
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్న బ్రూక్ తన శైలికి విరుద్దంగా ఎంతో సంయమనంతో ఆడి 137 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
బ్రూక్‌కు ఇది టెస్ట్‌ల్లో తొమ్మిదో సెంచరీ. బ్రూక్ ఈ తొమ్మిది సెంచరీలను కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్‌లో అత్యంత వేగంగా తొమ్మిది సెంచరీలు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు
37 - డెనిస్ కాంప్టన్
43 - హెర్బర్ట్ సట్‌క్లిఫ్
44 - హ్యారీ బ్రూక్
50 - వాలీ హామండ్
52 - మైఖేల్ వాన్
26 ఏళ్ల బ్రూక్ 44 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 60.48 సగటున 2540 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్‌రేట్ 87కి పైగా ఉండటం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 284/5గా ఉంది. బ్రూక్ (102), జేమీ స్మిత్ (126) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. బ్రూక్, స్మిత్ ఆరో వికెట్‌కు అజేయమైన 200 పరుగులు జోడించారు.
లంచ్‌కు ముందు జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్న ఔట్ కాగా.. రూట్ (22), స్టోక్స్ (0) ఇవాళ ఆట ప్రారంభం కాగానే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.