గుజరాత్‌ జెయింట్స్‌ కోచ్‌గా ఆసీస్ క్రికెట్‌ దిగ్గజం | Gujarat Titans appoint Matthew Hayden as batting coach ahead of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: గుజరాత్‌ జెయింట్స్‌ కోచ్‌గా ఆసీస్ క్రికెట్‌ దిగ్గజం

Mar 10 2026 1:07 PM | Updated on Mar 10 2026 1:14 PM

Gujarat Titans appoint Matthew Hayden as batting coach ahead of IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. వరల్డ్‌కప్ విన్నర్‌, డేంజరస్ ప్లేయర్‌ హేడెన్ రాకతో టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

"మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఒక కీలకమైన ఘట్టం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాథ్యూను మా బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది" గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విధ్వంసకర బ్యాటర్ గుజరాత్ హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు. హేడన్ గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్  కన్సల్టెంట్‌గా పనిచేశాడు. కానీ పూర్తి స్ధాయిలో ఎప్పుడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న హేడెన్‌.. ఐపీఎల్‌లో కూడా తన మార్క్‌ను చూపించాడు.

హేడెన్  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడారు. 2010లో టీమ్ ని టైటిల్ గెలిపించగా, 2009లో 12 మ్యాచ్‌ల్లో 572 రన్స్ చేసి ఆరెంజ్ కాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆట తీరునే మార్చేసిన హేడెన్, ఇప్పుడు కోచ్‌గా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడాలి. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.
చదవండి: Teamindia: బీసీసీఐ భారీ న‌జ‌రానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement