Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Radhika Yadav Friend Himaanshika Singh Rajput Reacts On Incident1
రాధిక చేసిన మిస్టేక్‌ అదే.. హిమాన్షిక సంచలన వ్యాఖ్యలు

గురుగ్రామ్‌: టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్‌లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్‌ టెన్నిస్‌ కోచ్‌లలో ఒకరైన అజయ్‌ యాదవ్‌ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్‌ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్‌ చాట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Actor Kota Srinivasa Rao Passed Away2
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు.నేడు అంత్యక్రియలుకోట శ్రీనివాసరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. ఆయన మనవడు శ్రీనివాస్‌ అంతక్రియలు పూర్తిచేయనున్నాడు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. కోట కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు.. శ్రీనివాస్ పెద్ద మనువడు కాగా హర్ష చిన్న మనువడు.(ఇదీ చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్‌గా, ఒక కమెడియన్‌గా, ఒక నిస్సహాయుడిగా, ఒక క్రూరుడిగా ఇలా ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్‌ స్క్రీన్‌ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాస రావు తన సినీ ప్రయాణాన్ని ముగించారు.తొలి ఛాన్స్‌ ఎలా వచ్చిందంటే..‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్రకు ఎంపిక అయ్యారు. అప్పటికే ‘ప్రాణం ఖరీదు’ నాటకం ప్రజల్లో ఆదరణ ఉంది. అందులో కోట నటించారు. ఆ నాటకాన్ని నిర్మాత వాసు, దర్శకుడు క్రాంతి కుమార్‌ చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్‌.రావుగారే సినిమాకి కూడా రచయిత. ఆయనకు కోట అంటే చాలా సెంటిమెంట్‌ ఉండేది. దీంతో ‘ప్రాణం ఖరీదు’లో చిన్న వేషం ఉంది.. చేయాలని కోరారు. అలా కోట ప్రయాణం మొదలైంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆయన సుమారు ఐదేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు. హైదాబాద్‌లోని స్టేట్‌బ్యాంకులో మంచి ఉద్యోగం ఉండటంతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు. జంధ్యాలగారితో ఉన్న పరిచయం వల్ల అమరజీవి (1983) చిత్రంలో నటించారు. అదే ఏడాదిలో విజయశాంతి ప్రతిఘటనలో ఛాన్స్‌ వచ్చింది. 1985లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. ఆ రాత్రికి రాత్రి కోట స్టార్‌ అయిపోయారు. ఆయనకు వరుసగా భారీ ఆఫర్లు రావడంతో 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.

Ujjwal Nikam Nominated to Rajya Sabha by President Murmu3
రాజ్యసభకు ప్రముఖుల నామినేట్‌.. జాబితా ఇదే..

న్యూఢిల్లీ: రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేశారు. రాజ్యాంగంలోని క్లాజ్ త్రీలో గల ఆర్టికల్ 80(1)(ఎ) ద్వారా మంజూరయిన అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నామినేషన్లు దాఖలు చేశారు. The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw— ANI (@ANI) July 13, 2025రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..1. ఉజ్వల్ దేవరావు నికమ్‌: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్‌ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది.

KL Rahul surpasses Virender Sehwag, joins Sunil Gavaskar in a rare record4
ఇంగ్లండ్‌ గడ్డపై రాహుల్‌ సూపర్‌ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్‌

లార్డ్స్ వేదికగా ఇం‍గ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్‌, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. తన సూపర్ పెర్ఫార్మెన్స్‌తో రాహుల్ ఆదుకున్నాడు.రిషబ్ పం‍త్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి రాహుల్ ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.మూడో ప్లేయర్‌గా..సేనా( దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్య‌ధిక సార్లు ఫిఫ్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన మూడో ఏసియన్ బ్యాట‌ర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ఇది సేనా దేశాల్లో 11వ ఫిప్టీ స్కోర్ కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా లెజెండ‌రీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయ‌ర్ త‌మీమ్ ఇక్భాల్‌, సయీద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ దిగ్గ‌జ ఆట‌గాళ్లు త‌మ కెరీర్‌లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిని కేఎల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడు 12 సార్లు 19 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్ధానంలో దిముత్ కరుణరత్నే(12) కొనసాగుతున్నాడు.ఇక లార్డ్స్ టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు చేయ‌గా.. టీమిండియా సైతం సరిగ్గా 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.

Mla Thomas Not Following Ttd Rules In Tirumala5
టీటీడీ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే తిట్ల పురాణం

సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ నిబంధనలను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ తుంగలో తొక్కేశారు. తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా సృష్టించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ఆయనతో పాటు 12 మందికి ప్రోటోకాల్‌ను టీటీడీ కేటాయించింది.అదనంగా జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్‌లో తనతో పాటు పంపాలంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందిపై గొడవపడి మరి ప్రోటోకాల్ దర్శనానికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.

Scam: Officers Ate 14 Kg Dry Fruits In One Hour In Madhya Pradesh6
గంటలో 14 కేజీలు లాగించేశారు!

ప్రభుత్వ అధికారుల అవినీతి కథలు కొత్తేమీ కాదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని ఈ తాజా ఘటన మాత్రం కొంచెం విచిత్రమైందే. గంట సమయంలో కొందరు అధికారులు ఎకాఎకిన 14 కిలోల డ్రైఫ్రూట్స్‌ లాగించేశారట. దీనికి సంబంధించి రూ.85 వేల బిల్లు పెడితే.. పై అధికారులకు డౌటొచ్చింది. విచారణ జరగడంతో పాపం చిక్కిపోయారు! వివరాలు...మధ్యప్రదేశ్‌లోని శాధోల్‌ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్‌ గంగ సంవర్ధన్‌’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, ఎస్‌డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్‌ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్‌ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్‌, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.వీటికి రకరకాల పండ్లు అదనం! విచిత్రమైన విషయం ఇంకోటి ఉంది. సమావేశానికి హాజరైన గ్రామస్తులకు కిచిడీ మాత్రమే వడ్డించి వీరు మాత్రం పంచభక్ష్య పరమాన్నాల టైపులో డ్రైఫ్రూట్స్‌తో ‘బ్రేవ్‌’ మని తేన్చడం!గంట సమావేశంలో రూ.85 వేల బిల్లు ఏమిటా? అన్న అనుమానం పై అధికారులకు రావడంతో విషయం బయటకొచ్చింది. విచారణ మొదలైంది. ‘‘అబ్బే.. మేం అసలు డ్రైఫ్రూట్స్‌ ముట్టుకోలేదు’’ అని కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు!-గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Court Summons Andhra Jyothi Md Radha Krishna7
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆంధ్రజ్యోతి ఎండీ వే­మూ­రి రాధాకృష్ణకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సివిల్‌ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్ర­జ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవా­లని గతంలో హిందూపురం టూటౌన్‌ సీఐగా పనిచేసిన సీఐ రియాజ్‌ అహ్మద్‌ కోర్టులో పరు­వు నష్టం దావా వేశారు.వ్యక్తిగత అంశాలను ఏబీఎన్‌ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారంటూ సదరు సీఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకూ నోటీసులు పంపింది. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.కాగా.. తనకు పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డితో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే తనను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచా­రం చేసినట్టు సీఐ రియాజ్‌ అహ్మద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను 2024 జూన్‌ 6న సస్పెండ్‌ కాగా, 3వ తేదీనే సస్పెండ్‌ అయినట్టు కథనాలు ప్రసారం చేశారని, దురుద్దేశ పూర్వకంగానే ఇలా ప్రసారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Goods Train Fire Accident Carrying Diesel In Tamil Nadu8
తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్‌ నిలిపివేత

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్‌ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్‌ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.🚨 #Breaking: Massive fire engulfs a diesel freight train near Tiruvallur, Tamil Nadu. Several major trains from MGR Chennai Central have been canceled for today, July 13, as a safety precaution. Passengers are advised to check with @GMSRailway for updates.#TrainFire #TamilNadu… pic.twitter.com/1ipJg4q94M— Shubham Rai (@shubhamrai80) July 13, 2025ఇక, గూడ్స్‌ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్‌లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.Major fire broke out very near tiruvallur railway station! Oil trail got collapsed n breakup a major fire.. #tiruvallur #tiruvallurrailwaystation #railway #SouthernRailway @RailMinIndia @IRCTCofficial @GMSRailway @UpdatesChennai @THChennai @polimernews pic.twitter.com/YJ8G534hpc— arsath ajmal (@ajmalji) July 13, 2025 A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 🚨 BREAKING: Goods train derails and catches fire near Tiruvallur railway station in Tamil Nadu. Rescue operations currently underway. 🚂🔥#TiruvallurTrainAccident #TamilNadu #TrainDerailment #RescueOperations #Breaking #IndianRailways #Emergency #SafetyFirst pic.twitter.com/NShYM4uw8K— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025Southern Railway tweets, "Due to a fire incident near Tiruvallur, overhead power has been switched off as a safety measure. This has led to changes in train operations. Passengers are advised to check the latest updates before travel." pic.twitter.com/LTvTAFYNqu— ANI (@ANI) July 13, 2025

Pawan Kalyan Suspended Janasena Party Leader TV Rama rao9
అలా ప్రశ్నిస్తావా?.. చంద్రబాబు కోసం సేనాని సంచలన నిర్ణయం

నేనే పాతికేళ్ల పాటు చంద్రబాబు పల్లకి మోయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఎన్నాళ్ళు సీఎంగా ఉన్న ఆయన గుమ్మం ముందు కాపలాకు సిద్ధమయ్యాను.. అలాంటిది చంద్రబాబును, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఏమైనా గానీ పార్టీలో ఎదగాలంటే పార్టీ అధినేత కనుసన్నల్లో.. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తేనే ముందుకు వెళ్లగలరు.. ఉన్నతమైన స్థానాలు పొందగలరు. అలాకాకుండా అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన కావచ్చు ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఖర్చయిపోతారు అని జనసేన అని రుజువు చేస్తున్నారు.వాస్తవానికి సేనాని పొత్తు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేది కాదు. కానీ, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కు ఏపాటి ప్రాధాన్యం దక్కుతుంది అన్నది జనం మొత్తానికి తెలుసు. ఇది ఎలా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జన సైనికులను రాజకీయ కార్యకర్తలుగా కన్నా డబ్బులు ఇస్తే వచ్చే కూలీలుగానే ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకుని చంద్రబాబు వద్ద తాబేదారుగా పని చేస్తున్నపుడు మధ్యలో మీరు ఎందుకు గొంతెత్తుతారు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.అంతేకాకుండా ప్రభుత్వం తరఫున జనసేనకు రావలసిన నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ ఏ విభాగంలో నామినేటెడ్ పోస్టులు నియామకాలు జరుగుతున్నా అక్కడ జన సైనికులకు కచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోస్టులు ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ తెలుగుదేశం వాళ్ళు తన్నుకుపోతుండగా మిగిలిపోయిన చిన్నా చితకా పదవులు నామ్ కే వాస్తే జన సైనికులకు దక్కుతున్నాయి. భారీ వేట అనంతరం సింహం తినగా మిగిలిన ఎముకలు బొమికలు దక్కించుకుని కుక్కలు నక్కలు పండగ చేసుకున్నట్లుగా జన సైనికుల పరిస్థితి ఉంది.మొన్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి చైర్మన్‌లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 పదవులకు గాను 12 పదవులు తెలుగుదేశానికి కేటాయించారు. ఆ పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. మిగిలిన రెండు పోస్టులు జనసేనకు చెందిన కాపు నేతలకు ఇచ్చారు. మొత్తం 14 పోస్టుల్లో దాదాపుగా 90 శాతం పదవులు తెలుగుదేశం వారే తీసుకోవడాన్ని అక్కడి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు అవమానకరంగా భావించారు.తమ పార్టీని ఇంత చిన్నచూపు చూడటమా.. మరీ బిచ్చం వేసినట్లు రెండంటే రెండు పదవులు ఇస్తారా అంటూ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవానికి ఇలాంటి పదవులు పంపిణీ జరిగేటప్పుడు జనసేన, తెలుగుదేశం నాయకులు మధ్య సమన్వయం అవసరం. ఇరుపార్టీల నాయకులు చర్చించుకుని పదవులు పంచుకోవాలి. అయితే, రాష్ట్రంలో జనసేనకు పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు లేరు. నాగబాబు అప్పుడప్పుడు కనిపించి వెళ్లడమే తప్ప పార్టీలో ఆయనకు అధికారం లేదు.. బాధ్యత కూడా లేదు. దీంతో తమ కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా కార్యకర్తలకు నాయకులకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్‌ను కలవడం అసాధ్యం. దీంతో టీవీ రామారావు అలాంటి సీనియర్ నాయకులు ఇలా తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు.కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా బయట పెట్టినందుకు టీవీ రామారావుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్‌కి ఉంటే ఇలాంటి అంశాలను నోట్ చేసుకొని.. కార్యకర్తలు నాయకులతో చర్చించి తమకు రావాల్సిన పదవులు వాటాను తెచ్చుకునేవారు. కానీ, పవన్‌కు పార్టీ మీద, కార్యకర్తల మీద ఎలాంటి ఆపేక్ష లేనట్లు ఈ సస్పెన్షన్‌తో అర్థమవుతుంది. నేనే చంద్రబాబుకు మరో పాతికేళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ప్రశ్నించడానికి మీరు ఎవరు?. పదవులు కానీ ఇంకేమైనా ప్రయోజనాలు కానీ చంద్రబాబు దయాదాక్షిణ్యలతో ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు వంటి సీనియర్ నాయకుడికే పార్టీలో రక్షణ లేకపోతే కిందిస్థాయిలో ఉండే తమకు ఇంకేం ఉంటుందని మండల స్థాయి నాయకులు లోలోన కుమిలిపోతున్నారు-సిమ్మాదిరప్పన్న.

Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt10
విద్యారంగంపై విషపు చూపు!

ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్‌ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్‌ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్‌ బాస్‌ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్‌ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్‌ ప్లస్‌ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్‌ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్‌ మీద ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్‌ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌’ అనే మరో గిన్నీస్‌ బుక్‌ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్‌ రికార్డు బ్రేకింగ్‌ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్‌ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్‌ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్‌ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్లాన్‌. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్‌ టీచర్‌ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్‌ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్‌ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్‌ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్‌ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్‌ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్‌ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్‌ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్‌ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్‌ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్‌ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్‌ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్‌ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్‌ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్‌ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్‌ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement