breaking news
Jamie Smith
-
జేమీ స్మిత్ విధ్వంసం.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన కేన్ మామ
హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ రెండో విజయం సాధించింది. నిన్న (ఆగస్ట్ 14) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కేన్ మామ ఈ మ్యాచ్‌లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు, సిక్స్) ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన జేమీ స్మిత్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీ బాదాడు. కేన్, స్మిత్‌లకు టర్నర్ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు), ఓలీ పోప్ (9 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాకెట్స్ బౌలర్లలో స్టోయినిస్ 2, కుక్, ఫెర్గూసన్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ తీశారు.అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమీ ఓవర్టన్ పొదుపుగా (20-10-15-1) బౌలింగ్ చేసి రాకెట్స్‌ను కట్టడి చేశాడు. వార్రల్, గ్లీసన్ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (46), స్టోయినిస్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జో రూట్ (27), డేవిడ్ విల్లే (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
కేఎల్ రాహుల్ వల్లే నష్టం జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా రెండు ప్రధాన తప్పిదాలు చేసిందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వాటి వల్లే ఇంగ్లండ్ 350 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగిందని అభిప్రాయపడ్డాడు.కేఎల్ రాహుల్ పొరపాటుతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు నిలువరించే వీలు లేకపోయిందని ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు మొదలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), సెంచరీ వీరుడు జో రూట్ (104)లను భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా త్వరత్వరగానే పెవిలియన్ చేర్చాడు.ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (51), టెయిలెండర్ బ్రైడన్ కార్స్ (56) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. నిజానికి జేమీ స్మిత్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు.మరోవైపు.. రెండో రోజు ఆటలో కేవలం 63 డెలివరీలు సంధించిన తర్వాతనే బంతిని మార్చాలంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టుబట్టాడు. అప్పటికి బుమ్రా ఆ బంతితో బాగానే రాణిస్తున్నా.. గిల్ అంపైర్‌తో వాదనకు దిగి మరీ బంతిని మార్పించాడు. అయితే, దురదృష్టవశాత్తూ పాత బంతి కంటే అంపైర్ ఇచ్చిన కొత్త బంతి మరింత వాడినదానిలా ఉండటంతో టీమిండియాకు షాక్ తగిలింది. మొమెంటమ్ మారిపోయింది.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘రెండోరోజు టీమిండియా చేసిన రెండు తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేసే అవకాశం చేజారింది. కేఎల్ రాహుల్ జేమీ స్మిత్ క్యాచ్ జారవిడవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. అక్కడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.స్మిత్ ఐదు పరుగుల వద్ద ఉన్నపుడు రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. ఆ తర్వాత అతడు బ్రైడన్ కార్స్‌తో కలిసి అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ గనుక అప్పుడే క్యాచ్ అందుకుని ఉంటే ఇలా జరిగేది కాదు.ఇక రెండోది... అసలు బంతిని మార్చమని ఎందుకు అడిగారో అర్థం కాలేదు. అప్పటికే తొలి సెషన్లోనే మూడు వికెట్లు తీశారు. అలాంటపుడు బంతిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ సమయంలో.. ఒకవేళ బంతి ఆకారం మారినా దానితో పెద్దగా వచ్చే నష్టం ఏముంది?ఓ బౌలర్‌గా చెప్తున్నా.. బంతి వల్ల మనకు ఏమాత్రం ఉపయోగం లేదనిపించినప్పుడు మాత్రమే మార్చమని అడుగుతాము. ఒకవేళ ఆ బంతి మరీ అంత చెత్తగా ఉండి ఉంటే మీకు ఉదయాన్నే మూడు వికెట్లు ఎలా దొరికేవి?.. అసలు బంతిని ఎందుకు మార్చమన్నారు?’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. -
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రాహుల్ విడిచిపెట్టాడు.87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్‌కు బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.బ్రాడైన్ కార్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు.. -
IND vs ENG 3rd Test: జేమీ స్మిత్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ (Jamie Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో మూడో టెస్టు సందర్భంగా లార్డ్స్ (Lord's Test)లో జేమీ స్మిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు.సర్రేకు చెందిన జేమీ స్మిత్.. గతేడాది వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియాతో సిరీస్‌లో మాత్రం 24 ఏళ్ల జేమీ స్మిత్ దుమ్ములేపుతున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 40, 44* పరుగులు చేసిన జేమీ స్మిత్.. రెండో టెస్టులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.భారీ అజేయ శతకంతొలి ఇన్నింగ్స్‌లో భారీ అజేయ శతకం (184)తో మెరిసి ఇంగ్లండ్ ఓటమి వాయిదా పడేలా చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత అర్ధ శతకం (88) బాదినా.. పరాజయం నుంచి జట్టును తప్పించలేకపోయాడు.ఇక తాజాగా లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కుకు చేరుకున్నాడు జేమీ స్మిత్. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. ఫలితంగా లైఫ్ పొందిన జేమీ స్మిత్.. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.వరల్డ్ రికార్డుకాగా తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జేమీ స్మిత్ ఈ సందర్భంగా సమం చేశాడు. అదే విధంగా.. అతి తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏క్వింటన్ డి కాక్, జేమీ స్మిత్- 21 ఇన్నింగ్స్‌లో🏏దినేశ్ చండిమాల్, జానీ బెయిర్‌స్టో- 22 ఇన్నింగ్స్‌లో🏏కుమార్ సంగక్కర, ఏబీ డివిలియర్స్- 23 ఇన్నింగ్స్‌లో🏏జెఫ్ డుజోన్- 24 ఇన్నింగ్స్లోతక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏జేమీ స్మిత్ (ఇంగ్లండ్)- 1303 బంతుల్లోనే🏏సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్)- 1311 బంతుల్లో🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 1330 బంతుల్లో🏏నిరోషన్ డిక్విల్లా (శ్రీలంక)- 1367 బంతుల్లో🏏క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా)- 1375 బంతుల్లో.👉ఇదిలా ఉంటే.. టీమిండియా మూడో టెస్టులో భాగంగా శుక్రవారం నాటి రెండో ఆటలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 105 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్? -
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్‌లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్‌ను ఆకాశ్‌దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ క్రిస్ వోక్స్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు. క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్‌లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్‌లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్‌దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్‌కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: శతక్కొట్టిన బ్రూక్.. కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లోనే..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్న బ్రూక్ తన శైలికి విరుద్దంగా ఎంతో సంయమనంతో ఆడి 137 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్‌కు ఇది టెస్ట్‌ల్లో తొమ్మిదో సెంచరీ. బ్రూక్ ఈ తొమ్మిది సెంచరీలను కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత వేగంగా తొమ్మిది సెంచరీలు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఇంగ్లండ్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు37 - డెనిస్ కాంప్టన్43 - హెర్బర్ట్ సట్‌క్లిఫ్44 - హ్యారీ బ్రూక్50 - వాలీ హామండ్52 - మైఖేల్ వాన్26 ఏళ్ల బ్రూక్ 44 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 60.48 సగటున 2540 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్‌రేట్ 87కి పైగా ఉండటం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 284/5గా ఉంది. బ్రూక్ (102), జేమీ స్మిత్ (126) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. బ్రూక్, స్మిత్ ఆరో వికెట్‌కు అజేయమైన 200 పరుగులు జోడించారు.లంచ్‌కు ముందు జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్న ఔట్ కాగా.. రూట్ (22), స్టోక్స్ (0) ఇవాళ ఆట ప్రారంభం కాగానే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా..
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జేమీ స్మిత్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా..అంతేకాదు.. టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్ తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు జేమీ స్మిత్. అతడి శతక ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్ ఏకంగా 23 పరుగులు పిండుకోవడం విశేషం.టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏గిల్బర్ట్ జెసప్- 1902లో ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో శతకం🏏జానీ బెయిర్ స్టో- 2022లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌పై 77 బంతుల్లో శతకం🏏హ్యారీ బ్రూక్- 2022లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై 80 బంతుల్లో శతకం🏏జేమీ స్మిత్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాపై 80 బంతుల్లో శతకం🏏బెన్ స్టోక్స్- 2015లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌పై 85 బంతుల్లో శతకం.The THIRD-FASTEST England Test century 🤯Counter-attacking in the extreme from Jamie Smith ☄️ pic.twitter.com/8Yz3Ccc0WL— England Cricket (@englandcricket) July 4, 2025 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 249/5 (47)ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో రోజు ఆటలో భాగంగా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కూడా అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. అదే విధంగా... కెప్టెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయి 77 పరుగులు చేసింది. ఇక శుక్రవారం నాటి ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ బజ్‌బాల్ ఇన్నింగ్స్ కారణంగా భోజన విరామ సమయానికి 249 పరుగులు స్కోరు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102, బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో!
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తావా? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అదే సమయంలో.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith)పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..ఆదిలోనే షాకులుభారత్-ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం మొదలైన రెండో టెస్టులో గిల్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో రోజు భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. భారత బౌలర్ల దెబ్బకు... ఇంగ్లిష్ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (19), బెన్ డకెట్ (0) సహా వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ‘బజ్‌బాల్’ దూకుడుఈ క్రమంలో గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లన నష్టానికి 77 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 77/3తో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. వెనువెంటనే జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయింది. ఇలా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ తమదైన శైలి ‘బజ్‌బాల్’ ఆటకు తెరలేపారు.43 బంతుల్లోనేఈ క్రమంలో కేవలం 43 బంతుల్లోనే జేమీ స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. కాగా ఆదిలో కాస్త నెమ్మదిగానే ఆడిన జేమీ స్మిత్ వేగంగా యాభై పరుగుల మార్కు చేరుకోవడానికి.. భారత పేసర్ ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగే కారణం.ఒకే ఓవర్లో 23 పరుగులుఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన ప్రసిద్ కృష్ణ... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని కట్టుదిట్టంగా వేసిన అతడు.. ఆ తర్వాత పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి మూల్యం చెల్లించాడు. ప్రసిద్ బౌలింగ్‌లో జేమీ స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది.Jamie Smith with back-to-back boundaries to start the 38th over 🔥He's absolutely flying here 😍 pic.twitter.com/rLEry94aGo— England Cricket (@englandcricket) July 4, 2025కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రోఇక జేమీ స్మిత్‌కు బజ్‌బాల్ అటాకింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రసిద్ కృష్ణపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో.. ఏదేమైనా జేమీ స్మిత్ సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. కామెంటేటర్ రవిశాస్త్రి.. ‘‘కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత నిర్దయగా బాదేస్తావా?!’’అంటూ జేమీ స్మిత్ సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడాడు.కాగా 47 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో ఉండగా.. జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. స్టోక్స్ బృందం చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.చదవండి: కోహ్లి, అజారుద్దీన్ కాదు!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?