
డిజిటల్ వరల్డ్
‘టైమ్ 100 క్రియేటర్స్’ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయురాలిగా ప్రత్యేకత నిలుపుకుంది యూట్యూబర్ ప్రజక్త కోలి( Prajakta Koli ). డిజిటల్ మీడియాలో 2015 నుంచి కోలి విజయపరంపర కొనసాగుతోంది.
‘టైమ్ 100 క్రియేటర్స్’లో చోటు సాధించిన నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది కోలి. ‘నాలో ఎన్నో భావాలు పొంగి పొర్లుతున్నాయి. నేను మీతో చె΄్పాలి అనుకుంటున్న వాటి కంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చెప్పడానికి రెండు మాటలే ఉన్నాయి... థ్యాంక్స్’ అని రాసింది. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులకే కాదు తన పేరుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘థ్యాంక్ యూ ప్రజక్త. వ్యూహం, ప్లాన్, రోడ్ మ్యాప్... ఇలాంటివేమీ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తనను తాను నమ్ముకుంది. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేసింది’ అని రాసింది.
2015లో యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది కోలి. మొదట్లో కామెడీ స్కిట్‌లు షేర్ చేసేది. తక్కువ కాలంలోనే తన చానల్‌కు ఏడు మిలియన్‌ల సబ్‌స్క్రైబర్‌లు ఏర్పడ్డారు. ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ యూట్యూబర్’గా పేరు తెచ్చుకున్న ప్రజక్త నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ సిరీస్ ‘మిస్ మ్యాచ్‌డ్’లో నటించింది. ‘టు గుడ్ టు బి ట్రూ’ అనే నవల రాసింది.
ఓన్లీ ఇండియన్