breaking news
South India
-
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్‌తో పాటు అడ్వెంచరస్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘శివ’ చూసి ‘ఓం’ స్క్రిప్ట్ మొత్తం మార్చేశా: ఉపేంద్ర
తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్‌నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్‌స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్‌ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఓం కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది."When I saw #Shiva, I left that script for two years and it kept haunting me. Then I thought of making the screenplay of #OM in a different way."– #Upendra | #NagarjunaAkkineni pic.twitter.com/A6mkbLvCNQ— Whynot Cinemas (@whynotcinemass_) December 22, 2025 -
సంక్రాంతి బరిలో 'డబ్బింగ్' రిస్క్ అవసరమా?
సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్‌లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్‌గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్లని ఎవరూ ఆదరించారు.అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్‌లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?) -
సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ.. మరింత ముందుకొచ్చిన పరాశక్తి..!
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందుగానే కర్చీఫ్ వేయాల్సిందే. పొంగల్ బాక్సాఫీస్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల డేట్స్ ఖరారయ్యాయి. వీటిలో ది రాజాసాబ్ జనవరి 9న, మనశంకరవరప్రసాద్ గారు జనవరి 12న, భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.వీటికి తోడు కోలీవుడ్ సినిమాలు సైతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన పరాశక్తి కూడా పొంగల్‌కే రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. జనవరి 14న విడుదల చేస్తామని ఫిక్సయ్యారు. అయితే తాజాగా రిలీజ్ తేదీ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 10న టాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ రోజే పరాశక్తి విడుదల కానుందని ప్రకటించారు. దీంతో ది రాజాసాబ్ రిలీజైన మరుసటి రోజే పరాశక్తి థియేటర్లకు రానుంది. విపరీతమైన పోటీ ఉన్న పొంగల్ బాక్సాఫీస్ వద్ద పరాశక్తికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ జనవరి 9న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.Coming to you, earlier than expected 🔥#Parasakthi - in theatres worldwide from January 10th, 2026 ✊Get ready for a ride through history🚂#ParasakthiFromPongal#ParasakthiFromJan10@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff… pic.twitter.com/OAPRBFsluh— Red Giant Movies (@RedGiantMovies_) December 22, 2025 -
సందర్భం ఏంటి?.. మీరు చేస్తుందేంటి?..సలార్ హీరో భార్య ఆగ్రహం..!
చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఠక్కున క్లిక్ క్లిక్‌మనిపించడమే. అదొక గ్రేట్ అచీవ్‌మెంట్‌లా ఫీలవ్వడమే. సమయం సందర్భంతో అవసరం లేదు మనకు. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలిప్పుడు. ఎలాంటి సందర్భమైనా సరే అదే ముఖ్యమంటున్నారు. అదేనండి సెల్ఫీ మోజు. ఈ చరవాణి ప్రపంచంలో దానికున్న క్రేజ్ ఇంకా దేనికైనా ఉందా? సందర్భంతో పనిలేకుండా ఎగబడి మరీ సెల్ఫీలు తీసుకుంటారు.ఇక ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు.. ఒక్క క్షణం కూడా ఆగలేం కదా. మరి ఈ పిచ్చి ముదిరితే ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో పీక్స్‌కు చేరింది. వచ్చిన సందర్భం కూడా ఆలోచించకుండా సెల్ఫీలకు ఎగబడ్డారు. ఇదే ఆ స్టార్ హీరో భార్యకు చిరాకు తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మలయాళ సినీతారలు పాల్గొన్నారు. అదే సమయంలో కొందరు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాసన్ ఫ్యామిలీకి బాధలో ఉంటే మీలాంటి వారి పైత్యం ఏంటని నిలదీసింది. శ్రీనివాసన్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషాదంలో ఉన్న కుటుంబం బాధ మీకు అర్థం కాదా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించింది.సుప్రియా మీనన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది వారి కుటుంబానికి భావోద్వేగ క్షణం. ఇలాంటి సమయంలో బాధలో ఉన్నవారిని పరామర్శించడానికి కూడా అక్కడ చోటు లేకపోవడం చాలా విషాదకరం. ప్రతిచోటా మొబైల్ ఫోన్ల కెమెరాలతో లోపలికి వస్తున్న నటులతో సెల్ఫీలకు ఎగబడ్డారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధను ఆ సమయంలో మనం ఊహించలేం. అసలు అంత్యక్రియల జరిగే చోట సెల్ఫీల కోసం గుమిగూడాల్సిన అవసరం ఉందా? బాధలో ఉన్న వారి కుటుంబం ఆ వ్యక్తికి వీడ్కోలు పలికే సందర్భంలో ఇలా చేస్తారా? ఆ ఫ్యామిలీ గోప్యతను గౌరవించరా?..' అంటూ ఆమె నిలదీసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. మలయాళ నటుడు శ్రీనివాసన్(69) కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. -
స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత
తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈయన నిర్మించిన కొత్త సినిమా 'వా వాతియర్'.. సరిగ్గా రిలీజ్‌కి మరికొన్ని గంటలు ఉందనగా కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తికి ఈయన రూ.20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య ఓవైపు ఉండగానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా జ్ఞానవేల్‌పై చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)శివకార్తికేయన్ హీరోగా జ్ఞానవేల్ నిర్మాతగా 2019లో 'మిస్టర్ లోకల్' అనే సినిమా వచ్చింది. దీనికిగానూ హీరోకి రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పేర్కొన్నాడు.తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు.. విడుదల కాకుండా నిలుపుదల చేయాలని శివకార్తికేయన్, చెన్నై కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే జ్ఞానవేల్ రాజా.. హీరోల సూర్య, కార్తీలకు దగ్గర బంధువే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి. మరి ఈ విషయంలో జ్ఞానవేల్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్) -
రాజకీయాల్లో తమిళ హీరోలు.. మరి మీరెందుకు లేరు?
చాలామంది సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్‌లో అడుగుపెట్టామన్నది వారి వాదన. అలా తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్ హాసన్, విజయ్.. ఇలా అందరూ రాజకీయాలను ఎంచుకున్నావే.. కానీ కర్ణాటకలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఇదే ప్రశ్న ఓ విలేఖరి స్టార్ నటుడు శివన్నను అడిగాడు.కారణాలేంటి?కన్నడ నటులు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45: ది మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్లో శివన్నకు.. కన్నడ నటులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? దానివెనక గల కారణాలేంటి? అన్న ప్రశ్న ఎదురైంది.నా డబ్బుతో సేవ చేస్తా..అందుకాయన స్పందిస్తూ.. నాకు రాజకీయాలు తెలియవు. అధికారం, పదవి లేకపోయినా జనాలకు సేవ చేయడమే నాకు తెలుసు. రాజకీయాలు కొన్నిసార్లు జనాల మధ్య బేధాన్ని సృష్టిస్తాయి. కానీ నేను నా డబ్బుతో ఎటువంటి పక్షపాతం చూపించకుండా జనాలకు సేవ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.ఎన్నికల్లో శివన్న భార్యకాగా శివరాజ్‌కుమార్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీత గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్‌లో నిలబడింది. భార్య కోసం శివన్న ప్రచారం కూడా చేసినప్పటికీ ఆమె ఓడిపోయింది. కాగా గీత మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె! You don't need to enter politics or seek power like @TVKVijayHQ . Politics introduces bias towards people & I prefer to help everyone impartially, using my own money 🙌 @NimmaShivanna - Clarity 👌🔥🔥#45TheMovie #Jailer2 #Shivannapic.twitter.com/7BIBRl3j1E— Achilles (@Searching4ligh1) December 22, 2025 -
పదేళ్ల తర్వాత అబ్బాస్ రీఎంట్రీ.. వీడియో చూశారా?
ఇటీవల ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ ఒకరని చెప్పవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఈయన ఇప్పటికే శత చిత్రాలకు చేరుకున్నారు. పరాశక్తి జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న 100వ చిత్రం. అదేవిధంగా సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్న ఈయన హీరోగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్, బ్యాచిలర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. హ్యాపీరాజ్మూవీఅయితే ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. చివరగా ఈయన నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా హ్యాపీరాజ్మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు ఇళంసెళియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గౌరీప్రియ హీరోయిన్. ఈ చిత్రంలో ప్రేమదేశం హీరో అబ్బాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పదేళ్ల తర్వాత రీఎంట్రీగతంలో హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈయన చాలా కాలం క్రితమే దుబాయిలో సెటిల్ అయ్యారు. తాజాగా హ్యాపీరాజ్ ద్వారా దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రోమో వీడియోను శనివారం విడుదల చేశారు. ఇందులో అబ్బాస్ ఐయామ్ బ్యాక్ అంటూ బరిలోకి దిగాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా చిట్‌చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్‌పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్‌కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
సరికొత్త నాడియా
‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా (ఇంగ్లిష్, కన్నడ) చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనేది ట్యాగ్‌లైన్స్ . యశ్‌తో కలిసి ఈ సినిమా కథ రాసి, దర్శకత్వం వహిస్తున్నారు గీతూ మోహన్స్ దాస్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆమె నాడియాపాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కొన్నిపాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు.. సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి.నాడియాపాత్రలో కియారా అద్వానీ సరికొత్తగా ట్రాన్స్ సఫార్మ్ అయ్యారు. ఆమె నటన చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కోసం ఆమె సపోర్ట్ చేస్తున్న తీరుకి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు గీతూ మోహన్స్ దాస్. వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది. ఇంగ్లిష్, కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా మరికొన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. -
ఓటీటీకి గురిపెట్టిన రివాల్వర్ రీటా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించారు. లేజీ ఓరియంటెండ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు.రివాల్వర్ రీటా కథేంటంటే..పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ.Watch Revolver Rita on Netflix out 26 December in Tamil, Telugu, Kannada and Malayalam#RevolverRitaOnNetflix@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction @mkt_tribe…— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025 -
శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం..!
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్ సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.కాగా.. ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఇందులో రవి మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. Actor #ShivaKarthikeyan narrowly escapes danger as another car hits his vehicle from behind in Kailash, Chennai. Thankfully, he walked away safe.Follow 👉 @FilmyBowlTamilpic.twitter.com/K6yaUm1BhG— FilmyBowl Tamil (@FilmyBowlTamil) December 20, 2025 -
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్‌గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.''ఓ మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.I remember a South film where I was the only woman, they wanted to add more padding on my bum & my breast. They were like, 'Amma, more padding' 😮— #RadhikaApte Which South movie is she referring to❓Kabali, Azhagu Raja or Balayya's Lion❓👀 pic.twitter.com/wm5Ne7Na4R— VCD (@VCDtweets) December 20, 2025 -
పరాశక్తిలో యాక్ట్ చేసేందుకు సంకోచించా: నటుడు
చెన్నై: శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. ఇది ఆయన హీరోగా యాక్ట్ చేసిన 25వ చిత్రం. రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో అధర్వ కీలక పాత్ర పోషించారు. శ్రీలీల కథానాయిక. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2026 జనవరి 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.గురువారం సాయంత్రం చిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలోని వళ్లువర్‌కొట్టంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరాశక్తి సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఇతర వస్తువులతో ఎగ్జిబిషన్‌ను 'వరల్డ్ ఆఫ్ పరాశక్తి' పేరుతో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ నాలుగు రోజులదాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌కు 100వ సినిమా అన్నారు. తన 25వ చిత్రాన్ని వేరే కథతో చేయాలని భావించానన్నారు. అయితే నిర్మాత ఆకాశ్ భాస్కర్ పరాశక్తి కథను చేయండి అని చెప్పారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మనల్ని 1960 కాలానికి తీసుకెళ్తుందన్నారు.తానీ చిత్రం చేయడానికి కారణం దర్శకురాలు సుధా కొంగరనేనన్నారు. ఆమె 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ చిత్రకథ రాశారన్నారు. ఈ సినిమా చేయడమన్నది సవాల్‌తో కూడుకుందన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. పరాశక్తి తనకు చాలా ముఖ్యమైన సినిమా అన్నారు. రవిమోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఊరే మాట్లాడోతుందన్నారు. ఇందులో నటించడానికి ముందు సంకోచించానని, అయితే అందరూ ఎంతో శ్రమ పెట్టి పనిచేశారన్నారు. -
పిల్లాడికి బంగారు చైన్ బహుమతిచ్చిన సూర్య
అభిమాన హీరో ఆటోగ్రాఫ్ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్‌కు ఇలాంటి సర్ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్ కుమారుడి చర్విక్ మొదటి బర్త్‌డేను వారి కుటుంబానికి లైఫ్‌లాంగ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.బంగారు గొలుసు కానుకపిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్ చైన్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లెజెండరీ యాక్టర్ సూర్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్ ఫస్ట్ బర్త్‌డే పురస్కరించుకుని బంగారు చైన్‌ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్ ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.తెలుగులో సినిమాఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్. రవీనా టండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. సూర్య 47వ మూవీసితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్, ఆవేశం సినిమాల ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. What an incredible surprise from the legendary Actor *Suriya* himself, such a kind gesture — gifted my baby boy *Charvik* a gold chain for his 1st Birthday! Thank you, *Suriya* sir—we’re forever grateful! 🙏✨@SuriyaFansClub #suriya46 @ActorSuriyaoff pic.twitter.com/grbI6DCngR— Charan (@Charanmaveric) December 17, 2025 -
హీరో ప్రదీప్ కాళ్ల దగ్గర.. ఆ పని ఎలా చేశావ్?
ఈ ఏడాది సెంచరీ దాటేసిన సినిమాల్లో డ్యూడ్ కూడా ఉంది. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా, హీరోకి మామగా, రాజకీయ నాయకుడిగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. అయితే అతడి కుల పిచ్చి ఎక్కువ.దేవయాని ఫోన్సినిమా చివర్లో హీరో అతడి కళ్లు తెరిపిస్తాడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో హీరో కాళ్ల దగ్గరపడి ఏడుస్తాడు శరత్ కుమార్. ఈ సీన్ చూసి సీనియర్ నటి దేవయాని ఆశ్చర్యపోయిందట! ఈ విషయాన్ని తాజాగా బిహైండ్వుడ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. డ్యూడ్ సినిమా చూసి దేవయాని నాకు ఫోన్ చేసింది. ఆ సీన్ చూసి షాక్చాలా బాగా చేశానని మెచ్చుకుంది. అలాగే నేను ప్రదీప్ కాళ్ల దగ్గర కూర్చుని చేసిన ఎమోషనల్ సీన్ చూసి షాకైంది. ఆ సన్నివేశం ఎలా చేయగలిగావ్? అని అడిగింది. అప్పుడు నేనొక్కటే చెప్పాను. నేను హీరో ప్రదీప్ దగ్గర కూర్చుని ఏడవలేదు. నా చెల్లెలి కొడుకు దగ్గర కన్నీళ్లుపెట్టుకున్నాను (సినిమాలో ప్రదీప్ తన మేనల్లుడిగా నటించాడు). తప్పేముంది?అందులో తప్పేముంది. ఒక నటుడిగా ఆ సీన్ చేసేటప్పుడు నాకెటువంటి హద్దులు, భయాలు ఉండకూడదు అని చెప్పాను అని వెల్లడించాడు. డ్యూడ్ (Dude Movie) విషయానికి వస్తే.. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూస్‌తోనే అవలీలగా రూ.100 కోట్లు దాటేసింది. -
హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థ సమర్పణలో కే.జే.బి టాకీస్ పతాకంపై నటుడు, నిర్మాత కేజే.బాలమణిమార్బన్ నిర్మిస్తున్న చిత్రం హాట్ స్పాట్ టూమచ్. ఇంతకుముందు వచ్చిన హాట్ స్పాట్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం గమనార్హం. హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో నటుడు ఎమ్మెస్ భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, రాక్షసన్, భవాని శ్రీ, బ్రిగిడా సగా, రంజన తివారి, ఆదిత్య ఖదీర్, విజయ్ టీవీ అమర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ రవి, జోసెఫ్ పాల్ ద్వయం ఛాయాగ్రహణం, సతీష్ రఘునాథన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి నటుడు విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రూపొందించిన హాట్ స్పాట్ చిత్రం నాలుగు కథలతో ఆంథాలజీగా ఉందని, హాట్ స్పాట్ టూమచ్ చిత్రం మూడు వేర్వేరు కథలతో సాగుతుందని చెప్పారు. ఇది అన్ని వర్గాలకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. చిత్ర ఆడియో, టీజర్, ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. Happy to present the stars reveal of #HotSpot2Much!https://t.co/WiuitAv3dfComing soon to cinemas near you ♨️@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @vikikarthick88 @priya_Bshankar @i_amak @AadhityaBaaskar @RakshanVJ @Brigidasagaoffl @BhavaniSre… pic.twitter.com/C0QbtOhURp— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 15, 2025The squad is pakka set 😎Welcome to the World of #HotSpot2Much da boys and girls !Hitting Theatres Sooon 🔥Stars Reveal 🔗 https://t.co/gEHcIbl881@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @thevishnuvishal @vikikarthick88 @priya_Bshankar @i_amak… pic.twitter.com/u7IsPvh0FD— Ramesh Bala (@rameshlaus) December 17, 2025 -
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్‌లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా.. ప్రదీప్ రంగనాథన్‌ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్‌కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్‌లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్‌కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్‌లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్‌ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!
మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్... "దృశ్యం" సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.జోక్ అనుకున్నా..కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా? అన్నాను. కలలో కూడా అనుకోలేదుఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్ చేస్తే.. ఆయన కూతురిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదుట గ్రాడ్యుయేషన్ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!అంత స్థోమత ఎక్కడిది?నాకు లండన్‌లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్ లోన్స్ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.పేరెంట్స్ అండగాకానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.అదే అసలు కష్టంనేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. చాలా నేర్చుకున్నా..దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Esther (@_estheranil) చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి -
భార్యకు విడాకులిచ్చిన 'దేవి' నటుడు
మలయాళ నటుడు, 'దేవి' సినిమా ఫేమ్ షిజు ఏఆర్ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ప్రీతి ప్రేమ్-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశాడు.లవ్ స్టోరీషిజు మలయాళంలో హీరోగా నటించిన తొలి చిత్రం 'ఇష్టమను నూరు వట్టం'. కువైట్‌లో 12వ తరగతి చదువుతున్న సమయంలో ప్రీతి ఈ సినిమా చూసింది. ఇందులోని హీరో షిజు ఆమెకు తెగ నచ్చేశాడు. కట్ చేస్తే కొన్నేళ్లకు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీ ఎక్కింది ప్రీతి. అలా ఓసారి చెన్నై ఎయిర్‌పోర్టులో షిజును కలిసింది. అప్పుడే ఇద్దరూ మాట్లాడుకోవడం.. నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఫ్రెండ్స్‌గా బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు.ఓరోజు షిజు.. ప్రీతికి ఫోన్ చేసి నువ్వంటే నాకిష్టం అన్నాడు. టీనేజీ నుంచి ఇష్టపడుతున్న హీరో తనను ఇష్టపడేసరికి ప్రీతికి నోటమాట రాలేదు. వారం రోజుల్లో షిజు ఆమెకు మరోసారి ప్రపోజ్ చేశాడు. అప్పుడు కానీ ప్రీతికి ఓ విషయం గుర్తురాలేదు. అతడు ముస్లిం, తాను క్రిస్టియన్ అని! కొంత సమయం కావాలని అడిగింది. ఇంట్లో అడిగితేనేమో ఇద్దరి మతాలు వేరని వ్యతిరేకించారు.మతం కన్నా మనిషి వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదు. మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామంది. అలా 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది. తర్వాత కూతురి సమక్షంలో మరోసారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ విడిపోయారు.సినిమామలయాళంలో అనేక సినిమాలు చేసిన షిజు (Shiju Abdul Rasheed) 'దేవి' మూవీతో తెలుగువారికి పరిచయమయ్యాడు. సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, గౌతమ్ ఎస్ఎస్సీ, శివరామరాజు, శతమానం భవతి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా రాబిన్‌హుడ్ మూవీలో కనిపించాడు. మలయాళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొనడమే కాకుండా టాప్ 5లో ఒకరిగా నిలిచాడు. ప్రీతి.. ప్రస్తుతం ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్‌గా రాణిస్తోంది. అలాగే ఈమె లాయర్ కూడా! View this post on Instagram A post shared by Shiju Abdul Rasheed (@shijuar) -
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
ఏఐ మాయ.. ఆ లిస్ట్‌లో మరో హీరోయిన్.. ..!
టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.తాజాగా లిస్ట్‌లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025 -
వెండి వెలుగులకై దక్షిణాది పోటాపోటీ!
దేశంలో వేల కోట్ల రూపాయల పరిశ్రమగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఎ.వి.జి.సి) విజృంభణతో విస్తృతమైన వినోద రంగంలో సినిమా ఓ చిరుభాగమైంది. ఇవాళ మారిన కాలంతో పాటు మారాల్సి వస్తున్న సినిమా ఒకపక్క భాష, ప్రాంతీయ భేదాలను చెరిపేస్తుంటే, మరోపక్క ఓటీటీ వేదికలు దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సొంతంగా నిర్మిస్తున్న ‘ఒరిజినల్స్’ కొత్త తరహా కథ, కథనాలను పరిచయం చేస్తున్నాయి. ఫిల్మ్ సిటీల నిర్మాణం మొదలు శిక్షణ, మెంటర్ షిప్‌ల ద్వారా ఈ సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందుగా పై చేయి సాధించాలని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీ పడుతున్నాయి.సాధారణ ఆర్థిక రంగంలోనే కాదు... సృజనాత్మక ఆర్థికవ్యవస్థ (క్రియేటివ్ ఎకానమీ)లోనూ తమదైన ముద్ర వేసేందుకు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు దూసుకు వస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట డిసెంబర్ 8 – 9 తేదీలలో గ్లోబల్ సమిట్ జరిగి, అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమను సైతం తెలంగాణకు ఆకర్షించాలన్న ప్రయత్నం జరిగింది. సరిగ్గా అదే సమయంలో డిసెంబర్ 9న చెన్నైలో ప్రముఖ ‘జియో – హాట్‌స్టార్’ సంస్థ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త వెబ్ సిరీస్‌లు, షోలను జనం ముందుకు తెస్తూ, అందుకు ముందస్తుగా ‘సౌత్ అన్బౌండ్’ అనే ఉత్సవం నిర్వహించింది. అక్కడే తమిళనాట సినీ పరిశ్రమ అభివృద్ధికి గాను ఆ సంస్థకూ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య ఓ ప్రాథమిక అవగాహన కూడా కుదరడం విశేషం.మరోపక్క తెలుగు రాష్ట్రాలు ఒకటికి రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సైతం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కొన్నేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగులకు సింగిల్ విండో అనుమతుల మొదలు పలు చర్యలు గతంలోనే పాలకులు చేపట్టారు. స్థానికంగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్లను ప్రోత్సహించి, ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో పరిశ్రమకు మరో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనేది ప్రయత్నం. వెరసి, సినీ పరిశ్రమకు చెరగని చిరునామాగా నిలిచి, తద్వారా ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందు వరుసలో నిలవాలని దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతుండడం గమనార్హం.సినిమాకు ‘ఫ్యూచర్ సిటీ’... వినోదానికి గ్లోబల్ హబ్…తెలుగు సినీ పరిశ్రమకు ఆది నుంచి తమ కాంగ్రెస్ ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయని పదే పదే నొక్కిచెబుతున్న ప్రస్తుత తెలంగాణ సర్కార్ హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు మరో కీలక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలాకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా రానున్న ‘ఫ్యూచర్ సిటీ’లో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్ లాంటి హిందీ తారలకు సైతం ఫిల్మ్ సిటీ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు 50 ఏళ్ళుగా హైదరాబాద్‌తో మమేకమైన అన్నపూర్ణ స్టూడియోస్ సైతం ‘ఫ్యూచర్ సిటీ’లో భాగమవుతుందంటూ అక్కినేని నాగార్జున లాంటి వారు ప్రకటించారు.అలాగే, సంస్కృతి, సినిమా, సృజనాత్మకతలకు గ్లోబల్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ డిసెంబర్ ప్రథమార్ధంలోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐ.ఐ.ఎఫ్.ఎ – ‘ఐఫా’)తో సైతం తెలంగాణ సర్కార్ పలు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 120కి పైగా దేశాల్లో వీక్షకులున్న “వార్షిక ‘ఐఫా’ ఉత్సవం 2026 నుంచి 2028 వరకు వరుసగా మూడేళ్ళ పాటు హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు ‘ఐఫా’ అవార్డులు అందించే ఈ ఉత్సవాల వల్ల ఏటా కొన్ని వేల మంది సందర్శకులు మన దగ్గరకు వస్తారు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. దక్షిణాదిపై కన్నేసిన ‘జియో- హాట్‌స్టార్’!ఇక, తమిళనాడు ప్రభుత్వంతో తాజాగా ‘జియో-హాట్‌స్టార్’ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వంతో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకం చేస్తున్నట్లు డిసెంబర్ రెండోవారంలో ప్రకటించింది. ఫలితంగా, తమిళనాట సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ‘జియో-హాట్‌స్టార్’ కీలక పాత్ర పోషించనుంది. “ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. అందుకు తగ్గట్టే నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్లు, డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్‌లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్‌ల లాంటివి చేపడతాం” అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే, నెట్ఫిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటివి దక్షిణాదిలోనూ అనేక రకాల ఒరిజినల్ కంటెంట్‌తో ముందుకొస్తున్నాయి. తాజాగా ‘జియో – హాట్ స్టార్’ సైతం ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం... ఇలా నాలుగు దక్షిణాది భాషల్లో ఫిక్షన్, నాన్ – ఫిక్షన్ కేటగిరీలలో 25 రకాల కొత్త టైటిల్స్‌ను వీక్షకుల నెట్టింట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. “దక్షిణ భారతదేశం ఎప్పుడూ సృజనాత్మకశక్తికి కేంద్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రేక్షకులు వినోద రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వినోదం అందించాలన్నది మా ప్రయత్నం. అందుకే ఈ ‘సౌత్ అన్ బౌండ్’. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొత్తగా 25 వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు అందిస్తున్నాం. ఈ కృషిలో భాగంగా గత పది నెలల్లో, దాదాపు 500 మందికి క్రియేటర్లు, డైరెక్టర్లు, షో రన్నర్లు మా సంస్థ కుటుంబంలో భాగమయ్యారు” అని ‘జియో స్టార్’ ఎంటర్టైన్మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి వివరించారు.దక్షిణాది సినీ ప్రముఖులు ఎందరో... ఈ ప్రసిద్ధ స్ట్రీమింగ్ దిగ్గజం అందిస్తున్న సిరీస్‌లు, షోలలో సినీ ప్రముఖులు సైతం భాగం కావడం చెప్పుకోదగ్గ విశేషం. తమిళంలో విజయ్ సేతుపతి సైతం ‘కాట్టాన్’ అనే ఓ వెబ్ సినిమాను స్వయంగా నిర్మిస్తూ, నటిస్తుంటే, మలయాళంలో ‘దృశ్యం’ చిత్ర సిరీస్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శక – నిర్మాత జీతూ జోసెఫ్ సైతం మరో ఓటీటీ ప్రయత్నాన్ని సమర్పిస్తున్నారు. ఇక, ప్రసిద్ధ నటుడు నివిన్ పాలీ సైతం భారతీయ ఔషధ రంగంలోని లోటుపాట్లపై నిర్మిస్తున్న ‘ఫార్మా’ అనే వెబ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ప్రముఖ సినీ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ఐశ్వర్యా రాజేశ్, సీనియర్ నటి జయసుధ, యువ హీరో ప్రియదర్శి, యువ హీరోయిన్ శివాత్మికా రాజశేఖర్, కమెడియన్ అభినవ్ గోమఠం, సీనియర్ నటుడు సాయికుమార్... ఇలా సుపరిచితులైన పలువురు ఈ వెబ్ షోలలో అలరించనున్నారు.ఇలా రాబోయే అయిదేళ్ళలో ఆ సంస్థ దక్షిణాది భాషల్లో ఏకంగా రూ. 12 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. స్వయంగా పలు చిత్రాలు నిర్మించి, వెండితెరపై నటించిన తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం రాష్ట్రంలో మరింత ఉపాధి, ఆదాయం పెంచే ఈ ఆలోచన పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారు. “దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఓ ప్రధాన కేంద్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఇక్కడే పుట్టాయి. అన్ని భాషల కళాకారులకూ ఇది నిలయం. దక్షిణాది సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది” అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో రానున్న సరికొత్త ఫిల్మ్ సిటీలు! నిజానికి, సినీ రంగంలోకి రావాలనుకొనే ఔత్సాహికులకు శిక్షణ నిచ్చేందుకు 1970ల నాటికే చెన్నైలో సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ పక్షాన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఆరంభమైంది. ఆ తరువాత కాలంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతూ వచ్చింది. ఇప్పటికీ అది నడుస్తోంది. ఇక, 1990ల నాటికే చెన్నైలో ఒకే చోట పలు సినిమా, టీవీ సీరియళ్ళ నిర్మాణానికి అనువుగా ఉండేలా ప్రభుత్వం ‘ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ’ పేరిట ప్రత్యేకంగా నెలకొల్పింది. అది చాలాకాలం తమిళ, తెలుగు, మలయాళ సినిమాలకు నిర్మాణ కేంద్రంగా నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో సినిమా స్టూడియోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం కోసం ప్రయత్నాలు సాగుతుంటే... మరోపక్క చెన్నైలో ఇప్పటికి రెండేళ్ళుగా సమస్త సౌకర్యాలతో, అధునాతన ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.2024 జనవరిలోనే డి.ఎం.కె. అధినేత – తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. చెన్నై శివార్లలోని పూనమల్లి దగ్గర కుతంబాక్కమ్ ప్రాంతంలో 152 ఎకరాల స్థలంలో రూ. 500 కోట్లతో ఈ నవీన ఫిల్మ్ సిటీ రూపొందనుంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పాటు భారీ ఎల్ఈడీ గోడలతో కూడిన వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలు, పోస్ట్ ప్రొడక్షన్ వసతులు, పరిశ్రమ వర్గీయుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ వసతి వగైరా అంతా అందుబాటులో ఉంచాలని యోచన. “త్వరలోనే నిర్మాణం చేపట్టి, సరికొత్త ఫిల్మ్ సిటీ కల సాకారం చేస్తాం” అని ఉదయనిధి ప్రకటించారు. నేరుగా ఇంట్లోనే రిలీజ్!ఇప్పుడు ఓటీటీలు కూడా రావడంతో అవి ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్ సినిమాలు, సిరీస్‌లు, షోల చిత్రీకరణ కూడా హెచ్చింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అందరినీ అలరించడమూ పెరిగింది. దక్షిణాది మీద ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న ఈ ఓటీటీ వేదికల ప్రాజెక్టులకు సైతం వసతి సౌకర్యాలు పెరగాల్సి ఉంది. అందుకోసం రానున్న కొత్త ఫిల్మ్ సిటీ వసతులు, రాష్ట్రాల ప్రత్యేక పాలసీలు ఉపకరిస్తాయి. ఆ సంగతి గ్రహించబట్టే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.థియేటర్లతో సంబంధం లేకుండా నేరుగా నట్టింటికే సినిమాను తీసుకొచ్చేసిన ఓటీటీలు ఇటీవల సులభమైన డబ్బింగ్, సబ్ టైటిల్స్ సాయంతో భాష, భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేశాయి. “కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. ఇప్పుడైనా, ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి” అని అభిమానులు ఆప్యాయంగా ‘కింగ్’ అని పిలుచుకొనే హీరో నాగార్జున సైతం ఇటీవల బాహాటంగా అన్నారు. ఉదయనిధి సైతం ఆ మాటే అంటూ, “కథను ఎలా చెప్పాలి, ప్రజలకు ఎలా చేరువ చేయాలి అన్న దానికి కమలహాసన్ సార్ గొప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినీరంగంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఓటీటీలు ఏవీ రాక ముందే, పుష్కరకాలం క్రితమే 2013 లోనే ఆయన తన (‘విశ్వరూపమ్’) చిత్రాన్ని డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) రిలీజ్ చేశారు” అని గుర్తు చేశారు.కరోనా కాలంలో థియేటర్లు మూసివేతలో ఉండడంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు తమదైన ప్రత్యేకత చాటాలని ‘జియో-హాట్ స్టార్’, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలు తమ ఒరిజినల్స్ ద్వారా చేస్తున్నది అదే. అవి నేరుగా వీక్షకుడి నట్టింటిలోకే తమ కొత్త సినిమా, సిరీస్, షోలను అందిస్తున్నాయి. వినోద రంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. థియేటర్లలో రిలీజయ్యే కొత్త సినిమాకు సైతం పోటీ అవుతున్నాయి. అయితే, ఓటీటీ కొత్త ద్వారాలు తెరిచింది. ఉదయనిధి అభిప్రాయపడినట్టు, “ఇవాళ ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదికలు వచ్చి, సినిమా స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని అనుకుంటే పొరపాటు. నిజానికి, సినీ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. కొత్త తరహా కథలు, కథనరీతులు, ఇంతకాలం లోకానికి వినిపించని అనేక గొంతులకు ఓటీటీ జాగా ఇస్తోంది.”ఈ కొత్త అవకాశాన్నీ, అందుబాటులో ఉన్న స్థానాన్నీ ఓటీటీలు తమ ఒరిజినల్స్ ద్వారా ఎంతవరకు అందిపుచ్చుకుంటాయో చూడాలి. వాటికి తగిన వాతావరణాన్నీ, వసతులనూ కల్పిస్తే... సొంత గడ్డపై సరికొత్త ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల దృష్టి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ‘జియో – హాట్‌స్టార్’ ప్రతిపాదనకు తమిళనాడు సై అన్నా, ‘ఐఫా’తో తెలంగాణ జట్టు కట్టినా అందరూ ఈ ‘ఆరెంజ్ ఎకానమీ’ కోసమే మరి!-రెంటాల జయదేవ -
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్.. మరో క్రేజీ రికార్డ్..!
రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిలిచింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.ప్రస్తుతం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. ది గర్ల్‌ఫ్రెండ్ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.ది గర్ల్‌ఫ్రెండ్ కథేంటంటే?భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. #TheGirlfriend is the 2nd most watched Non English film in THE WORLD on @NetflixIndia Have you watched it yet? pic.twitter.com/d21N2UhQuS— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025 -
మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ఈ రోజుల్లో మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం కంటెంట్‌తోనే ఈ సినిమాలు హిట్టవుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అలరించేందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం మలయాళంలోనే రిలీజైంది.ఆషికా అశోకన్, సంద్ర అనిల్ కీలక పాత్రల్లో వస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జస్టిస్ ఫర్ జెని. ఈ మూవీకి సంతోష్ ర్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఓ యువతిపై అత్యాచారం, మర్డర్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీని అస్నా క్రియేషన్ ప్రెజెంట్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో సినాన్, ఐశ్వర్య, బిట్టు థామస్ మప్పిళ్లస్సేరి, రేఖ, హరీష్ పేరడి, నిజల్గల్ రవి కీలక పాత్రలు పోషించారు. -
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. నాలుగు సినిమాలకేఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటి?దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది. -
ప్రేమ... పగ
నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ (తెలుగు, కన్నడ భాషల్లో..) ఈవెంట్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ కూడా చేశాను. సినిమా బాగా వచ్చింది’’ అని చెప్పారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా షూటింగ్‌ను 45 రోజుల్లోనే పూర్తి చేశాం. ప్రేమ–పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడుల మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది చేసిన రోల్ థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, కృష్ణసాయి, అడివి సాయికిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు అతిథులుగా పాల్గొని, సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వీ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆరోహణ సుధీంద్ర – సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో సంగీతం అందించారు. -
నన్ను దాటి ఏమీ చేయలేవు!
మోహన్ లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘వృషభ’. ఈ ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రంలో సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రల్లో నటించారు. నందకిశోర్ దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రం తెలుగు వెర్షన్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నన్ను దాటి మా నాన్నను నువ్వు ఏమీ చేయలేవు, నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధం’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
ఒకటో తేదీన నలభై ఐదు
శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘45 ది మూవీ’. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ట్రైలర్‌ని విడుదల చేశారు.‘‘45 ది మూవీ’ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్, గ్లింప్స్ మా సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాయి. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ లుక్ అదిరిపోతుంది. ఉపేంద్ర యాక్షన్, డైలాగ్ డెలివరీ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. విజువల్స్, నేపథ్య సంగీతం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ‘45 ది మూవీ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు. -
రాజుగా మోహన్ లాల్.. వృషభ ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ స్టార్ మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్ మూవీ క్రిస్మస్కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది. -
గుమ్మడికాయ కొట్టారు
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య 46’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్ జరిపారు.ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మరో కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
కాంతారపై రణ్వీర్ సింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి రియాక్షన్..!
కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. -
శివరాజ్ కుమార్ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది..!
కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 45. ఈ మూవీకి అర్జున్ జన్యా దర్శకత్వం వహించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే 45 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ.. మరణించిన తేదీ రాసుంటుంది..ఆ మధ్య ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం' అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫైట్స్, విజువల్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
కాంతార హీరోయిన్‌కు బాలీవుడ్ ఆఫర్!
సౌత్‌లోని భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే దక్షిణాదిలో టాలెంట్ నిరూపించుకుంటున్న భామలకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొస్తోంది. అందుకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద ఉదాహరణ.. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జంటగా ఓ సినిమా చేస్తోంది. తాజాగా మరో సౌత్ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రుక్మిణి వసంత్..నాలుగేళ్లు గ్యాప్2019లో బీర్బర్ ట్రయాలజీ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. అదే ఏడాది అప్‌స్టార్స్ అనే హిందీ మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సప్త సాగరదాచె ఎల్లో అనే కన్నడ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డ్రాగన్ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి టైటిల్‌తో విడుదలై మంచి స్పందన రాబట్టింది. దీని సీక్వెల్ కూడా సక్సెస్ అవడంతో పాటు రుక్మిణి అందానికి అందరూ ఫిదా అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా మెప్పించలేకపోయింది. కాంతార: చాప్టర్ 1 చిత్రంతో మరోసారి సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ నుంచి పిలుపుబాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రుక్మిణి (Rukmini Vasanth) మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి హిందీ సుపరిచితమైన భాషే అంది. ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. భగవంతుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేసింది.చదవండి: తిండీనిద్ర మానేసి మందు తాగుతూ ఉన్నా: ఊర్వశి -
తిండీనిద్ర మానేసి మందు తాగడం.. మాజీ భర్త వల్లే!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 350కి పైగా సినిమాలు చేసింది. 2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి సంతానం. రెండో పెళ్లిఅయితే భార్యాభర్తలు ఎంతోకాలం కలిసుండలేదు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ప్జాపతి అని ఓ కుమారుడు సంతానం. ఇటీవలే శివప్రసాద్ దర్శకుడిగా మారిపోయాడు. తన మొదటి పెళ్లి ఎందుకు విఫలమైందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందరూ కలిసి తాగేవారుఊర్వశి మాట్లాడుతూ.. మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణమే తేడాగా అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ ఆధునిక జీవన విధానాన్ని కొనసాగించేవారు. కలిసి తాగడం, తినడం చేసేవారు. తల్లీపిల్ల తేడా లేకుండా అంతా ఒక్కచోట కూడి సిట్టింగ్ చేసేవారు. వాళ్ల మధ్య నేను ఇమడగలుగుతానా? లేదా? అని భయపడ్డాను.షూటింగ్ అవగానే తాగడంఅడ్జస్ట్ అవడానికి ప్రయత్నించాను. వాళ్ల పద్ధతుల్ని నేర్చుకున్నాను. షూటింగ్స్‌కు వెళ్లడం.. రాగానే మందు కొట్టడం ఇదే పని! నన్ను నేను కోల్పోతున్నాను అన్న విషయం నెమ్మదిగా అర్థమైంది. అప్పటికే ఇంటి పోషణ బాధ్యత నా భుజాలపై పడింది. ఇష్టం లేని పనులు బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఆరోగ్యం నాశనం చేసుకున్నానా అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించేవారు కాదు. గొడవలు జరిగేవి.. అప్పుడు కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీనిద్ర మానేసి మరీ తాగుతూ కూర్చునేదాన్ని. చేజేతులా ఆరోగ్యం నాశనం చేసుకున్నాను. నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడ్డాను అని ఊర్వశి చెప్పుకొచ్చింది. -
ఎనిమిదేళ్లు సాగిన కేసులో తుది తీర్పు.. హీరోయిన్ భావన రియాక్షన్
హీరోయిన్ భావన స్వతహాగా మలయాళీ. కానీ తెలుగులోనూ ఒంటరి, మహాత్మ తదితర సినిమాలు చేసింది. అయితే ఈమెపై 2017లో దారుణం జరిగింది. రాత్రిపూట ఈమెని కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. తొలుత పదిమందిని అనుమానితులుగా చేర్చరు. తర్వాత హీరో దిలీప్ని కూడా అనుమానితుడిగా చేర్చారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో రీసెంట్‌గానే తుదితీర్పు వచ్చింది. ఆరుగురుని దోషులుగా తేల్చారు. హీరో దిలీప్ని మాత్రం నిర్దోషిగా ప్రకటించారు.అయితే ఈ తీర్పు విషయమై హీరోయిన్ భావన అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మాత్రం న్యాయమైనా జరిగింది అని ఆనందపడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ట్రయల్ కోర్టుపై తను నమ్మకం కోల్పోవడానికి కారణాలు బయటపెట్టింది. అలానే ఈ దేశంలో న్యాయవ్యవస్థ ముందు అందరికీ ఒకేలాంటి న్యాయం దొరకదని కూడా చెప్పుకొచ్చింది.'8 సంవత్సరాల 9 నెలల 23 రోజుల తర్వాత ఈ బాధాకరమైన ప్రయాణంలో చిన్నపాటి ఆశ కనిపించింది. ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారైంది. నా బాధ అబద్ధం, ఇదంతా కట్టుకథ అనుకునే వాళ్లకు ఈ తీర్పు అంకితం. మీకు ఇప్పుడు మనశ్శాంతి దొరికిందని అనుకుంటున్నా''అందరూ అనుకుంటున్నట్లు మొదటి అనుమానితుడు నా డ్రైవర్ కాదు, అదంతా అబద్ధం. నేను చేస్తున్న ఓ సినిమా కోసం ప్రొడక్షన్ కేటాయించిన డ్రైవర్ అతడు. సంఘటన జరిగిన రోజు తప్పితే అంతకు ముందు ఒకటి రెండుసార్లు మాత్రమే చూశా. కాబట్టి అసత్య ప్రచారాలు ఆపండి. ఈ తీర్పు చాలామందికి ఆశ్చర్యపరిచి ఉండొచ్చు కానీ నాకు కాదు. ఎందుకంటే 2020 ప్రారంభంలోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతుందనిపించింది. ప్రొసిక్యూషన్ కూడా కేసులో తేడా గుర్తించింది. మరీ ముఖ్యంగా ఓ అనుమానితుడు విషయంలో''ఇన్నేళ్లలో హైకోర్టు, సుప్రీంకోర్టుకి నేను పలుమార్లు వెళ్లాను. ట్రయిల్ కోర్టుపై నాకు నమ్మకం లేదని పేర్కొన్నాను. కానీ నా ప్రతి రిక్వెస్ట్‌ని తోసిపుచ్చారు. ఇన్నేళ్ల బాధ, కన్నీళ్లు, ఎమోషనల్ స్ట్రగుల్ తర్వాత.. 'దేశంలోని అందరికీ కోర్టులో ఒకేలాంటి ట్రీట్మెంట్ దొరకదు' అనే విషయం నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటికీ నన్ను తిట్టే వాళ్లకు చెబుతున్నాను. మీరు అలానే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు' అని భావన సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.ట్రయల్ కోర్టుపై నమ్మకం కోల్పోవడానికి కారణాలు ఇవే అని భావన కొన్నింటిని ప్రస్తావించింది.నా ప్రాథమిక హక్కులకు రక్షణ దొరకలేదు. ఈ కేసులో కీలక సాక్ష్యమైన మెమొరీ కార్డ్‌ని మూడుసార్లు ట్యాంపర్ చేశారు. అది కూడా కోర్టు కస్టడీలో ఉండగానే.వాదనలు సాగుతున్నప్పుడే ఇద్దరు పబ్లిక్ ప్రొసిక్యూటర్స్ రాజీనామా చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశపడొద్దని, కోర్టు వాతావరణం అస్సలు సరిగా లేదని నాతో చెప్పారు.మెమొరీ కార్డ్ ట్యాంపరింగ్ విషయంలో పక్కా దర్యాప్తు చేయమని ఎన్నోసార్లు అడిగా కానీ అది జరగలేదు. మళ్లీ మళ్లీ అడిగేంతవరకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు.ఈ కేసు విషయమై న్యాయం జరగట్లేదని గౌరవనీయ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా స్వయంగా నేను లేఖ రాశాను.ఓపెన్ కోర్టులో ఈ కేసు విచారించాలని నేను అడిగాను. తద్వారా మీడియా, ప్రజలకు ఏం జరిగిందో తెలుస్తుందని అన్నాను. కానీ నేను అడిగిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు.ఈ సంఘటనకు కారణమేంటి?హీరో దిలీప్ తొలుత హీరోయిన్ మంజు వారియన్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో బంధంలో ఉన్నప్పటికీ హీరోయిన్ కావ్య మాధవన్‌తో రిలేషన్ మెంటైన్ చేశాడు. కొన్నాళ్లకు మంజు విడాకులు ఇవ్వడంతో దిలీప్.. కావ్యని వివాహం చేసుకున్నాడు. అయితే కావ్య గురించి భావననే మంజుకి చెప్పిందని దిలీప్ అనుమానించాడు. ఈ క్రమంలోనే సుఫారీ ఇచ్చి భావనపై దారుణానికి ఒడిగట్టాడనేది ఆరోపణ. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
తమిళ్లో నాకు ఛాన్సులివ్వరు, ఇక్కడ ఆ ఐక్యత లేదు!
మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట. కిక్ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. మాస్కే పరిమితం కాకుండా క్లాస్, లవ్ ఎంటర్టైనర్ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్.ఇండస్ట్రీ కలుషితంతాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్‌కు తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.ప్రాంతీయభావం ఎక్కువతమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు. పీఆర్‌తో పనివాళ్లందరూ పీఆర్ టీమ్‌ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్‌గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? నా వల్లకాదు! -
బేబమ్మని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. డేంజర్ జోన్లో కెరీర్!
తొలి సినిమాతోనే సూపర్ హిట్ దక్కడం సినీతారలకు ఓ వరం లాంటింది. ఆ ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వరుస అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలతో నటించే చాన్స్ వస్తుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు చిత్రాలకే పనికొస్తుంది. ఆ తర్వాత కూడా హిట్ రాకపోతే..అంతే సంగతి. హీరోలలాగా హిట్ లేకపోయినా..ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. వయసు పెరిగేకొద్ది చాన్స్‌లు తగ్గిపోతుంటాయి. పైగా టాలీవుడ్లో అందాలకు కొదవేలేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పుటుకొస్తున్నారు. అందుకే హీరోయిన్ల హిట్ చాలా అవసరం. ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది. తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడడంతో తనకిక ఎదురులేదనుకున్నారు. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది ఈ బ్యూటీ. ఆమె హీరోయిన్గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఆమెను పక్కకి పెట్టింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన 'ఆర్మ్' అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. కార్తి 'వా వాథియార్'(అన్నగారు వస్తున్నారు), ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ 'జీని' చిత్రాల్లో నటించింది. అయితే వీటిల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. కొన్నాళ్ల పాటు ఆమెకు ఢోకా ఉండదు. కానీ హిట్ సంగతి పక్కకుపెట్టు..కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఆమె నటించిన సినిమాన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఈ నెల 12న అన్నగారు వస్తున్నారు రిలీజ్ అవ్వాల్సింది. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. ఆ తర్వాత ఇది కూడా వాయిదా పడినట్లు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు. కానీ డేట్ ప్రకటించలేదు.ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ టెన్షన్ పడుతుంది కృతి శెట్టి మాత్రమే. అసలే హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుస సినిమా రిలీజ్ అయితే..ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉంటారకుంది. అందుకే ఎంతో హుషారుగా ప్రమోషన్స్ చేసింది. అన్నగారు వస్తున్నారు సినిమాతో హిట్ పడుతుందని.. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి వాయిదా పడడంతో బ్యాడ్‌లక్ అనుకొని సైలెంట్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజై..ఒక్కటి హిట్ అయినా కృతికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే మాత్రం.. కోలీవుడ్‌లో కూడా కృతికి అవకాశాలు రావు. ఓవరాల్‌గా ఆమె సినీ కెరీరే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. -
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కారణం లేకపోలేదు. భార్య, దర్శకురాలు గీతాంజలి.. తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఫోటోలన్నీ సడన్‌గా తీసేయడంతో వీళ్ల మధ్య గొడవలు తలెత్తాయని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ఈ కాలంలో విడాకులు తీసుకునేముందు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని ఇలా ఫోటోలు డిలీట్ చేసుకుంటున్నారు. దీంతో ఈ జంట కూడా విడిపోయిందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.రెండు పెళ్లిళ్లుసెల్వరాఘవన్ (Selvaraghavan).. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో సెల్వ తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. సోనియా అగర్వాల్‌ను హీరోయిన్గా బిగ్‌స్క్రీన్‌కు పరిచయం చేశారు. సెల్వ నెక్స్ట్ మూవీ 7/G రెయిన్బో కాలనీ (7/G బృందావనం) మూవీలోనూ సోనియానే హీరోయిన్! ధనుష్- సోనియాను జంటగా పెట్టి మూడో సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో సోనియాతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.కానీ భార్యాభర్తలుగా ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సెల్వ.. దర్శకురాలు గీతాంజలి (Gitanjali Raman)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లుగా ఎంతో బాగా కలిసున్న ఈ దంపతులు ఇప్పుడిలా విడిపోతున్నారన్న వార్త అభిమానులను కలిచివేస్తోంది. అటు సెల్వ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడం గమనార్హం!చదవండి: మ్యాచ్ చూసేందుకు వచ్చి మెస్సీ అంటే ఇష్టం లేదన్న అర్హ -
96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్‌కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్స్లీ, డీఎస్ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్ రిపీట్!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి
బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్ మలర్‌వనమ్.. ఇతర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.నిద్రమాత్రలు మింగి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్‌లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. చికిత్స పొందుతూ మృతితొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్పాక్కమ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్పాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఛూ మంతర్!
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘ఆషికీ 3’ సినిమాతో బాలీవుడ్లో, ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హిందీలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే రెండో సినిమా ‘ఛూ మంతర్’లో నటించే చాన్స్ అందుకున్నారట శ్రీలీల.తరుణ్ దుడేజా దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుత అనన్యాపాండేను సంప్రదించారు మేకర్స్. ఆమె సరే అన్నప్పటికీ... తన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ రెండో సీజన్‌తో డేట్స్ క్లాష్ కావడంతో ‘ఛూ మంతర్’ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోనున్నారట. ఇప్పటికే మేకర్స్ సంప్రదించగా.. ‘ఛూ మంతర్’లో నటించేందుకు శ్రీలీల సుముఖంగా ఉన్నారని టాక్. -
జైలర్ యాక్షన్
సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. 2023 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూట్‌తో బిజీగా ఉన్నారు రజనీ. కాగా డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు.75 ఏళ్లు పూర్తి చేసుకున్నారాయన. ఏడు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలకు సై అంటున్నారు రజనీ. ప్రస్తుతం ‘జైలర్ 2’ కోసం ఓ ఫైట్ సీక్వెన్స్లోపాల్గొంటున్నారాయన. ఇందులో భాగంగా ఓ సన్నివేశంలో ఆయన బరువైన వస్తువుని పైకి ఎత్తి తలకిందులుగా పెట్టాల్సి ఉందట. ఈ కష్టమైన సీన్‌ని డూప్‌తో చేయిద్దామని నెల్సన్ చెప్పినప్పటికీ... వద్దంటూ తనే ఆ సన్నివేశంలోపాల్గొన్నారట రజనీకాంత్. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. -
క్యాన్సర్‌తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..దయచేసి కాపాడండికొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్‌ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ వాహిని?వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్ -
అసలేంటి తలైవా.. ఈ వయసులో కూడా ఇంత సాహసమా?
సూపర్ స్టార్ రజినీకాంత్..ఈ పేరు వింటే చాలు అభిమానులకు ఆ డైలాగ్ తప్పకుండా గుర్తుకొస్తుంది. 'ఆడదంటే అణకువగా ఉండాలి.. తొందర పడకూడదు. చదువు ఉండాలి సంస్కారం మరిచి పోకూడదు. అధికారం ఉండాలి.. అహంకారం ఉండకూడదు.. క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు.. భయభక్తులు ఉండాలి.. బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు' అంటూ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ఎప్పటికీ అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది.1999లో వచ్చిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇవాళ తలైవా బర్త్ డే కావడంతో మరోసారి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేటితో రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తలైవాకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది కూలీతో అభిమానులను అలరించిన సూపర్ స్టార్.. జైలర్ సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం డేరింగ్ స్టంట్స్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.జైలర్-2లో సాహసం చేస్తోన్న తలైవా..ప్రస్తుతం రజినీకాంత్ జైలర్-2తో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 75 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తోన్న తలైవా.. ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం రజినీకాంత్ సాహసం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ వయసులో ఫైట్ సీన్ కోసం..ఇటీవలే జైలర్-2 షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రజినీకాంత్‌తో ఓ ఫైట్ సీన్ కోసం బరువైన వస్తువులు ఎత్తాల్సి ఉంది. ఈ ఫైట్ సీన్ కోసం తలైవా బరువైన వస్తువును ఎత్తి తలకిందులుగా పెట్టాలి. ఈ కష్టమైన సీన్‌కు డూప్‌ను ఏర్పాటు చేశారు దర్శకుడు నెల్సన్. కానీ రజినీకాంత్ వద్దని చెప్పారట. ఆయనే డూప్ లేకుండా ఆ బరువును ఎత్తడానికి ప్రయత్నించారట. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ వయసులో ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వయసులో ఇంత సాహసం చేయడం తలైవాకే సాధ్యమంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. కాగా.. జైలర్-2 చిత్రంలో ఎస్జే సూర్య, యోగిబాబు, రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్ హీరోయిన్భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్‌బాబు జీవిత రథం, ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్లో, హిందీ సిరియల్స్‌లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్‌లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది. -
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్‌తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్ రిజెక్ట్దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్‌కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు. -
రజినీకాంత్ బర్త్ డే.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్అప్ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్..రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు.కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎలా మారిపోయిందో!
సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్‌కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంఅలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు. అలా కనిపించి ఇలా కనుమరుగురాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు. బొద్దుగా తులసితాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine ) Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025 -
తేదీ తారు మారు
తార్ మార్ తక్కర్ మార్ అన్నట్లు... ఈ వారంలో విడుదల కావాల్సిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల అటూ ఇటూ కావడంతో ఈ వారంలో విడుదల కావాల్సిన కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే కార్తీ ‘అన్నగారు వస్తారు’ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా శుక్రవారం (డిసెంబరు 12) విడుదల కావడం లేదు. ఈ చిత్రం కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తారు. ఇక... వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం.అన్నగారు... కమింగ్ సూన్ కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 12న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణాల వల్ల ఈ చిత్రం నేడు విడుదల కావడం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ గురువారం తెలిపారు.లాక్ డౌన్ మరోసారి వాయిదా అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాక్ డౌన్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ ప్రకటించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్లో రూపొందిన తమిళ చిత్రం ‘లాక్ డౌన్’. కరోనా సమ యంలో ఏర్పడిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను నవంబరు 23న గోవాలో జరిగిన 56వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది.అయితే చెన్నైలో వర్షాల కారణంగా 5వ తేదీ నుంచి 12కు వాయిదా వేశారు. కానీ నేడు కూడా విడుదల చేయడం లేదంటూ... రిలీజ్‌కి ఒక్క రోజు ముందు (గురువారం) లైకా ప్రోడక్షన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొన్ని పరిస్థితుల వల్ల మా ‘లాక్ డౌన్’ విడుదలను వాయిదా వేస్తున్నాం. మా మూవీ వాయిదా వల్ల ప్రేక్షకులకు, థియేటర్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది కలుగుతున్నందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని లైకా ప్రోడక్షన్స్ సంస్థ పేర్కొంది.న్యూ ఇయర్‌కి సైక్ సిద్ధార్థ శ్రీ నందు హీరోగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’. యామినీ భాస్కర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్‌తో శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ డిసెంబరు 12న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాను జనవరి 1కి వాయిదా వేశారు.వారం ఆలస్యంగా సఃకుటుంబానాంరామ్ కిరణ్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. ఈ సినిమా నేడు (డిసెంబరు 12న) రిలీజ్ కావాల్సింది. కానీ ఈ నెల 19కి వాయిదా వేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘బాలకృష్ణగారి ‘అఖండ 2: తాండవం’ డిసెంబరు 12న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో మా సినిమా రిలీజ్‌ను 19కి వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది.ఆలస్యంగా మిస్ టీరియస్ ‘రక్త కన్నీరు’ సినిమా ఫేమ్, దివంగత నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్‌తో పాటు రోహిత్ సహాని, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెల 19న రిలీజ్ చేస్తామని జై వల్లందాస్ తెలిపారు. -
మలయాళ స్టార్‌కు మన ‘కింగ్’ అపూర్వ అభినందన
ఎంచుకున్న రంగంలో ఏ స్థాయికి ఎదిగామన్నది కాదు... ఎంత ఎదిగినా, దాన్ని తలకెక్కించుకోకుండా ఎంత హుందాగా, సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరితో ఎంత గౌరవంగా ప్రవర్తించామన్నది ముఖ్యం. అందరినీ ఆకట్టుకొనే ఆ తరహా ప్రవర్తనను అగ్ర నటుడు నాగార్జున మరోసారి ప్రదర్శించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ‘జియో – హాట్ స్టార్’ వారి ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఆయన తన సీనియర్ నటుడు – మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో, మరో అగ్ర తమిళ నటుడు విజయ్ సేతుపతితో కలసి వేదిక పంచుకున్నారు. ఆ సందర్భంగా వేదిక మీదకు వస్తూనే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? పక్కనే ఉన్న విజయ్ సేతుపతి చేతి నుంచి చొరవగా ముందుగా మైకు తీసుకొని, మోహన్ లాల్‌ను అభినందించడం.క్లాప్స్ కొట్టడం తప్ప మరేమీ చేయలేం!మలయాళ చిత్రాల్లోనే కాక తెలుగు, హిందీ సహా వివిధ భాషల్లో నటించిన నటుడు మోహన్‌లాల్‌ను ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, సత్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలిసారిగా వ్యక్తిగతంగా కలుస్తున్న మోహన్‌లాల్‌ను సభాముఖంగా నాగార్జున ఆత్మీయంగా అభినందించారు. “వెండితెర మీద ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల అరుదైన నటుడు మోహన్‌లాల్ గారు. ఏ తరహా పాత్ర అయినా సరే, అందులోకి పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా పండిస్తారు. ఆయన ఏదైనా చేయగలరు. అలాంటి అభినయాన్ని చూసినప్పుడు చప్పట్లు కొట్టి, హర్షం వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయలేము” అంటూ నాగ్ తన మనసులో మాట ఆత్మీయంగా పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువా, పుష్పగుచ్ఛంతో మోహన్‌లాల్‌ను సత్కరించారు.అడిగినా... అక్కినేని చెప్పలేదట!ఆ సందర్భంగా నాగార్జున తన తండ్రి – సీనియర్ అగ్ర నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుతో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. సినీ రంగంలో కృషి చేసినవారికి భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత పురస్కారమైన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ గారు అన్ని విధాలా అర్హులైన నటుడు. ఈ అవార్డు ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే, కొన్నేళ్ళ క్రితం స్వయంగా మా నాన్న గారికి వచ్చింది. ఆ తరువాత ఫాల్కే అవార్డు విజేత ఎంపిక కమిటీలో మా నాన్న గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఒకసారి ఆ కమిటీ మీటింగ్ జరిగి, ఫాల్కే అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించారు. ఇంకా పేరు బయటకు ప్రకటించాల్సి ఉంది. ఇంటికొచ్చాక నాన్న గారితో, ఈసారి ఫాల్కే అవార్డు ఎవరికిస్తున్నారని అడిగాను. ఎంత అడిగినా, ఆయన ఆ సంగతి చెప్పలేదు. గోప్యంగానే ఉంచారు. అంత నిజాయతీగా, నిఖార్సుగా ఇచ్చే అవార్డ్ గనకనే ఫాల్కే అవార్డ్ రావడమంటే అంత గొప్ప. అందుకే, మోహన్‌లాల్ గారికి ఈ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని నాగార్జున పాత సంగతులు ప్రస్తావించారు.ఆ ఆటోగ్రాఫ్‌కు ఫ్రేమ్ కట్టుకున్న విజయ్ సేతుపతి!వేదికపై ఉన్న తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం మోహన్ లాల్‌కు సత్కారం చేయడమే కాక, భావోద్వేగానికి గురవుతూ, “మోహన్‌లాల్ గారికీ, ఆయన నటనకూ నేను వీరాభిమానిని. ఏ పాత్ర ఇచ్చినా ఆయన అంత సునాయాసంగా ఎలా చేస్తారో అర్థం కాదు. వీరాభిమానిగా నేను ఆయన దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను భద్రంగా ఫ్రేమ్ కట్టి, ఇంట్లో దాచుకున్నాను. అలాంటి గొప్ప నటుడికి ఫాల్కే అవార్డ్ దక్కడం ఎంతో ఆనందం. ఆయనతో కలసి ఇలా వేదిక పంచుకోవడం, ఆయన ఎదురుగా మాట్లాడడం ఓ చెప్పలేని అనుభూతి” అని వ్యాఖ్యానించారు.అనుకోని రీతిలో జరిగిన ఈ ఆత్మీయ అభినందనకు మోహన్‌లాల్ సైతం అంతే వినయంగా, ఆత్మీయంగా స్పందించారు. తనను అభినందించిన తోటి నటులకు కృతజ్ఞతలు చెబుతూనే, అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఏయన్నార్‌తో కలసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయంటూ, “బాలకృష్ణ హీరోగా దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో తీసిన ‘గాండీవం’ (1994) చిత్రంలో ఆయనతో కలసి నేను ఓ పాటలో (‘గోపబాలుడొచ్చెనమ్మ గోకులానికి...’ పాట) నటించాను. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఏయన్నార్ గారి నటన, ప్రవర్తన నేను మర్చిపోలేను. ఎందరికో స్ఫూర్తిదాత అయిన ఆయన నాకు మంచి ఆత్మీయులయ్యారు” అని మోహన్‌లాల్ వివరించారు. ఇలా పరస్పర గౌరవం, ఆత్మీయ అభినందనలు చూసి, ప్రేక్షకులు పెద్దయెత్తున హర్షధ్వానాలు చేశారు. - రెంటాల జయదేవ -
మన సినిమా ప్రాంతీయం కాదు... జాతీయం!.. అగ్ర నటుడు కమల్ హాసన్
అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.“ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!దక్షిణాది వినోద మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్‌తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.“ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు. -
'అన్నగారు' రావట్లేదు.. కార్తీ సినిమా మళ్లీ వాయిదా?
గతవారం సరిగ్గా థియేటర్లలో విడుదలకు కొన్ని గంటలు ఉందనగా బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు.. గతంలో తీసుకున్న డబ్బుని ఈరోస్ సంస్థకు సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం. అయితే కోర్ట్ బయటే సమస్య పరిష్కారమైంది. డబ్బంతా నిర్మాతలు చెల్లించడంతో అఖండ సీక్వెల్‌కి మార్గం సుగమమైంది. సేమ్ దీనిలానే కార్తీ చిత్రం కూడా రిలీజ్‌కి రోజు ముందు వాయిదా పడింది.కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వా వాతియర్'. తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాల్సింది. కానీ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి)దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని గతవారమే ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి జ్ఞానవేల్ రాజా.. ఈ మొత్తాన్ని రేపటిలోపు(డిసెంబరు 12) కడతారా లేదా అనేది చూడాలి? చూస్తుంటే 'అన్నగారు వస్తారు' వాయిదా పడినట్లే అనిపిస్తుంది. అన్నీ క్లియర్ అయిపోతే శనివారం (డిసెంబరు 13) విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.కార్తీ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తీరా ఇప్పుడు విడుదల చేసేందుకు సిద్ధమైతే పాత అప్పుల కారణంగా కోర్ట్.. రిలీజ్‌పై స్టే విధించింది. మరి ఇప్పుడు నిర్మాత జ్ఞానవేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి) -
రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?
అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. జైల్లోని తోటి ఖైదీలపై చేయి చేసుకున్నాడని రెండు రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇప్పుడు మరో షాకింగ్ ఫొటో వైరల్ అవుతోంది. దర్శన్ హత్య చేసిన రేణుకాస్వామి సమాధి చిత్రదుర్గలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరో ధ్వంసం చేశారు.రేణుకా స్వామి హత్య కేసులో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో సమాధిని ధ్వంసం చేయడం అంటే దర్శన్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఇతడి అభిమానులే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. రేపు(డిసెంబరు 11) దర్శన్ కొత్త సినిమా 'డెవిల్' థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం అభిమానులు ఆ హడావుడిలోనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రేణుకా స్వామి సమాధి ధ్వంసం అయిందని ఒకటి రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.హత్య కేసు సంగతేంటి?హీరో దర్శన్ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారని, దీని వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందనే బాధతో రేణుకాస్వామి అనే యువకుడు.. తన ఇన్‌స్టాలో పవిత్రని టార్గెట్ చేశాడు. అశ్లీల సందేశాలు, దర్శన్‌ని విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.ఇదే రేణుకాస్వామి హత్యకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు కన్నడనాట తీవ్ర సంచలనం సృష్టించింది. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో హైకోర్టు దర్శన్‌కు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాలు చేసింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కనపెడుతూ అత్యున్నత న్యాయస్థానం ఆ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ దర్శన్‌ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో దర్శన్ ఉన్నాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు) -
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్ భార్య
కన్నడ స్టార్ హీరో యష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్ వచ్చింది. అతడే నా సర్వస్వంఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్ బాడీగార్డ్, నా చాట్‌జీపీటీ, నా చెఫ్, నా పర్సనల్ ఫోటోగ్రాఫర్, నా మెంటార్, నా డీజే, నా డాక్టర్, నా కాలిక్యులేటర్, నా స్ట్రెస్ బస్టర్ అంటూ యష్ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్ ఫోటోను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని యష్‌ను కొనియాడుతున్నారు.సినిమాకేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
అజిత్ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్‌కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్ హీరోను కలిసిన శింబుఅజిత్ సినిమాలతోపాటు కార్ రేస్‌లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్‌ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్‌కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్‌తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్‌తో వన్స్ మోర్అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025 -
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు! -
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.మరి కోలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్ తనకు రిస్కీ సబ్జెక్ట్ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు."I always think that Telugu makers are doing big films & Malayalam makers are doing different films.. What's the identity of Tamil films..? We can't do new things if we are scared to try.. We need to break the barriers.."- #Karthi at #VaaVaathiyaar Event pic.twitter.com/5QIyqfr14L— Laxmi Kanth (@iammoviebuff007) December 8, 2025 -
కూలీగా మారిన హీరో.. నెట్టింట వీడియో వైరల్
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్ హెచ్.ఎన్. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్స్క్రీన్పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..తిథిరామ్ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.జాతీయ అవార్డుపల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ ద ఫేబుల్ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.కూలీగా మారిన హీరోఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. పొట్టకూటి కోసం..ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు. Heartbreaking: Abhi, the unforgettable lead from the National Award-winning Kannada masterpiece “Thithi”, is now working as a daily wage labourer to make ends meet.From stealing the screen to struggling for survival this is the reality for many of our brilliant artists. 💔… pic.twitter.com/xSz78ZqCsU— ಸನಾತನ (@sanatan_kannada) December 7, 2025 చదవండి: నేనే దురదృష్టవంతుడిని.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్ -
నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. సీక్వెల్‌కు ప్లానింగ్
రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది.25 ఏళ్ల తర్వాత రిలీజ్ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ చూడలేదు. నరసింహ సీక్వెల్జైలర్, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనేదే నా ఉద్దేశం. ఐశ్వర్యరాయ్ ఫస్ట్ ఛాయిస్ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో మైసూర్ వేలాది మందితో సీన్ షూట్ చేశాం.ఆమె కూడా..జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్ చేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.చదవండి: నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా -
దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి
హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్‌లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్‌ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
చిన్న వయసులోనే చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి
కృతీ శెట్టి.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాకే టాలీవుడ్ సెన్సేషన్ అయింది. ఉప్పెన మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు రావడంతో యంగ్ హీరోలతో జోడీ కట్టింది. అయితే తెలుగులో తన క్రేజ్‌ను, సక్సెస్‌ను అలాగే నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తోంది.ట్రోలింగ్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కృతీ శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా సున్నితమైన వ్యక్తిని.. అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. చిన్న వయసులోనే నేను చాలా విషయాలు ఫేస్ చేశాను.అమ్మ సపోర్ట్సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్, ద్వేషం చూసి నాకు చాలా బాధేసింది. ఇక్కడ ఏవీ మన చేతుల్లో ఉండవు. అయినా సరే మనల్నే నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అప్పుడు అమ్మ అండగా నిలబడి.. నీ వల్ల అయినదానికన్నా ఎక్కువే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పేది. ఒకానొక సమయంలో నాపై నేను నమ్మకం కోల్పోయాను. తట్టుకలోకపోయా..నిజ జీవితంలో నన్నెవరైనా కామెంట్ చేసుంటే పట్టించుకునేదాన్ని కాదు. కానీ కెరీర్లో ఇలాంటి కామెంట్స్ వినేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఫ్రెండ్స్ నేను బాధపడనీయకుండా నాతోనే ఉన్నారు. నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు అంటూ కృతీ శెట్టి (Krithi Shetty) కన్నీళ్లు పెట్టుకుంది.చదవండి: నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు -
నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు
నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోల్లో శింబు ఒకరు. ఈ తమిళ హీరో గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ ప్రేమ పెళ్లి పట్టాలెక్కకముందే బ్రేకప్ అయింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ హీరో ప్రేమ, పెళ్లిని కాస్త సైడ్‌కు నెట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్లోనూ కాస్త ఫన్నీగా చెప్పాడు.అందరి నోటా ఒకటే ప్రశ్నమలేషియాలో ఓ కార్యక్రమానికి హాజరైన శింబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలమాలతో సాదరంగా ఆహ్వానించారు. తర్వాత అక్కడే ఉన్న ఓ యాంకర్.. సర్, అందరూ ఒకటే అడుగుతున్నారు.. అదే మీ పెళ్లెప్పుడు? అని మెల్లిగా కూపీ లాగింది. ఆల్రెడీ అయిపోయిందిగా!అందుకు శింబు నవ్వుతూ.. అదేంటి, నాకు ఆల్రెడీ 120 సార్లు పెళ్లయిపోయిందిగా! అని జోక్ చేస్తూనే జీవితంలో ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అని బదులిచ్చాడు. లైఫ్‌లో ఒంటరిగా ఉన్నామా? ఒకరితో బంధాన్ని కలుపుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. మనం మంచిగా ఉంటే అంతే చాలు అన్నాడు. అరసన్ మూవీతర్వాత అభిమానుల కోరిక మేరకు ఓ తమిళ పాటను ఆలపించాడు. ఇకపోతే ప్రస్తుతం శింబు 'అరసన్' (తెలుగులో సామ్రాజ్యం) సినిమా చేస్తున్నాడు. వేట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపోమాపో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ సేతుపతి, సముద్రఖని, కిషోర్, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.చదవండి: రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! -
వైకల్యం, అవమానాలు అధిగమించి గీత రచయితగా..
ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్. ఆత్మస్థైర్యం ఎక్కువఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్‌చైర్‌లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్‌కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం. ఈయన పాటలు ఏం రాస్తారులే?అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు. అలా సినీ ఎంట్రీఅలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. వల్లభ ఫస్ట్ మూవీదివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు. మంచి పేరుఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు. -
జోడీ కుదిరిందా?
నటుడిగా విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు. నటిగా సాయి పల్లవి ఎంచుకునే పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసిందే. ఇలా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న ఈ ఇద్దరి జోడీ ఒక సినిమాకి కుదిరిందని చెన్నై అంటున్న మాట. అది కూడా మణిరత్నం దర్శకత్వంలో అని ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమకథా చిత్రం అని సమాచారం. విజయ్ సేతుపతి – సాయి పల్లవి ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట.జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తారట. ఒకవేళ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి – సాయి పల్లవి నటించనున్నారనే వార్త నిజమైతే... ‘నవాబ్’ తర్వాత ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతికి ఇది రెండో చిత్రం అవుతుంది. మణిరత్నం డైరెక్షన్లో సాయి పల్లవికి ఇది తొలి చిత్రం అవుతుంది. -
ది రిటర్న్ ఆఫ్ పడయప్ప
పాతికేళ్ల తర్వాత ‘పడయప్ప’ తిరిగి రానున్నాడు. రజనీకాంత్ హీరోగా, శివాజీ గణేశ్న్, రమ్యకృష్ణ, సౌందర్య, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహా’). కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999లో విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఈ నెల 12న రీ– రిలీజ్ కానుంది. డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే.ఇక నటుడిగా రజనీకాంత్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పడయప్ప’ సినిమాను డిసెంబరు 12న రీ రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేస్తూ, ‘ది రిటర్న్ ఆఫ్ పడయప్ప’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘పడయప్ప’ సినిమాలోని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌ను రజనీకాంత్ రీ క్రియేట్ చేసిన సీన్ ఈ వీడియోలో కనిపిస్తోంది. -
హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.(ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే
సినీ ఇండస్ట్రీలో వారసులు, నెపోటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలా ఈమె కూడా తల్లితండ్రి హీరోహీరోయిన్ కావడంతో సులువుగానే నటి అయిపోయింది. కాకపోతే పట్టుమని ఐదు మూవీస్ చేసిందో లేదో పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం తెరపై ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అక్షర హాసన్. ఈమె తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చిన్న కూతురు. కమల్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. గతంలో హీరోయిన్ సారికతో రిలేషన్లో ఉన్నప్పుడు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వాళ్లే శ్రుతి హాసన్, అక్షర హాసన్. శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేసే రేంజుకి వెళ్లింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)మరోవైపు అక్షర పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా తయారైంది. తల్లిదండ్రుల్లానే అక్షర కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అలా 2010లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మణిరత్నం తీసిన 'కడలి' మూవీలో ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో లెక్కలు మారిపోయాయి. అలా కొన్నాళ్ల పాటు దర్శకత్వం విభాగంలో మెలకువలు నేర్చుకున్న అక్షర.. 2015లో 'షామితాబ్' మూవీతో నటిగా మారింది.తొలి సినిమాలోనే(హిందీ) అమితాబ్ బచ్చన్, ధనుష్ లాంటి స్టార్స్‌తో నటించింది. కానీ ఏం లాభం? ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయింది. తర్వాత హిందీలో మరో మూవీ.. అనంతరం తమిళంలో మూడు చిత్రాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా అక్షరకు ఉపయోగపడలేకపోయాయి. చివరగా 2022లో ఓ సినిమాలో కనిపించిన అక్షర.. తర్వాత నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే తల్లితో కలిసి ముంబైలో ఉంటోంది. తాజాగా తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న తన చిన్నప్పటి ఫొటోలని షేర్ చేసింది. అలా ఇప్పుడు మరోసారి అక్షర హాసన్.. వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్') View this post on Instagram A post shared by Aksharaa Haasan (@aksharaa.haasan) -
'బెడ్రూమ్ వీడియో ల్యాప్‌టాప్‌లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!
ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్‌కు కొదువే లేదు. ఏ భాషలో తెరకెక్కించినా సరే డబ్బింగ్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతున్నాయి. అలా గతేడాది రిలీజైన మలయాళ చిత్రం నునుకుజి. ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు దృశ్యం డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చదివేయండి.ఏబీ జకారియా (బసిల్ జోసెఫ్) మంచి కోటీశ్వరుడు. తన తండ్రి మాట కోసం రిమీ (నిఖిలా విమల్)ను పెళ్లాడాతాడు. తండ్రి చనిపోయాక.. వాళ్ల కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజు అనుకోకుండా ఏబీ జకారియా తన వింత కోరికతో చిక్కులో పడతాడు. భార్యతో శృంగారాన్ని రికార్డ్ చేసి, వీడియోగా తన ల్యాప్ టాప్‌లో స్టోర్ చేస్తాడు. భార్య ఎంతగా చెప్పిన డిలీట్ చేయడు. అదే అతన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒక రోజు ఊహించని పరిణామాలతో ఏబీ జకారియా ల్యాప్‌టాప్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ చేతికి వెళ్తుంది. ఈ విషయం తెలిసిన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు ఆ ల్యాప్‌టాప్ చివరికీ జకారియాకు దొరికిందా? తన ల్యాప్ టాప్ కోసం జకారియా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే నునాకుడి కథ.ఎలా ఉందంటే..దృశ్యం డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీతూ జోసెఫ్ తన థ్రిల్లర్ కంటెంట్‌తో అభిమానులను కట్టిపడేయడంలో దిట్ట. ఆ విషయం దృశ్యం చూసిన వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. నునాకుజి కథలో సస్పెన్స్‌తో పాటు కామెడీని జొప్పించారు. సున్నితమైన సబ్జెక్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేసి ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చిపడేశాడు. నాలుగు గోడల మధ్య జరిగే తంతును కెమెరాలో బంధిస్తే ఎలాంటి ఇబ్బందులువు ఎదురవుతాయనే సింపుల్ సబ్జెక్ట్‌ను సీరియస్‌గా కాకుండా కామెడీ కోణంలో చూపించడం జీతూ జోసెఫ్‌కే సాధ్యమని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సీన్స్ బోరింగ్ అనిపించవు. కథలో సీరియస్‌నెస్‌తో పాటు సమపాళ్లలో కామెడీ పండించేందుకు డైరెక్టర్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ కథ మొత్తం కేవలం ఆ ఒక్క ల్యాప్ టాప్ చుట్టే తిప్పాడు. చివరి వరకు ల్యాప్ టాప్ కోసం సాగిన ఈ కథలో క్లైమాక్స్‌లోనూ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెలియాలంటే నునాకూజి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా జీ5 వేదికగా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్లో మంచి సస్పెన్స్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ కావాలంటే నునాకుజి చూసేయండి. ఎవరెలా చేశారంటే..మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ నటన మన తెలుగువారికి తెలిసిందే. బసిల్ జోసెఫ్ తన పాత్రలో అదరకొట్టాడు. రష్మిత రంజిత్ పాత్రలో గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకు న్యాయం చేశారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎస్ వినాయక్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎక్కడా బోరింగ్ కొట్టకుండా కట్ చేశాడు. విష్ణు శ్యామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
మనస్సాక్షి లేదా? ప్రజలంటే అంత చులకనా?
ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో కరూర్ తొక్కిసలాట ఒకటి. హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ విషాదంపై సినీనటులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్‌తో కలిసి జిల్లా మూవీలో యాక్ట్ చేసిన వినోదిని.. విజయ్‌కు నటుడిగా సపోర్ట్ చేస్తానని, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించింది.జనాలను పట్టించుకోవడం దండగఈమధ్య ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జనాలను పట్టించుకోవడం దండగ అని ఈ మధ్యే అర్థమైంది. వాళ్లకోసం మాట్లాడి ఉపయోగం లేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ విషయం నాకు మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఉదాహరణకు కరూర్ తొక్కిసలాటనే తీసుకోండి.. 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలు కూడా అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నారు. అలాంటివారి కోసం నేనెందుకు నిలబడాలి? అని మాట్లాడింది. నటి ఆగ్రహంఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనం శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాధను ఎందుకని అవమానిస్తున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? మీరేమైనా కరూర్ బాధితులను నేరుగా కలిశారా? మాట్లాడారా? వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారా? సమస్యను అర్థం చేసుకోవడం పక్కనపెట్టి విజయ్ సర్‌ను అరెస్ట్ చేయలేదని ఎక్కువ ఫీలవుతున్నట్లున్నారు.బీపీ వచ్చిందిజయలలిత లాంటి నాయకురాలు రాజకీయాల్లో మళ్లీ కనిపించరా? అని అడుగుతుంటారు కదా! ఇదే దానికి సమాధానం. ప్రజలకు విలువ ఇవ్వని నాయకులు ఎక్కడ ఎదుగుతారు? ఆమె మాటలు విన్నాక నాకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను కరూర్ బాధితులను నేరుగా కలిశాను. నేను మీలా రాజకీయ నాయకురాలిని కాదు. ఏ పార్టీని సపోర్ట్ చేయను. అయినా వారి బాధ నేను అర్థం చేసుకోగలను. జనం పనికిరానివాళ్లా?వాళ్లకోసం నేను పెద్దగా ఏమీ చేయకపోవచ్చేమో! కానీ, అండగా నిలబడటం నా బాధ్యత. జరిగినదాంట్లో విజయ్ సర్ తప్పు లేదని బాధితులే స్వయంగా చెప్పారు. కానీ, మీరు మాత్రం దాన్ని ఒప్పుకోరు. పైగా అలా అన్నందుకు మీ దృష్టిలో ఆ అమాయక జనం పనికిరానివాళ్లుగా మారిపోయారు. మీరు పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేశారు. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. మీ సేవలు మాకు అక్కర్లేదు అని మండిపడింది. కాగా వినోదిని.. మక్కల్ నీది మయ్యం పార్టీకి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసింది. తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న సనం శెట్టి.. తెలుగులో శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాల్లో నటించింది.చదవండి: తనూజకు క్లాస్ పీకిన నాగ్.. ఆ ముగ్గురికే ట్రోఫీ గెలిచే అర్హత -
15 ఏళ్లుగా పోరాటం.. గ్లామర్ ఉన్నా నో లక్!
పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్‌తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.సీన్స్ కట్ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్‌లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.వివాదంవాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది. కోరికసెంగళం అనే వెబ్ సిరీస్‌లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్‌లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
సినిమాలో అన్ని పాటలు పాడిన రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్‌లో అన్ని పాటలు పాడటం రెహమాన్‌కు ఇదే మొదటిసారి!అది రిపీట్ అవాలని..ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు. రెండు వారాల రిహార్సల్స్ఇందులో సంగీతానికి, డ్యాన్స్‌కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.చదవండి: అప్పుడే తెలిసిపోయింది -
ఐటీ నోటీసుల కేసులో నటుడు యశ్‌కు ఊరట
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటుడు యశ్‌కు ఆదాయ పన్ను శాఖ(ఐటీ) నోటీసుల కేసులో ఉపశమనం లభించింది. కేజీఎఫ్ సినిమాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో 2021లో ఐటీ అధికారులు యశ్ ఇళ్లు, హోంబాళె నిర్మాణ సంస్థ ఆఫీసులు, యజమానుల ఇళ్లలో దాడులు చేసింది. సేకరించిన సమాచారం ఆధారంగా 2013 నుంచి 2019 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి వివరాలను సమర్పించాలని అప్పట్లో ఐటీ అధికారులు యశ్‌కు నోటిసులిచ్చారు.వీటిని సవాల్ చేస్తూ యశ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణలో యశ్ విచారణ పరిధిలోని వ్యక్తి కాదని, నోటీసులు ఇవ్వడం తప్పని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఆర్.కృష్ణ కుమార్ నోటీసులను రద్దు చేస్తూ అదేశాలిచ్చారు. కాగా, యశ్ నటించిన కొత్త సినిమా ట్యాక్సిక్ విడుదలకు సిద్ధమైంది. కేజీఎఫ్–2 తరవాత వస్తున్న యశ్ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
వారికి పుట్టగతులు ఉండవు: ఇంద్రజ శాపనార్థాలు
జంతర్ మంతర్, యమలీల, సొగసు చూడరతరమా, అమ్మ దొంగ, శుభమస్తు, పెద్దన్నయ్య, అల్లుడు అదుర్స్, మాచర్ల నియోజకవర్గం, ఉగ్రం, డాక్టర్.. ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది ఇంద్రజ. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.సుధీర్ నాకు దేవుడిచ్చిన బంధంతాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సమాజం పోకడల గురించి మాట్లాడింది. అలాగే సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. సాఫ్ట్వేర్ సుధీర్ మూవీలో సుధీర్‌కు అమ్మగా నటించా.. అమ్మ అన్న మాటకు ఫిక్సయిపోయి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇది దేవుడిచ్చిన బంధం. సుధీర్ చేరుకోవాల్సిన స్థాయికి ఇంకా ఎందుకు చేరుకోలేదన్న చిన్న బాధ ఉంది.పుట్టగతులు ఉండవ్ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ప్రేమలో మోసపోయినప్పుడు కూడా అంతే నొప్పి ఉంటుంది. అలా మోసం చేసినవాళ్లు ఆడవారైనా, మగవారైనా వారికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి అని గుర్తుంచుకోండి.అమ్మ కోరిక నెరవేర్చలేకపోయా..మాకు దగ్గర్లో వడపళని మురుగన్ గుడి ఉండేది. అమ్మ ఆ గుడికి తీసుకెళ్లమని కోరింది. రెండు రోజుల్లో తీసుకెళ్తాను అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇంతలో వారం రోజులకే అమ్మ చనిపోయింది. అమ్మ కోరిక నెరవేర్చలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. అమ్మను టైట్‌గా హగ్ చేసుకోవాలని ఉండేది, కానీ తను లేదు అంటూ ఇంద్రజ (Indraja) ఎమోషనలైంది.చదవండి: హనీమూన్‌లో రాహుల్ సిప్లిగంజ్ -
ఏడేళ్లు సీరియల్స్.. సినిమాల్లో కలిసిరాని లక్!
అందం, టాలెంట్ ఉంటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి. పాయల్ రాజ్‌పుత్‌కు లక్ మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. నేడు (డిసెంబర్ 5) పాయల్ రాజ్‌పుత్ 33వ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..సీరియల్ నటిగా..1992 డిసెంబర్ 5న ఢిల్లీలో పాయల్ జన్మించింది. చిన్ననాటి నుంచే సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమె ఇష్టాన్ని కాదనుకుండా నచ్చింది చేయమని ప్రోత్సహించారు. అలా సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. 2010 నుంచి ఏడేళ్లపాటు హిందీలో పలు సీరియల్స్ చేసింది. చన్నా మేరేయా (2018) అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్గా మారింది.ఫస్ట్ మూవీతో క్రేజ్ఈ మూవీలో పాయల్‌ను చూసిన తెలుగు దర్శకుడు అజయ్ భూపతి ఫిదా అయ్యాడు. అలా ఆర్ఎక్స్ 100 మూవీతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్మార్ఖాన్ వంటి సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. కెరీర్అలాంటి సమయంలో అజయ్ భూపతి మంగళవారం సినిమాతో తనకు ఘన విజయాన్ని అందించాడు. ఈ హిట్టు తనను మళ్లీ నిలబెట్టేలా చేసింది. మరో కమర్షియల్ హిట్టు పడితేనే పాయల్ (Payal Rajput) కెరీర్ పుంజుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలు చేస్తోంది. మరి మున్ముందైనా మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి!చదవండి: ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నా.. ఖాళీగా ఉన్నా ఓకే! -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ.. వివాదంలో సినిమా..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్‌లాల్ సుందర్‌దాస్ చెన్నై హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Interim Ban on ‘#VaaVaathiyaar’The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025 -
సింగర్ తల్లి నోట పాట.. వీడియో వైరల్
హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్‌రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్‌ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్‌ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. -
మేఘా ఆకాశ్ బర్త్ డే పార్టీ.. వేకేషన్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే..!
బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్..వైట్ డ్రెస్‌లో దియా మీర్జా బ్యూటీఫుల్ లుక్స్..బహమాస్‌లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లయ..వేకేషన్లో చిల్ అవుతోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే..శ్రీలంకలో చిల్ అవుతోన్న సాహితి దాసరి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి నెలరాజె అంటూ సాగే పాటను విడుదల చేశారు.అయితే ఈ పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తనకు తెలియకపోవటం వల్ల పాడానని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాదని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.డైరెక్టర్ రియాక్షన్..చిన్మయి క్షమాపణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర దర్శకుడు మోహన్ జి స్పందించారు. ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితేనే బాగుంటుందని పాడించానని పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదన్నారు. దీనిపై చిన్నయి వివరణ ఇవ్వాలని లేదంటే ట్వీట్‌ను తొలగించాలని కోరారు.ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని దర్శకుడు మోహన్ పేర్కొన్నారు. చిన్మయి తన మెసేజ్‌లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయన వెల్లడించారు. At the outset, my heartfelt apologies for Emkoney.Ghibran is a composer I have known for 18 years since my jingle singing days. When his office called for this song, I just went & sang as I usually do. If I remember right, Ghibran wasn't present during this session - I was…— Chinmayi Sripaada (@Chinmayi) December 1, 2025 Don't target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it's my own creation and idealogy. Your target is me.. Don't target those associated Directly or indirectly with me and my projects.. It's a kind of cowardness..— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025 -
కాంతార చాప్టర్-1 సూపర్ హిట్.. రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ఈ ఏడాది కాంతార చాప్టర్-1తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని గతంలో రిలీజై సూపర్ హిట్‌గా కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు.అయితే ఈ మూవీ తర్వాత రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. కాంతార-3 ప్లాన్‌లో ఉన్నారా? లేదంటే మరో కొత్త మూవీ తెరకెక్కిస్తున్నారా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటివరకు కొత్త మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ రిషబ్ శెట్టి తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్తో రిషబ్ శెట్టి జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఓ యోధుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన ఓ వీరుడి గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన 'ఆనంద్ మఠ్' అనే పుస్తకం స్ఫూర్తిగా తీసుకొని ఈ కథని దర్శకుడు అశ్విన్ అశ్విన్ గంగరాజు తెరకెక్కించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2026 వేసవిలో షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఈ ఏడాది క్రేజీ స్టార్స్.. టాప్ టెన్‌లో రష్మిక, రుక్మిణి.. ఫుల్ లిస్ట్ ఇదే!
త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్ హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఈ ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్‌డమ్‌ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్‌ను ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. ఈ సారి అత్యధికంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్, కల్యాణి ప్రియదర్శన్ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్, థామా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్-1తో ఆడియన్స్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్ కొత్తలోక: చాప్టర్- 1 మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది.బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్‌లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్ సూరి డైరెక్టర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఐఎండీబీ- 2025 లిస్ట్..టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...అహాన్ పాండే (సయారా)అనీత్ పడ్డా (సయారా)ఆమిర్ ఖాన్ (సితారే జమీన్ పర్)ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్)లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)రష్మిక మందన్నా (ఛావా, సికిందర్, థామా, కుబేర)కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్1)త్రిప్తి డిమ్రి (ధడక్2)రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్1)రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1) టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..మోహిత్ సూరి (సయారా)ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)లోకేశ్ కనగరాజ్ (కూలీ)అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్)ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో)డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్1)లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్) -
హీరోయిన్‌తో విడాకులు.. రూ.100 కోట్ల ఆస్తి ఎవరికంటే?
దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 30) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి కాలంలో మాత్రం కనిపించకుండా పోయారు. చాలాకాలంగా ఒంటరిగానే బతుకీడుస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఈ ప్రత్యేక కథనం..పెళ్లి చేసుకోమని బలవంతంసినీ నిర్మాత ఎస్ఎంఎస్ సుందరరామన్ కుమారుల్లో దేవదాస్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్ చేశారు. దేవదాస్.. వేగుళి పెన్, మని కోయ కురుప్, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించారు. వేగుళి పెన్ మూవీ సమయంలో హీరోయిన్ దేవిక ఆయనతో ప్రేమలో పడింది. దేవిక, దేవదాస్పెళ్లితో జీవితం తలకిందులుఅయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట! పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది! దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక.. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. కానీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని దేవదాస్‌కు నెమ్మదిగా అర్థమైంది. ఆయన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది. దశాబ్దాల తరబడి కోర్టులోఅందుకు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు తాళి బొట్టు ఆయన మొహాన విసిరికొట్టింది. అంతేకాదు, భర్తను చంపించాలని ప్రయత్నించిందట. ఈ విషయంపై దేవదాస్ పోలీసులను ఆశ్రయించగా దాదాపు 32 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. పెళ్లయిన మూడేళ్లకే దంపతులిద్దరూ విడిపోయారు. కోర్టు కూతురును తల్లికే అప్పగిస్తుంది. అలా కనక తండ్రికి దూరమైంది. కూతురి కోసం ఇంటికెళ్తే...కాదు, దేవికయే కూతుర్ని తనకు దూరం చేసిందంటారు దేవదాస్.. ఆమె వేసిన నిందలకు అందరూ తనను శత్రువులా చూశారని బాధపడ్డారు. కనక మానసిక స్థితి సరిగా ఉండదని, ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వస్తే ఇంటికి వెళ్లి చూశారు. కనక బతికే ఉండటంతో అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. కనక ఇంటి బయట అంతా శుభ్రం చేశారు. అయినా తండ్రిని ఆమె లోనికి రానివ్వలేదు. చారిటీకి ఆస్తిఅలా భార్య, కూతురి ప్రవర్తన వల్ల జీవితాంతం నరకం అనుభవించారు దేవదాసు. దేవికను పెళ్లి చేసుకోవడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపపడ్డారు. తన గురించి పట్టించుకోనివారి కోసం ఆలోచించి సమయం వృథా చేయాలనుకోలేదు. అందుకే తన మరణానంతరం రూ.100 కోట్ల ఆస్తి ట్రస్టుకు చెందాలని వీలునామా రాశారు. ఇప్పుడిక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవిక తెలుగులో పెండ్లి పిలుపు, అన్నా చెల్లెలు, గాలిమేడలు, రక్త సంబంధం, మంగళసూత్రం, నిండు మనసులు, గండికోట రహస్యం, పాపం పసివాడు, శ్రృ కృష్ణాంజనేయ యుద్ధం, నిప్పులాంటి మనిషి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.చదవండి: సాయిపల్లవి వల్ల నా జీవితమే మారిపోయింది: మ్యూజిక్ డైరెక్టర్ -
పూటుగా తాగేసి ఫోన్లు ఎత్తకపోయేవాడిని.. నాకోసం సాయిపల్లవి..
విరాటపర్వం, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశాడు సురేశ్ బొబ్బిలి. లేటెస్ట్ హిట్ బాయిలోన బల్లిపలికే అనే జానపద పాటకు సైతం ఈయనే మ్యూజిక్ అందించాడు. అయితే తన కెరీర్ ఇక్కడివరకు రావడానికి హీరోయిన్ సాయిపల్లవి కారణం అంటున్నాడు.బ్యాక్గ్రౌండ్తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. మాది గౌరారం గ్రామం, మహబూబాబాద్ జిల్లా (ఉమ్మడి ఖమ్మం జిల్లా). అమ్మ పొలం గట్ల దగ్గర పాటలు పాడేది. నాన్న స్టేజీ ఆర్టిస్టు. మా అన్నయ్య నందన్ రాజు కూడా మ్యూజిక్ డైరెక్టర్. అన్న వేరేవాళ్లతో కలిసి పెట్టుకున్న స్టూడియోలో ఆఫీస్ బాయ్‌గా చేరాను. అక్కడే కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాను.కెరీర్ మార్చిన మూవీఆరు నెలల్లో అదే స్టూడియోలో ఇంజనీర్ అయ్యాను. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాను. అయితే మొదటగా మా అబ్బాయి మూవీ రిలీజైంది. వరుసగా నాలుగు శ్రీ విష్ణు సినిమాలే చేశాను. నా కెరీర్‌ను పూర్తిగా మార్చిన మూవీ విరాటపర్వం. అయితే ఆ మూవీ సమయంలో నాకు తాగుడు అలవాటు ఉండేది. ఫోన్లు ఎత్తేవాడిని కాదుఅమ్మానాన్న లేరు. అన్న చెప్పినా చెవికెక్కించుకునేవాడిని కాదు. నా లక్ష్యాన్ని చేరుకోగానే దారి తప్పాను. ప్రేమ- బ్రేకప్ వల్ల తాగుడుకు అలవాటుపడ్డా.. దర్శకుడు వేణు ఊడుగుల, సాయిపల్లవి (Sai Pallavi).. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. తాగిన మైకం దిగాక ఎందుకిలా చేస్తున్నానని ఏడ్చేవాడిని. చనిపోదామన్న ఆలోచనలు కూడా వచ్చేవి. రెండేళ్లపాటు నరకం అనుభవించాను.నన్ను పక్కనపెట్టి..విరాటపర్వం సినిమా సమయంలో నేను ఫోన్లు ఎత్తకపోయేసరికి వేరేవాళ్లకు మిగతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయమని చెప్పారు. అయితే అప్పటికే నేను బీజీఎమ్ అంతా రెడీ చేసి పెట్టాను. అది ఓసారి సాయిపల్లవి, రానా విన్నారు. వాళ్లు నేను ఇచ్చే మ్యూజికే కావాలన్నారు. అదే సినిమాను బతికిస్తుంది, వేరేవాళ్లతో చేయొద్దన్నారు.సాయిపల్లవి ఫోన్అప్పుడు సాయిపల్లవి నాకు ఫోన్ చేసి.. మీకేదైనా నేనున్నాను. మీరు ఏకాగ్రత పెట్టి పని చేయండి. ఆరోగ్య సమస్య లేదా వ్యక్తిగత సమస్యలేమైనా ఉంటే నేను చూసుకుంటాను. మీరు వెనక్కి తగ్గొద్దు, చక్కగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. అలా నెలరోజులపాటు కూర్చుని సినిమాలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేశాను.మందు జోలికి వెళ్లలేసినిమా రిలీజయ్యాక ఫస్ట్ మీకే మంచి పేరొస్తుంది.. చాలా బాగా సంగీతం అందించారు. మీకు మంచి కెరీర్ ఉంది. వేణుగారు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని వదిలేయండి.. మీకు మంచి భవిష్యత్తు ఉంది. చిన్నచిన్నవాటిని పట్టించుకోవద్దు అని సాయిపల్లవి సలహా ఇచ్చారు. అలా ఆమె సలహా వల్లే మద్యం మానేశాను. ఇంతవరకు మళ్లీ మందు జోలికి వెళ్లలేదు అని సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) చెప్పుకొచ్చాడు.చదవండి: తనూజపై గెలిచిన సుమన్.. టికెట్ టు ఫినాలే ఎవరిదో? -
నన్ను కాదు, వాళ్లను ఆరాధించండి: హీరో
కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవాలు మాత్రమే ప్రచారంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్‌లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటివారే ఇష్టంతనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్‌ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
దృశ్యం 3 షూట్ కంప్లీట్
హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ ఏడాది ‘దృశ్యం 3’ సినిమాను కూడా ప్రకటించారు మోహన్‌లాల్. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డిసెంబరు 2న ఈ’ సినిమా చిత్రీకరణ ముగిసిందని యూనిట్ సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా పేర్కొంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీరకణ పూర్తి కావడం విశేషం.ఇక ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కనుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్లో వెంకటేశ్, హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ నటిస్తారు. కాగా, ‘దృశ్యం 3’ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామన్నట్లుగా ఆ మధ్య దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.మరి... జీతూ జోసెఫ్ అనుకున్నట్లుగానే ‘దృశ్యం 3’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌లాల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’ ఈ డిసెంబరు 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మోహన్‌లాల్ హీరోగా నటించి, విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇంకా ‘దృశ్యం 3’ సినిమా తర్వాత రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట మోహన్‌లాల్. -
'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో
రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమా హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. దానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్. ఎందుకంటే 'కాంతార'లో పంజుర్లీ దేవతకు సంబంధించిన విషయాన్ని చూపించారు. దీన్ని రణ్వీర్ కామెడీ చేసేలా ప్రవర్తించడం విపరీతమైన విమర్శలకు దారితీసింది.ఏం జరిగిందంటే?కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజుర్లీ దేవతని ఆరాధిస్తుంటారు. 'కాంతార 1' రిలీజ్ టైంలోనే కొందరు సదరు దేవత తరహా వేషాలు వేసుకుని వచ్చారు. దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మూవీని గౌరవంగా చూడాలని, దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించకూడదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడేమో గోవా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్వీర్.. పంజుర్లీ దేవతని అవమానించేలా కామెడీ చేశాడు.(ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)ఈ కార్యక్రమానికి రిషభ్ శెట్టి హజరవగా.. స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.'సినిమాలో రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఆ సీన్లో ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని రణ్వీర్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే రణ్వీర్.. కర్ణాటకకు అల్లుడే. ఇతడు పెళ్లి చేసుకున్న దీపికది ఆ రాష్ట్రమే. కానీ ఇప్పుడు వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)Ranveer Singh literally mocking Daiva Chavundi possession in Kantara.How low these movie stars can go for fame, money with zero respect for sacred Tulunad Daivaradhane beliefs🥺Shame.Rishabh is enjoying that mimic?@RanveerOfficial @shetty_rishab pic.twitter.com/F4x0X2rVmA— Vije (@vijeshetty) November 29, 2025 -
భారీ బడ్జెట్ మూవీగా ద్రౌపది-2.. సాంగ్ రిలీజ్!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవలే ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రీసెంట్‌గానే విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. ఈ పాటక జిబ్రాన్ సంగీత అందించారు. ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయగా.. పద్మలత పాడారు. ఈ సాంగ్ హృదయానికి హత్తుకునేలా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
విజయ్‌కు సలహాలివ్వను: కమల్ హాసన్
హీరో విజయ్‌కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే నా శత్రువుతమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్‌కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.అదే గొప్ప గురువు2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్‌కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు. సినిమాఅనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్‌తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.చదవండి: నేడు సమంత పెళ్లి? బరి తెగించారంటూ ఆమె పోస్ట్ -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్.. నయనతారకు క్యూట్ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 18న 42వ వసంతంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీతారలు విషెస్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఈ ఏడాది తన పుట్టినరోజున తన పిల్లలు ప్రత్యేకంగా విష్ చేసినట్లు పోస్ట్ చేసింది. తన కవలలు ఉయిర్, ఉలగం రాసిన క్యూట్ కొటేషన్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే టూ బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్ అంటూ చిట్టి చేతులతో రాసిన పేపర్‌ను నయన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
దేవతను దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ హీరో
ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఇఫీ (అంతర్జాతీయ చలనచిత్రోత్సవ) వేడుకలు శుక్రవారం (నవంబర్ 28న) విజయవంతంగా ముగిశాయి. గోవాలో ఈ ముగింపు వేడుకకు కాంతార హీరో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సైతం హాజరయ్యాడు. కానీ అత్యుత్సాహంతో రణ్వీర్ చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?స్టేజీపై రణ్వీర్ మాట్లాడుతూ.. నేను కాంతార: చాప్టర్ 1 థియేటర్లో చూశాను. రిషబ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఆడ దెయ్యం అతడి శరీరంలో ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశం అయితే అమేజింగ్ అంటూ ఆ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే తనను కాంతార 3లో చూడాలనుకుంటే రిషబ్‌ను మీరే ఒప్పించండి అని ప్రేక్షకులను కోరాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక నటుడిగా స్టేజీపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది కూడా తెలీదా? దైవాన్ని పట్టుకుని దెయ్యం అంటాడేంటి? దేవతను కించరిచే హక్కు ఈయనకెక్కడిది? అని మండిపడుతున్నారు.కాంతార విశేషాలురిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. #RanveerSingh literally called chavundi mata a ghost and mimicked her in funny way Isn't this Blasphemy pic.twitter.com/iJ1bAjRCLs— Tyler Burbun (@BurbunPitt) November 29, 2025 చదవండి: ప్రకాశ్ రాజ్ భార్యగా ఛాన్స్.. ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు -
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్‌లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
ఐయామ్ ది గేమ్
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐయామ్ ది గేమ్’. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిదాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది.నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో రక్తంతో తడిసిన చేతితో గన్ పట్టుకున్న దుల్కర్ లుక్ ఓ స్టయిలిష్ క్యారెక్టర్లో ఈ హీరోని చూడబోతున్నామనే ఫీల్‌ని కలిగించేలా ఉంది. మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలుపోహిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
అన్నగారు పోలీసాఫీసర్
కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రానుంది. డిసెంబరులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు టీజర్‌ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.‘‘టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. కార్తీ, జ్ఞానవేల్ రాజాతో పాటు చిత్రయూనిట్‌కి అభినందనలు’’ అని అనిల్ రావిపూడి తెలిపారు. ‘‘యాక్షన్ కామెడీ కథతో రూపొందిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ మూవీలో కార్తీపోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు అతి పెద్ద పండగ ఏది అంటే సగటు సినిమా ప్రేక్షకుడు సైతం టక్కున సంక్రాంతి అని చెబుతాడు. చిత్రపరిశ్రమకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా అత్యంత ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఈ పండగ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. అయినప్పటికీ ఫలానా సినిమా బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బ్లాక్‌బస్టరే. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలుపోటీ పడుతుంటారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను నిలిపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ కోవలోనే 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరపోరు నెలకొంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు పండగకి విడుదల కానున్నాయి. మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు సైతం తెలుగు హీరోలతో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? ప్రేక్షకుల మనసులు గెలిచేది ఎవరు? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే సినిమా ఏది? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం... డబుల్ ఫెస్టివల్ 2026 సంక్రాంతికి అందరి హీరోల కంటే ముందుగా కర్చీఫ్ వేశారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ ΄్లాన్ చేసి, శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్రపోషిస్తున్నారు.అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ట్రేడ్ వర్గాల్లోనూ మంచి జోష్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. పైగా చిరంజీవి–వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రాజా సాబ్ ఫిక్స్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి రేసులో నిలిచింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి వాయిదా పడింది.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. అందుకే ‘ది రాజా సాబ్’ని జనవరి 9న విడుదల చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీపోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో పాటు తాజాగా విడుదలైన పాటకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంజయ్ దత్ ప్రత్యేకపోస్టర్కి కూడా మంచి స్పందన వచ్చింది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్, కామెడీ మూవీ కావడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘మా పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్రనిర్మాణ సంస్థ పేర్కొంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో వినోదం అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు... ఈ మూవీని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు తీసుకు రానున్నట్లు తెలిపారు. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించాను.గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను.. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.సున్నితమైన అంశాలను తనదైన భావోద్వేగాలతో తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఈ చిత్రం ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ్రపొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. నారీనారీ నడుమ మురారి హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2017లో ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన ఆయన ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మరోసారి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు శర్వానంద్. శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ (2023) వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ‘నారి నారి నడుమ మురారి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం వల్ల ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘శర్వానంద్ నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్‌పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే...’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచె కట్టుతో ఉన్న శర్వానంద్ లుక్‌ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెపొ్పచ్చు. అందుకే మా ‘నారి నారి నడుమ మురారి’తో కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు మరో హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జ్ఞానశేఖర్, యువరాజ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. అనగనగా ఒక రాజు... ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట విడుదల వేడుకని భీమవరంలో ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి పండగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా నవీన్ పొలిశెట్టి వేదిక వద్దకు ఎద్దుల బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నవీన్, మీనాక్షి కలిసి ‘భీమవరం బల్మా...’ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా ‘భీమవరం బల్మా...’ పాటతో నవీన్ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరింత విశేషం. ‘‘ఒక బైక్ ప్రమాదంలో గాయాలు కావడం వల్ల నేను కొంతకాలం షూటింగ్‌కి దూరమయ్యాను.ఆ సమయంలో ప్రేక్షకులకు ఎలా వినోదం అందించాలని ఆందోళన చెందాను. మీ అందరి ప్రేమ, అభిమానం వల్ల కోలుకొని ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ చేసి, పండగకు మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నారు.ఈ సంక్రాంతికి తెలుగు హీరోల మధ్యపోటీ తీవ్రంగా ఉంది. పాంచ్ పటాకా అంటూ ఐదుగురు హీరోలు సంక్రాంతి రేసులో నిలవనుండటం ఒక విశేషం అయితే... మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సంక్రాంతి ఎంత పెద్ద పండగో... తమిళ్లో పొంగల్ కూడా అంత పెద్ద ఫెస్టివల్. అందుకే విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తున్నాయి. ఈ సినిమాలు ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ⇒ తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి తమిళ చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ్రపొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయగన్’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘విజయ్ చివరి చిత్రంగా ‘జన నాయగన్’ రాబోతోంది. విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంటుంది. ఈ మూవీ విజయ్‌కి ఫేర్‌వెల్‌గా ఉండబోతోంది. ఆయన అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ⇒ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరాశక్తి’. ‘గురు, ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ఇతర ప్రధాన పాత్రలుపోషిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి సమర్పణలో ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రత్నమాల...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. శివ కార్తికేయన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ మెలోడీకి మంచి స్పందన వచ్చింది. జనవరి టు జూన్... ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 2024లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025లో ్రపారంభమైంది.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గడంతో పాటు పూర్తి స్థాయి గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసమే ఆయన ఈ లుక్‌లోకి మారారనే వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.ఇదిలా ఉంటే... తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో తొలుత ప్రకటించిన చిత్రం కూడా ఇదే. అయితే ఆ తర్వాత ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా విడుదల కాస్తా జనవరి నుంచి జూన్‌కి మారింది. – డేరంగుల జగన్ మోహన్ -
చీప్ పాత్రలు చేయను: రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, టచ్ చేసి చూడు.. ఇలా తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసింది హీరోయిన్ రాశీఖన్నా.. కానీ, ఈమధ్య తెలుగులో కంటే పరభాషా చిత్రాలతోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఏకైక మూవీ చేస్తోంది. హిందీలో 120 బహదూర్ మూవీతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది. అలాంటివాటికి నోఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. ఒక మెట్టు దిగి చీప్ పాత్రలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. దక్షిణాదిన నేను ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను. ఓ అడుగు ముందుకేసి హిందీలో బలమైన పాత్రల్నే చేయాలనుకున్నాను. కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ, దానికి కూడా లిమిట్ ఉంటుంది. దిగజారిపోయేలా ఉంటే మాత్రం..ఒక్కో యాక్టర్‌కు ఒక్కో రకంగా పరిమితులు ఉంటాయి. నావరకు వస్తే నన్ను చీప్‌గా చూపించే పాత్రలు చేసేందుకు నేను ఒప్పుకోను. ఆ పాత్ర నేను పెట్టుకున్న నిబంధనలను దాటడంతోపాటు, అందులో నేను మరింత దిగజారిపోయినట్లు కనిపిస్తానంటే మాత్రం వెంటనే నో చెప్పేస్తా.. అని రాశీ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో చివరగా 'తెలుసు కదా' సినిమాలో మెప్పించింది.చదవండి: బిగ్‌బాస్ 9: కెప్టెన్ కల్యాణ్ రిపోర్టింగ్ సర్! -
సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఏ ఓటీటీలో ఉందంటే?
సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటే వెబ్ సిరీస్‌లు ఇంకా ముందుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌ల నిర్మాణం అధికం అవుతోంది. అలా తాజాగా జీ 5 ఓటీటీ సంస్థ రేకై అనే వెబ్ సిరీస్ ముందుకు తీచ్చింది. ప్రముఖ నవలా రచయిత రాజేశ్ కుమార్ రాసిన క్రైమ్ నవల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఇది. ఈయన ఇంతకు ముందు రాసిన పలు క్రైమ్ నవలలు బహు ప్రాచుర్యం పొందాయి.అలా ఆయన తాజాగా రాసిన నవల ఆధారంగా రూపొందిన రేకై వెబ్ సిరీస్‌కు ఎం.దినకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.సింగారవేలన్ నిర్మించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌గా రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇంతకు ముందు పలు సినిమాలు, వెబ్ సిరీస్ రూపొందాయి. వాటికి భిన్నంగా ఉత్కంఠభరిత కథ, కథనాలతో రూపొందిన వెబ్ సిరీస్ రేకై . కథఒక ఐస్ ట్రక్ అనూహ్యంగా ప్రమాదానికి గురవుతుంది. దీంతో దాని డ్రైవర్ మృతి చెందుతాడు. అయితే ఆ ట్రక్‌లో ఓ మొండి చేయి బయట పడుతుంది. అది ఎవరిది? దాని వెనుక ఉన్న హంతకులు ఎవరన్న ఇన్వెస్టిగేషన్తో కథ మొదలవుతుంది. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అదే సమయంలో ఆ మొండి చెయ్యి రేఖలతో మరో ఆరుగురి రేఖలు కనుగొనబడతాయి. దీంతో కేసు విచారణ క్లిష్టంగా మారుతుంది. మరో పక్క డిపార్టెమెంట్‌లోనూ కొందరు ప్రముఖులు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరో పక్క మానవ అవయవాల రాకెట్ దందా పెద్ద స్థాయిలో జరుగుతోందనే విషయాన్ని పోలీస్ అధికారులు చేధించగలిగారా? లేదా? ఇలా పలు ఊహకు అందని సంఘటనలతో కథ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో బాలహాసన్, పవిత్ర జనని, బోపాలన్ ప్రగదీశ్, వినోదిని వైద్యనాథన్, శ్రీరామ్.ఎం, అంజలిరావ్, ఇంద్రజిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్‌తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్‌నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్‌కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్‌లో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్‌కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
కథ విన్నప్పుడే థ్రిల్ అయ్యాను: నటుడు ఉపేంద్ర
‘‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కథ విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు కాస్త టెన్షన్ గా అనిపించింది. నేనెలా ఆంధ్ర కింగ్ అవుతానని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్‌లా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ (ప్రేక్షకులు, అభిమానులను ఉద్దేశించి) గొప్పతనం’’ అని ఉపేంద్ర అన్నారు. రామ్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. మహేశ్‌గారు అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఆ హీరో అభిమాని మధ్య ఉన్న డివైన్ ఎమోషన్ ని చక్కగా చూపించారు. నా ఫ్యాన్ సాగర్ (సినిమాలో రామ్ పాత్ర), మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు’’ అన్నారు.‘‘ఈ చిత్రంలో రామ్, ఉపేంద్రగార్లు ఓ మ్యాజిక్ చేశారు. మంచి టీమ్‌తో పని చేసినప్పుడు వండర్స్ జరుగుతాయి. అలాంటి వండర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. నన్నో బ్రదర్‌లా చూసుకున్న నిర్మాతలు నవీన్ , రవిశంకర్‌గార్లకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను’’ అని తెలిపారు పి. మహేశ్‌బాబు. ‘‘ఈ చిత్రంలోని రామ్, ఉపేంద్రగార్ల కాంబినేషన్ సీన్స్, వారి నటన గురించి అభినందనలు వస్తున్నాయి. దర్శకుడిగా మహేశ్‌కి మంచి పేరు వచ్చింది. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా’’ అని అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ , మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్–మెర్విన్ మాట్లాడారు. -
వంద జన్మలైనా నటుడిగానే పుట్టాలనుకుంటున్నాను: రజనీకాంత్
‘‘సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కథలను సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో ఈ ఫెస్టివల్ ముగినట్లు కాదు... సృజనాత్మక ఆలోచనలు, ప్రపంచవ్యాప్త సినీ కళాకారుల సమ్మేళనానికి ఓ నిదర్శనం. ఇఫీలోని మరో కొత్త అధ్యాయానికి మరో ముందడుగు’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. గోవా వేదికగా ఈ నెల 20న మొదలైన ‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు శుక్రవారం (నవంబరు 28)తో ముగిశాయి. సినీ పరిశ్రమలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు రజనీకాంత్‌ని ఈ వేడుక చివరి రోజున గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సత్కరించారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ‘ఇఫీ’ వేడుకలను నిర్వహిస్తున్న గోవా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. సినిమాల్లో నాకు యాభై సంత్సరాలు పూర్తయ్యాయి. కానీ నాకు మాత్రం పదో–పదిహేనో సంవత్సరాలు పూర్తయినట్లుగా ఉంది. నటనను, సినిమాను ప్రేమిస్తున్నందువల్లే ఇలా అనిపిస్తోంది. నాకు వంద జన్మలున్నా నేను ప్రతి జన్మలోనూ నటుడిగానే, రజనీకాంత్‌గానే పుట్టాలనుకుంటాను. దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నిషియన్స్... ఇలా ఇండస్ట్రీతో పాటుగా నా జర్నీలో కూడా భాగమైన వారందరికీ నా ఈ 50 ఏళ్ల సత్కారం దక్కుతుంది’’ అని రజనీకాంత్ అన్నారు. భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లడమే ‘ఇఫీ’ లక్ష్యం. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీగారి నేతృత్వంలో ఈ ఏడాది మేలో తొలిసారిగా ‘వేవ్స్ – 2025’ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్) జరిగింది. ఇఫీలో ‘వేవ్స్ బజార్ –2025’ను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది రూ. 1000 కోట్ల బిజినెస్ జరిగిందని గర్వంగా చెప్పగలను. నరేంద్ర మోదీగారు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తారు. ఈ ఏడాది ‘ఇఫీ’లో మహిళా దర్శకులు తీసిన యాభై సినిమాలు ప్రదర్శితమయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి అందించే ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును వియత్నాం ఫిల్మ్ మేకర్ యాష్ మేఫెయిర్ డైరెక్ట్ చేసిన ‘స్కిన్ ఆఫ్ యూత్’ దక్కించుకుంది. ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు విభాగంలో కరణ్ సింగ్ త్యాగి (‘కేసరి చాప్టర్ 2’)కి దక్కింది. ఇక ‘ఇఫీ’ వేడుక చివరి రోజున ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ఇండియన్ పనోరమా విభాగం) స్క్రీనింగ్ అయింది. ఇందులో భాగంగా చిత్రనిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఇంకా రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నేడు(నవంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు. మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ(Revolver Rita Movie Story In Telugu). ఎలా ఉందంటే.. అనుకోకుండా హత్య చేయడం..ఆ శవాన్ని తరలించే ప్రయత్నం..ఈ క్రమంలో ఒక్కో ట్విస్ట్ బయటకు రావడం.. చివరకు ఈ హత్య వెనక కూడా ఓ రహస్యం ఉండడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రివాల్వర్ రీటా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ఓ హత్య చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరినీ విడిచి పెట్టదు.. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనే కోణంలో ఈ మూవీ కథనం సాగుతుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ పాయింట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ...తెరపై మాత్రం అది మిస్ అయింది. సినిమా చూస్తున్నంత సేపు దృశ్య 2 మొదలు మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు చాలా చిత్రాలు గుర్తుకువస్తాయి. కామెడీ అనుకొని రాసిన సన్నివేశాలు కూడా పెద్దగా పేలలేదు. ఉన్నంతలో రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ కాస్త నవ్వులు పంచారు. ఇక ట్విస్టులు అనుకొని రాసిన సన్నివేశాలు కూడా డార్క్ కామెడీ చిత్రాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈజీగా పసిగట్టగలరు. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ప్రారంభంలోనే పాండిచ్చేరి డాన్ పాండ్య- నర్సిరెడ్డి మధ్య వైర్యానికి గల కారణం ఏంటో చెప్పి.. కథను కామెడీ జానర్లోని మార్చేశాడు. రీటా ఫ్యామిలీ పరిచయ సీన్లతో పాటు..పాండ్య హత్యవరకు అన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. హత్య తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో వచ్చే చేజింగ్ సీన్లు.. బోరింగ్‌గా సాగుతాయి. ఒకటి రెండు చోట్ల రెడిన్ కింగ్స్లీ వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. అంతేకానీ సునీల్ సీన్లతో పాటు జాన్ విజయన్ సన్నివేశాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఈ తరహా కథలు చాలానే రావడం.. క్రైమ్, కామెడీ సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో.. ‘రివాల్వర్ రీటా’ తూట సరిగా పేలలేకపోయిందనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు.ఎవరెలా చేశారంటే.. టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్..మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కథలోనే కొత్తదనం లేకపోవడంతో.. ఆమె నటనలోనూ కొత్త కోణం ఏది కనిపించదు. రీటా తల్లి చెల్లమ్మగా నటించిన రాధిక శరత్ కుమార్.. అమాయకత్వపు పనులతో నవ్వులు పూయించింది. సునీల్ పాత్ర లుక్ చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. అది తెరపై కనిపించలేదు. జాన్ విజయన్ కూడా రొటీన్ పోలీసు పాత్రలో కనిపించాడు. రెడిన్ కింగ్స్లీ ఎప్పటి మాదిరే తనదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. బాత్రూం సీన్ ఒక్కటి బాగా వర్కౌట్ అయింది. సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఓకే. దినేష్ కృష్ణన్. బి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్. కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్‌లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్.. చివరి కెప్టెన్ ఎవరంటే? -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్‌హాసన్(Kamal Haasan) తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కొడుకు సమక్షంలో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి
ప్రముఖ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్‌తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్‌గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్లోనూ చేసింది. తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్)అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్లానే క్రికెట్‌ని కెరీర్‌లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Samyuktha Shanmughanathan (@samyuktha_shan) -
6 ఏళ్లకే నటిగా.. 19 ఏళ్ల వయసులో హీరోయిన్గా!
చిన్న వయసులో వెండితెరపై అడుగుపెట్టి తర్వాత హీరోయిన్గా రాణించినవారు చాలామంది ఉన్నారు. పైన కనిపిస్తున్న ఈ క్యూట్ పాప కూడా మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది. 20 ఏళ్లు కూడా నిండకముందే హీరోయిన్గా సినిమాలు చేసింది. ఇంతకీ తనెవరో గుర్తుపట్టారా? ఆ పాపే 'బుట్టబొమ్మ' అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). చైల్డ్ ఆర్టిస్ట్‌గా..ఈ మలయాళ కుట్టి బాలనటిగా యాక్ట్ చేసిన మొదటి చిత్రం 'కద తుదరున్ను'. అప్పుడు తన వయసు ఆరేళ్లే! విశ్వాసం సినిమాలో అజిత్- నయనతార కూతురిగా నటించింది. అప్పటినుంచి తనను కుట్టి నయనతార అని పిలుస్తూ ఉంటారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ, తమిళ భాషల్లో దాదాపు 15 సినిమాలు చేసింది. తెలుగులో ద ఘోస్ట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. 19 ఏళ్ల వయసులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా మారింది. కానీ, తర్వాత మళ్లీ తెలుగులో కనిపించనేలేదు. సినిమాలుమలయాళంలో ఓ మై డార్లింగ్, కింగ్ ఆఫ్ కొత్త.. తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం(తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా), ఇంద్ర, పీటీ సర్ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక మూవీ చేస్తోంది. యూట్యూబర్‌లో రెండు,మూడు షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. రెండేళ్ల క్రితం ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ వైరలయింది. అది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ అది రియల్ పోస్టర్ కాదు, రీల్ పోస్టర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ బుట్టబొమ్మ తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) చదవండి: హిట్టు మూవీ.. థియేటర్లలో ఫ్రీ టికెట్ -
కలిసిరాని సినిమాలు.. స్టార్ హీరోయిన్ అయ్యేదెప్పుడో?
కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్‌కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.బ్రేక్అయినా ప్రియాంక మోహన్‌ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. ఉపయోగపడని ఓజీపవన్కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఈ సినిమాలపైనే ఆశలుకాగా ప్రస్తుతం కెవిన్‌కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది. -
చిరు కంటే ఆయనే బెస్ట్ డ్యాన్సర్.. కీర్తి సురేశ్ క్లారిటీ.!
కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన కీర్తి సురేశ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించింది.ఈ ఈవెంట్లో కీర్తి సురేశ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు చిరంజీవి కంటే విజయ్ బాగా డ్యాన్స్ చేస్తారని అన్నారు.. అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలా మీరు ఎందుకు అనాల్సి వచ్చిందని ఆమెను ప్రశ్నించారు. దీనికి కీర్తి సురేశ్ స్పందించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. 'నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. కానీ నేను దళపతి విజయ్ సర్‌కు వీరాభిమానిని. చిరంజీవి సార్‌కు కూడా ఈ విషయం గురించి తెలుసు. నేను, మెగాస్టార్ గతంలో సెట్స్‌లో దీనిపై సరదాగా మాట్లాడుకున్నాం. ఆయన దానిని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. చిరంజీవి సర్‌పై నాకు చాలా గౌరవం ఉంది. అందుకే నాకు అనిపించింది చెప్పాను. కొన్నిసార్లు నాకు ఏమి అనిపిస్తుందో చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది.' అని అన్నారు.Here is the video of the interview. pic.twitter.com/X0ZbUTNXEa— MK (@MK_VOXX) November 26, 2025 -
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
సింగర్‌గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెరెమా. విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆమె దాదాపు సుపరిచితమే. ఈ ఏడాది మాస్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కవిన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఆండ్రియా పిశాచి-2 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రకటించి మూడేళ్లయినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్లో కనిపించే పోస్టర్‌పై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆండ్రియా.. ఆ వివాదస్పద సీన్ గురించి మాట్లాడింది. స్క్రిప్ట్ ప్రారంభంలోనే ఆ బోల్డ్ సీన్ చేర్చారని పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. ఈ చిత్రంలో ఎవరూ కూడా నగ్నంగా కనిపించరని పేర్కొంది. తనకు డైరెక్టర్ మిస్కిన్పై పూర్తి నమ్మకముందని.. ఆయన కథకు అవసరమైతేనే అలాంటి సీన్స్ పెడతారని వివరించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కానీ అవన్నీ నగ్నంగా మాత్రం ఉండవని చెప్పింది. ఆయన ఇప్పటికే పలువురు స్టార్ నటులతో సినిమాలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ డైరెక్టర్ ఆ సీన్ అవసరమని భావిస్తే అతని దృష్టి కోణం అది కాదని.. ఆ సీన్ వెనకాల కచ్చితంగా అర్థముంటుందని ఆండ్రియా చెబుతోంది. -
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. -
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
సడన్‌గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోషపడడు? మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak) కూడా అంతే.. ఓ ఇంటర్వ్యూ క్లిప్స్ వల్ల సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అయింది. తన ఫాలోవర్లు అమాంతం పెరిగారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 20 ఏండ్ల తర్వాత ఈరేంజ్ పాపులారిటీ చూసి గిరిజ సైతం షాకైపోయింది. ఏ మార్పూ లేదుఇదే మంచి తరుణంగా భావించి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, రియాలిటీలో అదేమీ జరగడం లేదు. పేరొచ్చింది కానీ అవకాశాలైతే రావడం లేదంటోంది. తాజాగా ద లాలన్టాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకేమీ ఎక్స్ట్రా సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి. గంటకు ఎంత?నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. వీళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్లైన్ చాటున నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు అని గిరిజ అసహనం వ్యక్తం చేసింది.సినిమాకాగా మరాఠి నటి గిరిజ ఓక్ 2004లో మానిని అనే మరాఠి సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, సైకిల్ కిల్, కాలా, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది. హిందీతో పాటు మరాఠి, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: కాస్త మర్యాద ఇవ్వండి.. బలుపుతో చెప్పట్లేదు: నిర్మాత -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మధ్య తరగతి అమ్మాయినిఅలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్‌ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అవమానంచిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు. -
శింబుకు విలన్‌గా?
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా ‘అరసన్’ (తెలుగులో ‘సామ్రాజ్యం’). కలైపులి ఎస్. థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. అయితే విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (తెలుగులో ‘నవాబు’) సినిమా తర్వాత శింబు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అలాగే వెట్రిమారన్ దర్శకత్వం వహించిన గత చిత్రం ‘విడుదలై’ తర్వాత ఆయన దర్శకత్వంలోని తాజా చిత్రం ‘అరసన్’లోనూ విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటిస్తుండటం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా సమంత, శ్రీలీల వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
తరగని ఉత్తేజం తారా లోక విహారం
గోవాలోని పంజిమ్‌లో 56వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నెల 20న ఆరంభమైన ఈ చిత్రోత్సవం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ ఉత్సవంలో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్లు ఉన్నాయి. ఈ చిత్రోత్సవానికి జపాన్ కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా, స్పెయిన్ ‘భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ‘స్పాట్లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి.తెలుగు చిత్రాల సందడి... పలు టాలీవుడ్ చిత్రాలకు ఈ చిత్రోత్సవంలో చోటు దక్కింది. నేడు (26వ తేదీ బుధవారం) ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను, 28న ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ప్రదర్శించనున్నారు. ప్రారంభ చిత్రాల్లో ఒకటిగా తమిళ చిత్రం ‘అమరన్’ చోటు దక్కించుకోగా, మరికొన్ని తమిళ, మలయాళ చిత్రాలను కూడా ప్రదర్శించారు. పనోరమా విభాగంలో 25 చలన చిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి.సినిమా... అంతకు మించి... ఈసారి చిత్రోత్సవంలో సినిమాల ప్రదర్శనతో పాటు మరెన్నో వైవిధ్యభరిత, ఆసక్తికరమైన కార్యక్రమాలకు చోటు కల్పించారు. కొత్త తరాన్నిప్రోత్సహించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం వంటి లక్ష్యాలతో వీటిని నిర్వహిస్తున్నారు. క్రియేటివిటీకి క్లాప్... చిత్రోత్సవాల్లో సినిమాల ప్రదర్శనతో పాటు నూతన తరాన్నిప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సీఎమ్ఓటి) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 128 మంది యువతీ యువకులు 48 గంటల చిత్ర నిర్మాణ ΄ోటీలో పాల్గొన్నారు. వీరిని 5 విభాగాలుగా విభజించి ΄ోటీ నిర్వహించారు. దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఎంపిక అవడం విశేషం. మాస్టర్ క్లాస్... సూపర్ హిట్... చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాస్‌లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుడు విధు వినోద్ చోప్రా నిర్వహించిన మాస్టర్ క్లాస్ ఆకట్టుకుంది. అందులో ఆయన పంచుకున్న జీవితానుభవాలు యువతను మేల్కొలిపేలా ఉన్నాయి. అలాగే చిత్రోత్సవాల్లో దాదాపు పూర్తి స్థాయిలో కనిపించిన మరో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సమర్పించిన మాస్టర్ క్లాస్ సినీరంగంలో రాణించాల్సిన వారికి ఉండాల్సిన ఓర్పు పట్టుదల అవసరాన్ని నొక్కి చెప్పింది. సెషన్స్... లెసన్స్... ‘ఇన్ –కన్వర్జేషన్ ’ పేరిట కీలకమైన అంశాలపై సాగుతున్న పలు చర్చలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సుహాసిని, ఖుష్బూ నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అలాగే సినిమా రంగంలో మహిళల అంశంపై దేశ విదేశీ ప్రముఖులు సాగించిన చర్చ కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉండి, ఆకట్టుకుంది. ఏఐ ఫెస్ట్... రేపటికి మస్ట్... ఇఫీలో తొలిసారిగా ‘సినిమాఏఐ హ్యాకథాన్’ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సినిమాటిక్ సృజనాత్మకథ కలయికలో హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఫిల్మ్‌లు ప్రదర్శిస్తున్నారు. ఇఫీస్టా... మరోవైపు ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ‘ఇఫెస్టా’ సాంస్కృతిక సంబరం ఏర్పాటైంది. ఇది సంగీతాభిమానులను తనివి తీరా ఆనందింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలు.. వంటివి ఉంటున్నాయి. ‘బాటిల్ ఆఫ్ బాండ్స్’ (భారతీయ, అంతర్జాతీయ బ్యాండ్స్) మరో ఆకట్టుకునే కార్యక్రమం. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన కళాబృందాల్లో మన తెలంగాణ నుంచి గుస్సాడీ నృత్య కళాకారుల బృందం కూడా ఒకటి. అలలోత్సవం... వేవ్స్ బజార్... మారియట్ హోటల్ వేదికగా నిర్వహిస్తోన్న వేవ్స్ బజార్ పెద్ద సంఖ్యలో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది. ఈప్రాంగణంలో రోజూ పదుల సంఖ్యలో సినిమాల ప్రదర్శనతో పాటు స్టార్టప్స్ వేదికలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనలు... ఇంకా మరెన్నింటికో చోటు కల్పించారు. ఎన్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఈవెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్ + టెక్‌ను కలిపే ఉద్దేశంతో స్టార్ట్–అప్ – ఇన్నోవేషన్‌ను కలుపుతూ వేవ్ ఎక్స్ అనే జోన్ కూడా ఏర్పాటు చేశారు. సెలబ్రిటీకి రైట్ రైట్... రెడ్ కార్పెట్.. సినిమాల ప్రదర్శన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై సినీ సెలబ్రిటీలు వాక్ చేస్తున్నారు. ఆ సందర్భంగా వీరు సందర్శకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అతిర«థ మహారధుల వంటి సినిమా ప్రముఖులు కనపడుతుండడంతో ఔత్సాహిక రూపకర్తలకు అభిమానులకు అవధుల్లేని ఆనందం కలుగుతోంది. ప్రత్యేక ఆకర్షణలు...ఇఫీలో ఆహుతులను ఆకట్టుకుంటున్న అనేక ప్రదర్శనల్లో కొన్ని మరింత విశేషంగా అనిపిస్తున్నాయి. వాటిలో.. ∙‘షోలే’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో వినియోగించిన బైక్‌ను ఈ ఈవెంట్లో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆహుతులు ఆ బైక్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ∙కళా అకాడమీలో ఏర్పాటైన కెమెరా ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. అక్కడ వందల సంఖ్యలో కొలువుదీరిన అనేక కెమెరాల్లో శతాధిక వయస్సు ఉన్నవి కూడా ఉండడం విశేషం. పలు కెమెరాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మహారాష్ట్రకు చెందిన సర్వేష్ అనే కెమెరాల సేకర్త ఈ ప్రదర్శనను సమర్పిస్తున్నారు. ఆహుతులు పెద్ద సంఖ్యలో ఈ కెమెరాలను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ⇒ప్రాంగణంలో నెలకొల్పిన అనేక స్టాల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాంకేతిక ప్రగతికి చిహ్నంగా కనిపించే అనేక విశేషాలను ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. పైగా యువతను ఆకట్టుకునేలా అప్పటికప్పుడు గెలు΄ోటముల్ని తేల్చేసే టెక్ గేమ్స్ నిర్వహిస్తుండడంతో యువత పెద్ద సంఖ్యలో గుమి కూడుతోంది. పంజిమ్‌లోని పీబీబి సెంటర్, ఐనాక్స్ థియేటర్ప్రాంగణం, కళా అకాడమీ, మారియట్ హోటల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియం... తదితర ప్రదేశాల్లో ఇఫీ విస్తరించింది. ఈ దఫా ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్స్‌కు కూడా చోటు కల్పించడం మరో విశేషం. వందల సంఖ్యలో ఈవెంట్లు ఆకర్షణలు, విశేషాలతో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ఆహుతులను ఆకర్షిస్తోంది. మరో 2 రోజుల్లో ముగియనున్న ఇఫీ... మరో ఏటా తన కోసం వేచి చూసేవారి సంఖ్యని ఈ ఏడాది కార్యక్రమాలతో మరింతగా పెంచుకోనున్నదని చెప్పవచ్చు. – సత్యబాబుదక్షిణ కొరియా ఎంపీ జేవాన్ కిమ్ మన వందే మాతరంను అత్యంత శ్రావ్యంగా గానం చేయడం గోవాలో జరిగిన వేవ్స్ ఫిల్మ్ బజార్ప్రారంభ వేడుకలో హర్ష ధ్వానాలు అందుకుంది. ఒక విదేశీయురాలు ఇంత అందంగా పాడగలగడం చూడటం గొప్ప విషయం అని పలువురు అతిథులు అభినందనలు కురిపించారు.భానుమతి శత జయంతుత్సవాలు... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరిలతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత నటి స్వర్గీయ పి. భానుమతి శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ‘మల్లీశ్వరి’ని చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఫెస్టివల్లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుప్రారంభ వేడుకలో టాలీవుడ్ నటుడు బాలకృష్ణను సన్మానించారు. ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సన్మానించనున్నారు అలాగే ఆయన సినిమాలు లల్ సలామ్, జైలర్’ లను చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు. -
శ్రీలీల- శివకార్తికేయన్ పరాశక్తి.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రత్నమాల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
జన నాయగణ్ భారీ ఈవెంట్.. ఒక్క టికెట్ అన్ని లక్షలా?
పొలిటికల్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయాల్లోకి వచ్చేముందు ఈ మూవీనే తన కెరీర్లో చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా విదేశాల్లో నిర్వహిస్తున్నారు. మలేసియాలో ఈ బిగ్ ఈవెంట్ జరగనుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా. ఈ భారీ ఈవెంట్లో గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లిడించారు.తమ అభిమాన హీరో బిగ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కు భారీ డిమాండ్ ఉండడంతో టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఈ టికెట్ బుకింగ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో సైంధవి, టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమా ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర, యోగి బి, విజయ్ యేసుదాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు
స్వతహాగా తమిళ అమ్మాయి అయిన నివేదా పేతురాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. వాటిలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో ఉన్నాయి. ఈ ఏడాది తన ప్రియుడి గురించి బయటపెట్టింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేనట్లు ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే వీధి కుక్కల గురించి మాట్లాడుతూ నివేదా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.చెన్నైలో సోమవారం.. వీధి కుక్కల సంరక్షణ కోసం కొందరు ర్యాలీ చేశారు. దీనిలో నివేదా పేతురాజ్ కూడా పాల్గొంది. తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే కుక్క కాటుని అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అదేమంత పెద్ద విషయం కాదని చెప్పింది. దీంతో కొందరు ఈమెని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈమెని దారుణంగా విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)'కుక్క కాటుని మనం పెద్దదిగా చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించకూడదు. మన కళ్లముందే చాలా క్రూరమైన ఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఒక్కరూ మాట్లాడరు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ చాలా ప్రమాదకర వ్యాధి అనేది నిజం. కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు.. పరిష్కారం ఏంటో ప్రజలకు నేర్పించాలి. వీధి కుక్కల్ని చంపడం పరిష్కారం కాదు' అని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.అయితే నివేదా.. కుక్క కాటుని చాలా తక్కువగా చేస్తోందని, ఓసారి వీధి కుక్కలు ఉండేచోట కారులో కాకుండా నడుచుకుని తిరిగితే అప్పుడు సమస్య ఏంటో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె త్వరలో దుబాయికి చెందిన బిజినెన్మ్యాన్ని పెళ్లి చేసుకోనుంది. తర్వాత ఈమె మన దేశంలో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఈ విషయాన్ని కూడా గుర్తుచేస్తున్న పలువురు నెటిజన్లు.. ఈమెని ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)If a dog bites you, don't make a big deal out of it and create fear. — #NivethaPethurajpic.twitter.com/OFFw5YpQT2— Filmy Bowl (@FilmyBowl) November 24, 2025 -
పూరీసేతుపతి పూర్తి
‘పూరీసేతుపతి’ సినిమా షూటింగ్ పూర్తయింది. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పూరీసేతుపతి’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ ప్రధానపాత్రల్లో నటించారు.ఛార్మీ కౌర్ సమర్పణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
వీరిద్దరి కాంబో సూపర్ హిట్.. మరోసారి గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.చెన్నైలో ఓ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.కాగా.. అజిత్ కుమార్ ఈ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది. -
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్ -
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.లవ్ ఫెయిల్యూర్సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్‌తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు -
పోయి ముఖం కడుక్కుపో.. కమల్ వ్యాఖ్యలతో షాక్!
గోవాలో ఇఫీ (అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఖుష్బూ (Kushboo).. గతంలో కమల్ హాసన్‌తో తనకు ఎదురైన ఓ సంఘటనను గురించి చెప్పుకొచ్చింది. వీరిద్దరూ మైకేల్ మదన కామరాజు (Michael Madana Kama Rajan Movie) అనే క్లాసిక్ మూవీలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను ఖుష్బూ తాజాగా గుర్తు చేసుకుంది.బాగా రెడీ అయి వెళ్తే..'మైకేల్ మదన కామరాజు సినిమా సెట్‌కు నేను బాగా రెడీ అయి వెళ్లాను. హెయిర్ స్టైల్ చేసుకుని, ఐ షాడో పెట్టుకుని.. ఫుల్ మేకప్‌తో వెళ్లా.. నేను సెట్లో అడుగుపెట్టానో లేదో.. నన్ను చూడగానే కమల్ హాసన్ (Kamal Haasan) ఓ మాటన్నాడు. వెనకాల వాష్‌రూమ్ ఉంది. వెళ్లి ముఖం కడుక్కుని రాపో అన్నాడు. ఆ మాట విని షాకయ్యా.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అనిపించింది. అర్థం చేన్నా..అంతలోనే కమల్.. నీ ముఖంపై కొంచెం కూడా మేకప్ ఉండకూడదు. నా షాలిని (మైకేల్ మదన కామరాజు మూవీలో హీరోయిన్ పాత్ర) సినిమాలో మేకప్ లేకుండానే ఉంటుంది అన్నాడు. ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వెంటనే ముఖం కడుక్కుని మేకప్ తీసేశాను. ఆ తర్వాతే మాపై సీన్లు చిత్రీకరించారు. ఇక్కడ కమల్ సినిమాలో సహజత్వం కోరుకున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి' అని చెప్పుకొచ్చింది.కమల్ సినిమాలో ఐటం సాంగ్?ఇకపోతే ఇటీవల రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని ప్రకటించారు. ఈ మల్టీస్టారర్‌కు ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. కానీ, రెండురోజులకే ఆ మూవీ తాను డైరెక్ట్ చేయడం లేదన్నాడు సుందర్. ఖుష్బూను ఐటం సాంగ్ చేయమని డిమాండ్ చేశారని, అందుకే ఆమె భర్త సినిమా నుంచి తప్పుకున్నాడంటూ ట్రోలింగ్ జరిగింది. ఖుష్బూ కౌంటర్అలాంటి ఓ పోస్ట్‌కు ఖుష్బూ స్పందిస్తూ.. నన్ను ఐటం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో! అని కౌంటరిచ్చింది. సుందర్ మంచి కథ ఇవ్వకపోవడం వల్లే ఆయన పక్కకు తప్పుకున్నారన్న ప్రచారమూ జరిగింది. దాన్ని కూడా ఖుష్బూ తోసిపుచ్చింది. ఈ నిరాధారమైన వార్తలు బయటకు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇకపోతే కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీ-కమల్ మూవీ రానుంది.చదవండి: 23 ఏళ్లుగా సహజీవనం.. 47 ఏళ్ల వయసులో పెళ్లి -
సిక్స్‌ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్కు తయారయ్యారు. ఫుల్ వర్కవుట్స్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Raghavendra Mahat (@mahatofficial) -
అప్పుడు ముంబై వదిలేద్దామనుకున్నా!: అనుపమ్ ఖేర్
‘‘సారాంశ్’ (1984) చిత్రంలో నాకు ప్రధాన పాత్ర (బీవీ ప్రధాన్) చేసే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఆ పాత్ర నాకు దక్కే పరిస్థితి కనిపించలేదు. ఆ సమయంలో నేను తీవ్రంగా కుంగిపోయాను. ఆ పాత్ర కోసం దాదాపు ఆరు నెలలు సమయం కేటాయించాను. అయితే బీవీ ప్రధాన్ క్యారెక్టర్ నాకు దక్కేలా లేదని తెలిసినప్పుడు ఏర్పడిన నిరాశ నన్ను బాగా కుంగదీసింది. ఆ నిరాశ నన్ను ముంబై వదిలేద్దాం అని నిర్ణయించుకునేలా చేసింది’’ అని బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనుపమ్ ఖేర్ ‘ఇఫీ’ వేదికపై ఎంతో భావోద్వేగంగా గతం తాలూకు తన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ‘గివింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ఛాయిస్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సెషన్లో అనుపమ్ ఖేర్ పాల్గొన్నారు. అప్పుడు ‘సారాంశ్’ గురించి గుర్తు చేసుకున్నారు. అయితే బీవీ ప్రధాన్ పాత్ర తనకు దక్కేలా లేదని తెలిసిన తర్వాత చివరిసారిగా ఆ చిత్రదర్శకుడు మహేశ్ భట్‌తో మాట్లాడి, వెళ్లిపోదామనుకున్నారట అనుపమ్ ఖేర్.అదే ఆయన జీవితాన్ని మార్చింది. ఆ విషయం గురించి అనుపమ్ ఖేర్ చెబుతూ – ‘‘చివరిసారిగా మహేశ్ భట్‌ను కలవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన నా ఆవేదనని అర్థం చేసుకున్నారు. ఆ పాత్ర కోసం నేను ఆరు నెలలు వెచ్చించడం, సినిమాపై నాకున్న శ్రద్ధ, గౌరవాలను గుర్తించి బీవీ ప్రధాన్ పాత్రను నాతోనే చేయించారాయన. కాబట్టి అందరికీ నేను చెప్పేదొక్కటే... ఆశను ఎప్పుడూ వదులు కోవద్దు’’ అంటూ ‘మాస్టర్ క్లాస్’లో ఆయన స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.ఇదో అనూహ్యమైన అనుభవం – నటి–నిర్మాత నిహారిక ‘ఇఫీ’ వేడుకల్లో నటి–నిర్మాత నిహారిక సందడి చేశారు. తాను నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిత్రదర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నామినేషన్ దక్కడం తనకు ఆశ్చర్యానందాన్ని కలిగిస్తోందనీ, ఇదొక అసాధారణమైన అనుభవం అనీ నిహారిక పేర్కొన్నారు.ఇంకా చిత్రోత్సవాలకు హాజరైన ఇతర భాషలవారితో ‘సినిమా’ గురించిన విశేషాలను చర్చించారు. ఈ వేడుకల్లో పలు దేశ విదేశీ చిత్రాల ప్రదర్శనలు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిత్ర ప్రదర్శనలు జరిగే చోట భారీ క్యూలు కనిపించాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
మలయాళ బ్యూటీ పార్వతి ఆర్ కృష్ణ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ లగ్జరీ కారు స్కోడాను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్తతో పాటు ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారును ఇంటి తీసుకొచ్చింది.కాగా.. పార్వతి ఆర్ కృష్ణ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. సెలబ్రిటీ కపుల్ గేమ్ షో సూపర్ జోడిలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. మలయాళ ఇండస్ట్రీలో యాంకర్‌గా, నటిగా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో 'వర్షంగల్కు శేషం' చిత్రంలో చిన్న పాత్రతో ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమె 'ఏంజెల్స్', 'మాలిక్', 'కడిన కదోరమీ అందకదహం' వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా కుంచకో బోబన్ నటించిన గర్ర్ అనే మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
హ్యాపీ బర్త్‌డే లవర్.. శోభిత లవ్లీ విషెస్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitaya Akkineni) బర్త్‌డే నేడు (నవంబర్ 23). తన 39వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అర్ధాంగి, హీరోయిన్ శోభిత (Sobhita Dhulipala) కూడా భర్తకు ఆన్లైన్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేసింది. భర్తను ప్రియుడిగా..హ్యాపీ బర్త్‌డే లవర్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఇద్దరూ ఓ చోట ఆగిపోగా.. చై ప్రేమగా భార్యకు స్వెటర్ తొడిగాడు. ఇది చూసిన జనాలు భార్యంటే ఎంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చై జర్నీ జోష్‌తో మొదలైంది. రెండో సినిమా ఏ మాయ చేసావెతో మంచి హిట్టందుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లు తిరిగేసరికి పెద్దలను ఒప్పించి సామ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్బయట చాలా చలాకీగా, ఖుషీగా కనిపించే ఈ జంట మధ్య రానురానూ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై-శోభితతో ప్రేమలో పడ్డాడు. సోషల్ మీడియాలో మొదలైన చాటింగ్ ప్రేమకు దారి తీసింది. అలా మరోసారి పెద్దలను ఒప్పించి చై-శోభిత 2024 డిసెంబర్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సమంత.. ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: సినిమా కొనేందుకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే! -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
అదృష్టం కాదు... అంకితభావం ఉండాలి
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఓ వర్క్ షాప్ సందేశాత్మక సంభాషణకు వేదికైంది. ప్రముఖ తారలు సుహాసిని–ఖుష్బూ ఈ వర్క్‌షాప్‌లో తమ అనుభవాలు, అబీప్రాయాలు, నటనలో మెళకువలను పంచుకున్నారు. తన ప్రశ్నలు తానే వేసుకుని తానే సమాధానాలు చెప్పడం ద్వారా సుహాసిని ఆసక్తిని పెంచగా, ఖుష్బూ తన అనుభవాలను పంచుతూ, హాజరైనవారిని అలరించారు. సంపూర్ణంగా అంకితం కావాలి... నటన అంటే ఏ కేటగిరీ అయినా సంపూర్ణ అంకితభావం తప్పనిసరి అని వీరిద్దరూ స్పష్టం చేశారు. ‘‘పారలల్ సినిమా–కమర్షియల్ సినిమా అని తేడా లేదు. ఏ సినిమా కైనా పని తీరు మాత్రం ఒకటే’’ అని ఖుష్బూ స్పష్టం చేశారు. చిత్రకళ, కెమెరా టెక్నిక్‌లలో శిక్షణ పొందిన సుహాసిని సాంకేతిక అంశాలపై సూచనలు ఇచ్చారు. ‘‘ఐ లైన్స్, టైమింగ్, కెమెరా ఎలా పని చేస్తాయో తెలుసుకోండి. కెమెరాను ఎలా డీల్ చేయాలో నేర్చుకోండి. రియలిజయ్ కూడా ఓ స్థాయి దాటకూడదు’’ అని సూచనలు చేశారు. నటీనటులు సంభాషణలను ఎప్పుడూ తమ స్వభాషలో నేర్చుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తమ తరానికి చెందిన క్రమశిక్షణను నేటి యువతకు చెప్పారు. ‘‘15 నిమిషాల్లో మేకప్ పూర్తి చేయడం, సమయాన్ని గౌరవించడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలి’’ అని ఖుష్బూ తెలిపారు.సుహాసిని తనకు ఎదురైన తొలి వైఫల్యం గురించి చెప్పిన విషయం ప్రేక్షకుల నుంచి చప్పట్లను అందుకుంది. ‘‘నా తొలి తెలుగు సినిమా (కొత్త జీవితాలు) సూపర్ ఫ్లాప్. కానీ 100 తెలుగు సినిమాలు చేశాను. అదృష్టాన్ని కాదు... నిరంతర కృషినే నమ్మాలి... విజయానికి మూలం అదే అన్నారు. ‘‘యాక్షన్–కట్ మధ్యలోనే జననం–మరణం అన్నట్టు ఉంటుంది’’ అన్నారు సుహాసిని. ‘మీలోని చిన్నప్పటి నటì ఇప్పుడు మీకు ఎదురైతే మీరు ఏం చెప్పాలనుకుంటారు?’ అన్న ప్రేక్షకుల ప్రశ్నకు ‘‘ఇంకా కొంచెం బాగా చేయమని చెబుతాను’’ అని ఖుష్బూ చెప్పగా, ‘‘నేను కొన్ని అర్థం చేసుకోవడంలో నా చిన్నప్పటి స్థితి చూసి సిగ్గుపడతాను. స్వేచ్ఛగా ఉండమని చెబుతాను’’ అన్నారు సుహాసిని. ఇక ఓపాటకు ఖుష్బూ పెదాలు కదపగా, శాస్త్రీయ అభినయంతో సుహాసిని ఆకట్టుకున్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
డ్రీమ్ థియేటర్లో ప్రియాంక
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, ధనంజయ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో డా. వైశాఖ్ జె. గౌడ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకా మోహన్ని ఖరారు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్.ఈ సందర్భంగా ప్రియాంకా మోహన్ మాట్లాడుతూ–‘‘శివ రాజ్‌కుమార్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగం కావడంతో నా కల నిజమైంది. ప్రతిభావంతులైన ధనంజయతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
వినోదాల కనువిందు
ఈ ప్రపంచమే నిశ్శబ్దండిసెంబరు తొలి వారంలో ముందుగా ‘అఖండ 2: తాండవం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ‘‘కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి..’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘అఖండ 2: తాండవం’ సినిమా ట్రైలర్. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ చిత్రం రూపొందింది. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలోని ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో ‘‘ఎనిమిది కంఠాలు తెగాలి... రక్తం చిందాలి, నేను చని పోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది..., ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం... ఈ దేశంలో మీరు ఎటు చూసినా కనిపించేది ఒక ధర్మం... సనాతన హైంధవ ధర్మం..., దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు... దేవం జోలికి వస్తే మేం ఖండిస్తాం... మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్.., ఇప్పటివరకు ప్రపంచపటంలో నా దేశం రూపాన్ని చూసి ఉంటావ్... ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవ్... మేం ఓసారి లేచి శబ్దం చేస్తే... ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి.సమయంతో పోరాడే కథ శర్వానంద్ హీరోగా నటించిన మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా ‘బైకర్’. 1990–2000 మధ్య కాలంలో సాగే ఈ చిత్రం మూడు తరాల నేపథ్యంలో ఉంటుంది. ఈ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్‌లో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమాలోని లుక్ కోసం శర్వానంద్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని సన్నబడ్డారు. స్పోర్ట్స్ అంశానికి కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది.మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ–ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ‘బైకర్’ ఫస్ట్ల్యాప్ పేరిట ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ, ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరి దాకా పోరాడటం గొప్ప’ అనే డైలాగ్స్ ఈ గ్లింప్స్‌లో ఉన్నాయి.ఫారెస్ట్ లవ్‌స్టోరీ రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటించగా, వైవా హర్ష ఓ కీలకపాత్రలో నటించారు. ఓ అమ్మాయి ప్రేమకోసం ఓ అబ్బాయి ఫారెస్ట్‌లో ఎలాంటి సాహసాలు చేశాడు? తన ప్రేయసి కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు? అన్నది ‘మోగ్లీ 2025’ సినిమాలో చూడొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘మోగ్లీ 2025 వరల్డ్, మోగ్లీ 2025 టీజర్’లను రిలీజ్ చేశారు మేకర్స్. శంబాల ప్రపంచం క్రిస్మస్ ఫెస్టివల్‌కి ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆది సాయికుమార్. ఈ మిస్టికల్ థ్రిల్లర్ సినిమాను యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్ధం ఈ కథకి మూలం, అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి, వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు... విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం’.., ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం... మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’... వంటి డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రకథ ప్రధానంగా ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుందని, దుష్టశక్తులు, దైవం, సైన్స్ వంటి అంశాల మేళవింపుతో కథనం సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథనం విభిన్న కాలమానాల్లో సాగుతుందని తెలిసింది.చాంపియన్ ప్రేమకథ రోషన్ మేకా (ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చాంపియన్’. ఈ చిత్రంతో అనస్వర రాజన్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మ్యాన్, ఫుట్‌బాలర్ మైఖేల్ సి. విలియమ్స్‌గా రోషన్ కనకాల నటించారు. మైఖేల్ ఎంతటి ప్రతిభావంతుడైన ఫుట్‌బాల్ ప్లేయర్ అంటే అప్పట్లో ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం అతనికి లభిస్తుంది.కానీ అతని ధ్యాస అంతా తన ప్రేయసి చంద్రకళ (అనస్వర రాజన్పాత్ర పేరు) పైనే. మరి... చంద్రకళతో మైఖేల్ ప్రేమకథ ఏమైంది? అన్నది క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబరు 25న థియేటర్స్‌లో చూడాల్సిందే. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ‘‘హిస్టరీ, స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టోరీ, భావోద్వేగాలు, యుద్ధం వంటి అంశాలతో ‘చాంపియన్’ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అని ఇటీవల ఈ సినిమా గురించి యూనిట్ పేర్కొంది.యూత్‌ఫుల్ యుఫోరియా యూత్‌ఫుల్ ‘యుఫోరియా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్ ప్రధానపాత్రధారులుగా నటించిన సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇటీవల ప్రకటించింది.నేటి యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ ‘యుఫోరియా’ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉందని యూనిట్ పేర్కొంది. కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాశ్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇక ‘ఒక్కడు’ (2003 – ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరో) చిత్రం తర్వాత భూమిక చావ్లాతో కలిసి దర్శకుడు గుణశేఖర్ రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ‘యుఫోరియా’ సినిమాకు కలిసి పని చేయడం విశేషం. పతంగుల పోటీ పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. వంశీ పూజిత్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్ ప్రధాన తారలుగా ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలకపాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కూడా క్రిస్మస్ సందర్భంగానే డిసెంబరు 25 రిలీజ్ కానుంది. ఈ సినిమా కథే మెయిన్ హీరో అని, థియేటర్స్‌లో ఈ ‘పతంగ్’ సినిమా యూత్‌కి ఓ యూత్ ఫెస్టివల్‌గా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. కులవ్యవస్థపై దండోరా అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్రవర్ణాలకు ఎవరైనా ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతాయనే అంశాల నేప థ్యంలో రూపొందిన సినిమా ‘దండోరా’. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, మోనికా రెడ్డి ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. మురళీ కాంత్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ‘తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ‘దండోరా’ ను తెరకెక్కించామని, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ డిసెంబరు నెలలో రిలీజ్ కానున్న సినిమాలు, రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ డిసెంబరు నెలలో డబ్బింగ్ సినిమాలు కూడా గట్టిగానే సందడి చేయనున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్ వేద్దాం...⇒ కార్తీ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించగా, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ ‘వా వాత్తియార్’ మూవీకి తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ యాక్షన్ కామెడీ కథకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ పతాకంపై కె. ఇ. జ్ఞానవేల్ రాజా ఈ నిర్మించారు. కాగా, ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇటీవల ప్రకటించింది. గతంలో ఈ ‘వా వాత్తియార్’ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్లో మార్పు ఉంటుందని, డిసెంబరు 12న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రావచ్చని కోలీవుడ్ టాక్. ⇒ ‘లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, డ్యూడ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ప్రదీప్ రంగనాథన్. ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, నయనతారతో కలిసి లలిత్‌కుమార్ నిర్మించారు. కృతీ శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీ జీ కిషన్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 18న రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ ‘ఎల్.ఐ.కే’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ పండగ సందర్భంగానే ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో సినిమా ‘డ్యూడ్’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఎల్.ఐ.కే’ సినిమాను రిలీజ్ వాయిదా వేయక తప్పలేదు. ⇒ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లోని ‘అవతార్’ సిరీస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అవతార్:ఫైర్ అండ్ యాష్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబరు 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్‌లాంగ్, ఊనా చాప్లిన్, కేన్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జాక్ చాంపియన్ వంటి హాలీవుడ్ నటులు ఈ ‘అవతార్ 3’ చిత్రంలో నటించారు. జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు ఓ నిర్మాతగా ఉన్నారు. జూన్ ల్యాండో ఈ సినిమాకు మరో నిర్మాత. ⇒ మోహన్‌లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమాను దీపావళికి, ఆ తర్వాత నవంబరు 6న రిలీజ్ చేయాలని ΄్లాన్ చేశారు. కానీ వీలుపడలేదు. అయితే ఇటీవల ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు. తండ్రీ కొడుకుల ఎమోషన్, మానవ అనుబంధాల మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. వీటితోపాటు ఈ నెలలోనే మరికొన్ని ఇతర భాషల చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్‌ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్‌లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్‌సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్‌తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్ -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) బిజీ యాక్టర్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. ఈ ఏడాదైతే ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాల్లో కనిపించాడు (ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, కన్నప్ప, హృదయపూర్వం). ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్, రామ్ వంటి పలు సినిమాలు చేస్తున్నాడు.హీరో కోసం 80 ఏళ్ల వృద్ధురాలుదృశ్యం 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళలోని అయిమురిలో ఓ చర్చి దగ్గర ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ విషయం తెలిసి ఓ 80 ఏళ్ల వృద్దురాలు అక్కడికి చేరింది. కొత్తగా కొన్న చీర కట్టుకుని మనవడు శ్యామ్‌ను వెంటేసుకుని లొకేషన్లో అడుగుపెట్టింది. కానీ జనం రద్దీ అధికంగా ఉండటంతో లోనికి ఎవరినీ అనుమతించలేదు. అందరూ దూరం నుంచే మోహన్‌లాల్‌ను చూసి సంతోషించారు. అయినా లీలామణి అమ్మకు తృప్తి తీరలేదు.మహిళా అభిమానిని కలిసిన మోహన్లాల్చూశాకే తిరిగెళ్తా!ఆయన్ను కచ్చితంగా దగ్గరినుంచి చూసి తీరాల్సిందేనని భీష్మించుకుంది. ఆయన్ను కలిసేవరకు తిరిగి వెళ్లే ప్రసక్తేలేదని మొండిగా కూర్చుంది. ఈ విషయం హీరో చెవిన పడింది. సాయంత్రం ఐదు గంటలకు లీలామణి అమ్మను కలిశాడు. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఇంట్లో అందరూ బాగున్నారా? అని యోగక్షేమాలు అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ నెమ్మదిగా ఓ కోరిక కోరింది. ముట్టుకోవాలని కోరికనేను మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? అని అడిగింది. అందుకు మోహన్‌లాల్ నవ్వుతో అంగీకారం తెలుపుతూ ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. హీరో కోసం పాట కూడా పాడాలనుకుంది, కానీ అక్కడ అంత సమయం దొరకలేదని చెప్తోంది. మోహన్‌లాల్ సినిమా వస్తుందంటే చాలు టీవీకి అతుక్కుపోతుంది లీలామణి. ఆయన నటించిన వాటిలో ఆరం తంపురన్ మూవీ తనకెంతో ఇష్టమని చెప్తోంది. చివరగా తన పిల్లలతో కలిసి తుడరుమ్ సినిమా చూశానంది. దృశ్యం 1, 2 సినిమాలను చూశానని, మూడో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నానంది.చదవండి: దర్శన్ ఎలాంటివాడో మీఅందరికీ తెలుసు..: హీరో భార్య -
మీ ప్రేమ చూస్తుంటే కళ్లలో నీళ్లు..: దర్శన్ భార్య
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan) కటకటాలపాలయ్యాడు. ప్రియురాలి కోసం దర్శన్ ఊచలు లెక్కపెడుతుంటే.. ఆయన నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ భార్య కష్టపడుతోంది. ప్రకాశ్ వీర్ దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయిపోయింది. వచ్చే నెల డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.నోట మాట రాలేదుదీంతో సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ తరపున అతడి భార్య విజయలక్ష్మి మీడియా ముందుకు వచ్చింది. ఇటీవలే ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేనెప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదు. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో జనం ముందుకు రావడం.. వాళ్లందరూ డి బాస్ అంటూ నినాదాలు చేయడం చూసి చాలా సంతోషించాను. నిర్మాతలే అన్నదాతలువాళ్లు చాలాసేపటివరకు అలా నినాదాలు చేస్తూ నన్ను మాట్లాడనివ్వలేదు. అభిమానుల ప్రేమాభిమానాలకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓపక్క సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే దర్శన్ డెవిల్ సినిమా రిలీజ్ గురించే ఆందోళన చెందాడు. నిర్మాతలే మన అన్నదాతలు. నా వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదు అని చెప్పాడు. అభిమానులు కురిపించిన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీ అందర్నీ ఆయన సెలబ్రిటీలుగా అభివర్ణించాడు.అభిమానులంటే ప్రేమఅభిమానులు ఆయన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? దర్శన్ మంచి మనిషి అని వాళ్లకు బాగా తెలుసు. అభిమానులకు ఓ విషయం చెప్పమన్నాడు. తన గురించి కంగారు పడొద్దని, తన సినిమాలకు సపోర్ట్ చేయమని కోరాడు. తనెంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ఆటోలపై దర్శన్ అనే స్టిక్కర్ కనిపిస్తే వెంటనే ఆటోవాలాను కలిసి థాంక్యూ చెప్తాడు. అభిమానులంటే ఆయనకు అంతిష్టం. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ఇప్పటికీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ కళాకారుడి బాగోగులను దర్శనే చూసుకుంటున్నాడు. నేను తన సినిమా సెట్స్‌కు పెద్దగా వెళ్లేదాన్ని కాదు. రాజస్తాన్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ అయినప్పుడు మాత్రం నేను, మా కొడుకు వినిశ్ తనకు తోడుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా, మానసికంగా అలిసిపోయేవాడు. నడుమునొప్పి, వెన్ను నొప్పి తట్టుకోలేక పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్స్ తీసుకుని డెవిల్ సెట్‌కు వెళ్లేవాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా దెబ్బలు తగిలించుకున్నాడు. హీరోయిన్‌కు సలహాఅప్పుడు దర్శకనిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. హీరోయిన్ రచనతో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేనున్నానని ఇబ్బందిగా ఫీలవద్దని రచనతో అన్నాను. ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి సింపుల్‌గా బతకడానికే ఇష్టపడతాను. కానీ కొన్ని నెలలుగా మా జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి. నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.కన్నీళ్లు దిగమింగుకునిఓ పక్క పని, మరోపక్క పోలీసులు, లాయర్స్‌ను కలవడం, నా కొడుకును చూసుకోవడం.. ఇలా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తోంది. దర్శన్‌కు, ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎన్నోసార్లు ఏడ్చాను. ఆ బాధ దర్శన్ ఇట్టే కనిపెట్టేస్తాడు. అందుకే తనను కలవడానికి వెళ్లినప్పుడు బలవంతంగా చిరునవ్వు పులుముకునేదాన్ని. అంతా బానే ఉందని అబద్ధాలు చెప్తుంటాను అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: ఏయ్, ఏం పొడిచావ్? సీరియల్ స్టార్.. ఏడుపొక్కటే వచ్చంటూ గలీజ్ పంచాయితీ -
ఈ సినిమా హిట్టయితేనే పిశాచి 2 రిలీజ్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్ గో ఆన్ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్. బ్లాక్ మెడ్రాస్ ఫిలింస్ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్ తిలక్, కల్లూరి వినో, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మాస్క్ రిలీజ్వెట్రిమారన్ మార్గదర్శకత్వంలో వికర్ణన్ అశోక్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్ కథానాయకుడిగా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్ 21న) తెరపైకి వచ్చింది. అది హిట్టయితేనే..ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్ చిత్ర హిట్‌పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట! -
స్వతంత్ర సినిమాకు ప్రోత్సాహం కరువైంది: ‘ఇఫీ’లో కమల్‌హాసన్
‘‘స్వతంత్ర సినిమా స్వతంత్రంగానే ఉంటుంది. దాన్ని వాణిజ్య సినిమాలతో పోల్చి పరిమితుల్లో పెట్టకండి. స్వతంత్ర సినిమా కూడా స్వతంత్ర భారత్ లాగే స్వేచ్ఛగా ఉంటుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్ తెలిపారు. గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) శుక్రవారం కమల్‌హాసన్ పాల్గొన్నారు. ‘ఇండిపెండెంట్ సినిమాలు ఇంకా థియేటర్లలో స్థానం సంపాదించుకోవడానికి పోరాడుతున్నాయి... థియేటర్లలో స్వతంత్ర సినిమాలకు సరైన ప్రదర్శన అవకాశాలు లభించడం లేదు కదా?’ అనే ప్రశ్నకు కమల్‌హాసన్ బదులిస్తూ– ‘‘అవును... ఇది నిజమే. గత 40 ఏళ్లుగా నేను లేవనెత్తుతున్న సమస్య ఇది’’ అని స్పష్టం చేశారు.శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా కమల్‌హాసన్ నిర్మించిన ‘అమరన్’ చిత్రం ఈ ఏడాది భారతీయ పనోరమా విభాగంలో ప్రారంభ చిత్రంగా ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘అమరన్ ’ చిత్రం ‘ఇఫీ’లో ప్రదర్శనకు ఎంపిక కావడం, అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్ పీకాక్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘అర్ధంతరంగా ఆగి పోయిన ‘మరుదనాయగమ్’ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించే చాన్స్ ఉందా?’ అనే ప్రశ్నకు కమల్ బదులిస్తూ– ‘‘ప్రస్తుత సాంకేతిక విప్లవ యుగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా ఆ చిత్రం పూర్తి కావచ్చుననే ఆశాభావం ఉంది’’ అన్నారు. మాస్టర్ క్లాసెస్ ప్రారంభం ‘ఇఫీ’లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను శుక్రవారం కేంద్ర సమాచార– ప్రసారశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముజఫర్ అలీ మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో తొలి సెషన్‌ను నిర్వహించారు. సినీ ప్రముఖులతో క్లాసెస్... ఈ మాస్టర్‌క్లాస్ విభాగంలో ఫ్యానల్ డిస్కషన్లు, వర్క్‌షాపులు, రౌండ్‌టేబుల్ ఇంటరాక్షన్లు, ఇంటర్వ్యూ సెషన్లు, ఫైర్‌సైడ్ చాట్స్ వంటి వర్క్‌షాపులు ఉంటాయి. భారతీయ సినీ ప్రముఖులు విధు వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్, షాద్ అలీ, శేఖర్ కపూర్, రాజ్‌కుమార్ హిరానీ, ఆమిర్ ఖాన్, విశాల్ భరద్వాజ్, సుహాసినీ మణిరత్నం వంటి వారు ఈ ఫెస్టివల్లో వివిధ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా కృత్రిమ మేథ (ఏఐ) మనుగడ, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక విభాగాలపై ప్రత్యేక వర్క్‌షాపులను ప్లాన్ చేశారు. రంగస్థల నటనపై ప్రముఖ నిపుణులు అందించే మాస్టర్‌క్లాస్‌లు కూడా జరగనున్నాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
నిర్వాహకులకు షాక్.. బిగ్‌బాస్ రియాలిటీ షోపై ఫిర్యాదు!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ రన్ అవుతోంది. కన్నడలో ఈ ఏడాది కూడా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి.. మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు.తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మరో వివాదం మొదలైంది. బిగ్‌బాస్ హౌస్ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్తో పాటు కంటెస్టెంట్స్ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది.కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఓ ఎపిసోడ్లో రషికపై మరో కంటెస్టెంట్ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన 'మార్క్' షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న పండుగ విడుదల కానుంది. -
కుటుంబం రోడ్డుమీదకు.. నాన్న గుండె ఆగిపోయింది!
సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్ రెహమాన్ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే! ఎన్నో అవమానాలుఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్‌ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు. కోలుకోవడానికి చాలా ఏళ్లువిశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్-కృతీ సనన్ల 'తేరే ఇష్క్ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ 'పెద్ది' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.చదవండి: అమల అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? -
ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
‘‘భారతీయ దర్శకులు, నిర్మాతలు, కథారచయితలు... ఇలా అందరూ ప్రపంచాన్ని కలుసుకునే వేదిక ఇది. గోవాను క్రియేటివ్ క్యాపిటల్‌గా మలిచే దిశగా కృషి చేస్తున్నాం. చిత్ర నిర్మాణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గోవా ఫిల్మ్ మేకర్స్‌ను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) గురువారం భారీ పరేడ్ నేపథ్యంలో గోవా గవర్నర్ అశోక గజపతిరాజు ప్రారంభించారు. 2004లో మనోహర్‌పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇఫీలోపాల్గొడానికి గోవా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అశోక గజపతిరాజు గుర్తుచేసుకున్నారు.50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన ఘనతకు గుర్తింపుగా ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘ఇఫీ వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సనాతన ధర్మం సత్తా చూపించేలా ‘అఖండ 2’ రూ పొందింది. ప్రస్తుతం నటనని గ్రాఫిక్స్ డామినేట్ చేస్తున్నాయి. అయితే నా సినిమాలను గమనిస్తే నేనే వాటిని డామినేట్ చేస్తాను’’ అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఔత్సాహిక యువతను ప్రోత్సహించేందుకు మారియట్ హోటల్లో కేంద్ర మంత్రి మురుగన్ ఆరంభించిన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్–2025’ ప్రారంభ కార్యక్రమంలో కూడా బాలకృష్ణపాల్గొన్నారు.టాలీవుడ్ సందడి: ‘ఇఫీ’ కార్యక్రమాల్లో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగాపాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీలీల, ‘దిల్’ రాజు, సి కల్యాణ్, మాదాల రవి, వీరశంకర్, భరత్ భూషణ్ తదితరులుపాల్గొన్నారు. ‘‘్రపాంతీయ భాష నుంచిపాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ప్రాంతాలకు అతీతంగా ఇంతమందిని ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ‘ఇఫీ’లాంటి వేదికలు ఉపకరిస్తాయి’’ అన్నారు ‘దిల్’ రాజు, మాదాల రవి. హిందీ పరిశ్రమ నుంచి అనుపమ్ ఖేర్, రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా, శేఖర్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..నెట్‌ఫ్లిక్స్ బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21 ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21 హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21 డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21 వన్ షాట్ విత్ ఈడ్ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21జియో హాట్‌స్టార్ జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21 ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21 ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21 అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21 కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21 డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21జీ5 ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21మనోరమ మ్యాక్స్షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21లయన్స్ గేట్ ప్లే..టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21 -
కాంతార చాప్టర్-1.. బాక్సాఫీస్ వద్ద మరో క్రేజీ రికార్డ్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతార చాప్టర్-1. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కనుమరుగవుతున్న సమయంలో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిషబ్ శెట్టి మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో కాంతార ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన కాంతార చాప్టర్-1 మరో క్రేజీ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. Celebrating 50 glorious days of #KantaraChapter1.A divine cinematic experience rooted in our timeless heritage and sacred traditions.#50DaysOfKantaraChapter1 ❤️🔥https://t.co/d7It7XIZUO#BlockbusterKantara #KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere… pic.twitter.com/iEvur0NiQL— Rishab Shetty (@shetty_rishab) November 20, 2025 -
మోహల్ లాల్‌తో ఇంటిమేట్ సీన్.. షూటింగ్‌కు ముందే: హీరోయిన్
ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మూడో పెళ్లి చేసుకున్న భామ.. మరోసారి విడాకులు తీసుకుంది. దీంతో మీనా వాసుదేవన్ పేరు మాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మలయాళంలో పలువురు స్టార్ హీరోల సరసన మీనా నటించింది. మోహన్ లాల్ హీరోగా 2005లో వచ్చిన తన్మాత్ర అనే మూవీలో కనిపించింది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో ఓ ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సీన్లో మోహన్ లాల్ పూర్తి నగ్నంగా నటించాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయని.. ఇలా చేస్తున్నందుకు షూటింగ్‌కు ముందే మోహన్ లాల్ తనకు క్షమాపణ చెప్పాడని మీరా గుర్తుచేసుకుంది.మీరా వాసుదేవన్ మాట్లాడుతూ.. "నేను అతన్ని ఒకే ఒక్క విషయం అడిగా. ఈ సన్నివేశం ఎందుకు అవసరం? దాని ఉద్దేశ్యం ఏమిటి?' అని ప్రశ్నించా. కానీ ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచే రెండు పాత్రలను చాలా దగ్గరగా చిత్రీకరించారు. ఇది కూడా ఒక సన్నిహిత కుటుంబం. భార్యాభర్తలు ఎల్లప్పుడూ చాలా సున్నితంగా, భావోద్వేగంగా ఉంటారు. ఈ సీన్లో మోహన్ లాల్ సర్ పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో ఆయనకు చాలా కష్టంగా అనిపించింది. అతనికి మరింత సవాలుగా అనిపించింది. ఈ సీన్లో నా గురించి, నా గౌరవం గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఆయన చాలా ప్రొఫెషనల్. దీంతో షూట్‌కు ముందే మోహన్ లాల్ స్వయంగా వచ్చి నాకు క్షమాపణలు చెప్పా. ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే సారీ' చెప్పారని" తెలిపింది.కాగా.. ఈ చిత్రం ఉత్తమ మలయాళ మూవీగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రం మోహన్ లాల్‌కు ఉత్తమ నటుడిగా ఐదోసారి రాష్ట్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇటీవలే మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మీరా వాసుదేవన్ కెరీర్..మీరా వాసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. -
నేరుగా ఓటీటీకి సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలైనా ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మలయాళ క్రైమ్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సినిమాలతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.తాజాగా ఓ సీరియల్ కిల్లర్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. స్టీఫెన్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ సరికొత్త సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని రివీల్ చేసింది. ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం వహించగా.. జేఎం ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు. If we have a serial killer on our hands, namma keka vendiya kelvi yaaru nu ah illa yen nu ah?Watch Stephen, out 5 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix! #StephenOnNetflix pic.twitter.com/KHUg70WCrS— Netflix India South (@Netflix_INSouth) November 20, 2025 -
నా ఫోటోలు అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది: కీర్తి సురేశ్
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ప్రస్తుతం చెన్నైలో రివాల్వర్ రీటా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీర్తి సురేశ్ మాట్లాడారు. ఏఐతో సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏఐ మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో ఏఐ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక వరమే కానీ..ఒక రకంగా శాపం కూడా. మానవులు సాంకేతికతను కనుగొన్నారు. కానీ ఇక్కడ మనం నియంత్రణ కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో అసహ్యకరమైన దుస్తుల్లో నా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటా. నేను ఎప్పుడైనా నిజంగానే ఇలాంటివీ ధరించానా అని షాకవుతుంటా. ఇటీవల నేను సినిమా పూజ కోసం ధరించిన దుస్తులను వేరే కోణంలోకి మార్చి చూపించారు. అది చూసిన క్షణం నేను షాకయ్యా. ఆ తర్వాత నేను అలా పోజు ఇవ్వలేదని గ్రహించా. ఇలాంటివి చూసినప్పుడు చిరాకు తెప్పిస్తుంది. అంతేకాదు బాధగా కూడా అనిపిస్తుంది" అని పంచుకుంది.ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గురైన ఎవరినైనా ప్రభావితం చేస్తుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఏఐ వినియోగం పెరిగాక పలువురు సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి ఆండ్రియా జెరెమియా కూడా ఏఐతో సంబంధం ఉన్న నష్టాల గురించి ప్రస్తావించారు, ఈ సాంకేతికత వినోద రంగానికి సవాల్‌గా మారిందన్నారు. కేవలం నటులకే కాదు ప్రజలకు కూడా ఏఐ సమస్యగా మారుతోందని.. ఏఐ మన కోసం పనిచేయాలి.. మరోలా కాదన్నారు. -
చలి వల్ల ఇబ్బంది పడుతున్నా.. ప్లీజ్ ఒక దుప్పటి ఇవ్వండి
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ను 57వ సీసీహెచ్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. దర్శన్ నీలం రంగు టీ షర్ట్, నల్ల ప్యాంట్ ధరించి హాజరయ్యారు. అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని దర్శన్ తరఫు న్యాయవాదికి సూచించారు. జైలులో చలి ఎక్కువగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చిన దుప్పటిని కప్పుకోవడానికి ఇప్పించాలని ఆయన కోరారు.మరో నిందితుడు నాగరాజు కూడా ఇదే కోరాడు. అయితే, జడ్జి ముందు దర్శన్ ఇలా వాపోయాడు. 'చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర పోవడమే సాధ్యం కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం అదనంగా ఒక కంబళి ఇప్పించండి.' అని వేడుకున్నాడు. అయితే, జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. 'చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదనంగా కంబళి ఇవ్వాలి కదా.. ఇప్పటికే ఆదేశించాం కదా.. పదేపదే ఎందుకు చెప్పించుకుంటున్నారు..? నిందితులకు కావలసిన అదనపు కంబళ్లను ఇవ్వండి.' అని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.జైలు వీడియోల కేసులో భార్య పేరుపరప్పన జైల్లో ఖైదీలకు రాచమర్యాదల వీడియో లీకేజీలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి పేరు బయటకు వచ్చింది. దర్శన్ మిత్రుడు, నటుడు ధన్వీర్‌ను వీడియోల గురించి పోలీసులు విచారిస్తున్నారు. మొదట ఆ వీడియో న్యాయవాది ద్వారా తనకు రాగా, అదే వీడియోను తాను దర్శన్ భార్యకు పంపానని ధన్వీర్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. తాను ఈ వీడియోలను వైరల్ చేయలేదు, ఎవరు చేశారో తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆమెకు కూడా నోటీసులిచ్చి విచారించాలని పరప్పన అగ్రహార పోలీసులు నిర్ణయించారు. ఈ వీడియోలను ఎవరు అప్లోడ్ చేశారో చెప్పాలంటూ ఫేస్‌బుక్‌కు పోలీసులు ఈ మెయిల్ ద్వారా అడిగినట్లు తెలిసింది. -
వచ్చే నెల అన్నగారు వస్తారు
కార్తీ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబరులో విడుదల చేయనున్నట్లు బుధవారం నిర్మాత ప్రకటించారు. ‘‘యాక్షన్ కామెడీ కథతో రూ΄÷ందిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌ని అలరించేలా ‘అన్నగారు వస్తారు’ ఉంటుంది. కార్తీ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.


