
డౌట్ అక్కర్లేదు. ఇది కారే. కాకపోతే.. ప్రపంచంలోనే అత్యంత సన్నటి (స్లిమ్) కారు. ట్రాఫిక్ జామ్‌ల ఫికర్ లేదు. పార్కింగ్ సమస్య లేనే లేదు. ఈ అల్ట్రా స్లిమ్ ఫియట్ పాండా ఎలక్ట్రిక్ కారును ఇటలీలో ఆవిష్కరించారు. డ్రైవర్ కాకుండా.. ఇంకొకరు వెనుక సీట్లో కూర్చొని ప్రయాణించవచ్చు. 50 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ కారును ఇటలీకి చెందిన మెకానిక్ ఆండ్రియా పాత ఫియట్ కారు భాగాలను ఉప యోగించి రూపొందించాడు.
145 సెంటీమీటర్ల ఎత్తు, 340 సెంటీమీటర్ల పొడవున్న ఈ కారు బరువు 264 కిలోలు. దీన్ని చూసినోళ్లంతా గట్టిగా గాలి వస్తే పడిపోతుందేమో అని అనుమా నం చేయగా.. అటూ ఇటూ ఊగుతుంది గానీ.. పడిపోదు అని దీన్ని తయారుచేసిన ఆండ్రియా చెప్పాడు. దాన్ని నిరూపించడానికి అక్కడ నడిపి చూపాడు. ఇది స్లిమ్ కారు.. దానికి తగ్గట్లు ఇందులో సన్నగా ఉన్నవాళ్లే పడతారు. ప్రపంచంలోనే అత్యంత సన్నటి కారుగా దీని పేరు ను త్వరలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించనున్నట్లు ఆండ్రియా తెలిపాడు.