
ఉద్యోగం చేసేందుకు భారత్‌లో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా ఆర్థిక సేవల దిగ్గజం మెట్‌లైఫ్‌కు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ ఇండియా గుర్తింపు లభించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం మీద 100 టాప్ కంపెనీల జాబితాలో ఆరో స్థానం, బీమా రంగంలో అగ్రస్థానాన్ని కంపెనీ దక్కించుకుంది.
ప్రతి ఒక్కరు ఎదిగేందుకు, అత్యుత్తమంగా రాణించేందుకు తోడ్పాటునిచ్చే సంస్కృతిని తమ సంస్థలో అమలు చేస్తున్నామని, దానికి ఈ గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయమని మెట్‌లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ శ్రీవాస్తవ తెలిపారు. ఉద్యోగుల అభిప్రాయాలు, సిబ్బంది విషయంలో కంపెనీ పాటించే విధానాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఈ జాబితాను రూపొందిస్తుంది.
ఫిలిం స్కూల్స్ విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ ఫెలోషిప్‌లు
ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లోని ప్రతిభావంతులైన పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫెలోషిప్‌లను అందించే దిశగా స్క్రీన్ అకాడెమీ ఏర్పాటైంది. లోధా ఫౌండేషన్‌కి చెందిన అభిషేక్ లోధా వితరణతో స్క్రీన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేశాయి.
ఫిలిం ఇనిస్టిట్యూట్స్ నామినేట్ చేసిన, ఆర్థిక వనరులు అంతగాలేని విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ వార్షికంగా ఫెలోషిప్‌లు అందిస్తుంది. రసూల్ పోకుట్టి, గునీత్ మోంగా లాంటి ప్రముఖులు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పుణెలోని ఎఫ్‌టీఐఐ, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిలిం అండ్ టీవీ ఇనిస్టిట్యూట్, ముంబైలోని విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్‌తో అకాడెమీ జట్టు కట్టగా, ఇతర ఇనిస్టిట్యూట్స్‌కి కూడా దీన్ని విస్తరించనున్నారు.