
అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్ సెట్ అనుకుంటాం. కోట్ల రూపాయలు, తక్కువలో తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు.
ప్రముఖ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్‌లో న్యూయార్క్ నగరంలో టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు. పాడ్‌కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్ అమెరికాలో జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.
ఈ వివరాలను లోధా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్‌టైన్‌మెంట్ సహా ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి.

ఇది చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు. భారీ జీతం, న్యూయార్క్‌లాంటి గ్లోబల్ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు.