
మానసిక ఆందోళనలు తగ్గడానికి, స్పష్టత లేని ఆలోచనలను కట్టడి చేయడానికి, మెదడు ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన టెక్నిక్‌లా ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో.. మత్సాసన, గరుడాసన, ధనురాసన, వజ్రాసన, అర్ధమత్యేంద్రాసన, బాలాసన, శవాసన.. మొదలైనవి ఉన్నాయి.
ఛాతీ, మెడను విస్తరించి, ఆక్సిజన్ మెరుగుపరుస్తుంది మత్సా్యసన. ఊపిరితిత్తులను, నాడీ వ్యవస్థను ఉత్తేజరుస్తుంది. మానసిక అలసట తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
గరుడాసన ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రతను పదునుపెడుతుంది. ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుంది.
వజ్రాసన ద్వారా శరీరంపై అవగాహన పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయ పడుతుంది.
భావోద్వేగాలను సమతుల్యం చేసే ధనురాసనం ఏకాగ్రతను పెంచుతుంది. ∙అర్ధ మత్య్సేంద్రాసన వల్ల వెన్నెముక నరాలను ఉత్తేజపరచడం ద్వారా అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది. మెదడుకు రక్తప్రవాహం పెరుగు తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
మోకాళ్లపై వంగి, చేతులు చాచి, ముందుకు వంగడం వల్ల శ్వాస తీసుకోవడంలో మెరుగ వుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది.
శవాసనలో పూర్తి విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల భావోద్వేగాల సమతుల్యత కుదురుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది