
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ నిబంధనలను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తుంగలో తొక్కేశారు. తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా సృష్టించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ఆయనతో పాటు 12 మందికి ప్రోటోకాల్‌ను టీటీడీ కేటాయించింది.
అదనంగా జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్‌లో తనతో పాటు పంపాలంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందిపై గొడవపడి మరి ప్రోటోకాల్ దర్శనానికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.