ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త! | House purchase agreement important Real estate Hyderabad | Sakshi
Sakshi News home page

ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త!

Jul 13 2025 10:54 AM | Updated on Jul 13 2025 12:38 PM

House purchase agreement important Real estate Hyderabad

మనకు నచ్చే ఫ్లాట్‌ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్‌ దొరికితే చాలు.. అడ్వాన్స్‌ అందజేసి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందనానికి దూరమైనట్లే.  – సాక్షి, సిటీబ్యూరో

స్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారుడితో కుదుర్చుకునే ఒప్పందమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల విషయంలో బిల్డర్‌తో జాగ్రత్తగా ఉండాలి. జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి.  

హక్కుల చిక్కులు, ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి కొన్ని సూత్రాలివి..

మొత్తం విలువెంత?  
ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, తాగునీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్‌ వంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో కలిసి ఉండొచ్చు. లేదంటే విడిగా 
ఉండొచ్చు. కాబట్టి ఈ ఖర్చులన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి.  

ఏం చేయాలి? 
ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్‌ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్‌కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి 
అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్‌తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.

నిర్మాణం జాప్యమైతే? 
నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..? ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మాంద్యం దెబ్బ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవుతుంది, ఎప్పటిలోగా ఫ్లాటను అప్పగించే విషయంపై బిల్డర్‌తో పత్రంలో రాయించుకోండి.

ఏం చేయాలి? 
పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్‌ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్‌ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement