
భారతదేశంలోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్‌ను ‘డార్క్ ప్యాటర్న్స్’గా అభివర్ణిస్తూ జెరోధా సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్ కామత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు ఎక్కువ డబ్బు సంపాదించడానికి, తమ ప్రయోజనాలే ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టివేసేందుకు కొన్ని ట్రిక్స్ అనుసరిస్తున్నాయని కామత్ చెప్పారు.
కామత్ తన ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్మించడంలో ప్రోత్సాహకాలు కీలకంగా మారుతాయి. అయితే ఇవి కస్టమర్ కోసం కాకుండా వ్యాపారానికి మంచి చేసేలా వక్రీకరించబడి ఉంటాయి. తాత్కాలికంగా వినియోగదారులకే పెద్దపీట వేసినట్లు ఉన్నా, నిలకడగా కస్టమర్లకు మొదటి స్థానం కల్పించడం చాలా కష్టం. ఇది కాసినో గేమ్ వంటిది. స్పష్టమైన ఫీచర్లు, స్థిరమైన నోటిఫికేషన్లు, వివరాలు లేకుండా ప్రమాదకరమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. చాలా ఫైనాన్షియల్ యాప్స్ డిజైనింగ్ ప్రజలు క్రమంగా ఎక్కువ ఖర్చు చేయడానికి, అజాగ్రత్తగా పెట్టుబడి పెట్టడానికి, నిత్యం అదే యాప్‌కు బానిస అయ్యేలా రూపొందించబడ్డాయి. ఈ డార్క్ ప్యాటర్న్స్ యాప్స్, వెబ్‌సైట్‌లో ఉపయోగించే డిజైన్ ట్రిక్స్’ అని చెప్పారు.
One of the biggest challenges in building a financial services business is that the incentives are often skewed toward doing what’s good for the business and not for the customer. It’s very hard to consistently put customers first.
This is one of the main reasons why finance… pic.twitter.com/AZR1hiiIfb— Nithin Kamath (@Nithin0dha) July 9, 2025