సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఏ ఓటీటీలో ఉందంటే? | Regai Web Series Released In OTT, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Regai Web Series: ఉత్కంఠభరిత కథతో 'రేగై' సిరీస్‌.. అక్కడే స్ట్రీమింగ్‌

Nov 29 2025 7:55 AM | Updated on Nov 29 2025 12:32 PM

Regai Web Series Streaming on This OTT Platform

సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్నాయి. సినిమాలు పాన్‌ ఇండియా స్థాయికి చేరుకుంటే వెబ్‌ సిరీస్‌లు ఇంకా ముందుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో వెబ్‌ సిరీస్‌ల నిర్మాణం అధికం అవుతోంది. అలా తాజాగా జీ 5 ఓటీటీ సంస్థ రేకై అనే వెబ్‌ సిరీస్‌ ముందుకు తీచ్చింది. ప్రముఖ నవలా రచయిత రాజేశ్‌ కుమార్‌ రాసిన క్రైమ్‌ నవల ఆధారంగా రూపొందిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఈయన ఇంతకు ముందు రాసిన పలు క్రైమ్‌ నవలలు బహు ప్రాచుర్యం పొందాయి.

అలా ఆయన తాజాగా రాసిన నవల ఆధారంగా రూపొందిన రేకై వెబ్‌ సిరీస్‌కు ఎం.దినకరన్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌.సింగారవేలన్‌ నిర్మించిన ఈ సిరీస్‌ 6 ఎపిసోడ్స్‌గా రూపొందింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఇంతకు ముందు పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ రూపొందాయి. వాటికి భిన్నంగా ఉత్కంఠభరిత కథ, కథనాలతో రూపొందిన వెబ్‌ సిరీస్‌ రేకై . 

కథ
ఒక ఐస్‌ ట్రక్‌ అనూహ్యంగా ప్రమాదానికి గురవుతుంది. దీంతో దాని డ్రైవర్‌ మృతి చెందుతాడు. అయితే ఆ ట్రక్‌లో ఓ మొండి చేయి బయట పడుతుంది. అది ఎవరిది? దాని వెనుక ఉన్న హంతకులు ఎవరన్న ఇన్వెస్టిగేషన్‌తో కథ మొదలవుతుంది. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అదే సమయంలో ఆ మొండి చెయ్యి రేఖలతో మరో ఆరుగురి రేఖలు కనుగొనబడతాయి. దీంతో కేసు విచారణ క్లిష్టంగా మారుతుంది. 

మరో పక్క డిపార్టెమెంట్‌లోనూ కొందరు ప్రముఖులు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరో పక్క మానవ అవయవాల రాకెట్‌ దందా పెద్ద స్థాయిలో జరుగుతోందనే విషయాన్ని పోలీస్‌ అధికారులు చేధించగలిగారా? లేదా? ఇలా పలు ఊహకు అందని సంఘటనలతో కథ సాగుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో బాలహాసన్‌, పవిత్ర జనని, బోపాలన్‌ ప్రగదీశ్‌, వినోదిని వైద్యనాథన్‌, శ్రీరామ్‌.ఎం, అంజలిరావ్‌, ఇంద్రజిత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement