
బీఎస్‌ఈ అనుబంధ సంస్థ అయిన ఏషియా ఇండెక్స్ తాజాగా బీఎస్‌ఈ ఇన్సూరెన్స్ పేరిట కొత్త సూచీని ప్రారంభించింది. బీఎస్‌ఈ 1000 ఇండెక్స్‌లోని బీమా రంగం కింద వర్గీకరించిన సంస్థలు ఈ సూచీలో ఉంటాయి. దీని బేస్ వేల్యూ 1000గా, తొలి వేల్యూ డేట్ 2018 జూన్ 18గా ఉంటుంది. వార్షికంగా రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ సూచీలో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్యాసివ్ వ్యూహాలను పాటించే ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్‌లకు ఇది ప్రామాణికంగా ఉంటుంది.
ప్రాంతీయ భాషల్లో సీడీఎస్‌ఎల్ ఐపీఎఫ్ పోర్టల్
పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించేందుకు సీడీఎస్‌ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్‌ఎల్ ఐపీఎఫ్) తాజాగా ప్రాంతీయ భాషల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ప్రా రంభించింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో కంటెంట్ ఉంటుంది.
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు పెట్టుబడులు పెట్టాలనే అలోచనతో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భావి ఇన్వెస్టర్లకు కూడా ఈ వెబ్‌సైట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీడీఎస్‌ఎల్‌ఐపీఎఫ్‌డాట్‌కామ్‌లోని ఈ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చని సంస్థ సెక్రటేరియట్ సుధీష్ పిళ్లై తెలిపారు.