కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్ హెచ్.ఎన్. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్‌స్క్రీన్‌పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..
తిథి
రామ్ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.
జాతీయ అవార్డు
పల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ ద ఫేబుల్ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.

కూలీగా మారిన హీరో
ఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు.
పొట్టకూటి కోసం..
ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు.
Heartbreaking: Abhi, the unforgettable lead from the National Award-winning Kannada masterpiece “Thithi”, is now working as a daily wage labourer to make ends meet.
From stealing the screen to struggling for survival this is the reality for many of our brilliant artists. 💔… pic.twitter.com/xSz78ZqCsU— ಸನಾತನ (@sanatan_kannada) December 7, 2025


