
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి.
ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు.
ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది.
వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి.
వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు.
నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు.
చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.
నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!