
దుబాయ్‌లో వైఎస్సార్ జయంతి సందర్భంగా కేక్‌ను కట్ చేస్తున్న యాత్ర–2 సినీ నిర్మాత శివ మేక, యూఏఈ వైఎస్సార్ అభిమానులు
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సౌదీ అరేబియాలో..
సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సింగపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి..
వైఎస్సార్ జయంతిని సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
వైఎస్సార్‌సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్‌లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్‌లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు