
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. రూ .4.88 లక్షలు జరిమానా విధించినట్లు ప్రకటించింది. తన క్లయింట్‌కు టర్మ్ లోన్ మంజూరు చేసేటప్పుడు 'మాస్టర్ డైరెక్షన్ - ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా' నిబంధనలను విస్మరించిందని, అందుకు గానూ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) సెక్షన్ 11 (3) నిబంధనల ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిబంధనల ఉల్లంఘనలపై నిఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేయగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని, మౌఖిక సమర్పణలు కూడా చేసిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేసు వాస్తవాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పందనను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
శ్రీరామ్ ఫైనాన్స్‌కూ జరిమానా
డిజిటల్ లెండింగ్ సంబంధిత నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పైనా రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ లెండింగ్) ఆదేశాలు, 2025" లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ .2.70 లక్షల జరిమానా విధించింది.
2024 మార్చి 31 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్బీఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం, సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.
రుణగ్రహీతలు నేరుగా రుణ చెల్లింపులను కంపెనీ ఖాతాలో జమ చేయడానికి బదులుగా థర్డ్ పార్టీ ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మళ్లించిందని ఆర్బీఐ తన తనిఖీలో గుర్తించింది. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్‌కు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.