భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమేనని చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 2024 డిసెంబర్‌లో వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్‌తో త్వరలో చెస్ క్యాండిడేట్ టోర్నీ విజేతతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో జుడిత్ పోల్గర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈసారి గుకేశ్ టైటిల్ నిలబెట్టుకోవడ కష్టమని, ఎందుకంటే క్యాండిడేట్ చెస్ టోర్నీ విజేత అతడిని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
‘గుకేశ్ ఈసారి విఫలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి చాంపియన్‌షిప్ తర్వాత మరోసారి గుకేశ్ చాంపియన్‌గా నిలుస్తాడా అనేది చెప్పడం సందేహమే. 2024లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ అత్యంత పిన్న వయస్సులో చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఈసారి గుకేశ్ ఆటతీరులో మార్పు కనిపిస్తుంది.
2024 నుంచి గుకేశ్ ఆడిన గేముల్లో డ్రాలతో పాటు ఓటములు కూడా ఉన్నాయి. దీంతో గుకేశ్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అతడు జాగ్రత్తగా ఆడితే తప్ప చాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకోలేకపోవచ్చు.’ అని చెప్పుకొచ్చారు.
కాగా ఇటీవల కాలంలో జరిగిన టోర్నీల్లో గుకేశ్ కేవలం ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో మాత్రమే విజయాన్ని అందుకున్నాడు.2025లో విజ్ ఆన్ వేదికగా జరిగిన టాటా మాస్టర్స్ చెస్ టోర్నీలో పాల్గొన్నగుకేశ్ భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందతో తలపడ్డాడు. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో టైటిల్‌ను డిసైడ్ చేసేందుకు టైబ్రేకర్ వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ టైబ్రేక్ ప్రజ్ఞానంద విజయం సాధించడంతో గుకేశ్‌కు నిరాశే మిగిలింది.


