
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎడమ చేతి వేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఓవరాల్‌గా 112 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కన్పించిన రిషబ్ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అవసరంలేని రన్‌కు పరిగెత్తి తన వికెట్‌ను పంత్ కోల్పోయాడు. ఈ క్రమంలో పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శించారు. లంచ్ విరామానికి ముందు పంత్ అనవసరంగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడని కుంబ్లే మండిపడ్డాడు.
"రిషబ్ పంత్ అనవసరంగా ఔటయ్యాడు. అస్సలు అక్కడ పరుగు వచ్చే ఛాన్స్ లేదు. పంత్ మొదట పరుగుకు పిలుపిచ్చి, వెంటనే తన మనసు మార్చుకున్నాడు. కానీ పంత్ పిలుపుతో కేఎల్ రాహుల్ వెంటనే నాన్ స్ట్రైక్ నుంచి రన్ కోసం పరిగెత్తాడు.
దీంతో ప్రారంభంలో పంత్ కాస్త సంకోంచి పరిగెత్తడంతో రనౌట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇది అనవసరం. ఎందుకంటే మరో మూడు బంతులు ఆడి ఉంటే, లంచ్ బ్రేక్‌కు వెళ్లిపోయేవారు. ఆ తర్వాత తమ ప్రణాళికలను అమలు చేసి ఉంటే సరిపోయిండేది.
అంతకుముందు జో రూట్ 99 పరుగుల వద్ద ఉండగా ఆట ముగిసింది. తన సెంచరీ కోసం అతడు ఒక రాత్రి వేచి ఉండాల్సి వచ్చింది. కానీ అతడు ఎక్కడ కూడా తొందరపడి ఆడలేదు. పోప్, స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే వారు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడింది" అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా