
హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ రెండో విజయం సాధించింది. నిన్న (ఆగస్ట్ 14) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కేన్ మామ ఈ మ్యాచ్‌లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు, సిక్స్) ఆడాడు.
ఓపెనర్‌గా వచ్చిన జేమీ స్మిత్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీ బాదాడు. కేన్, స్మిత్‌లకు టర్నర్ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు), ఓలీ పోప్ (9 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
గత రెండు మ్యాచ్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాకెట్స్ బౌలర్లలో స్టోయినిస్ 2, కుక్, ఫెర్గూసన్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమీ ఓవర్టన్ పొదుపుగా (20-10-15-1) బౌలింగ్ చేసి రాకెట్స్‌ను కట్టడి చేశాడు. వార్రల్, గ్లీసన్ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రాకెట్స్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (46), స్టోయినిస్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జో రూట్ (27), డేవిడ్ విల్లే (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.