breaking news
Vastu Shastra
-
వీధి పోటుతో ఆటుపోట్లు, అసలేంటీ వీధిపోటు!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్! -
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
ఐఐటీ సిలబస్‌లో వాస్తు!
కోల్‌కతా: ఆర్కిటెక్చర్ సిలబస్‌లో వాస్తు శాస్త్రాన్ని త్వరలో ప్రారంభించాలని ఐఐటీ ఖరగ్‌పూర్ యోచిస్తోంది. ప్రపంచమంతా వాస్తును బలంగా విశ్వసిస్తున్న సమయంలో తమ విద్యార్థులకు ఇందులోని మెలకువలు తెలవాలనుకుంటున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ఆర్కిటెక్చర్ విభాగం హెడ్.. ప్రొఫెసర్ జాయ్ సేన్ తెలిపారు. ‘ప్రకృతి, నాగరికతల మధ్య అనుసంధానాన్ని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రపంచమంతా భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మన యువతరానికి దీని గురించి తెలవాలనేదే మా ప్రయత్నం. అందుకే వీలైనంత త్వరలోనే సిలబస్‌లో దీన్ని చేర్చనున్నాం’ అని సేన్ వెల్లడించారు.