
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.
గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది.
ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.