
ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు
పిల్లలూ.... మనందరికీ ఎవరెస్టు శిఖరం తెలుసు. హిమాలయాల్లో అన్నింటి కంటే ఎత్తయిన శిఖరం, ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. కాని అది ఒక వ్యక్తి పేరు. ఎత్తయిన శిఖరానికి తన పేరు పెట్టేంత గొప్పవాడైన ఎవరెస్ట్ ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్, రాయల్ సొసైటీ సభ్యుడు (George Everest)
ఎవరెస్ట్ 1790 జూలై 4 న గ్వెర్న్ వేల్ లో జన్మించాడు. ఆయన ఇంగ్లాండులోని మిలిటరీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి చేరుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో 1806లో చేరాడు. ఏడు సంవత్సరాలు బెంగాలులో పనిచేశాడు. జావా సర్వే పనిలో 1814 నుండి 1816 వరకు పని చేశాడు. తర్వాత అతను భారత దేశ గ్రేట్ త్రికోణమితి సర్వే Great Trigonometrical విలియం లాంబ్టన్‌కు సహాయకుడిగా నియమించబడ్డాడు. భారతదేశపు అత్యంత చివరి దక్షిణ బిందువు కేప్ కొమరిన్ నుండి నే΄ాల్ వరకు దాదాపు 2,400 కిలోమీటర్ల (1,500 మైళ్ళు) దూరంలో ఉన్న మెరిడియన్ ఆర్క్ (Meridian Arc)ను సర్వే చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఎవరెస్ట్. ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ప్రవేశపెట్టి సర్వే పని ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఎవరెస్ట్ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్ గా మార్చింది. ఆ పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్ లేకుండా ఎవరెస్ట్ పేరును ప్రతి΄ాదించింది. అలా ఎవరెస్ట్ పర్వతానికి ఎవరెస్ట్ పేరు స్థిరపడింది.ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు