
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రాహుల్ విడిచిపెట్టాడు.
87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్‌కు బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.
రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.
బ్రాడైన్ కార్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు..