
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వింబుల్డన్-2025 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది.
శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతంచేసుకుంది. రెండు సెట్లలోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిలవలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.