబిరం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. ఈ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. 367 పరుగులతో నాటౌట్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. లారాను దాటకపోయినా... తన అద్భుత బ్యాటింగ్‌తో అతను ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఈ క్రమంలోనే లారా రికార్డును టచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే తాను 400కు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?ఈ నేపథ్యంలో.. ‘‘ప్రతి ఒక్కరు వియాన్ ముల్డర్లా నిస్వార్థంగా ఉంటే.. ఈ ప్రపంచం ఎంతో బాగుండేది’’ అని కొంత మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు చేసిన పని తప్పు అని విమర్శిస్తున్నారు. ‘‘ఒకవేళ ముల్డర్ లారా పట్ల గౌరవం ప్రదర్శించాలని భావిస్తే.. 399 వరకు ఆడి అప్పుడు డిక్లేర్ చేయాల్సింది.లారాను గౌరవిస్తున్నాడు సరే.. మరి హెడెన్, జయవర్దనే, సోబర్స్ ఇలా అందరినీ గౌరవించాలి కదా! అయినా ఆటల్లో రికార్డులు ఉన్నవే బద్దలు కొట్టడానికి కదా! అసాఫా పావెల్ కోసం ఉసేన్ బోల్ట్ నెమ్మదిగా పరిగెత్తలేడు..ఏదేమైనా ఇక్కడ ప్రత్యర్థిని ఆడించి.. ఆలౌట్ చేసి గెలవాలంటే సౌతాఫ్రికాకు సమయం కావాలి. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. కానీ ముల్డర్ తానేదో త్యాగం చేస్తున్నట్లు చెప్పడం సరికాదు’’ అని ట్రోల్ చేస్తున్నారు. -
Sourav Ganguly: ఈ రికార్డులను ఇంత వరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!
భారత క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్ టైగర్ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.ఒకే ఒక్కడు..అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో దాదా ఈ ఘనత సాధించాడు.ఏకైక లెఫ్ట్ హ్యాండర్‌గా..వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు కూడా గంగూలీనే కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో న్యూజిలాండ్‌పై సౌరవ్ సెంచరీ(117) సెంచరీతో మెరిశాడు.👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భారత తరపున నుంచి గంగూలీ ఒక్కడే ఉన్నాడు.👉ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు పరుగులు చేశాడు.వరసుగా నాలుగు సార్లు1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయర్స్‌లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.1997లో – 1338 పరుగులు1998లో – 1328 పరుగులు1999లో – 1767 పరుగులు2000లో – 1579 పరుగులు👉వరల్డ్ క్రికెట్లో అంతర్జాతీయ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్ సాధించాడు.👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్నుని అందించిన కెప్టెన్ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. -
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ.. ఇక డబుల్ సెంచరీ బాకీ!
ఐపీఎల్-2025లో అదరగొట్టిన యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తన అరంగేట్ర సీజన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇంగ్లండ్ గడ్డ మీదా వేగవంతమైన శతకంతో మెరిశాడు.తద్వారా యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో, తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లంగ్ పర్యటనలో అతడి ప్రదర్శన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ క్రికెటర్లు.. ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నారు.252కు పైగా స్ట్రైక్రేటుతోఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆరంభం కాగా.. హోవ్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇక రెండో యూత్ వన్డేలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ రాణించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 45 పరుగులు రాబట్టాడు.సునామీ శతకంతో చెలరేగి..అయితే, మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన వైభవ్.. ఈసారి ఏకంగా 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు తొమ్మిది సిక్స్‌లు ఉండటం విశేషం.ఇవన్నీ ఒక ఎత్తయితే.. నాలుగో వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రశంసించేందుకు మాటలు చాలవు. మంచి బంతిని గౌరవిస్తూనే.. లూజ్ బాల్ పడ్డప్పుడల్లా బౌండరీలతో ఇరగదీశాడు ఈ చిచ్చరపిడుగు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఇందులో 46 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం.Highlights of Vaibhav Suryavanshi's superb 143 off 78 against England Under-19s 🙌(via @WorcsCCC) pic.twitter.com/alFqUTxNHL— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025 ఫాస్టెస్ట్ సెంచరీఆ తర్వాత కూడా ఇదే జోరును కొనసాగించిన వైభవ్.. కేవలం 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా యూత్ వన్డేలో 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్. ఇక ఈ మ్యాచ్ వైభవ్ (143)తో పాటు మరో ఆటగాడు విహాన్ మల్హోత్రా (129) కూడా శతకం బాదడంతో భారత్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం సాధించి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇక ఆఖరిదైన ఐదో యూత్ వన్డేలో మాత్రం వైభవ్ నామమాత్రంగానే ఆడాడు. 42 బంతులు ఎదుర్కొని కేవలం 33 పరుగులే చేశాడు. మిగతా వారిలో ఆర్ఎస్ అంబరీష్ అజేయ అర్ధ శతకం (66)తో రాణించాడు. ఈ క్రమంలో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన భారత జట్టు.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. భారత బౌలర్లు తేలిపోవడంతో 31.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ పనిపూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏదేమైనా ఈ పర్యటన ద్వారా వైభవ్ సూర్యవంశీ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి.. భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తంగా 355 పరుగులు సాధించగా... ఇందులో 29 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక డబుల్ సెంచరీ బాకీ..ఇక తన ఫాస్టెస్ట్ సెంచరీ తర్వాత బీసీసీఐతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ.. ‘‘ఈ రికార్డు గురించి నాకసలు తెలియదు. మా టీమ్ మేనేజర్ అంకిత్ సర్ దీని గురించి చెప్పారు. శుబ్‌మన్ గిల్ (డబుల్ సెంచరీ)ను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన తీరును గమనించాను. అప్పుడే నేను కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో అర్థం చేసుకున్నాను. అయితే, సెంచరీ తర్వాత నేను తప్పుడు షాట్ సెలక్షన్‌తో అవుటయ్యాను. లేదంటే గిల్ మాదిరే డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నించేవాడిని.నేనేం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే!..తదుపరి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, 33 పరుగులకే అవుట్ కావడంతో వైభవ్ ఆశ నెరవేరలేదు. అయినప్పటికీ ఈ సిరీస్‌లో వైభవ్ కనబరిచిన ఆట తీరు అద్భుతమనే చెప్పవచ్చు. వన్డే ఫార్మాట్లో అతడు టీ20 మాదిరి విధ్వంసం సృష్టించడం విశేషం. ఇక తదుపరి ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో యూత్ టెస్టులలోనైనా వైభవ్ తన డబుల్ సెంచరీ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాలి!చదవండి: MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే -
లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం?
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా తమ జోరును కొనసాగించి ప్రత్యర్దిని మట్టికర్పించాలని టీమిండియా(Teamindia) ఉవ్విళ్లూరుతోంది. లార్డ్స్ టెస్టు కోసం గిల్ సేన మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది.మెకల్లమ్ మాస్టర్ ప్లాన్..కాగా మూడో టెస్టు కోసం లార్డ్స్ పిచ్‌ను ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే విధంగా క్యూరేటర్లు తాయారు చేశారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon McCullum) అభ్యర్ధన మేరకు క్యూరేటర్లు పేస్ బౌలింగ్‌కు సరిపోయే వికెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ పిచ్‌ను మంగళవారం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రెవ్‌స్పోర్ట్స్ వెబ్సైట్ ఎక్స్‌లో షేర్ చేసింది. పిచ్‌పై ఎక్కువగా గ్రాస్‌ను ఉంచినట్లు ఫోటోలో కన్పిస్తోంది. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు.సుందర్‌పై వేటు..?ఇక లార్డ్స్ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశమున్నందన అదనపు పేసర్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశముంది. స్పిన్ ఆలౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టి పేస్ బౌలింగ్ సంచలనం అర్ష్‌దీప్ సింగ్‌కు భారత టెస్టు క్యాప్‌ను అందించే సూచనలు కన్పిస్తున్నాయి.రెండో టెస్టులో సుందర్ అద్బుతంగా రాణించినప్పటికి పిచ్ కండీషన్స్ కారణంగా వేటు పడకతప్పదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మూడో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నందన ఎడ్జ్‌బాస్టన్‌లో ఘోరంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణపై వేటు పడడం ఖాయన్పిస్తోంది.చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్First look of the Lord's pitch for the third Test between India and England. India head coach Gautam Gambhir and batting coach Sitanshu Kotak take a closer view. 📸 @CricSubhayan pic.twitter.com/YC8pSaxKDI— RevSportz Global (@RevSportzGlobal) July 8, 2025 -
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 17 మందితో సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు చరిత్ అసలంక(Charith Asalanka) సారథ్యం వహించనున్నాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్లు దసున్ షనక(Dasun Shanaka), చమిక కరుణరత్నేలకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.అదేవిధంగా యువ పేసర్ ఎషాన్ మలింగకు తొలిసారి లంక టీ20 జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో మలింగ అద్బుతమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు టీ20 జట్టులోకి తీసుకున్నారు.మలింగకు డెత్‌లో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇక ఈ జట్టులో కెప్టెన్ అసలంకతో కుశాల్ మెండిస్, నిస్సాంక, కమిందు మెండిస్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మతీషా పతిరాన, వానిండు హసరంగా, నువాన్ తుషారా వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు.కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2026 సన్నాహాల్లో భాగంగా జరగనుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు శ్రీలంక, భారత్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక, బంగ్లా జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే పల్లెకలే వేదికగా మంగళవారం జరుగుతోంది.బంగ్లాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమిక కరుణరత్నే, మతీషా పతిరనా, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, ఎషాన్ మలింగ.చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ -
‘అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు’
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో చక్కగా రాణిస్తున్నాడని.. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల స్థానాన్ని అతడు భర్తీ చేస్తున్నాడని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బ్యాటర్‌గా అదరగొడుతున్నాడని.. మంచినీళ్లప్రాయంలా పరుగుల వరద పారిస్తున్నాడని ప్రశంసించాడు.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలుత టీమిండియాను ఓటమి పలకరించింది. లీడ్స్‌లో శుబ్‌మన్ గిల్ సహా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (రెండు సెంచరీలు) శతక్కొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం వల్ల ఓటమిపాలైంది.అయితే, రెండో టెస్టులో మాత్రం ఆ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు. మరోసారి బ్యాటర్‌గా దుమ్ములేపిన గిల్.. కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161)తో అలరించాడు.సారథిగానూ తనదైన వ్యూహాలతో ముందుకు సాగి జట్టుకు చారిత్రాత్మక విజయం అందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగులతో ఓడించిన భారత్.. ఈ వేదికపై తొలిసారి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి మార్క్ బుచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రీడా ప్రపంచంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండటం కంటే ఒత్తిడితో కూడిన బాధ్యత మరొకటి ఉండదు. ప్రతీ అడుగును నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని గిల్ భర్తీ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. అయినా సరే.. మంచినీళ్లప్రాయంగా తన పని చేసుకుంటూ పోతున్నాడు. కొత్త బాధ్యతను ఎంతో చక్కగా, సౌకర్యవంతంగా నిర్వర్తిస్తున్నాడు’’ అని గిల్‌పై బుచర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (జూలై 10-14)కు లార్డ్స్ వేదిక. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో పెను విషాదం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.ACB's Condolence and Sympathy MessageACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 - 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 20251984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో అతను చివరి సారి అంపైరింగ్ చేశాడు. షిన్వారీ తన కెరీర్లో 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్ జర్నీని ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు.బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!షిన్వారీ 2020 అక్టోబర్‌లో నగర్హర్ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చనిపోలేదని నిర్ధారించాడు. -
అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లండ్ (IND vs ENG)తో రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో అతడిపై విమర్శలకు అడ్డుకట్ట పడింది. కాగా గౌతీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా బాగానే రాణిస్తోంది.వరుస పరాజయాలుముఖ్యంగా ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం గంభీర్ కోచింగ్ కెరీర్లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు స్వస్తి పలికారు.ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక సంప్రదాయ ఫార్మాట్లో భారత్ ఇలా వరుసగా మ్యాచ్‌లు ఓడటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.తొలిసారి ఈ వేదికపై గెలిచిఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమిండియా తమకు అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్ వేదికపై ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి.. ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్‌గా గిల్‌కు.. విదేశీ గడ్డపై కోచ్‌గా గంభీర్‌కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించిన తర్వాత గంభీర్ చిరునవ్వులు చిందించాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఇరుజట్ల ఆటగాళుల పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గిల్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న గౌతీ.. ఎంతో సంతోషంగా కనిపించాడు.అతడు తరచూగా నవ్వడు.. ఈసారి మాత్రంఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్ ఒడిసిపట్టగా.. కామెంటేటర్ రవిశాస్త్రి గంభీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘అతడు తరచూగా నవ్వడు. అయితే, ఈసారి మాత్రం చిరునవ్వులు చిందించేందుకు పూర్తిగా అర్హుడు.ఒక ఓటమి తర్వాత జట్టు తిరిగి పుంజుకోవడం.. అది కూడా ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వడం.. సిరీస్ ఆశలను సజీవం చేసుకోవడం కంటే ఓ కోచ్‌కు గొప్ప సంతోషం మరేదీ ఉండదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!ఇక రవిశాస్త్రి కామెంట్స్ వైరల్ కాగా.. ‘‘అమాసకు.. పున్నానికి (అమావాస్యకు.. పౌర్ణమికి) ఓసారి నవ్వే గంభీర్.. ఈసారి మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. బర్మింగ్‌హామ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య జూలై 10-14 వరకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్🎙️ Ravi Shastri on-air: Don't see him smile too often but Gautam Gambhir deserves every bit of it. #ENGvsIND pic.twitter.com/avyTsSTv5t— KKR Vibe (@KnightsVibe) July 6, 2025 -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. తప్పుకొన్న కేన్ విలియమ్సన్
ఈ నెలాఖరులో జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జులై 8) ప్రకటించారు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడనుంది. ఇతరత్రా ప్లేయింగ్ కమిట్మెంట్స్ కారణంగా కేన్ ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేన్ ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ కోసమే కేన్ జింబాబ్వే సిరీస్‌ను వద్దనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జింబాబ్వే సిరీస్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా తప్పుకొన్నాడు. ఫ్రాంచైజీ కమిట్మెంట్స్ కారణంగా మైఖేల్ బ్రేస్‌వెల్ జింబాబ్వే సిరీస్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఈ సిరీస్ సమయంలో బ్రేస్‌వెల్ హండ్రెడ్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉన్నందున అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగనుంది. కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. లెఫ్ట్మార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా యువ పేసర్ మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. ఫిషర్ దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. ఫిషర్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జులై 30 నుంచి న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తొలి టెస్ట్ జులై 30న, రెండో టెస్ట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు బులవాయో వేదికగా జరుగుతాయి. -
MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అవుటైన తీరుపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) స్పందించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని.. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సంధించిన డెలివరీ నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అనవసరపు రాద్దాంతాలు అక్కర్లేదని కొట్టిపారేసింది.తొలి గెలుపుటెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.పది వికెట్లు తీసిన ఆకాశ్ఇక భారత్ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269, 161)తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిదైన ఐదో రోజు ఏడు వికెట్లు కూల్చాల్చిన తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి సత్తా చాటాడు.అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6)లను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. హ్యారీ బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రూట్ బలయ్యాడా?అదే విధంగా జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, జో రూట్ అవుటైన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆకాశ్ దీప్ రూట్‌ను బౌల్డ్ చేసింది నిజమే అయినా.. అది నో బాల్ అని.. అతడి కాలు రిటర్న్ క్రీజును దాటిందని పలువురు విమర్శించారు. అంపైర్ తప్పిదం కారణంగా అనవసరంగా రూట్ బలయ్యాడంటూ కామెంట్లు చేశారు.𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG— Star Sports (@StarSportsIndia) July 5, 2025ఎంసీసీ వివరణఅయితే, అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసి రూట్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఎంసీసీ తాజాగా స్పందించింది. రూట్ విషయలో అంపైర్‌ది సరైన నిర్ణయమని సమర్థించింది. ‘‘గత వారం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్‌ను అవుట్ చేసిన విధానంపై కొందరు సందేహాలు లేవనెత్తారు.అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని విశ్వసించారు. నిజానికి దీప్ అసాధారణ రీతిలో క్రీజుపై ల్యాండ్ అయ్యాడు. అతడి బ్యాక్ ఫుట్ రిటర్న్క్రీజు ఆవల నేలను తాకినట్లు కనిపించింది. అయినా సరే.. అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించలేదని అన్నారు.అయితే, ఈ విషయంలో ఎంసీసీ స్పష్టతనివ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం.. బౌలర్ బ్యాక్ ఫుట్ తొలుత ఎక్కడ ల్యాండ్ అయిందన్న విషయాన్నే ఎంసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ దీప్ పాదం వెనుక భాగం తొలుత నేలను తాకింది. అది రిటర్న్ క్రీజు లోపలే ఉంది.అయితే, అతడి పాదంలో కొంత భాగం రిటర్న్ క్రీజు అవతల నేలను తాకి ఉండవచ్చు. కానీ నిబంధన ప్రకారం.. అతడి పాదం తొలుత రిటర్న్ క్రీజులోపలే ల్యాండ్ అయింది. కాబట్టి ఇది చట్టబద్దమైన డెలివరీయే’’ అని ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
కౌంటీల్లో అరంగేట్రం చేయనున్న మరో భారత క్రికెటర్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి మరో భారత ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. తమిళనాడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ సర్రే కౌంటీ జట్టుతో రెండు మ్యాచ్‌ల స్వల్ప ఒప్పందం చేసుకున్నాడు. సాయి కిషోర్ ఈ నెల 22న యార్క్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌తో కౌంటీ అరంగేట్రం చేస్తాడు. ఆ మ్యాచ్‌లో సాయి తన మాజీ సీఎస్కే సహచరడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఢీకొంటాడు. రుతురాజ్ కూడా ఇదే సీజన్‌తో యార్క్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేశాడు.28 ఏళ్ల సాయి సర్రే క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఘన చరిత్ర కలిగిన సర్రేకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సాయి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడతాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత్ తరఫున 3 టీ20లు ఆడిన సాయికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 23.5 సగటున 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 2022 సీజన్ నుంచి గుజరాత్‌కు ఆడుతున్న సాయి.. ఈ లీగ్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 20.3 సగటుతో 32 వికెట్లు తీశాడు.ఈ సీజన్లో ఆరో క్రికెటర్ప్రస్తుత కౌంటీ సీజన్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదుగురు భారత ఆటగాళ్లు వేర్వేరు క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్, తిలక్ వర్మ హ్యాంప్‌షైర్, ఖలీల్ అహ్మద్ ఎసెక్స్, రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్, యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్నారు.వీరిలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే ఇరగదీశారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశారు. -
భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ కోసం 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. రెండో టెస్ట్‌కు ముందు మరో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్ అదే జట్టును రెండో టెస్ట్‌లోనూ కొనసాగించింది. దీంతో ఆర్చర్‌కు ఛాన్స్ దక్కలేదు. మూడో టెస్ట్ తుది జట్టులో ఆర్చర్ లేదా అట్కిన్సన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని క్రిస్ వోక్స్ స్థానంలో ఆర్చర్ లేదా అట్కిన్సన్ను ఆడించవచ్చు. మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 336 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి చారిత్రక విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత).608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. అంతకుముందు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో.. ఐదో టెస్ట్ జులై 31నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది. -
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. కానీ: భారత మాజీ బ్యాటర్
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సొంతం. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 (ODI World Cup), ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013లను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. తద్వారా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే డకౌట్ అయిన ధోని.. జట్టులో కొనసాగడం కష్టమేనని అప్పటికి జట్టులో ఉన్న క్రికెటర్లు భావించారట. అతడి ఆట మూణ్ణాళ్ల ముచ్చటేనని.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించలేడని అనుకున్నారట. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఈ విషయాన్ని వెల్లడించాడు.కాగా ధోని సోమవారం (జూలై 7) 44వ వసంతంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధోని గురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కైఫ్.. అరంగేట్ర వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ధోని.. 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన తీరు తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.వన్‌డౌన్‌లో రావడమే సర్ప్రైజ్‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఎంతగా ఉంటుందో తెలుసు కదా!.. నాటి ఆ మ్యాచ్‌లో ధోనిని టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని గంగూలీ భావించాడు. అతడు కొన్నైనా పరుగులు చేస్తాడని అనుకున్నాడు.కానీ అతడు 140 పరుగులు చేస్తాడని ఎవరు అనుకోగలరు. డ్రెసింగ్‌రూమ్‌లో ఈ విషయం గురించి ఒక్కరికీ తెలియదు. కనీసం ఎవరూ ఊహించను కూడా లేదు. అసలు అతడు వన్‌డౌన్ (మూడో స్థానం)లో బ్యాటింగ్‌కు వెళ్లడమే ఒక సర్ప్రైజ్.అలాంటిది అతడు పాయింట్, మిడాఫ్ మీదుగా అలా షాట్లు బాదుతుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఇతడు ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని ఒక్కరమూ ఊహించలేదు. మా ఆలోచన ఎంత తప్పో తన ఆట ద్వారానే నిరూపించాడు.అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడుఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అతడు షాట్లు బాదుతూనే ఉన్నాడు. పవర్ ప్లేలో మొదలుపెడితే.. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అన్న తేడా లేకుండా అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. తనకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని అతడికి తెలుసు.ఒకవేళ మూడో స్థానంలో గనుక తను రాణించకపోతే.. భవిష్యత్తులో తనకు మళ్లీ అవకాశాలు రావని కూడా అతడికి తెలుసు. అందుకే అతడు ధైర్యంగా, దూకుడుగా ఆడి సత్తా చాటాడు’’ అని మహ్మద్ కైఫ్ జియోస్టార్ షోలో పేర్కొన్నాడు. కాగా 2005లో పాక్‌తో రెండో వన్డేలో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 148 పరుగులు చేశాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా పాక్‌ను ఓడించింది. అయితే, స్వదేశంలో జరిగిన ఆ సిరీస్‌లో మాత్రం 4-2తో ఓటమిపాలైంది.దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్‌కాగా 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ధోని.. 2006లో టీ20లలో ప్రవేశించాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగిన ధోని.. 2007లో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.భారత దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు ధోని. టీమిండియా తరఫున మొత్తంగా 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన తలా... ఆయా ఫార్మాట్లలో 10773, 1617, 4876 పరుగులు సాధించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు తలా.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
ఆర్సీబీ స్టార్ క్రికెటర్‌పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.— ANI (@ANI) July 7, 2025ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్ స్టేషన్లో యశ్ దయాల్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద యశ్‌పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన యువతి దయాల్‌తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్‌తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.దయాల్ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్‌తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్‌కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, 27 ఏళ్ల యశ్ దయాల్‌ను ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్‌కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్లో దయాల్ 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో దయాల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దయాల్ 2023 సీజన్లో రింకూ సింగ్‌కు బౌలింగ్ చేస్తూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్ విరాట్ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. -
బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ సమయంలో హాస్పిటల్‌కు... ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముషీర్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్‌కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్‌లో ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు) సరిపెట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్‌దే. రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.శాంతించిన వైభవ్ఈ సిరీస్‌లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. -
అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్‌కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్‌కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్‌కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్‌లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్‌బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్‌లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్‌కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్‌లాండ్‌తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్‌ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్‌లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్‌లను మారుస్తూ పోయింది. డెనర్‌బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్‌లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్‌గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్‌లాండ్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్‌లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్‌లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్‌లో ఉన్నారు. పురుషుల ఫుట్‌బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్‌ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్‌పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్‌లో ఆతిథ్య థాయ్‌లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్‌లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్‌తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్‌తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్‌కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్‌కు వెళ్లి కాంట్రాక్ట్‌లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్‌లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్‌లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్‌లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
రెండో రౌండ్లో వంతిక అగర్వాల్
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్లోకి ప్రవేశించగా... కిరణ్ మనీషా మొహంతి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్ గేమ్‌లలో తేలనుంది. తొలి రౌండ్లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్మెనిస్తాన్)పై, పద్మిని 2–0తో జాంగ్ లాన్లిన్ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్ అనాహి (ఈక్వెడార్)పై గెలుపొందారు. కిరణ్ మనీషా 0.5–1.5తో సాంగ్ యుజిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లోని రెండు గేమ్‌లు ముగిశాక ప్రియాంక–గాల్ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్‌లో 29 ఎత్తుల్లో నెగ్గింది. జాంగ్ లాన్లిన్పై తొలి గేమ్‌లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్‌లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్‌లో నెగ్గిన నందిత రెండో గేమ్‌లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్ యుజిన్ చేతిలో తొలి గేమ్‌లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది. -
ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్‌వర్క్‌కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్‌కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్‌కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా... సంజోగ్‌ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా వచ్చి... ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్డైస్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి మీడియా మొఘల్‌గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్‌వర్క్‌ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్ ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్ సహా, ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ (ఐఎస్ఎల్) సహా ఎన్నో ప్రీమియర్ లీగ్‌ను, గ్రాండ్‌స్లామ్ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నెట్వర్క్ డిస్నీ స్టార్‌ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్ యాజమాన్యం గతేడాది సంజోగ్ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్‌ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్ గుప్తా. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993–2001), మాల్కం స్పీడ్ (2001–2008), హరూన్ లోర్గాట్ (2008–2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012–2019), మనూ సాహ్ని (2019–2021), జెఫ్ అలర్డైస్ (2021–2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు. -
జొకోవిచ్ 16వసారి...
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 16వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 1–6, 6–4, 6–4, 6–4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై నెగ్గాడు. 3 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్లో కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచాడు. అయితే రెండో సెట్ నుంచి గాడిలో పడ్డ జొకోవిచ్ ప్రత్యరి్థకి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 52 సార్లు దూసుకొచ్చి 35 సార్లు పాయింట్లు నెగ్గిన జొకోవిచ్ 38 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా వింబుల్డన్‌లో 101వ విజయం నమోదు చేసిన జొకోవిచ్ కెరీర్లో 63వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోలితో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కొబోలి 6–4, 6–4, 6–7 (4/7), 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై... బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–1, 7–6 (7/1), 7–5తో సొనెగో (ఇటలీ)పై, డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించారు. -
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఇవాళ (జులై 7) జరుగుతున్న ఐదో యూత్ వన్డేలో 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ఇంత తక్కువ స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ తొలిసారి శాంతించడంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్‌దే. మిగతా ఆటగాళ్లలో రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెన్ డాకిన్స్ (66) అర్ద సెంచరీతో రాణించగా.. బెన్ మేస్ (45) ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. మేస్‌కు జతగా కెప్టెన్ రూ (2) క్రీజ్‌లో ఉన్నాడు.కాగా, ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడింట విజయాలు సాధించింది. చివరిదైన ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియాకు ఒరిగేదేమీ ఉండదు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ రెండో వన్డేలో మాత్రమే నెగ్గింది. వన్డే సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది. -
రసెల్, నరైన్ కొనసాగింపు.. కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర వీరులు
దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు జరుగనుంది. ఈ సీజన్లో కోసం లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొదటి దశ సెలెక్షన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇవాళ (జులై 7) లీగ్ నిర్వహకులు జట్ల వివరాలను వెల్లడించారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 23 మంది ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఇందులో ఎనిమిది మందిని రీటైన్ కానీ డైరెక్ట్ సైనింగ్ కానీ చేసుకోవచ్చు. మిగతా బెర్త్‌లను తొలిసారి వేలం ద్వారా భర్తీ చేయనున్నారు.తొలి దశ ఎంపిక ప్రక్రియలో అన్ని ఫ్రాంచైజీలు విధ్వంసకర బ్యాటర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, ఆలీషాన్ షరాఫును రిటైన్ చేసుకొని, కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లను ఎంపిక చేసుకుంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లైన అలెక్స్ హేల్స్, లియామ్ లివింగ్‌స్టోన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లను కొత్తగా అక్కున చేర్చుకుంది.మరో ఫ్రాంచైజీ డెజర్ట్ వైపర్స్ డాన్ లారెన్స్, డేవిడ్ పెయిన్, ఖుజైమా బిన్ తన్వీర్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్ హోల్డన్, సామ్ కర్రన్, వనిందు హసరంగను రీటైన్ చేసుకొని, ఆండ్రియస్ గౌస్‌ను కొత్తగా సైన్ చేసుకుంది.దుబాయ్ క్యాపిటల్స్ విషయానికొస్తే.. దసున్ షనక, దుష్మంత చమీరా, గుల్బదిన్ నైబ్, రోవ్‌మన్ పోవెల్, షాయ్ హోప్‌ను రీటైన్ చేసుకొని, కొత్తగా లూక్ వుడ్, వకార్ సలాంఖీల్, ముహమ్మద్ జవాదుల్లాను సైన్ చేసుకుంది.గల్ఫ్ జెయింట్స్ ఆయాన్ అఫ్జల్ ఖాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, మార్క్ అదైర్‌ను రీటైన్ చేసుకొని.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొయిన్ అలీ, రహ్మానుల్లా గుర్బాజ్‌ను సైన్ చేసుకుంది.ఎంఐ ఎమిరేట్స్ అల్లా ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూకీ, కుసాల్ పెరీరా, రొమారియో షెపర్డ్, టామ్ బాంటన్, ముహమ్మద్ వసీంను రీటైన్ చేసుకొని.. క్రిస్ వోక్స్, కమిందు మెండిస్‌ను సైన్ చేసుకుంది.షార్జా వారియర్జ్ జాన్సన్ ఛార్లెస్, కుసాల్ మెండిస్, టిమ్ సౌధి, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ను రీటైన్ చేసుకొని.. మహీశ్ తీక్షణ, సికందర్ రజా, సౌరభ్ నేత్కావల్కర్, టిమ్ డేవిడ్‌ను సైన్ చేసుకుంది. -
అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలు వీరే.. గవాస్కర్‌కు అత్యధికంగా..!
ఐపీఎల్లో అత్యధిక పారితోషికం అందుకున్న వ్యాఖ్యాతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లెక్కల ప్రకారం.. గవాస్కర్ ఓ సీజన్లో ఇంగ్లీష్ కామెంట్రీ చేసినందుకు గానూ రూ. 4.5 కోట్లు తీసుకుంటాడు. అంటే ఓ మ్యాచ్‌కు అతని రెమ్యూనరేషన్ రూ. 6 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. వ్యాఖ్యాతలు కామెంట్రీతో పాటు మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్టోరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కలిపి వారి పారితోషికం ఉంటుంది.గవాస్కర్‌తో సమానంగా ఐపీఎల్లో పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలుగా మాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. వీరంతా ఇంగ్లీష్ కామెంట్రీకి తలో రూ. 4.17 కోట్లు అందుకుంటారు. వీరి తర్వాత ఇంగ్లీష్ కామెంట్రీకి హర్షా భోగ్లే రూ. 4.1 కోట్లు, రవిశాస్త్రి రూ. 4 కోట్లు అందుకుంటారు.హిందీ కామెంట్రీకి అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అతనికి సీజన్‌కు రూ. 2.92 కోట్లు లభిస్తుంది. ఆకాశ్ చోప్రా తర్వాత సంజయ్ మంజ్రేకర్ అత్యధికంగా రూ. 2.8 కోట్లు అందుకుంటాడు. ఆతర్వాత సురేశ్ రైనా రూ. 2.5 కోట్లు, హర్భజన్ సింగ్ రూ. 1.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటారు.సీనియర్ వ్యాఖ్యాతల పారితోషికాలు ఇలా ఉంటే, జూనియర్లకు మ్యాచ్‌ల లెక్కన పేమెంట్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని స్థానిక భాషల్లో వ్యాఖ్యానం చేసే వారికి ఒకే లెక్కన మ్యాచ్‌కు రూ. 35 వేలు ఇస్తారు. ఇటీవలికాలంలో క్రికెట్లో కామెంట్రీకి ప్రాధాన్యత చాలా పెరిగింది. వ్యాఖ్యాతలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే, వారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లేకు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. ఔటైనప్పుడు కానీ సిక్సర్లు కొట్టినప్పుడు వీరి వ్యాఖ్యానం పతాక స్థాయిలో ఉంటుంది. -
విండీస్ ఆటగాడి ఉగ్రరూపం.. 52 బంతుల్లో సుడిగాలి శతకం
మేజర్ లీగ్ క్రికెట్లో వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాటర్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ ఫ్లెచర్ విశ్వరూపం ప్రదర్శించాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో ఇవాళ (జులై 7) జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (58 బంతుల్లో 118; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సునామీ శతకంతో చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఫ్లెచర్‌తో పాటు అలెక్స్ హేల్స్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా విధ్వంసం సృష్టించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూనికార్న్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. సంజయ్ కృష్ణమూర్తి (40 బంతుల్లో 92; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నైట్‌రైడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. అతనికి హస్సన్ ఖాన్ (17 బంతుల్లో 35)చ, హమ్మద్ ఆజమ్ (27 బంతుల్లో 27), జేవియర్ బార్ట్లెట్ (13 బంతుల్లో 27) కూడా తోడవ్వడంతో ఓ దశలో యూనికార్న్స్ సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో యూనికార్న్స్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ చివరి 3 ఓవర్లు అద్భుతంగా వేసి కీలక వికెట్లు తీశారు. ఈ గెలుపు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించిన నైట్‌రైడర్స్‌కు కంటితుడుపుగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో యూనికార్న్స్ మూడో స్థానానికి పరిమితమై ఎంఐ న్యూయార్క్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రీడం చేతిలో ఓడినా సీయాటిల్ ఓర్కాస్‌తో పోటీ పడి (రన్‌రేట్ విషయంలో) నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఎంఐపై గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం టాప్ ప్లేస్‌ను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో వాషింగ్టన్, టెక్సాస్ జట్లు తలపడనున్నాయి.ఐదో శతకం.. ఈ సీజన్లో రెండోదిఈ మ్యాచ్‌లో ఫ్లెచర్ చేసిన సెంచరీ ఈ సీజన్లో అతనికి రెండవది. కొద్ది రోజుల కిందట ఇతను వాషింగ్టన్ ఫ్రీడంపై మెరుపు శతకం (104) బాదాడు. ఓవరాల్‌గా ఫ్లెచర్‌కు ఇది టీ20ల్లో ఐదవ సెంచరీ. ఈ సెంచరీతో ఫ్లెచర్ కొలిన్ మున్రో, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర వీరుల సరసన చేశాడు. వీరంతా టీ20ల్లో తలో 5 సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. -
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
పృథ్వీ షా సంచలన నిర్ణయం
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్‌గా తనకు గుర్తింపునిచ్చిన ముంబైతో బంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి (2025-26) దేశవాలీ సీజన్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. షా ఇటీవలే NOC (No Objection Certificate) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, తాజాగా అది జారీ అయ్యింది. PRITHVI SHAW JOINS MAHARASHTRA...!!!!- Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv— Johns. (@CricCrazyJohns) July 7, 2025షా క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్లో ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే డిసెంబర్ 14న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్ షా రాణించనప్పటికీ ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఇదే షాకు ముంబై తరఫున ఆఖరి మ్యాచ్.షా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (MCA) రాసిన లేఖలో ఇలా పేర్కొన్నాడు. MCA క్రికెటర్‌గా తనకు జన్మనిచ్చిందని అన్నాడు. MCA తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మహారాష్ట్రకు ఆడే ఆశాజనకమైన అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపాడు. ఈ మార్పును (ముంబై నుంచి మహారాష్ట్రకు) తన క్రికెట్ ప్రయాణంలో ముందడుగుగా అభివర్ణించాడు. ఇది తన అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నానని అన్నాడు.25 ఏళ్ల పృథ్వీ షా కెరీర్ హీన దశలో ఉన్నప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున అవకాశాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఈ సాహసం చేశాడు. సహజంగా క్రికెటర్లకు ముంబై తరఫున ఆడుతుంటేనే జాతీయ జట్టులో అవకాశాలు వస్తుంటాయి. అలాంటిది షా ముంబైని వీడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేసి భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. వివాదాలు, ఫిట్నెస్, పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.ఇవే కారణాలుగా అతను దేశవాలీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. షాను తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. షా కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ దశలో అతను ముంబైని వీడి మహారాష్ట్రకు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. షా తదుపరి దేశవాలీ సీజన్లో మరో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆడతాడు. రుతురాజ్ మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కుదిరితే షా, రుతురాజ్ మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. -
ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు బద్దలు
యుజీన్ (అమెరికా): మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్ లీగ్‌లో భాగంగా అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఫెయిత్ కిపియేగాన్ 1500 మీటర్ల విభాగంలో... పారిస్ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్ చెబెట్ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్ తిరగరాసింది. కిపియేగాన్ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్ చెబెట్ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందిన చెబెట్... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో చెబెట్ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్’ సాధించిన మూడో అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ ఈ ఫీట్ సాధించాడు. WIAAN MULDER BECOMES THE FIRST TEST CAPTAIN TO SCORE TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT...!!! 🦁 pic.twitter.com/SujzdKo0Ht— Johns. (@CricCrazyJohns) July 7, 2025ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.వీరేంద్ర సెహ్వాగ్-278 బంతుల్లోవియాన్ ముల్దర్-297హ్యారీ బ్రూక్-310మాథ్యూ హేడెన్-262వీరేంద్ర సెహ్వాగ్-364ఈ ట్రిపుల్‌తో ముల్దర్ టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 314 పరుగుల స్కోర్ వద్ద హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఆమ్లా తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కడపటి వార్తలు అందేసరికి ముల్దర్ 350 పరుగులు కూడా పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు (ముల్దర్‌తో కలిసి) మాత్రమే ఈ ఘనత సాధించారు. 108 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా స్కోర్ 593/5గా ఉంది. ముల్దర్ 350 (324 బంతుల్లో 48 ఫోర్లు, 3 సిక్సర్లు), వెర్రిన్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేసిన ముల్దర్జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ముల్దర్ తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన ముల్దర్ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.