breaking news
kannada movie Thithi
-
కూలీగా మారిన హీరో.. నెట్టింట వీడియో వైరల్
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్ హెచ్.ఎన్. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్స్క్రీన్పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..తిథిరామ్ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.జాతీయ అవార్డుపల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ ద ఫేబుల్ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.కూలీగా మారిన హీరోఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. పొట్టకూటి కోసం..ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు. Heartbreaking: Abhi, the unforgettable lead from the National Award-winning Kannada masterpiece “Thithi”, is now working as a daily wage labourer to make ends meet.From stealing the screen to struggling for survival this is the reality for many of our brilliant artists. 💔… pic.twitter.com/xSz78ZqCsU— ಸನಾತನ (@sanatan_kannada) December 7, 2025 చదవండి: నేనే దురదృష్టవంతుడిని.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్ -
కన్నడ చిత్రానికి అమీర్ ప్రశంసలు
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన కన్నత చిత్రం 'థిథి'పై ప్రశంసంలు కురిపించారు. చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన చిత్రాన్ని చూశానంటూ ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ చిత్ర నటీనటులను అమీర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ చిత్రంలో ప్రముఖ నటులు లేకపోయినా... కొత్తవారి నటన మాత్రం అద్భుతమని కొనియాడారు. కర్ణాటకలోని ఓ గ్రామంలో సెంచరీ కొట్టి జీవితం సాగిస్తున్న సెంచరీ గౌడ అనే వ్యక్తి మరణంపై మూడు తరాలకు చెందిన వాళ్లు ఎలా స్పందిస్తారు, అతడు మరణించిన 11 రోజులకు అంత్యక్రియలు చేయడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. జనరేషన్లో వస్తున్న మార్పులు, వారి ఆలోచనా విధానాలు చూస్తుంటే కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ సినిమా మాత్రం ఫన్నీగా ఉందని...డోంట్ మిస్ అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. థిథి చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకోవటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 12 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. థిథి చిత్రాన్ని ప్రతాప్ రెడ్డి నిర్మించారు. It's a Kanada film, with subtitles in English. It's an absolute MUST WATCH! It's releasing in theatres on 3rd June. (2/4) — Aamir Khan (@aamir_khan) May 30, 2016 Hey guys, just saw one of the most amazing films I have seen in a long time! Thithi. (1/4)https://t.co/xc0LTGcW6c — Aamir Khan (@aamir_khan) May 30, 2016


