ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబ‌రాలు | NATS 8th America Telugu Sambaralu grand celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబ‌రాలు

Jul 10 2025 3:01 PM | Updated on Jul 10 2025 3:16 PM

NATS 8th America Telugu Sambaralu grand celebrations

విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

ఓకే వేదికపై అలరించిన విక్టరీ వెంకటేశ్,నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్

సంగీతంతో ఉర్రుతలూగించిన దేవిశ్రీ ప్రసాద్, తమన్

తెలుగు సంబరాల విజయవంతంలో తనదైన శైలి ముద్ర వేసిన గుత్తికొండ శ్రీనివాస్

ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు  వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.

అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ,  విక్టరీ వెంకటేశ్,  అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...

నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్  పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్‌ సంబరాల కమిటీ కన్వీనర్  ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్  పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్

చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..

సంబ‌రాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి నాట్స్‌ 85లక్షల  విరాళం అందజేసింది.  ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్‌ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement