
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.2.13 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.33 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.2.50 నుండి 4.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.12.51 నుండి 2.30 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35.
మేషం.. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.
వృషభం.... కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆదాయం తగినంత లేక అప్పులు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథునం... కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. కళాకారులకు ప్రయత్నాలు సఫలం.
కర్కాటకం.... రాబడికి లోటు లేదు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో మీ ఊహలు నిజం కాగలవు. వస్తులాభాలు.
సింహం... కార్యక్రమాలలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. కళాకారులకు చికాకులు.
కన్య... కష్టానికి ఫలితం కనిపించదు. ముఖ్య కార్యాలలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దేవాలయ దర్శనాలు.
తుల... సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. అదనపు రాబడితో అవసరాలు తీరతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దేవాలయ దర్శనాలు.
వృశ్చికం... ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు.... కార్యక్రమాలు సకాలంలో చకచకా సాగుతాయి. అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం..... కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆదాయం ఉన్నా ఖర్చులు సైతం పెరుగుతాయి. ప్రతి విషయానికి కలత చెందుతారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..
కుంభం... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు కాస్త ఉపశమనం పొందుతారు.
మీనం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి ముఖ్య సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అవాంతరాలు తొలగుతాయి.