మధ్య తరగతి తెలుగబ్బాయి | Santosh Sobhan birthday poster from Couple Friendly | Sakshi
Sakshi News home page

మధ్య తరగతి తెలుగబ్బాయి

Jul 13 2025 12:18 AM | Updated on Jul 13 2025 12:18 AM

Santosh Sobhan birthday poster from Couple Friendly

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానసా వారణాసి హీరోయిన్‌గా నటించారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా జూలై 12న సంతోష్‌ శోభన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ తెరకెక్కింది.

చెన్నైలో లైఫ్‌ లీడ్‌ చేస్తున్న ఓ మధ్య తరగతి తెలుగబ్బాయిగా సంతోష్‌ శోభన్‌ కనిపిస్తారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement