
మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
ఉదయం వేళల్లో మసాలాలు, డీప్ ఫ్రైస్ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.
చాలామంది బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.
ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.
చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు