
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడ్డాడు. 78వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా షాట్ ఆడాడు.
ఈ క్రమంలో బంతిని ఆపే ప్రయత్నంలో అతడి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. దీంతో బషీర్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో రాకముందే తనంతట తానే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సామ్ కూక్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు.
కాగా ఇంగ్లండ్‌కు ఇది నిజంగా గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జట్టులో బషీర్ ఏకైక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. అతడు బయటకు వెళ్లిపోవడంతో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ రూట్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.
కాగా సెంచూరియన్ కేఎల్ రాహుల్‌ను బషీర్ అద్బుతబ బంతితో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. 109 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(72), సుందర్(19) ఉన్నారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా