breaking news
The Pet Detective Movie
-
వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్‌లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)ఆహాప్రేమిస్తున్నా - తెలుగు సినిమాక్రిస్టినా కథిర్‌వేలన్ - తమిళ మూవీసన్ నెక్స్ట్శశివదనే- తెలుగు సినిమానెట్ఫ్లిక్స్మాస్ జాతర - తెలుగు సినిమాఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీలెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమాస్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రంబార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీజీ5ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమారేగాయ్ - తమిళ సిరీస్రక్తబీజ్ - బెంగాలీ మూవీలయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమారష్ - ఇంగ్లీష్ మూవీబుక్ మై షో40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమాఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీగ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమాహాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీవిన్నర్ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా -
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది.


