అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు.
కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది.


