
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వియత్నాం రాజధాని హనోయి నగరంలో మంగళవారం ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
గత వారం రోజులుగా వియత్నాంలో పర్యటిస్తున్న కరుణాకర రెడ్డి.. దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఏ ప్రాంతంలో ఉన్నా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారని సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వైఎస్ నిలిచి పోవడం జరిగిందని, అనేక రాష్ట్రాలలో ప్రస్తుత ముఖ్యమంతులు వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి, చరణ్ రెడ్డి, జివి లక్ష్మీ, వాణి రెడ్డి, నీహారిక, డేనియల్, ప్రశాంత్, పీటర్సన్, డాంగ్ జాన్, తదితరులు పాల్గొన్నారు.