
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి. కోట శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. pic.twitter.com/FjQsioIsO3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2025