Karnataka
-
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. -
మే అంటే హడలే
బనశంకరి: మే నెల వర్షాలంటే బెంగళూరువాసులు వణికిపోవాల్సి వస్తోంది. అంత ఉధృతంగా వానలు పడి ముంపును కలిగిస్తున్నాయి. ఈ కష్టాలు పడలేక జనం మే వస్తోంటే గుబులు పడుతున్నారు. అతి పెద్ద వానలకు రికార్డు బెంగళూరులో మే నెలలో ఇప్పటివరకు 276 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ అని వాతావరణశాఖ తెలిపింది. సిటీలో సాధారణంగా వేసవి కాలమైన మే నెలలో సరాసరి 128 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా. కానీ ఈసారి మే పూర్తికావడానికి 10 రోజులు ఉండగానే 276.5 మిల్లీమీటర్ల వర్షం దంచేసింది. గత ఆదివారం ఒకేరోజు 132 మిల్లీమీటర్లు వర్షం పడి, ఒక నెలలో పడే వర్షం ఒకేరోజున కురిసింది. 2023 మే నెలలో నగరంలో 305 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇప్పటివరకు మే లో కురిసిన అత్యధిక వర్షంగా రికార్డయింది. కొత్త రికార్డు సృష్టించడానికి 28.9 మిల్లీమీటర్లు వర్షం అవసరం. నైరుతి రుతుపవనాలు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం వల్ల ఈ మేలో భారీ వర్షాలు పడ్డాయి. గత పదేళ్లలో కురిసిన రెండో అతిపెద్ద వర్షం ఈ మేలోనే నమోదైంది. 2022లో 270.2 మిల్లీమీటర్ల కుండపోత కురిస్తే, ఈ రికార్డును గత ఆదివారం వర్షం బద్ధలు కొట్టింది. ఎండలు, రుతుపవనాలు కలిసి ఎక్కువ వర్షాలు వస్తాయని అంచనా. -
అజంతా గుహ నుంచి సముద్ర అలల మీదకు
కర్వార్(కర్ణాటక): ప్రఖ్యాత అజంతా గుహలోని ఒక శిలపై చిత్రించిన పెయింటింగ్ నుంచి స్ఫూర్తి పొందిన భారత నావికాదళం ఎట్టకేలకు ఐదో శతాబ్దినాటి పడవకు ప్రాణప్రతిష్టచేసింది. ప్రాచీన భారతీయ నావికా సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఈ నౌకను రూపొందించింది. కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నావికా స్థావరంలో ఈ పురాతన సంప్రదాయక రీతిలో నిర్మించిన ఐఎన్ఎస్వీ కౌండిన్యను ఇండియన్ నేవీ బుధవారం ఆవిష్కరించింది. ఒకటో శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్ర యానం చేసి ఆగ్నేయాసియాను చుట్టొచ్చిన ప్రఖ్యాత భారత నావికుడు కౌండిన్య పేరును ఈ ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ)కి పెట్టారు. ఈ నౌకకు ఎన్నో విశిష్టతలున్నాయని దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం చెప్పారు. ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, వేరే ఆకృతిలో తెడ్డులతో దీనిని సహజ ముడి సరుకులతో నిర్మించామని నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ‘‘ ఈ నౌకకు సంబంధించిన వాస్తవ కొలతల మ్యాప్‌లు, బ్లూప్రింట్లు అందుబాటులో లేవు. ద్విమితీయ చిత్రంలో ఉన్న ఒక్కో అంశాన్ని స్పష్టంగా అర్థంచేసుకుని వాటినే కొలతలుగా భావించి వాస్తవిక ఊహతో నౌక నిర్మాణం మొదలెట్టాం. పురాతన నౌక నిర్మాణాలు, నౌకా నిర్మాణ శాస్త్రం, సాంప్రదాయక విధానాలను మేళవిస్తూ ఈ నౌక సముద్ర పరిస్థితులను ఏ విధంగా తట్టుకోగలదనే అంచనాతో నౌకకు తుదిరూపునిచ్చాం’’ అని నేవీ అధికారి తెలిపారు. ‘‘భారతీయుల సముద్రయాన ఘనతను, వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఆనాటి నిర్మాణ కౌశల్యాన్ని కళ్లముందే సాక్ష్యాత్కరిస్తోంది’’ అని మంత్రి షెకావత్ అన్నారు. పురాతన విధానంలో నిర్మించిన ఈ నౌక పనితీరు, సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు త్వరలోనే దీనిని గుజరాత్ తీరం నుంచి ఒమన్‌కు నడపనున్నారు. -
స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి
మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్‌ప్రైజ్ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొంది నేడు తొలిసారి దక్షిణాది భాషకు బుకర్ ప్రైజ్ తెచ్చి పెట్టిన బాను ముష్టాక్ పరిచయం.‘మీరు రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ప్రజలు’ అని సమాధానం చెప్తారు బాను ముష్టాక్. ‘వారిలోని మంచి, చెడు, టక్కరితనం, నిస్సహాయత, ఓర్పు, ప్రతి మనిషికీ ఉండే కథ... ఇవే నన్ను రచయిత్రిని చేశాయి’ అంటారామె.75 ఏళ్ల బాను ముష్టాక్ భారతీయ సాహిత్యం, అందునా దక్షిణాది సాహిత్యం, ప్రత్యేకం కన్నడ సాహిత్యం గర్వపడేలా ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025’ను మంగళవారం రాత్రి గెలుచుకున్నారు. ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ అయిన ఆమె 12 కథల పుస్తకం ‘హార్ట్ ల్యాంప్’ ఈ ప్రతిష్టాత్మక బహుమతి గెలుచుకుంది. దక్షిణాది భాషలకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీజర్నలిస్టుగా, అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన బాను ముష్టాక్ 1990 నుంచి ముస్లిం స్త్రీల జీవన గాథలను కథనం చేస్తూ వచ్చారు. ఆమె రాసిన మొత్తం 50 కథల నుంచి 12 కథలు ఎంచి దీపా బస్తీ అనువాదం చేయగా ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌కు చెందిన ‘అండ్ అదర్ స్టోరీస్’ అనే చిన్న పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.బాను ముష్టాక్ ఎవరు?బాను ముష్టాక్ కర్ణాటక రాష్ట్రం హాసన్‌లో జన్మించారు. తండ్రి సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్. ఆమెను చిన్నప్పుడు ఉర్దూ స్కూల్లో వేయగా, అక్కడి వాతావరణం సరిపడక ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గలోని కన్నడ స్కూల్లో చేరారు. ఆరు నెలల్లో కన్నడ నేర్చుకుంటేనే స్కూల్లో ఉంచుతాం లేకుంటే పంపించేస్తాం అనంటే కొద్ది రోజుల్లోనే కన్నడ భాషను నేర్చుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఆమెను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతికి పంపించారు. ‘నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న తన పిల్లలు డబుల్ డిగ్రీలు చేయాలని పట్టుదలగా ఉండేవాడు’ అంటుంది బాను ముష్టాక్. చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుఆది నుంచి సవాళ్లేబాను ముష్టాక్‌కు ముందునుంచి తిరగబడే స్వభావం ఉంది. మగపిల్లలతో కలిసి సైకిల్ నేర్చుకుంటున్న ఆమెను ముస్లిం పెద్దలు ఆపి ఇలా సైకిల్ తొక్కకూడదని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే కాలంలో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 1974లో కట్నం ప్రస్తావన లేకుండా ఆమె పెళ్లి జరిగింది. అయితే వాచ్ రిపేరర్ అయిన భర్తకు సరైన సంపాదన లేకపోవడం, అత్తింటివారి నుంచి ఇబ్బందులు, ఉమ్మడి సంసారం కలిగిన ఇంటిలో వారితో కలిసి ఉండటం.. ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో భర్త ఆపారు. చివరకు ఆమె షరతులకు భర్త ఒప్పుకోవడంతో ఆత్మహత్య, విడాకుల ఆలోచనలు మానుకున్నారు. అప్పటినుంచి ఆమెకు కాస్త స్వేచ్ఛ లభించింది.పత్రికా రచయితగా‘ముస్లిం మహిళలు సినిమాలు చూడటం నేరమా?’ అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక ‘లంకేశ్ పత్రికె’లో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. దాంతో అదే పత్రికలో రిపోర్టరుగా చేరారు. అనంతరం కొన్ని నెలలపాటు బెంగళూరు ఆలిండియా రేడియోలో పని చేశారు. 1978లో తండ్రి ప్రోద్బలంతో మీద ఆమె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థినిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తు ‘కుట్టు మిషన్’. తండ్రితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకు నచ్చలేదు. ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఆమె ఓడిపోయారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఆ తర్వాత రెండుసార్లు హాసన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. బాను ముస్తాక్ రచయితగానే కాక, సామాజిక కార్యకర్తగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరికీ సమానహక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడారు. తొలుత దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం ఆ తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో మొత్తం జిల్లాలో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఆమే.ముస్లింల కథలు‘నేను రాసే వరకు ముస్లింల జీవితం అంతగా కన్నడలో రాలేదు. హిందూ రచయితల కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్ అండ్ వైట్‌గా ఉండేవి. బండాయ సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారు రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలెట్టాను’ అంటారు బాను ముష్టాక్. ఆమె ఇప్పటికి ఆరు కథాసంపుటాలు, ఒక నవల, ఒక వ్యాససంపుటి, కవిత్వ సంపుటి ప్రచురించారు. బాను ముస్తాక్ రాసిన ‘కరి నాగరగళు’ అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి 2005లో ‘హసీనా’ అనే కన్నడ చిత్రం తీశారు. అందులో నటి తార ప్రధాన పాత్ర పోషించారు. అందులోని నటనకుగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. బాను ముస్తాక్ కన్నడతోపాటు హిందీ, దక్కనీ ఉర్దూ, ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ, పంజాబీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇస్లాం ప్రకారం స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం ఉందని, కేవలం మగవారే వారిని ఆపుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆమెను, ఆమె కుటుంబాన్ని మూడు నెలలపాటు సామాజికంగా బహిష్కరించారు. కర్ణాటకలో ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్ వేసుకునే హక్కు కోసం పోరాడిన సమయంలో బాను ముస్తాక్ వారికి మద్దతుగా నిలిచారు. 1990లో లా చదివిన బాను ముస్తాక్, లాయర్‌గా స్త్రీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వేలాది కేసులపై ఆమె వాదించారు. బాను ముష్టాక్‌కు బుకర్ప్రైజ్సీనియర్ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్ (75)కు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ను 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. మంగళవారం రాత్రి లండన్‌లో జరిగిన బహుమతి ప్రదాన వేడుకలో ఆమె రాసిన ‘హార్ట్ ల్యాంప్’ అనే కథా సంపుటికి ఈ బహుమతి దక్కింది. కన్నడంలో ఆమె రాసిన కథల నుంచి ఎంచిన 12 కథలను దీపా బస్తీ ఇంగ్లిషులో అనువాదం చేయగా ఈ బహుమతి దక్కింది. 50 వేల పౌండ్లు (57 లక్షల రూపాయలు) నగదు అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు చెరిసగం పంచుకోవాలి. బ్రిటిష్ రచయిత మేక్స్ పోర్టర్ న్యాయ నిర్ణేతల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ‘హార్ట్ ల్యాంప్లోని కథలు ఇంగ్లిష్ పాఠకులకు కొత్త ప్రపంచాన్ని చూపుతాయి’ అని ఆయన అన్నారు. 12 దేశాలకు చెందిన 13 మంది రచయితలు ఈ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో ఎంపిక కాగా ఆ తర్వాత ఆరుమంది రచయితలతో షార్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. బాను ముష్టాక్ పుస్తకం షార్ట్ లిస్ట్‌లో రావడమే ఘనత అనుకుంటే ఏకంగా బహుమతిని గెలవడంతో భారతీయ సాహిత్యాభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ‘ఇది కన్నడ భాషకు దక్కిన గౌరవం’ అని కొనియాడారు. అలాగే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు అభినందనలు తెలిపారు. భాను ముష్టాక్ స్వస్థలం హాసన్. ఆమె రచయితగానే గాక అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా కూడా కృషి చేస్తున్నారు. కాగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఇంగ్లాండ్‌లో ప్రచురితం అయి ఉండాలి. 2022లో గీతాంజలి శ్రీ రాసిన ‘రేత్ కీ సమాధి’ ఇంగ్లిష్‌లో ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా అనువాదమై బుకర్‌ప్రైజ్ గెలుచుకోవడం పాఠకులకు విదితమే. -
ఎడతెగని వానలు.. పొంగిన వాగులు
హొసపేటె: విజయనగర జిల్లాలో అకాల వర్షాలు గత మూడు రోజుల నుంచి యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం కురిసిన వర్ష ప్రభావానికి రోడ్లతో పాటు చెక్ డ్యాంల్లో వర్షపు నీరు నిండి వాగులను తలపిస్తున్నాయి. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, హరపనహళ్లి, కొట్టూరు తాలూకాల్లో కూడా వర్ష ప్రభావం కొనసాగింది. గంటల తరబడి వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దేవదుర్గ తాలూకా లింగదహళ్లిలో యల్లమ్మ(55) అనే మహిళ గ్రామ శివార్లలోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై మరణించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడ్డారు. కలబుర్గి జిల్లా అప్జల్‌పుర తాలూకా కర్జిగిలో నబీలాల్ సాబ్ చౌదరి(70) పిడుగుపాటుకు గురై మరణించారు. ధార్వాడ జిల్లాలో.. హుబ్లీ: ధార్వాడ జిల్లాలో మంగళవారం పిడుగుపాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. చెరువులో ఎద్దులకు స్నానం చేయించడానికి వెళ్లిన యువకుడు పిడుగుపాటుతో మృతి చెందిన ఘటనలో జిల్లాలోని కుందగోళ తాలూకా హిరేనర్తి గ్రామంలో చోటు చేసుకుంది. హిరేహరకుణి గ్రామానికి చెందిన మైలారప్ప(18) అనే యువకుడు తాత ఇంటికి వచ్చిన వేళ ఈ దురంతం జరిగింది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు మధ్యాహ్నం ఎద్దులను చెరువు దగ్గరకు తీసుకెళ్లగా భారీ వర్షం కురిసింది. దీంతో పక్కన ఉన్న పొలంలోని వేపచెట్టు దగ్గర నిలబడగా పిడుగుపాటుతో మృతి చెందాడు. ఇతడికి కొంచెం దూరంలోనే నిలబడి ఉన్న మంజునాథ్ నాయక్‌ను కూడా పిడుగు తాకడంతో గాయాలయ్యాయి. తక్షణమే కుందగోళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేఎంసీకి తరలించారు. మృతుడు మైలారప్ప తల్లి ఫిర్యాదు మేరకు కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన కుందగోళ తహసీల్దార్ రాజు మాట్లాడుతూ దర్యాప్తు ప్రక్రియ ముగిశాక తక్షణమే జాతీయ విపత్తుల పరిహార నిధి ద్వారా రూ.4 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.మరో ఇద్దరికి గాయాలు -
దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు అనన్యమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నాడు రాజీవ్‌గాంధీ అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో విజ్ఞాన, సాంకేతిక రంగంలో సామాజిక దృష్టితో అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేంత స్థాయికి వివిధ రంగాలను తీర్చిదిద్దారన్నారు. దేశభద్రతను పటిష్ట పరిచే ప్రక్రియలో రాజీవ్‌గాంధీ చేసిన ప్రయత్నం మరువలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు చట్టప్రకారం రిజర్వేషన్లు, దళితులకు, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పదవులు లభించేలా చేశారన్నారు. కార్యక్రమంలో అమరేగౌడ, రుద్రప్ప, చేతన్, ఆంజనేయ, శంశాలం, శివమూర్తి, జయంత్రావ్లున్నారు. కాగా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరిస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒపెక్ ఆస్పత్రిలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. -
వైభవంగా కంచు మారెమ్మ జాతర
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచు మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి ఆలయం వద్ద వందలాది మంది భక్తుల సమక్షంలో ఊయల ఉత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం హుబ్లీ: జిల్లాలో సమగ్ర బాల వికాస అభివృద్ధి పథకంలో ఖాళీగా ఉన్న 23 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, అలాగే మొత్తం 97 అంగన్వాడీ సహాయకుల ఉద్యోగాల నియామకాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగల వారు జూన్ 18లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. వివరాలకు ధార్వాడ గ్రామీణ సీడీపీఓ కార్యాలయం, హుబ్లీ గ్రామీణ సీఈపీఓ కార్యాలయం, కలఘటిగి సీడీపీఓ కార్యాలయం, కుందగోళ, నవలగుంద కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎస్ సంకనూరు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలల మూసివేత తగదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ పేర్కొంది. బుధవారం జగ్జీవన్ రామ్ సర్కిల్లో చేపట్టిన 50 లక్షల సంతకాల సేకరణ సందర్భంగా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. పాఠశాలల మార్పునకు వినతిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 100 కన్నడ పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ స్కూల్(కేపీఎస్)లుగా ప్రకటించిన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉరూ పాఠశాలలను కేపీఎస్‌లుగా మార్చాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. సిరవార, మస్కి, కవితాళ, సింధనూరులో మొరార్జీ దేశాయి గురుకుల పాఠశాల, రాయచూరు, యరమరస్ క్యాంప్, ఆశాపూర్లలో మౌలానా ఆజాద్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను మంజూరు చేయాలని కోరారు. ధర్మ సందేశాలు పిల్లలకు నేర్పాలిరాయచూరు రూరల్: హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రామలింగేశ్వర ఆలయంలో జిల్లా బేడ జంగమ సంఘం ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి మంత్రోపచారణ, ఇష్టలింగ పూజ, ఆచమ, ఆగమ, ఇతర పురాణాలను శిబిరంలో నేర్పిన విద్య చిరకాలం ఉంటుందని తెలిపారు. శిబిరంలో శాంత మల్ల శివాచార్య, వీర సంగమేశ్వర స్వామి, పంపాపతి శాస్త్రి, శరణయ్య, బసవరాజ్‌లున్నారు. అలరించిన కరగ ఉత్సవం కోలారు : తాలూకాలోని సువర్ణహళ్లి గ్రామంలో రంగనాథస్వామి కళ్యాణోత్సవం, గంగాదేవి, మారికాంబా దేవి జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కరగ ఉత్సవం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈసందర్భంగా హసికరగ, పూల కరగ, అగ్నిగుండ ప్రవేశం, దీపోత్సవం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం విజయపుర (బిజాపుర) జిల్లాలో మనగోళి వద్ద షోలాపూర్– చిత్రదుర్గ హైవే–50 లో స్కార్పియో కారు డివైడర్‌కు ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో లారీ కూడా ఈ రెండు వాహనాలను ఢీకొంది. స్కార్పియో కారు తుక్కు తుక్కు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే బస్సు డ్రైవర్ బసవరాజ్ రాథోడ్ కూడా గాయాలతో మృతి చెందారు. బ్యాంకు మేనేజర్ కుటుంబం బలి స్కార్పియో వాహనంలో తెలంగాణకు చెందిన గద్వాల కెనరా బ్యాంక్ మేనేజర్ టి.భాస్కరన్, ఆయన భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు అభిరాం, డ్రైవర్ వికాస్ శివప్ప ప్రాణాలు కోల్పోయారు. వీరు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. భాస్కరన్ కుమారుడు ప్రవీణ్ తేజ, లారీ డ్రైవర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. విజయపుర జిల్లా ఎస్పీ, పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను, మృతదేహాలను విజయపుర ఆసుపత్రికి తరలించారు. బస్సును ఢీకొన్న స్కార్పియో వాటిని టిప్పర్ లారీ ఢీ 6 మంది మృత్యువాత స్కార్పియో డ్రైవరు, బ్యాంకు మేనేజర్, భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం బస్సు డ్రైవర్ సైతం మృతి -
బెంగళూరు– బీదర్ మధ్య స్పెషల్ రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు– బీదర్– బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ నుంచి నంబరు– 06589 రైలు రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్‌కు చేరుతుందన్నారు. అలాగే ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ నుంచి ( రైలు నంబరు 06590) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాద్గరి, షాహబాద్, కలబురిగి, హుమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్లకు 3ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయన్నారు. -
ఈడీ దాడులు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025హోం మంత్రి విద్యాసంస్థలపై తుమకూరులోని సిద్దార్థ వైద్య విద్యాలయం తుమకూరు: రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన హోం మంత్రి జీ.పరమేశ్వర్‌కు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆకస్మికంగా షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది. సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల మూడు కార్యాలయాలలో 30 మందికి పైగా ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నెలమంగల సమీపంలోని టీ.బేగూరు వద్ద ఉన్న సిద్దార్థ వైద్య కళశాల, తుమకూరులోని మరళూరులో ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ, హెగ్గెరె సమీపంలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలలో దాఖలాలు, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు. కాలేజీ వద్ద నియంత్రణ మూడు కార్లలో 10 మందికి పైగా ఈడీ అధికారులు తుమకూరులోని మరళూరు వద్ద ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీపై దాడి చేశారు. కాలేజీ లోపలకు మీడియా వారితో సహా ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. అలాగే టీ.బేగూరు, లగ్గెరెలోని విద్యాలయాలకు చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని బయటకు వెళ్లకుండా, కాల్స్ చేయకుండా నియంత్రించారు. వైద్య సీట్లపై నిఘా ఈడీ అధికారులు మెడికల్ సీట్ల ఫీజులు, దాఖలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈడీ వెంట భద్రతగా కేంద్ర బలగాలు వచ్చాయి, అలాగే కాలేజీల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో 2019లో మెడికల్ సీట్ల అక్రమాలు జరిగాయని సిద్దార్థ విద్యా సంస్థలపై ఐటీ దాడులు చేశారు. పరమేశ్వర్ పీఏను ఐటీ అధికారులు ప్రశ్నించారు, దీంతో ఆ పీఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దాడుల సమాచారాన్ని ఐటీవారు ఈడీకి ఇచ్చారని, వాటి కొనసాగింపే ఈ తనిఖీలని సమాచారం. తుమకూరుకు మంత్రి రాక ఈడీ దాడుల గురించి తెలియగానే హోం మంత్రి జీ.పరమేశ్వర్ భార్య కన్నికతో కలిసి బెంగళూరు నుంచి తుమకూరు సమీపంలోని టీ.బేగూరు, లగ్గెరెల్లోని మెడికల్ కాలేజీలకు వెళ్లారు. సోదాలు ఎందుకని ఈడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. తుమకూరు, నెలమంగల వద్ద వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు హుటాహుటిన తుమకూరుకు పరమేశ్వర్ రన్య రావుతో లింకులు? కొంతకాలంగా బంగారం స్మగ్లింగ్‌తో పేరుపొందిన రన్య రావు కేసుకు, ఈ దాడులతో సంబంధముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అది గుర్తించి ఈడీ దాడులు చేసిందని సమాచారం. రన్యకు మంగళవారమే బెయిలు రావడం తెలిసిందే. మరుసటి రోజే ఈడీ కదిలింది. దాడుల గురించి ఇంకా ఈడీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. -
నూతన పోలీస్ బాస్ సలీం
అడవినోదంస్మార్ట్ మీటర్లపై గవర్నర్‌కు ఫిర్యాదుబనశంకరి: ఇళ్లకు విద్యుత్ స్మార్ట్‌మీటర్ల కొనుగోలులో దోపిడీతో పాటు వినియోగదారులకు అన్యాయం జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం బీజేపీ నేతలు ఆర్.అశోక్, సీఎన్.అశ్వత్నారాయణ నేతృత్వంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి స్మార్ట్‌మీటర్ల టెండర్లలో కుంభకోణం జరిగిందని వినతిపత్రం ఇచ్చారు. ఆపై విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్‌మీటర్ల వల్ల కస్టమర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వేలాది కోట్లు లూటీ అయ్యాయి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం , ఇంధనశాఖ అధికారులు భాగస్వాములయ్యారని ఆరోపించారు. మీటర్ల ధర చాలా అధికంగా ఉందని, అర్హతలేని కాంటాక్టర్లకు అప్పగించారని చెప్పారు. ఈ కుంభకోణం గురించి గవర్నర్‌కు వివరించామన్నారు.శివాజీనగర: రాష్ట్ర నూతన డీజీపీగా సీఐడీ చీఫ్ డాక్టర్ ఎం.ఏ.సలీం నియమితులయ్యారు. డీజీపీ అలోక్‌మోహన్ బుధవారం ఉదయం రిటైరయ్యారు. పోలీస్ కవాతు మైదానంలో అట్టహాసంగా వీడ్కోలు వేడుక జరిగింది. ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా సలీంకు పగ్గాలు అప్పగించింది. కేంద్ర యూపీఎస్సీ ఆమోదం తరువాత పూర్తిస్థాయి డీజీపీని నియమిస్తారు. సీనియారిటీ ఆధారంగా ఐపీఎస్‌లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్, సలీం, సైబర్ విభాగం చీఫ్ ప్రణవ్ మొహంతి తదితర ఏడుమంది ఉన్నారు. సీనియారిటీలో ఠాకూర్‌ది అగ్రస్థానం. అయితే సిద్దరామయ్య సర్కారు సలీంకు కట్టబెట్టింది. బెంగళూరువాసే 1966 జూన్ 25న బెంగళూరులోని చిక్కబాణవారలో జన్మించిన సలీం ఎంబీఏ తరువాత పలు పీజీ కోర్సులు చేశారు. సివిల్స్‌లో ఉత్తీర్ణులై 1993లో కర్ణాటక కేడర్ ఐపీఎస్‌గా వచ్చారు. గుల్బర్గా, కొడగు తదితర జిల్లాల్లో పనిచేశారు. ఆయన బెంగళూరువాసి, మైనారిటీ కావడంతో కలిసివచ్చిందని సమాచారం. దేశంలో ఉత్తమ పోలీసులు దేశంలోనే కర్ణాటక పోలీస్ బెస్ట్ అని రిటైరైన డీజీపీ అలోక్ మోహన్ ప్రశంసించారు. కోరమంగల కేఎస్ఆర్పీ పరేడ్ మైదానంలో ఘనంగా వీడ్కోలు వేడుక జరిగింది. పోలీస్ శాఖలో 38 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా సేవలందించాను. కర్ణాటక పోలీస్ బలగాలు దేశంలో బెస్ట్ అని చెప్పేందుకు గర్వంగా ఉందని కొనియాడారు. తాత్కాలిక డీజీపీగా నియామకం -
రమణీయం.. రోకలి కరగ
మాలూరు: తాలూకాలోని కుడియనూరు గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి దేవాలయంలో కరగ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఒనకె (రోకలి) కరగ ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న రోకలిని తలపై నిలిపి దాని మీద రాగి పాత్రను నీటితో నింపి కరగ పూజారి మంజునాథ్ నృత్యమాడారు. సుమారు గంటకు పైగా నిర్వహించిన రోకలి కరగ నృత్యాన్ని చూస్తూ భక్తులు మైమరిచారు. ఆలయం పరిసరాలలో జాతర సందడి నెలకొంది. సిందూర్‌ను కించపరచొద్దు మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషంతోనే కాంగ్రెస్ నాయకులు ఆపరేషన్ సిందూర్ గురించి తేలికగా మాట్లాడుతున్నారు అని మైసూరు బీజేపీ మాజీ ఎంపీ ప్రతాప్ సింహ ఆరోపించారు. మైసూరులో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ చిన్నయుద్ధమని ఏఐసీసీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ చెప్పడం సరికాదన్నారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఎన్ని విమానాలు పోయాయి అంటున్నారు, నువ్వు చైనా, పాకిస్తాన్ ఏజెంటా అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చైనా ఆయుధాలను కొనడానికి ఎవరూ రావడం లేదన్నారు. భారతదేశ బ్రహ్మోస్ క్షిపణికి 14 దేశాలు నుండి డిమాండ్ వచ్చిందని చెప్పారు. మెట్రో చిక్స్ అల్లరి చేష్టలు బనశంకరి: వేలాదిమంది సంచరించే బెంగళూరు మెట్రో రైళ్లలో పోకిరీలు, కొందరు విద్యావంతులు కూడా రహస్యంగా మహిళా ప్రయాణికులను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెరిగిపోయింది. అల్లరిమూకలు మెట్రోస్టేషన్లు, రైళ్లలో సంచరిస్తూ యువతులు, మహిళల అసంబద్ధ ఫోటోలు, వీడియోలను క్లిక్ చేయడంతో పాటు అశ్లీల క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాలో అప్లోడ్ చేసినట్లు కనబడింది. 5 వేలమందికి పైగా ఫాలోయర్స్ కలిగిన మెట్రో చిక్స్ అనే అకౌంట్లో ఏప్రిల్ 11 నుంచి వీడియో, ఫోటోలను అప్లోడ్ చేశారు. గమనించిన బనశంకరి పోలీసులు స్వయంప్రేరితంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సూట్‌కేసులో బాలిక శవం● నగర శివార్లలో ఘోరం బనశంకరి: బాలికను హత్యచేసి తల–మొండెం వేరు చేసి సూట్‌కేసులో కుక్కి పడేశారు. ఈ భయానక సంఘటన బుధవారం ఆనేకల్ వద్ద చందాపుర రైల్వేపట్టాలపై కనపడింది. వెంటనే సూర్యనగర పోలీసులు, బయప్పనహళ్లి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన బాలిక వయసు 9, 10 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సూట్‌కేసును చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎవరో ప్రయాణికులు పడేసుకుని ఉంటారని పరిశీలించారు. అందులో ముక్కలైన బాలిక శవాన్ని చూసి అందరూ హడలిపోయారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలున్నాయి. పోలీసులు విచారణ చేపట్టారు. ఫ్యాక్టరీ సంపులో ఇద్దరు కార్మికుల మృతి తుమకూరు: కర్మాగారంలోని సంపును శుభ్రం చేయడానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు కార్మికులు ఊపిరాడక మరణించారు. ఈ దుర్ఘటన స్థానిక వసంతనరసాపుర పారిశ్రామికవాడలో బుధవారం జరిగింది. ప్రతాప్ (23), వెంకటేష్ (32), మంజణ్ణ (42), యువరాజ్(32) కర్మాగారంలోని లక్ష లీటర్ల సామర్థ్యమున్న సంపులోకి దిగి శుభ్రం చేస్తుండగా రసాయనాల తాకిడికి ఊపిరి ఆడక పడిపోయారు. మిగతా కార్మికులు చూసి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ప్రతాప్, వెంకటేష్ మరణించారు. మిగతా ఇద్దరు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. బాధితులందరూ జిల్లావాసులే. కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితుల బంధువులు ధర్నాచేశారు. కోరా పోలీసులు కేసు నమోదు చేశారు. -
అవినీతిపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు ఽథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో రూ.130 కోట్ల మేర జరిగిన అవినీతిపై విచారణ జరపాలని జయ కర్ణాటక సంఘం డిమాండ్ చేసింది. బుధవారం ఆర్టీపీఎస్ ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ మాట్లాడారు. స్యాండ్ బ్లాస్టింగ్, ఐపాక్స్ పెయింటింగ్ పనుల్లో నియమాలను గాలికొదిలి ఒకే కంపెనీకి 4 కాంట్రాక్ట్ పనులు కేటాయించారని ఆరోపించారు. ఆర్టీపీఎస్ అధికారులు భాగస్వాములై నాసిరకంతో పనులు చేపట్టి రాష్ట్ర సర్కారు ఖజానా నుంచి రూ.వందలాది కోట్లను లూటీ చేశారన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎండీకి వినతిపత్రం సమర్పించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలిబళ్లారిఅర్బన్: జిల్లాతో పాటు తాలూకాలోని ప్రైవేట్ పరిశ్రమల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సువర్ణ కర్ణాటక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లాధికారికి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాలూకాలోని హలకుంది, హరగినడోణి, జానెకుంటె, వేణివీరాపుర, తోరణగల్లు, బెళగల్లు, శిడిగినమొళతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కర్మాగారాల్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్రేతరులే ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే ఆయా కర్మాగారాల్లో పని చేసే స్థానికుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండగా, బయట రాష్ట్రాల వారు గరిష్ట సంఖ్యలో ఉన్నారన్నారు. నేల, నీరు, ఊరు మనది. అయితే ఇక్కడ పని చేస్తున్న వారు మాత్రం స్థానికేతరులు ఎక్కువేనన్నారు. ఇది శోచనీయమైన విషయం అన్నారు. స్థానికులకు అవకాశం కల్పించాలి లేకుంటే జిల్లా పరిధి నుంచి కర్మాగారాలను తరలించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు వేలాది సంఖ్యలో ఉన్నారు. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ ఆయా ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పించాలని ఆయన ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. వేదిక జిల్లాధ్యక్షుడు, ఇతర పదాధికారులున్నారు. 29న ఇందిరా క్యాంటీన్ ప్రారంభంకేజీఎఫ్ : పేదల ఆకలి తీర్చేందుకు నగరంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను ఈ నెల 29వ తేదీన జిల్లా ఇన్చార్జ్ మంత్రి భైరతి సురేష్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. బుధవారం ఆమె నగరంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న ప్రభుత్వ స్థలంలో రూ. కోటితో ఇందిరా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చి వచ్చే పేదలకు ఈ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందిరా క్యాంటీన్‌కు మెరుగులు దిద్దడం కోసం నగరసభ నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. టిఫిన్ రూ.5, భోజనం రూ.10తో అందజేస్తారని తెలిపారు. నగరసభ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు వళ్లల్ మునిస్వామి ఉన్నారు. పరిసరాలను నిర్లక్ష్యం చేయొద్దుకోలారు : ప్రతి ఒక్కరూ సంపాదనలో పడి ప్రకృతిని, పరిసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది ప్రమాదకర పరిణామమని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ రవి అన్నారు. వాతావరణ పరిస్థితులపై నగరంలోని పాత్రికేయుల భవనంలో గ్రామ వికాస సంస్థ, పాత్రికేయుల సంఘం, భారతీయ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ప్రజలకు సరైన రీతిలో తెలియజేయాల్సిన బాధ్యత విలేకరులపై ఉందన్నారు. వదంతులను ప్రచారం చేయకుండా వాస్తవాంశాలను ప్రజల ముందుంచాలన్నారు. పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీవీ గోపినాథ్, వాతావరణ శాఖ డైరెక్టర్ కేజీ రమేష్, బెంగళూరు ఎంసీ యోజనా విజ్ఞాని షేక్దర్గా సాహెబ్, రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు కేఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర: మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికై నా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. మునిరత్న, అనుచరులపై బీజేపీ మహిళా కార్యకర్త ఫిర్యాదు -
బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. -
నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో!
సాక్షి,బెంగళూరు: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో (sbi) ప్రాంతీయ (language row) భాష చిచ్చు పెట్టింది. ఎస్బీఐ మేనేజర్ తమ మాతృ భాషలో మాట్లాడడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. ఈ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు సైత్యం జోక్యం చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు సదరు మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్బీఐ చర్యలకు ఉపక్రమించింది.ఇంతకీ ఏం జరిగిందంటే? కర్ణాటక రాజధాని బెంగళూరు సూర్యా నగర్ ఎస్బీఐ (SBI Surya Nagar branch Bangalore) బ్రాంచ్‌లో కస్టమర్‌కు, మహిళా బ్యాంక్ మేనేజర్ మధ్య వివాదం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ వీడియోల్లో బ్యాంక్ మేనేజర్‌ను పదేపదే కన్నడలో (kannada language row) మాట్లాడమని కస్టమర్ సూచించడం, అందుకు బ్యాంక్ మేనేజర్ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి’ అంటూ కస్టమర్, బ్రాంచ్ మేనేజర్ మధ్య సంభాషణ జరిగింది. 🚨 Karnataka's divisive language war!SBI manager in Chandapura unfairly targeted for not speaking Kannada.India’s diversity means we can’t force one language—Hindi & English are official too.Let’s respect all tongues & unite, not vilify!🇮🇳#sbimanager #Kannada #Karnataka… pic.twitter.com/nv0Rd5W6Yr— Rahul Kumar (@RealRavani) May 21, 2025 అలా అని రాసుందా?ఒకానొక సమయంలో ‘మేమేం చేయాలో మీరు చెప్పడం కాదని బ్యాంక్ మేనేజర్..కస్టమర్‌తో అనడం. భాష విషయంలో మళ్లీ జోక్యం చేసుకున్న కస్టమర్ మీరు హిందీలో కాకుండా కన్నడలో మాట్లాడమని బ్యాంక్ మేనేజర్‌కు సూచించడం.. అందుకు మేనేజర్ బదులిస్తూ..అలా అని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించడంతో మరింత వివాదం రాజుకుంది.ఇది కర్ణాటక.. కాదు ఇండియాకస్టమర్ బ్యాంక్ మేనేజర్ తీరును ప్రశ్నిస్తూ.. ఇది ఆర్బీఐ నిర్ణయం. మీరు ముందు అది తెలుసుకోండి. ఇది కర్ణాటక ఇక్కడ కన్నడే మాట్లాడాలి అని అనడంతో.. ఇది ఇండియా అని బ్యాంక్ మేనేజర్ జవాబు ఇవ్వడం వీడియోల్లో కనిపిస్తోంది.ఎస్బీఐ సూర్యానగర్ బ్రాంచ్‌లో జరిగిన వివాదంపై ఎస్బీఐ స్పందించింది. బెంగళూరులోని సూర్యనగర్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై మేం తీవ్రంగా విచారిస్తున్నాము. ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నాం. ఎస్బీఐ తన కస్టమర్ల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రవర్తనకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఎస్బీఐ మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. మరింత వివాదం ఎస్బీఐ బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్,క స్టమర్ మధ్య చోటు చేసుకున్న వివాదం రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. ప్రో-కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. ఎస్బీఐ సూర్యాపురం బ్రాంచ్ సిబ్బంది కన్నడ కస్టమర్లను అవమానిస్తోందని, స్థానిక భాషలో ప్రాథమిక సేవల్ని అందించడంలో విఫలమవుతున్నారని కేఆర్వీ ప్రతినిధులు ఆరోపించారు.A severe protest erupted today by the #KaRaVe members against the arrogant manager at the #SBIBank in #Chandapur, #Bengaluru!#ServeInMyLanguage #StopHindiImposition #KannadaInKarnataka https://t.co/K9HNZlsiYr pic.twitter.com/2WiFLdTiBD— Safa 🇮🇳 (@safaspeaks) May 21, 2025మరోవైపు, ఎస్బీఐ బ్యాంక్‌లో జరిగిన వివాదంపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా సంప్రదించారు. బ్రాంచ్ మేనేజర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. Many bank customers, especially in rural Karnataka, face extreme difficulty when banking staff - those that have a public interface - don’t communicate in local language. This is an issue faced by millions of customers in many states. After we raised this issue at multiple… https://t.co/msr6azNuFf pic.twitter.com/juFQyNq8uj— Tejasvi Surya (@Tejasvi_Surya) May 21, 2025The behaviour of the SBI Branch Manager in Surya Nagara, Anekal Taluk refusing to speak in Kannada & English and showing disregard to citizens, is strongly condemnable.We appreciate SBI’s swift action in transferring the official. The matter may now be treated as closed.…— Siddaramaiah (@siddaramaiah) May 21, 2025 -
నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యాసంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. ఈడీ అధికారులు దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.Watch: The Enforcement Directorate (ED) is conducting raids and inspections at Siddhartha Institute of Technology and Siddhartha Medical College in Tumakuru, owned by Karnataka's Home Minister G. Parameshwara. The operation began around 9:30 AM today, with five teams involved in… https://t.co/xggph2I2Dh pic.twitter.com/QJ3AMuEcWc— IANS (@ians_india) May 21, 2025రన్యారావు పెళ్లికి సీఎం,హోమంత్రిమార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు తర్వాత,కర్ణాటక మంత్రులు,మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి.రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,హోమంత్రి పరమేశ్వరలు పెళ్లికి హాజరైన ఫొటోలో వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాజకీయ రంగుపులుముకుంది. స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది.రన్యారావుతో సంబంధాలు.. ఖండించిన డిప్యూటీ సీఎం డీకేఆ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రన్యారావుకు బెయిల్బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్‌పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు. -
ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..
ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, బెంగళూరులో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బెంగళూరులో దాదాపు 36 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదారుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. Thankyou @mybmc for this wonderful treatment! #MumbaiRains #WeatherAlert Location: Andheri E, Near Subway pic.twitter.com/JRur1BRPPR— Bhairavi Wamorkar (@Bhaiiravii) May 20, 2025అలాగే కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.Pre-monsoon and Mumbai is already drowning. All of Modi’s grand claims to make it a high-tech city are floating in floodwater. Any responsible Prime Minister would’ve resigned seeing this state but here, not even a single tweet for Mumbaikars’ safety#Mumbai#MumbaiRains pic.twitter.com/x6bSfufPBx— Pritesh Shah (@priteshshah_) May 20, 2025మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు నగరంలోని మాన్యత టెక్ పార్క్, సిల్క్ బోర్డ్ జంక్షన్లలో వంటి ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నిలిచిపోయింది. వాహనాలు మొరాయించడంతో వాహన దారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో మరణాల సంఖ్య అయిదుకు చేరింది. సాయి లేఔట్లోకి భారీగా వరద చేరడంతో చిన్నపాటి దీవిని తలపిస్తోంది. నివాసాల్లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నీరు చేరడంతో అందులోని వారు బయటకు రాలేక, లోపల ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఆ లేఔట్‌లోని కనీసం 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికి అధికార యంత్రాంగం ఆహారం, నీరు సరఫరా చేసింది. వరదతో నిండిన హెన్నూర్ అనాథాశ్రమంలోని వారిని కూడా కాపాడారు. ఇలా ఉండగా, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. INCKarnataka promised: Brand BengaluruWhat @INCKarnataka delivered:Beach Bengaluru#CongressFailsKarnataka #BangaloreRains pic.twitter.com/YJrlbrJEM1— Naveen Kamadolli (@NaveenKamadolli) May 19, 2025 Why companies are building in Bangalore when taxes are not used in Infrastructure.It's time to rethink#BangaloreRains pic.twitter.com/4qWNnz1BlA— Anshul Garg (@AnshulGarg1986) May 20, 2025 -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. -
నిత్యావసరాల ధరలు తగ్గించండి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని జేసీటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి శరణ బసవ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను లూటీ చేసిందన్నారు. నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, వక్ఫ్ బిల్లును, లేబర్ కోడ్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ గవర్నర్‌కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శ్రీశైలరెడ్డి, కాశప్ప, పద్మ, వీరేష్, నరసింహ, లక్ష్మణ, గోకారమ్మ, ఇందిర, చంద్రకళ, భీమప్ప, విజయలక్ష్మి, హులిగప్ప, మల్లికార్జునలున్నారు. -
రుణాలిప్పిస్తామని నమ్మించి మోసం
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో మోసపోయిన స్వయం సహాయక సంఘాల మహిళలు బైలువద్దిగేరి జీపీ సభ్యులు, మాజీ అధ్యక్షులు సహా 19 మంది విజయనగర జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం హొసపేటె నగరంలో ప్రియాంక మహిళా పరపతి సహకార సొసైటీని ప్రారంభించి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ అందించి మోసగించిన సహకార సంఘానికి చెందిన ప్రియాంక జైన్, తాయమ్మదేవి శక్తి సంఘం అధ్యక్షురాలు కవితా ఈశ్వర్ సింగ్, ఆమె సన్నిహితురాలు లలితమ్మ, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. సీపీఎం నాయకులు భాస్కర్‌రెడ్డి, యల్లాలింగ, దళిత హక్కుల కమిటీ నాయకులు మరడి జంబయ్య నాయక, బీ.తాయప్ప నాయక, బీ.రమేష్‌కుమార్, సూర్యనారాయణ, డీవైఎఫ్ఐ నాయకులు ఈడిగర మంజునాథ్, వడ్డరహళ్లి స్వామి, తిరుకప్ప తదితరులు హాజరై నిందితులకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని, ఫిర్యాదుదారులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు శాఖ అధికారులను వారు కోరారు. జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు -
మూడేళ్లుగా ఫలితాలు పెండింగ్
రాయచూరు రూరల్: కలబుర్గి విశ్వ విద్యాలయంలో డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించడంలో జాప్యం చేస్తోందనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. విద్యాభ్యాసం ముగించుకొని ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనుకునే వారి ఆశలకు విశ్వ విద్యాలయం గండి కొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో పరీక్ష పేపర్లు చోరీ అయ్యాయనే ఆరోపణలున్న నేపథ్యంలో నేడు ఫలితాలను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కలబుర్గి విశ్వ విద్యాలయం పరీక్ష సుధారణ సమితి విచారణలో సమాధాన పత్రాల మూడు బ్యాచ్‌ల విద్యార్థుల మార్కులు, ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. కలబుర్గి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శ్రీరాములు వివరిస్తూ డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామన్నారు, నకిలీ మార్కుల జాబితాల కేసు విషయంలో లోకాయుక్త అధికారుల విచారణతో జాప్యమైందన్నారు. ఈ విషయంలో విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి రోజు 200 మంది విద్యార్థులు వర్సిటీ క్యాంపస్‌లో ఉండి ఫలితాలు ప్రకటించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం పరీక్ష సుధారణ సమితి ఏర్పాటైన సమయంలో 16 వేల మంది విద్యార్థుల ఫలితాల్లో కేవలం 9,024 మంది విద్యార్థుల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో పరీక్షలు నిర్వహించామన్నారు. ఫెయిలైన వారికి పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యమైందన్నారు. పరీక్షలు ముగిసిన 45 రోజుల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు. 9,024 మంది పరీక్షార్థుల ఎదురుచూపులు అంధకారంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కలబుర్గి విశ్వవిద్యాలయం నిర్వాకం -
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ
సాక్షి,బళ్లారి: శబరిలోని అయ్యప్ప స్వామి ఆలయం తరహాలో బళ్లారిలో అద్భుతంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ, పుష్పాభిషేకం, కుంభాభిషేకంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని రాఘవేంద్ర కాలనీలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రముఖులు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు అధ్యక్షుడు జయప్రకాష్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలోని బాల రాముడిని తయారు చేసిన విగ్రహ రూపకర్త, మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా తయారు చేసిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట, కుంభకోణం అవార్డు విన్నర్ రామ్ కుమార్‌తో పంచలోహాలతో తయారు చేసిన దేవి విగ్రహాలను బెంగళూరుకు చెందిన వాసవీ పీఠానికి చెందిన సచ్చిదానంద సరస్వతీ చేతుల మీదుగా ప్రతిష్టాపనతో కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి శబరిమలై మూలస్థానం అర్చకులైన శ్రీరంగం శరణ్ మోహన్ పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేషమైన పుష్పాభిషేకం, 18 మెట్లకు పడిపూజ చేయడంతో పాటు అయ్యప్పస్వామి విగ్రహానికి 18 రకాలుగా పుష్పాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుష్ప, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
● బెంగళూరులో విషాదం దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. యాత్రకు వెళ్తే, ఇల్లు ఖాళీ మైసూరు: మైసూరులోని దొంగతనాలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ ఒక చోరీ చొప్పున జరుగుతోంది. ఓ ఇంట్లో దొంగలు చొరబడి లక్షల విలువైన నగలు, నగదును దోచుకున్న సంఘటన తాలూకాలోని చిక్కళ్లి లో జరిగింది. మాదప్ప దంపతులు మంత్రాలయానికి దర్శనానికి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి, బీరువా, అల్మరాలలో దాచిన రూ. 7.80 లక్షల నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలను కనిపించలేదు. మాదప్ప అల్మరా వద్ద తాళాలను భద్రపరిచాడని, అది తెలిసిన దొంగలు తాళాలు సేకరించి పని కానించినట్లు అనుమానాలున్నాయి. సమాజ సేవ విస్తరించాలి మండ్య: ప్రపంచంలో సమాజ సేవ చేసేవారి సంఖ్య పెరగాలని, సమాజ సేవ ద్వారా సామాన్య ప్రజల కన్నీటిని తుడవాలని, అప్పుడే సమాజంలో సంతోషం వెల్లివిరుస్తుందని ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి అన్నారు. మంగళవారం మండ్య జిల్లా కేఆర్ పేటెలో ఆర్టీఓ మల్లికార్జున చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, సేవాతత్పరులకు సన్మానం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం సంతోషకరమన్నారు. నేను, నా కుటుంబం అని కాకుండా సమాజం కోసం కూడా ఉపయోగపడాలని సూచించారు. సమాజ సేవకులకు గొప్ప ధైర్యం ఉండాలని అన్నారు. బాల్కనీలో చదువుతూ కింద పడి.. మైసూరు: మైసూరులోని మండి మొహల్లాలోని ఎస్ఆర్ రోడ్డులో అక్షత అపార్ట్మెంట్లో ఒక యువతి ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. మొదటి అంతస్తులో షేక్ అలీ కుటుంబం ఉంటోంది. కుమార్తె అనిక (20) మైసూరులో కళాశాలలో బిబిఏ చివరి ఏడాది చదువుతోంది. సోమవారం రాత్రి బాల్కనీలో తిరుగుతూ చదువుతోంది. మంగళవారం ఉదయం బాల్కనీ కింద యువతి మృతదేహం కనిపించింది. బాల్కనీ నుంచి పడిపోవడంతో తలకు బలమైన గాయం కావడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఓ చేత్తో పుస్తకం పట్టుకుని, మరో చేత్తో ఫోన్ చూస్తూ ఉందని, ఆ సమయంలో పట్టుతప్పి పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మండి పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు. -
భారీ వర్షం.. రోడ్లు జలమయం
అణ్ణిగేరి పురసభ హస్తగతం ● అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం హుబ్లీ: అణ్ణిగేరి పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎస్టీ అభ్యర్థి శివానంద అధ్యక్షుడిగా, బీసీఏ కేటగిరికి చెందిన నాగప్ప దళవాయి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎన్‌హెచ్.కోనరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరూ సామానులే అన్నారు. శాసకాంగం, కార్యాంగం సంయుక్తంగా పని చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సూచించారు. తహసీల్దార్ మంజునాథ్, సీఐ రవికుమార్, రెహమాన్ సాబ్, మంజునాథ్, పురసభ ముఖ్యాధికారి వైజీ.గద్దిగౌడరు, పురసభ సభ్యులు పాల్గొన్నారు. కాగా పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న పురపాలక నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేపట్టారు. మంగళవారం ప్రభులింగ బృహన్మఠంలో కిల్లె మఠాధిపతి శాంతమల్ల శివాచార్య 22వ పట్టాధ్యక్షుడు ప్రభులింగ శివాచార్యుల మూల విరాట్‌కు అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళళహారతి నెరవేర్చారు. అనంతరం ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేశారు. గబ్బూరు మఠాధిపతి బూదిబసవ శివాచార్యులు, సుల్తాన్పుర మఠాధిపతి శంభు సోమనాథ శివాచార్యులు, రేణుకాచార్య, శరణయ్యలున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. 26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆందోళన హుబ్లీ: గత 30 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న గ్రంథాలయ పర్యవేక్షకులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో నిరవధిక ఆందోళన చేపడుతున్నారు. అరివు కేంద్రం గ్రంథ పాలకులను గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులుగా ఆదేశాలు వెల్లడించి ఒకే నియమావళిని రూపొందించాలి లేకుంటే తమను మాతృశాఖ ప్రజా గ్రంథాలయ శాఖకు పంపించాలి. పూర్తిగా కనీస వేతనాలను ప్రతి నెల 5వ తేదీలోగా నేరుగా వారి ఖాతాలకు చెల్లించాలి. గ్రాచ్యుటీ, పింఛన్ సౌకర్యం కల్పనతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ ఆందోళన చేపట్టినట్లు ఆ సంఘం ధార్వాడ జిల్లాధ్యక్షుడు యల్లప్ప బోవి ఓ ప్రకటనలో తెలిపారు. జీవితంలో భక్తిభావం పెంచుకోవాలి రాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సనాతన సంస్థ సంస్థాపకుడు సచ్చిదానంద అథవాలే పిలుపు ఇచ్చారు. సోమవారం గోవాలోని పోండాలో మూడు రోజుల పాటు జరిగే సనాతన శంఖునాద మహోత్సవాలను ప్రారంభించి సభికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిడితో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. కొంత సమయాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. ప్రతి ఆలయంలో ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో 23 దేశాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మందికి పైగా సాధకులు హాజరయ్యారు. సభలో సత్శక్తి, బిందా నీలేష్ సింగబాళ, అంజలి, చిత్శక్తిలున్నారు. ఉద్యోగాల పేరుతో వంచన ● ముంబై వాసి అరెస్ట్ యశవంతపుర: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసిన ముంబైకి చెందిన మసీవుల్లా అతివుల్లాఖాన్(36) అనే నిందితుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు నగర పోలీసుకమీషనర్ అనుపమ్ అగర్వాల్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుడు అతివుల్లాఖాన్ పలువురు నిరుద్యోగులకు వల వేసి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తనని ఆశ పెట్టాడు. ఓ నిరుద్యోగి వద్దనుంచి రూ.1.65 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు మంగళూరు తూర్పు పోలీసుస్టేషన్లో 2024 డిసెంబర్లో ఫిర్యాదు చేశాడు. అయితే కేసు దర్యాప్తులో సీఐ సోమశేఖర్, విచారణాధికారి ఎస్ఐ ఉమేశ్ నిర్లక్ష్యం వహించారు. అప్పట్లో వీరిద్దరూ సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఈకేసుపై పోలీసులు దృష్టి సారించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. పలువురి నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గతవారం రోజులుగా నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోయారు. ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు, ఆపై చల్లని వాతావరణం, అక్కడక్కడ మాత్రం చిరుజల్లులు కురిసేవి. ఇలాంటి తరుణంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినా ఉదయం 10 గంటలైనా వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మరి కొన్ని చోట్ల వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బైపాస్ రోడ్డుపై నిలిచిన వాహనాలు -
పసిడి స్మగ్లింగ్ కేసులో రన్యరావుకు బెయిలు
బనశంకరి: సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో అరైస్టెన నటి రన్య రావు కు బెంగళూరు ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్‌ను మంజూరు చేసింది. మార్చి 3వ తేదీన బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రన్య రావును సోదాలు చేయగా 14.8 కేజీల బంగారం లభించడంతో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తీసుకొస్తూ ఆమె పట్టుబడింది. కేసు నమోదు చేసి కొన్నిరోజుల పాటు తీవ్రంగా ప్రశ్నించారు. తరువాత పరప్పన అగ్రహార జైలుకు రిమాండు తరలించారు. పలుమార్లు ఆమె బెయిలు పిటిషన్లు దాఖలు చేయగా, ఎట్టకేలకు లభించింది. ఆమెతో పాటు అరెస్టయిన తరుణ్ రాజుకు ఇంకా బెయిలు దొరకలేదు. ఐశ్వర్య బెయిలు అర్జీ వాయిదా బెంగళూరులో బంగారు షాపుల నుంచి భారీ మొత్తంలో నగలు కొట్టేసిన కేసులో అరైస్టెన ఐశ్వర్య గౌడ బెయిల్ పిటీషన్ విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఐశ్వర్య వేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. అరెస్ట్‌కు సరైన కారణం చూపలేదని ఆమె వకీలు వాదించారు. ఈడీ న్యాయవాది వాదనలకు సమయం కోరడంతో వాయిదా వేశారు. -
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
శివాజీనగర: రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ అధికారావధి బుధవారం ముగుస్తోంది, ఇక కొత్త పోలీసు బాస్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. సీనియర్లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్, ఎం.ఏ.సలీం ఇద్దరిలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులోనే అలోక్ మోహన్ పదవీకాలం ముగిసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మే 21 వరకు విస్తరించింది. మళ్లీ పొడిగింపు లేనందున కొత్త డీజీపీని నియమించడం సిద్దరామయ్య ప్రభుత్వానికి అనివార్యమైంది. రేసులో ఎవరెవరు? ● సీనియర్ ఐపీఎస్‌లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్ బిహార్‌వాసి కాగా, ఎం.ఏ.సలీం బెంగళూరువాసి. సలీం కంటే ఠాకూర్ సుమారు ఏడాది సీనియారిటీని కలిగి ఉన్నారు. ● మహిళా ఐపీఎస్ మాలిని కృష్ణమూర్తి కూడా రేసులో ఉన్నట్లే లెక్క. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని వాస్తవ్యులు, దీనిని బట్టి బిహారి, కన్నడిగ, తెలుగువారు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు. ● ఈ ముగ్గురిని మినహాయిస్తే మరో ఐపీఎస్ కే.రామచంద్రరావుకు కూడా అవకాశం ఉండింది. అయితే ఆయన పెంపుడు కూతురు, నటి రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావడంతో ఆయనను సర్కారు సెలవు మీద పంపింది. దీంతో అవకాశం దూరమైంది. ● అలాగే ప్రణవ్ మొహంతి, దూకుడు ఐపీఎస్ అలోక్ కుమార్ వీరి కంటే కొంచెం జూనియర్లు అయినందున పదవి రాకపోవచ్చని భావిస్తున్నారు. నేడు డీజీపీ అలోక్ మోహన్‌కు వీడ్కోలు డీజీపీ అలోక్ మోహన్‌కు నగరంలోని కోరమంగల కేఎస్ఆర్పీ కవాతు మైదానంలో బుధవారం ఉదయం 8 గంటలకు వీడ్కోలు వేడుక జరుగుతుంది. అందరు ఐపీఎస్‌లు పాల్గొని ఆయనను సాగనంపుతారు. రేసులో ఠాకూర్, సలీం, మాలిని నేడు అలోక్ మోహన్ ఉద్యోగ విరమణ -
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం
హొసపేటె: ఎన్నికల వేళ మేం ఇచ్చిన హామీల్లో ఐదు గ్యారంటీలతో పాటు రెండేళ్లలో 142 హామీలు నెరవేర్చాం. తదుపరి మూడేళ్లలో మిగిలిన హామీలను పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన సమర్పణ సంకల్ప సమావేశంలో 1,11,111 కుటుంబాలకు హక్కు పత్రాలను పంపిణీ చేసి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రతిమను లోకార్పణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం అన్ని కులాల శాంతి తోట అని, అందరినీ సమానంగా గౌరవించే రాష్ట్రం అని సీఎం అన్నారు. రాష్ట్రంలో జేడీఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. అయినా బీజేపీ ఇంతవరకు సొంత శక్తితో అధికారంలోకి రాలేదన్నారు. ఆపరేషన్ కమల చేసి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 1.22 కోట్ల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద రూ.2 వేలను, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ను, మొత్తం రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించామని అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అంతకు ముందు నగరంలోని బసవేశ్వర సర్కిల్ నుంచి జానపద కళాకారుల బృందం ఊరేగింపును క్రీడా మైదానం వరకు చేపట్టారు. వివిధ తాలూకాల నుంచి వచ్చిన కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజన వ్యవస్థ కల్పించారు. సమావేశానికి వర్షం ఆటంకం సాధన సమావేశానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే భారీగా వర్షం కురువడంతో సమావేశం జరుగుతున్న మైదానం తడిసి ముద్దయింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు వర్షం తాకిడితో తడిచి పోయారు. సమావేశం వేదిక లోపలకు వర్షం నీరు చేరింది. భారీ వర్షానికి బ్యానర్లు, కటౌట్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిలా మారింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సందడిగా సంకల్ప సమావేశం -
వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం
● లోతట్టు ప్రాంతాలను వీడని ముంపు ● కొనసాగుతున్న సహాయక చర్యలు ● కుదేలైన సిలికాన్ సిటీ ● మూడురోజులుగా వానలే వానలు బనశంకరి: గత మూడు రోజులుగా బెంగళూరు నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనం కడగండ్లు పడుతున్నారు. ఉప్పొంగిన డ్రైనేజీలు, మునిగిన కూడళ్లు, ఇళ్లలోకి వచ్చిన నీరు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు మళ్లీ వర్షం వచ్చింది. విరామం ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు కురిసింది. నగరవ్యాప్తంగా పలు లేఔట్లలో ముంపు ఏర్పడింది. చెట్లు కూలిపడ్డాయి, మరో పక్క పాత కట్టడాలు కూలిపోయే భయం ఉండడంతో అందులోని నివాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పాత ఇళ్లను ఖాళీ చేయాలి ఉదయమే వానతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. సిటీలో 10 కిపైగా ప్రాంతాలు ఎక్కువ జలమయమయ్యాయి. పాత కట్టడాల్లో నివసించే నివాసులు ఖాళీ చేయాలని బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. అయితే ఇల్లు వదిలి ఎక్కడకు వెళ్లాలని చాలామంది ప్రశ్నించారు. పద్మనాభనగరలో ఓ భారీ చెట్టు కూలి ఇంటి మీద పడడంతో ఇల్లు ధ్వంసమైంది. సాయిలేఔట్కు కటకట ● హొరమావులోని సాయిలేఔట్ పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను ట్రాక్టర్లు, రబ్బరు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. ● మారతహళ్లి దీపా నర్సింగ్‌హోమ్, చిన్నప్పనహళ్లి 5వ క్రాస్, పణత్తూరు రైల్వే అండర్‌పాస్, గ్రీన్‌హుడ్, ఇబ్బలూరు జంక్షన్, బాలాజీ లేఔట్, కొత్తనూరు, ఏ.నారాయణపుర కృష్ణనగర, సునీల్ లేఔట్, హరళూరు, బీఎస్పీలేఔట్, మహదేవపుర వలయంలోని అనేక లేఔట్లు నీటమునిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. ● ఇన్ఫ్యాంట్రీరోడ్డు హిందూ ప్రెస్ సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. వర్షం వల్ల సిల్క్‌బోర్డు, రూపేన అగ్రహార మధ్య హోసూరు రోడ్డు ఫ్లై ఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాలి. ● కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద చెట్టుకొమ్మ పడి మేక్రీ సర్కిల్ వరకు వాహనాలకు ఆటంకం ఏర్పడింది. కస్తూరినగర రింగ్‌రోడ్డు గ్రాండ్ సీజన్ హోటల్ వద్ద నీరు నిలిచింది. పలు రోడ్లు బంద్ మడివాళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయ్యప్ప అండర్‌పాస్‌లో నీరు నిండిపోవడంతో హోసూరు మెయిన్ రోడ్డులో నగరం నుంచి రాకపోకలు దాదాపు స్తంభించాయి. హోసూరు మెయిన్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు జలమయమైంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సంచరించాలని పోలీసులు తెలిపారు. బన్నేరుఘట్టరోడ్డు ద్వారా నగరంలోకి రావచ్చు. హొసగుడ్డెదహళ్లి జంక్షన్ నుంచి మైసూరురోడ్డు టోల్గేట్ వర్షంనీరు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదించింది. బెంగళూరు సిటీలో ఏయే రోడ్లు జలమయం జయదేవ ఆసుపత్రి వైపు నుంచి ఈస్ట్ఎండ్ సర్కిల్ వరకు వర్తూరు కాలేజీ వైపు నుంచి వర్తూరు మరవ వరకు కాటన్‌పేటే నుంచి సుల్తాన్పేటే సర్కిల్ వరకు బీలేకహళ్లి వైపునుంచి జీడీమర వరకు సారక్కి జంక్షన్ నుంచి సింధూర జంక్షన్ వరకు -
కోర్టుకు దర్శన్, పవిత్ర
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితులు నటి పవిత్రగౌడ, నటుడు దర్శన్ మంగళవారం బెంగళూరులో నగర 57వ సిసిహెచ్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసును విచారించిన జడ్జి జూలై 10 కి వాయిదా వేశారు. కాగా, పవిత్రగౌడ 15 రోజులు వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి జడ్జి అనుమతించారు. నంబర్ అడిగిన పవిత్ర విచారణ ముగించుకుని లిఫ్ట్‌లో వెళుతుండగా, దర్శన్ ఫోన్ నంబర్ కావాలని పవిత్రగౌడ పట్టుబట్టింది. చేయి పట్టుకొని మొబైల్ నంబర్ అడిగి డయల్ చేయించుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో అరెస్ట్, విడుదలైన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మాట్లాడుకోవడం లేదని సమాచారం. మరో చార్జీషీట్ దాఖలు హత్య కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలను అదనంగా చేర్చి కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మరో చార్జిషీటును కోర్టులో సమర్పించారు. -
వాడవాడలా ముంపు గోల
ఉద్యోగుల ఇక్కట్లు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేనందున మంగళవారం పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. అయితే అలాంటి సదుపాయం లేని వేలాది ఉద్యోగులు ఉరుకుల పరుగుల మీద ఆఫీసులకు వెళ్లడం కనిపించింది. వాననీటిలో దాటడానికి పాట్లు పడ్డారు.● నీళ్ల మధ్యలో జనం అవస్థలు ● హొరమావు సాయిలేట్, మాగడిరోడ్డు కేపీ అగ్రహారతో పాటు పలు ప్రాంతాలు జలమయం కాగా, స్థానిక నివాసుల కష్టాలు చెప్పనలవి కాదు, ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు నానా బాధలు పడుతున్నారు. బైక్‌లు, కార్లు ఎక్కడివక్కడ చిక్కుకుపోయాయి. ● అపార్టుమెంట్ల వాసులు కిందకు రాలేకపోతున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. పై అంతస్తుల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకువస్తున్నారు. ● మామూలు ఇళ్లలో నీరు చేరగా, చేతికి దొరికింది తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తాపత్రయపడుతున్నారు. ట్రాక్టర్లు, జేసీబీల తొట్టెల్లో ప్రజలను తరలిస్తున్నారు. కానీ ఈ వాహనాలు ఏమాత్రం చాలడం లేదు. ఇక తాళం వేసిన ఇళ్లకు, షాపులకు దొంగల భయం ఏర్పడింది. ● మంగళవారం ఫైర్ సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది పంపుసెట్లు పెట్టి నీటిని తొలగించడంలో నిమగ్నమయ్యారు. కూలిన చెట్ల తొలగింపు సాగుతోంది. ముంపు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతాయని విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ● సెంట్రల్ సిల్క్ బోర్డు, మడివాళ, బొమ్మనహళ్లి ప్రదేశాల్లో పలు రోడ్లు నీటమునిగి వాహనాలు కదలడం లేదు. సంపంగిరామ నగరలో కంఠీరవ స్టేడియంలోకి నీరు చేరింది. పంపుసెట్లతో నీటిని తొలగించారు. -
మఠాల సేవలు ప్రశంసనీయం
హుబ్లీ: భారతీయ సంస్కృతిలో మఠాలకు ప్రత్యేక గౌరవం ఉంది, ఎన్నో మఠాలు పిల్లలకు భోజన వసతితో పాటు ఉచిత విద్యాభ్యాసం కల్పించడం ప్రశంసనీయం అని, వారి సేవలను సదా గుర్తు పెట్టుకోవాలని కుందగోళ ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన కుందగోళ తాలూకాలోని జిగళూరు గ్రామంలో సద్గురు శేషాచార్య గురువుల మఠం నిర్మాణం కార్యక్రమానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.4 లక్షలు కేటాయించి భూమిపూజ నెరవేర్చిన అనంతరం మాట్లాడారు. జిగళూరు మఠానికి అభివృద్ధి చెందిన ఇతర మఠాల మాదిరిగా అన్నదానం చేసేంత శక్తి కలగాలని ఆకాంక్షించారు. జిగళూరు మఠం కూడా మరింతగా ఎదగాలని, గ్రామానికి మేలు జరగాలని కోరారు. ప్రముఖులు మాలతేష్, మంజునాథ పాటిల్, జగదీశ్, తమ్మణ్ణ, రేవణ్ణప్ప కట్టి పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని సీనియర్ యోగా సాధకుడు భవర్లాల్ అన్నారు. మంగళవారం ఎల్‌వీడీ కళాశాల మైదానంలో పతంజలి యోగా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందన్నారు. యోగా ధ్యానంతో మానవుడి ఆయుష్షు వృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిరంతరం యోగా, ధ్యానం చేయాలన్నారు. విఠోబ, పరమేశ్వర సాలిమఠ, రుతుగౌడ, అరుణలున్నారు. రేపు సామాజిక నాటక ప్రదర్శన బళ్లారిఅర్బన్: రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకర్లతోట కనుగోలు తిమ్మప్ప 25వ వర్ధంతిని ఏర్పాటు చేశారు. రాఘవ కళా మందిరంలో ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బళ్లారి రంగ సంస్కృతి సారథ్యంలో సంపద అనే తెలుగు సామాజిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటకాన్ని వైఎస్.కృష్ణేశ్వరరావు రచించగా, లాల్‌రెడ్డి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని కర్ణాటక రైతు సంఘం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం దేవదుర్గలో విద్యా శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిలింగ పాటిల్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాధికారి బడిగేర్కు వినతిపత్రం సమర్పించారు. చిన్న కారణానికి దాడి.. కులదూషణపై ఫిర్యాదు హుబ్లీ: చిన్న కారణానికి దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాకుండా కులదూషణ చేశారని జిల్లాలోని కుందగోళ పోలీస్ స్టేషన్లో చెన్నబసప్ప, ఈరప్పలపై అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుందగోళ తాలూకాలోని రొట్టిగెవాడ గ్రామంలో నీటి తోపుడు బండిని తోచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై అడ్డుగా ఉన్న రాయిని పక్కకు జరిపారన్న కోపంతో చెన్నబసప్ప, ఈరప్ప కలిసి తనపై మారణాయుధాలతో దాడి చేశారని, తన తల్లి, సోదరిపై కూడా దాడి చేసి చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భక్తులకు ప్రసాదం పంపిణీరాయచూరు రూరల్: దేవసూగూరులో భక్తులకు ప్రసాదంగా పెరుగన్నం పంపిణీ చేశారు. సూగూరేశ్వర ఆలయంలో 6000 మందికి పెరుగన్నం దానం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం సూగూరేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. దేవస్థానంలో భక్తులు మల్లప్ప, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇవేం రోడ్లు?.. బీబీఎంపీకి రూ.50 లక్షల నోటీస్
బెంగళూరు: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు అనువైన రోడ్లు ఎంతో అవసరం. అయితే భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గుంతలు, గతుకులు, వర్షం పడితే చాలు నీటితో నిండిపోయే రోడ్లు బెంగళూరు వాసులను ఇబ్బందుకు గురిచేస్తున్నాయి. ఈ ఇక్కట్లపై స్పందించిన బెంగళూరుకు చెందిన దివ్య కిరణ్(43) బృహత్ బెంగళూరు మహానగరపాలిక(Greater Bengaluru Metropolitan City) (బీబీఎంపీ)కి నోటీసులు పంపించారు.బెంగళూరు నగరంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తనకు శారీరక బాధలు ఎదురవడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తాయని పేర్కొంటూ ఆయన బీబీఎంపీకి రూ. 50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. నగరానికి చెందిన సామాన్య పౌరుడినైన తాను పన్నులను చెల్లిస్తూ, నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానని కిరణ్ పేర్కొన్నారు. అయితే గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే కదలికల కారణంగా తాను తీవ్రమైన మెడ, వీపు నొప్పులకు లోనయ్యానని పేర్కొన్నాడు. ఈ నొప్పుల నుంచి ఉపశమనానికి ఐదు సార్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్(Orthopedic specialist)లను సంప్రదించాల్సి వచ్చిందని కిరణ్ ఆ నోటీసులో పేర్కొన్నాడు.నగర రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తన క్లయింట్ కిరణ్ పలు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నాడని ఇంజక్షన్లు, చికిత్సలు, నొప్పి నివారణ మందులు.. అతని రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయని అడ్వకేట్ కేవీ లవీన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య కిరణ్ ఆటోలు, టూ-వీలర్లలో ప్రయాణించడం అసాధ్యంగా మారిందని, క్యాబ్‌లు కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రోడ్ల దుస్థితి కారణంగా అవి కూడా అతని బాధను తప్పించలేకపోతున్నాయని లవీన్ పేర్కొన్నారు. నగరంలోని రోడ్ల పరిస్థితి అతని వృత్తిపరమైన జీవితాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని దివ్య కిరణ్ ఆరోపించారు. దీనికి ప్రతిగా తనకు రూ. 50 లక్షల పరిహారాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిపై స్పందించకుంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) కూడా దాఖలు చేస్తాననని కిరణ్ తెలిపారు.ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే.. -
స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు. -
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీరు ఆకాంక్ష ఎస్ నాయర్ (23) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 17న ఆమె పంజాబ్‌లో జలంధర్ వద్ద పగ్వారలో ఎల్పీయూ విద్యాసంస్థలో నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. అక్కడి పోలీసుల విచారణలో పలు విషయాలు తెలిశాయి. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళ కొట్టాయంవాసి బిజిల్ మ్యాథ్యూతో ప్రేమలో పడిందని, అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అతడు తిరస్కరించి కాలేజీకి వచ్చాడు. మళ్లీ అక్కడకు వచ్చిన ఆకాంక్ష మ్యాథ్యూతో గొడవ పడింది, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పడంతో మోసపోయానని బాధపడింది, అక్కడే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చావుకు కారణమయ్యాడని మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దారి తప్పిన ప్రేమ ఎంతపని చేసిందని బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి -
కన్నడిగులకు శాపంగా కాంగ్రెస్ సర్కార్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సాధన సమావేశం నిర్వహిస్తున్నారు, కన్నడిగులకు కాంగ్రెస్ సర్కార్ శాపంగా మారింది అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం 60 శాతం కమీషన్‌తో పనులు చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా మార్చుకొని ఆ పార్టీ హైకమాండ్ లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. బళ్లారిలో అవినీతి రహిత పాలన అందిస్తామని గెలిచిన ఎమ్మెల్యే ప్రతి పనికీ కమీషన్ తీసుకొని అవినీతి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కమీషన్ దందా ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్పీ సర్కిల్లో అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంచినీరు, పాలు, పెట్రోల్, నిత్యావసర ధరలు పెరిగి పోయి సామాన్యుల జీవితానికి ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. అభివృద్ధి శూన్యం అని అన్నారు. కిలోమీటర్ కూడా రోడ్డు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. టీబీ డ్యాం గేట్లు పటిష్టం చేయడంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జన సమీకరణపైనే దృష్టి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా మాట్లాడుతూ జిల్లాలో 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాధన సమావేశానికి పెద్ద ఎత్తున జన సమీకరణపై దృష్టి పెట్టినట్లుగా అభివృద్ధి పనుల విషయంలో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన రూ.187 కోట్ల నిధులు స్వాహా చేసిన వారిని పక్క పెట్టుకొని సాధన సమావేశం నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. కర్ణాటక లూటీ కాంగ్రెస్ డ్యూటీగా మారిందన్నారు. పాల ధర రూ.9 పెంచారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పేరుకు మాత్రమేనని, పురుషుల నుంచి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. బళ్లారి నుంచి బెంగళూరు వరకు మహనగర పాలికెలో కూడా అవినీతి పెరిగి పోయి కాంగ్రెస్ నాయకులకు ఏటీఎంగా మలుచుకున్నారన్నారు. కాంగ్రెస్ సర్కారులో రైతులకు మోసం జరుగుతోందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం సిద్దరామయ్య కుటుంబ సభ్యులపై ముడాలో అవినీతి జరిగిందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు డాక్టర్ బీకే సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది 60 శాతం కమీషన్ సర్కారు బళ్లారిలో పాలన అవినీతిమయం ఏం పొడిచారని సాధన సమావేశం? మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి -
జిల్లా అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తాం
రాయచూరు రూరల్: జిల్లాభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. ఆదివారం సిరవారలో ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు నిజాయతీగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈనెల 20న జరిగే సాధన సమావేశానికి వచ్చే ప్రజలకు పంచ గ్యారెంటీల గురించి వివరించాలన్నారు. ఇళ్లు లేని పేదలకు అశ్రయ పథకం కింద అశ్రయ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, బాలస్వామి కొడ్లి, చంద్రశేఖర్, మీనాక్షి, లక్ష్మి, రవిలున్నారు. పాత్రికేయుల సంచారానికి ప్రత్యేక వాహనం హుబ్లీ: హుబ్లీలో పని చేస్తున్న పాత్రికేయుల బృందానికి అనుకూలంగా జిల్లా సమాచార శాఖకు కొత్తగా 32 సీట్ల వాహనాన్ని ఇవ్వడానికి టాటా మోటర్స్ కంపెనీ అంగీకరించింది. ఆ మేరకు ఈ నెలాఖరులోగా వాహనాన్ని అందజేస్తారు. సదరు కంపెనీ సామాజిక బాధ్యత నిధుల ద్వారా జిల్లా సమాచార శాఖకు ఈ వాహనాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి గత ఫిబ్రవరిలో సూచించారు. మంత్రి ప్రతిపాదనకు స్పందించిన కంపెనీ టాటా మార్కోపోలో డీలర్ మాణిక్బాగ్ ఆటోమొబైల్స్ సంస్థకు ఈ నెలాఖరులోగా వాహనాన్ని ఇవ్వాలని సూచించారు. కాగా తమ విజ్ఞప్తికి స్పందించి పాత్రికేయ బృందానికి కొత్త వాహనం పంపిణీ చేస్తున్న టాటా మోటర్స్ కంపెనీ పాలక మండలికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిపై దాడి.. అధికారిపై సస్పెన్షన్ వేటు హుబ్లీ: గదగ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం రాత్రి కాంగ్రెస్ నేత, డిప్యూటీ తహసీల్దార్ కలిసి యువకుడిపై దాడి చేసిన ఘటనలో గదగ్ జిల్లాధికారి శ్రీధర్ డిప్యూటీ తహసీల్దార్ జీటీ వాల్మీకిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలను వెల్లడించారు. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా బెటగేరి నాడ కచేరి సదరు జీటీ వాల్మీకి ఈనెల 17న గదగ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో యువకుడిపై తమ సహచరులతో కలిసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జీటీ వాల్మీకి ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు, ప్రభుత్వ విధి నిర్వహణలో లోపానికి పాల్పడినట్లు దృష్టికి రావడంతో సంబంధిత చట్టం ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేసినట్లు జిల్లాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సస్పెన్షన్ గడువులో డిప్యూటీ తహసీల్దార్ తమ అనుమతి లేకుండా కేంద్ర స్థానం విడిచి వెళ్లరాదని ఆయన సూచించారు. చదరంగంతో ఏకాగ్రత సాధ్యంబళ్లారిఅర్బన్: చదరంగం ఆట పిల్లల్లో ఏకాగ్రతకు దోహద పడుతుంది. ఈ ఆటలో నిపుణులైన పిల్లలు ఎటువంటి క్లిష్ట సమయాల్లోనూ ఆందోళనకు గురికారని, ఈ ఆటను మైండ్ గేమ్‌గా అభివర్ణిస్తారని చెస్ అసోసియేషన్ బళ్లారి జిల్లా అధ్యక్షుడు డీహెచ్ఎం విరుపాక్షయ్య తెలిపారు. సోమవారం ప్రైవేట్ హోటల్లో అండర్–13, 19 పిల్లలకు ఏర్పాటు చేసిన చెస్ క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. చెస్ ఆట పిల్లలపై సానుకూల పరిణామాలను చూపుతుందన్నారు. అందువల్ల ఈ పోటీల్లో పాల్గొనేలా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ప్రముఖులు పోలా ప్రవీణ్ మాట్లాడుతూ చదరంగం క్రీడ కోసం ఎలాంటి సహాయానికై నా తాను సిద్ధమని ప్రకటించారు. చెస్ ఆటలో బళ్లారి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఆటలో సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కోరి జగదీష్, బసవరాజ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. నీటి కుంటలో పడి యువకుడి మృతిహుబ్లీ: వ్యవసాయ పొలంలో తీసిన నీటి కుంటలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా మారడిగి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని కల్మేశ మల్లప్ప(24)గా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన వచ్చి కార్యాచరణ చేపట్టి మృతుడి శవాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వైపీఎల్ చాంపియన్ అప్పు బాయ్స్ కోలారు : తాలూకాలోని యానాదిహళ్లి గ్రామంలో నిర్వహించిన యానాదిహళ్లి ప్రీమియర్ లీగ్(వైపీఎల్) క్రికెట్ టోర్నీ సీజన్–4 ఛాంపియన్‌గా అప్పుబాయ్స్ జట్టు నిలిచింది. రెండు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చూపడం ద్వారా అప్పు బాయ్స్ మొదటి బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి అశ్వర్థ్ నేతృత్వంలోని విక్టరీ 11, తృతీయ బహుమతి కిశోర్ నేతృత్వంలోని టాక్సిక్ జట్టు సాధించగా, నాలుగో స్థానంలో శ్రీనాథ్ నేతృత్వంలోని జై శ్రీరాం జట్టు సాధించింది. టోర్నీలో ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చూపిన వివేక్‌కు మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎన్నికయ్యాడు. -
ప్రహరీ స్థలాన్ని వదలబోమని ధర్నా
రాయచూరు రూరల్: హస్మియ పాఠశాల ప్రహరీ స్థలాన్ని వదలబోమని సోమవారం ప్రహరీ వద్ద ముస్లిం మహిళలు ఆందోళన జరిపారు. వక్ఫ్ అధికారులు ప్రహరీ స్థలం కమిటీదని, నివాసమున్న వారందరూ స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినందున తాము ఏళ్ల తరబడి నివాసం ఉన్నామని, తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలని, తమకు సమయం కేటాయించాలని ఒత్తిడి చేశారు. కాలువలో స్నానానికెళ్లి ఇద్దరు దుర్మరణంరాయచూరు రూరల్: కాలువలో స్నానానికెళ్లిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కెంబావి తాలూకా ఏవూరు వద్ద ప్రవహిస్తున్న కాలువలో వేసవిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం ప్రధాన్(19), కరియప్ప(19) అనే ఇద్దరు యువకులు స్నానానికి దిగారు. అయితే కాలువలో లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగిపోయారు. విజయపుర జిల్లా నుంచి గొర్రెల కాపరులుగా వచ్చిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు కాలువలో మునిగి మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధ్వానంగా కృష్ణా వంతెన రోడ్డురాయచూరు రూరల్: కృష్ణా నది వంతెన అధ్వాన స్థితికి చేరుకోవడంతో మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 2024 జనవరిలో 45 రోజుల పాటు రాకపోకలు స్తంభింపచేసి అధికార యంత్రాంగం చర్యలు తీసుకు రహదారి మరమ్మతు పనులు ముగించారు. అయితే ఏడాదిన్నరకే రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. జాతీయ రహదారి– 167పై శక్తినగర్ వద్ద కర్ణాటక–తెలంగాణల మధ్య గత 8 ఏళ్ల నుంచి వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పాత వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితికి చేరింది. అధికారులు జాతీయ రహదారిలో చేపట్టిన నూతన వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేస్తే రెండు రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 2024లో రూ.30 కోట్లతో పాత వంతెనపై తారు రోడ్డు వేశారు. నేడు రహదారి మళ్లీ గుంతలమయంగా మారింది. భారీ వర్షం.. రోడ్లు బురదమయంరాయచూరు రూరల్: జిల్లాలో ఆదివారం సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిిసింది. జడి వానతో జిల్లాలో ఎక్కడ చూసినా రహదార్లు బురదమయంగా మారాయి. గాంధీ చౌక్, మున్నూరు వాడి, కూరగాయల మార్కెట్లో వర్షపు నీరు చొరబడ్డాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెనలో నుంచి వాన నీరు కాలనీలోకి ప్రవేశించాయి. విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హంపీలో రెండో అతిపెద్ద ప్లానిటోరియం హొసపేటె: రాష్ట్రంలో రెండో అతి పెద్ద, కల్యాణ కర్ణాటకలో అతి పెద్ద ప్లానిటోరియం, ఒక సైన్స్ సెంటర్ ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలో నిర్మిస్తున్నట్లు చిన్న నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజు తెలిపారు. కల్యాణ కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం విజయనగర జిల్లా కమలాపురలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కొత్త సైన్స్ సెంటర్, ప్లానిటోరియం స్థలాన్ని సోమవారం అధికారులతో కలిసి ఆ స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. -
ఎన్‌ఆర్‌బీసీ.. నాణ్యత పడకేసి..
రాయచూరు రూరల్: నారాయణ పుర కుడి కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) మరమ్మతు పనుల్లో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు చేపడుతున్నారు. లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో ఎన్‌ఆర్‌బీసీ పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత కొరవడింది. కాలువ మరమ్మతు పనుల్లో కింది భాగంలో నామమాత్రంగా కాంట్రాక్టర్లు పనులు చేసి చేతులు దులుపు కున్నారు. కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేత బసవరాజ్ పనులు చేసిన కాలువలను పరిశీలించారు. లింగసూగూరు తాలూకాలో 4 కి.మీ.మేర పనులకు రూ.2.75 కోట్లు, దేవదుర్గ తాలూకాలో 4 కి.మీ. మేర పనులకు రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు నాసిరకంగా చేశారని ఆరోపించారు. ఈనేపఽథ్యంలో రైతులు కాలువ కింది భాగంలో చేతితో పెకలించగానే పెచ్చు ఊడి పైకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ ఇంజినీర్లను పిలిచి పనుల తీరుపై ఆరా తీశారు. నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం, కాంట్రాక్టర్లు తప్పించు కోవడం తగదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. నాసిరకంగా కాలువ నిర్మాణం రైతు సంఘం నేతల ఆరోపణ -
భూగర్భ డ్రైనేజీ సమస్యలు తీర్చండి
బళ్లారిటౌన్: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున నగరంలో అండర్ డ్రైనేజీలతో పాటు ఓపెన్ డ్రైనేజీలలో నీరు పొంగిపొర్లుతున్నందున ఈ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు నాగేంద్ర, భరత్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పంచాయతీ నూతన భవనంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ సామాన్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీల్లో నీరు ఎక్కువై లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు. ఆ నీటిని పక్కదారికి మళ్లించాలన్నారు. అదే విధంగా రాజకాలువ శుభ్రత పనులు కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. విద్యుత్ కోతలపై నిలదీత ఇటీవల నగరంలో విద్యుత్ కోత విధిస్తున్నందున ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, కోతలు ఎందుకు విధిస్తున్నారని ఆ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో కేఈబీ అధికారి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి రోజుకు 20 మంది కార్మికులతో జంగల్ కటింగ్ చేయిస్తున్నామని వివరణ ఇచ్చారు. నగరానికి విద్యుత్ ఒత్తిడి ఎక్కువైందని మరికొన్ని స్థావరాలు ఏర్పాటు చేయాలని అధికారి తెలియజేయడంతో హవంభావితో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో మరికొన్ని సబ్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. రైల్వే లైన్‌ను రద్దు చేయమని కోరాం ఇటీవల ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురాకుండా నగర శివార్లలో బైపాస్ రైల్వే నిర్మాణానికి మ్యాప్ గుర్తించడంపై తాము రైల్వే శాఖ మంత్రి సోమణ్ణ దృష్టికి కూడా తీసుకొచ్చి రద్దు చేయమని కోరినట్లు తెలిపారు. కౌల్‌బజార్‌లోని వేస్టేజ్ నీటి శుద్ధీకరణకు 14వ ఆర్థిక ప్రణాళికలో రూ.150 కోట్లతో ఎస్టీపీని రచించిందన్నారు. అయితే వాటి నిర్వహణ కాకున్నప్పటికీ వారికి నిధులు ఎలా చెల్లించారని కార్పొరేటర్ ప్రభంజన్‌కుమార్, మోత్కర్ శ్రీనివాస్, ఇబ్రహిం తదితరులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందన్నారు. దీనిపై ఓ కమిటీ రచించి విచారణ చేపట్టాలన్నారు. కలుషిత నీటితో ఆకుకూరల సాగుపై గరం కౌల్‌బజార్ ప్రాంతంలోని పలు పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీటిని రైతులు వాడుకొని ఆకుకూరలను పండించి మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు. ఇలాంటి ఆకుకూరలు తింటే ప్రమాదకరం అని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎమ్మెల్యేల సూచన వాడీవేడిగా కార్పొరేషన్ సమావేశం -
అనుమానితుల కదలికలపై ఆరా తీశాం
హుబ్లీ: హుబ్లీ ధార్వాడలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు సూరత్‌కు చెందిన వారు అని దర్యాప్తులో తేలిందని పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. జంట నగరాల్లోని కొన్ని ప్రార్థన మందిరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం పెరిగింది. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అరవింద బెల్లద తనకు రాసిన లేఖపై ఆయన వివరణ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలోని జన్నత్ నగర్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారన్నారు. ఈ నెల 2 నుంచి 10 వరకు అత్యధిక సిమ్ కార్డులు విక్రయించారన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించాం ధార్వాడ నగరంలోని విద్యాగిరి పోలీస్ స్టేషన్ సరిహద్దులో జన్నత్ నగర్, ఆరోగ్య నగర్ ప్రాంతాల్లో స్థానికులు కాని కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం మేరకు వారి జాడపై ఆరా తీశామన్నారు. ఎమ్మెల్యే లేఖ రాసిన వెంటనే స్పందించి పోలీస్ సిబ్బంది మారు వేషంలో వెళ్లి పరిశీలించి తగిన వివరాలు సేకరించారరు. జన్నత్ నగర్, బిలాల్ మసీదు, ఆరోగ్య నగర్ ఇసూఫియా మసీదుల్లో ఇతర ప్రాంతాల వారు వచ్చారు. ఈ వ్యక్తులు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వారు అని దర్యాప్తులో తెలిసిందన్నారు. విదేశీ ప్రజల గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. అత్యఽధిక సిమ్ కార్డుల అమ్మకాలపై కూడా దర్యాప్తు చేశామన్నారు. కొందరు మసీదులో శిక్షణ పొందేందుకు ఇక్కడికి వచ్చారన్నారు. ఈ విషయంలో పాలికె సంబంధిత అధికారులు కూడా అనుమానాస్పద వ్యక్తుల గురించి వివరాలు సేకరించారన్నారు. పాక్ మహిళపై సమాచారం ఇచ్చాం ఇప్పటి వరకు జంట నగరాల్లో ఓ పాక్ మహిళ ఉన్నట్లుగా గుర్తించాం. ఆమె దీర్ఘకాలం వీసాపై నివస్తున్నారు. ఈమె వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదు. సూచన వచ్చాక సదరు మహిళను పాక్‌కు పంపించాలా? లేక ఏం చేయాలన్నది నిర్ణయిస్తాం అన్నారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ యాక్టివ్‌గా పని చేస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు, చెడ్డ విషయాలను పంపిస్తే అలాంటి వారి గురించి పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి లింక్‌ను లేదా సదరు వ్యక్తి ఖాతా వివరాలు పోలీస్ వాట్సాప్‌కు పంపిస్తే చాలు అని, పోలీసులు దర్యాప్తు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ శశికుమార్ హామీ ఇచ్చారు. జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ -
మీ పిల్లల్ని నేలపై పడుకోబెడతారా?
రాయచూరు రూరల్: జిల్లాలో వెనుక బడిన వర్గాల, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించక పోవడంతో అధికారులపై జిల్లా ఇన్చార్జి ప్రభుత్వ కార్యదర్శి రితేష్‌కుమార్ సింగ్ మండిపడ్డారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టల్లో విద్యార్థులు నేలపై పడుకోబెడుతున్న విషయంపై సమావేశంలో ప్రస్తావించారు. మీ స్వంత పిల్లలను ఇలానే నేలపై పడుకోబెడతారా? అని అధికారులను ప్రశ్నించారు. నగరసభలో పన్నుల వసూలు విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదాయ వనరులను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు, మాన్వి తాలూకాల్లో వర్షం వల్ల సంభవించిన నష్ట నివారణకు అధికార యంత్రాంగం సిద్ధం చేసుకున్న ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ గజాననలున్నారు. అధికారులపై జిల్లా ఇన్చార్జి కార్యదర్శి మండిపాటు -
సిద్దూని పూర్తిస్థాయి సీఎంగా ప్రకటించండి
హొసపేటె: సిద్దరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని మంగళవారం హొసపేటెలో జరుగునున్న సాధన సమావేశంలో ప్రకటించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి శ్రీరాములు సవాల్ విసిరారు. సోమవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ప్రకారం సిద్దరామయ్య పదవీకాలం నవంబర్ చివరిలో ముగియనుందన్నారు. తాము దానిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా డీకే.శివకుమార్ కూడా సిద్దరామయ్యను ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అప్పుడు సుభద్ర కాంగ్రెస్ కూలిపోవచ్చు. కాబట్టి సిద్దరామయ్య ఈ సమావేశానికి వచ్చిన వెంటనే ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించనివ్వండి అని శ్రీరాములు అన్నారు. తాను అలా చేయకపోతే అదే సిద్దరామయ్య చివరి ర్యాలీ కావచ్చు అని జోస్యం పలికారు. బీజేపీ నేతలు శంకర్ మేటి, రాఘవేంద్ర, శ్రీనివాస్ వ్యాస తదితరులు పాల్గొన్నారు.శ్రీరాములు సవాల్ -
కుంభవృష్టికి సిలికాన్ సిటీ అస్తవ్యస్తం
బనశంకరి: బెంగళూరులో వరద బీభత్సానికి అన్ని లేఔట్లు విలవిలాడాయి. ● ఐడియల్‌హోమ్స్ 1వ క్రాస్ వృషభావతి వ్యాలీలో నీటి ఉధృతికి మూడు ఆవులు, దూడ, ఎనుము మృత్యవాత పడ్డాయి. మహదేవపుర వలయ పరిధిలో 10 చోట్ల జలమయమైంది. సాయిలేఔట్ పూర్తిగా జలమయం కాగా 6 ట్రాక్టర్లు, 2 జేసీబీ, 35 మంది సిబ్బంది, 3 అ గ్నిమాపక వాహనాలతో, ఎన్డీఆర్ఎప్ బృందాలతో 2 స్థానికులను తరలించారు. ● మారతహళ్లి దీపానర్సింగ్ హోమ్, చిన్నప్పనహళ్లి 5 వక్రాస్, పణత్తూరు రైల్వే అండర్‌పాస్, గ్రీన్‌హుడ్, ఇబ్బలూరు జంక్షన్, బాలాజీలేఔట్ కొత్తనూరు, ఏ.నారాయణపుర కృష్ణనగర , సునీల్లేఔట్, హరళూరు, బీఎస్పీ లేఔట్ కసవనహళ్లిలో ఇళ్లలోకి వర్షంనీరు చొరబడింది. పాలికె సిబ్బంది ఇళ్లలోచేరిన నీటిని పంప్సెట్లుతో తోడేశారు. ● సిల్క్‌బోర్డు జంక్షన్లో రాజకాలువ పొంగి పొర్లడంతో రోడ్లు జలమయం కాబడ్డాయి. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ 6–7 సెక్టార్లు, బన్నేరుఘట్టరోడ్డు బీలేకహళ్లి సిగ్నల్ రోడ్లు నీరు నిలిచింది. యలచేనహళ్లిలో ఇళ్లలోని నీరుచేరడంతో సహాయక చర్యలు చేపట్టారు. ● రాజ కాలువల్లోవర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హెచ్ఆర్బీఆర్,5,6,7,8 బ్లాకులు, బైరసంద్రలేఔట్, కెంపేగౌడ రోడ్డు, కామరాజనగర ప్రదేశాలు జలమయమయ్యాయి. 10 పంప్ సెట్లతో నీటి తొలగింపు చేపట్టారు. ● మడివాళ డాలర్స్కాలనీ, కోరమంగల 6 వబ్లాక్, ఈజీపుర ప్రదేశాలు జలమయమయ్యాయి. బెల్లందూరు వద్ద జేసీబీ ద్వారా బండ్ తొలగించి నీటిని మళ్లించడంతో ప్రవాహం క్రమేణా తగ్గింది. ● వృషభావతి వ్యాలీ గాలి ఆంజనేయ ఆలయం వద్ద ముంపు ఏర్పడింది. ఇళ్లలోకి నీరుచేరింది.చౌడేశ్వరినగర అట్టూరు లో సుమారు 15 ఇళ్లలోకి , డిఫెన్స్ లేఔట్, ద్వారకానగలో సుమారు 5 ఇళ్లలోకి నీరు చేరింది. ఈప్రదేశాల్లో పంపుసెట్లు అమర్చి నీరు తొలగించారు. విజయశ్రీలేఔట్ హెమ్మెగెపుర రాజకాలువ నీరు వచ్చి ఈ ప్రాంతం జలమయమైంది. ● కెంగేరి వద్ద కోటే లేఔట్లో సుమారు 100 ఇళ్లలోకి నీరుచేరింది 4 పంపుసెట్లను అమర్చి నీటిని తొలగించారు. మైసూరురోడ్డు జలమయం కాగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ● 27 చెట్లు కూలిపోగా 43 చోట్ల చెట్లుకొమ్మలు విరిగిపడ్డాయి. -
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీరు ఆకాంక్ష ఎస్ నాయర్ (23) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 17న ఆమె పంజాబ్‌లో జలంధర్ వద్ద పగ్వారలో ఎల్పీయూ విద్యాసంస్థలో నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. అక్కడి పోలీసుల విచారణలో పలు విషయాలు తెలిశాయి. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళ కొట్టాయంవాసి బిజిల్ మ్యాథ్యూతో ప్రేమలో పడిందని, అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అతడు తిరస్కరించి కాలేజీకి వచ్చాడు. మళ్లీ అక్కడకు వచ్చిన ఆకాంక్ష మ్యాథ్యూతో గొడవ పడింది, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పడంతో మోసపోయానని బాధపడింది, అక్కడే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చావుకు కారణమయ్యాడని మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దారి తప్పిన ప్రేమ ఎంతపని చేసిందని బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. బీజేపీ నాయకురాలిపై కేసు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసులో, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దినేశ్ గుండూరావ్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ కార్పోరేటర్ శ్వేతా పూజారిపై సూరత్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును మంగళూరు నగర సైబర్ ఠాణాకు బదిలీ చేశారు. శ్వేతాను విచారిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. కేసును బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ఖండించారు. -
టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో
టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవరంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరిచేందుకు, వారికి భరోసా కల్పించేందు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ జరిగిందంటే..బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచి పోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ బుల్డోజర్లో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని జెసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశా,నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జెసిబిలను ఉపయోగిస్తున్నారు #Bengaluru continued to #experience #heavyrains, leading to #water entering homes in several parts and #flooding in #low-#lying #areas of the #city. As of 8 a.m., the #city received 105 mm of #rainfall in the past 24 hours, according to the (IMD). pic.twitter.com/iKYkdqk9xM— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 19, 2025మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, తుమకూరు, మండ్య, మైసూరు, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరె మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్ ,హోరామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్కర్ణాటక తీరప్రాంతంలో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది, ఉత్తర , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అతి భారీ వర్షాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, గడగ్, హవేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. -
బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Silk Board Metro Station, Bengaluru…Congress is ruling the state so it’s ok…. pic.twitter.com/reKKwbMTdE— Mr Sinha (@MrSinha_) May 19, 2025 Today: Significant flooding in Bengaluru, Karnataka, India, leading to major traffic disruptions and impacting daily activities for residents. #BengaluruRains #KarnatakaRains pic.twitter.com/0Ph7vHBHUt— Weather Monitor (@WeatherMonitors) May 19, 2025భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.After hiking the price of bus ride and metro fare ; Karnataka Congress Govt to launch FERRY SERVICE? Seems so.Congress CM Siddaramaiah has 'gifted' people of Karnataka and Bengaluru especially lakes in the form of water stagnation.This is Congress govt for you. They can't… pic.twitter.com/dKvPLqTnUx— Cons of Congress (@ConsOfCongress) May 19, 2025 #bengalururains #BangaloreRains Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it. Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 202522 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది. ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025#BengaluruRains The Hennur-Bagalur Road, which is the alternative route to Kempegowda International airport in Bengaluru, was flooded. Motorists & traffic cops had a tough time. (📹 by TOI Syed Asif)@timesofindia pic.twitter.com/xZTRTU9Btv— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025BANGALORE WATER PARK #Bengaluru #bengalurufloods #BengaluruRains pic.twitter.com/QpBqXmgl5T— Bihar Buzz (@buzz_bihar) May 19, 2025 -
కనుల భాగ్యం.. పల్లకీ వైభోగం
బనశంకరి: వైవిధ్య పుష్పరాశులతో తయారైన పూల పల్లకీలు, అందులో కొలువుతీరిన దేవీ దేవతలను చూడడానికి భక్తులకు రెండు కళ్లు చాలలేదు. సిలికాన్ సిటీలో గ్రామదేవతల పూల పల్లకీ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. 28 కి పైగా గ్రామ దేవతల పూల పల్లకీ వాహనాల్ని రమణీయంగా ఊరేగించారు. పల్లకీల్లో ఆసీనులైన గ్రామదేవతలను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. మహదేవపుర నియోజకవర్గంలోని గరుడాచార్పాళ్యలో ఊరహబ్బ– ఊరు పండుగ శనివారం రాత్రి వైభవంగా ఆరంభమైంది. నిత్యం కొలిచే గ్రామ దేవతలను అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బృహత్ పూల పల్లకీ వాహనాలలో ప్రతిష్టించారు. ఇందుకోసం ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలను వినియోగించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కళా బృందాల ప్రదర్శనలు, మంగళవాయిద్యాలతో కోలాహలం మిన్నంటింది. అర్ధరాత్రి బృహత్ ఊరేగింపు ఆరంభమైంది. వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, చాముండేశ్వరీదేవి, గట్టి గణపతి, కావేరమ్మ, మద్దూరమ్మ, షిరిడి సాయి, అయ్యప్పస్వామి తదితర దేవీదేవతల పూలపల్లకీలు భక్తులను పరవశింపజేశాయి. చాముండేశ్వరీదేవి పూల పల్లకీని క్రేను మోస్తూ కదిలింది. పల్లకీలను భక్తులు మొబైల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం వరకు గరుడాచార్పాళ్య వీధుల్లో గ్రామ దేవతలను ఊరేగింపుతో ఉత్సవ శోభ నెలకొంది. మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ గ్రామదేవతలను పూజలు చేశారు. ప్రవాసాంధ్రులు పూల పల్లకీలను దర్శించుకున్నారు. మహదేవపురలో నేత్రపర్వంగా గ్రామ దేవతల జాతర -
తడిసి ముద్దయిన రాజధాని
బనశంకరి: రాజధాని బెంగళూరు రుతు పవన వర్షాలకు ముందే కుండపోత వానతో అల్లాడిపోయింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షంనీరు చేరి చెరువును తలపించింది. వాహనాలు వెళ్లలేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని చోట్ల డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చొరబడింది. బాణసవాడి , ఇందిరానగరలో చెట్లు కూలిపోగా ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. పుట్టేనహళ్లిలో వెంకటాద్రి అపార్టుమెంట్ ప్రహరీ కూలిపోయింది. సాయిలేఔట్ జలమయమైంది. మ్యాచ్ రభస చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వేలాదిమంది రావడంతో వాహన కష్టాలు రెట్టింపయ్యాయి. నగరవ్యాప్తంగా 8 చెట్లు కూలిపోగా 20 చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. బీబీఎంపీ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ పరిశీలించారు. బీబీఎంపీ కమిషనర్ ఎం.మహేశ్వర్రావ్తో సమస్యలపై చర్చించారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. 2.2 సె.మీ.వర్షపాతం నగరంలో సరాసరి 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా బిలేకహళ్లిలో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. పులకేశినగర, వన్నార్పేటేలో తలా 4.9 సెంటీమీటర్లు, హొరమావు 4.7, సంపంగి రామనగర 4.3, దొరసానిపాళ్య 4.2 సె.మీ. వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది. రాత్రంతా కుండపోత వాన అంతటా ట్రాఫిక్ జామ్‌లు పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు మరో 4 రోజులు వానలుబనశంకరి: రాష్ట్రంలో తొలకరి వర్షాలకు ముందు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి బెంగళూరుతో పాటు అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులు వానలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశముంది. గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. 21 వరకు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్, మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. వర్ష ప్రమాదాల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. -
మైసూరులో 3 ఇళ్లు దగ్ధం
మైసూరు: ఆకస్మికంగా మంటలు అంటుకుని మూడు ఇళ్లు కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. మైసూరు తాలూకాలోని బోరె ఆనందూరిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారె గౌడ, వెంకటేష్ గౌడ, శ్రీనివాస్‌గౌడల ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినా నష్టం జరగిపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు, బట్టలు, డబ్బు, బంగారం దగ్ధమయ్యాయి. మొదట ఓ ఇంటిలో మంటలు చెలరేగి తరువాత ఇళ్లకు వ్యాపించినట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ లేదా, కరెంటు వైర్లే కారణమని అనుమానాలున్నాయి. ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా తలా రూ. లక్ష సహాయాన్ని అందజేశారు. రైలు ఢీకొని ఇద్దరు మృతి! మైసూరు: మైసూరు నగరంలో రెండు వేర్వేరు సంఘటనల్లో ఒక మహిళ, ఓ పురుషుడు రైలు ఢీకొని మరణించారు. మొదటి కేసులో 40 నుంచి 45 సంవత్సరాలున్న గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అలాగే పట్టాల మీద మరో మహిళ మృతదేహం లభ్యమైంది. మైసూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదమా, ఆత్మహత్యలా అనేది తేలాల్సి ఉంది. -
నిర్లక్ష్య డ్రైవింగ్‌కు జరిమానా
కృష్ణరాజపురం: ఓ స్కూటరిస్టు హెల్మెట్ లేకుండా నడుపుతూ, పైగా మొబైల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. బైక్ నడిపేటప్పుడు నియమాలను పాటించాలి. అవేవీ లేకుండా స్కూటర్‌పై దూసుకెళ్తూ మొబైల్లో మాట్లాడుతూ ఇతర వాహనదారులకు చికాకు తెప్పించాడు. కూడళ్లలోని సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యాడు, పోలీసులు వాహన నంబరును గుర్తించి ఇంటికి వెళ్లి మరీ జరిమానా రసీదులను అందజేశారు. ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి ●● పంజాబ్‌లో సంఘటన దొడ్డబళ్లాపురం: జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు. పొలం పట్టాల్లో అవినీతి కోలారు: పొలం పట్టా (పి) నంబర్ మార్పులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తనిఖీ చేయాలని ఈ నెల 22వ తేదీన కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని రైతు సంఘం నేతలు తీర్మానం చేశారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం ముందు సమావేశమై చర్చించారు. జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాలు, ఫిర్కాకేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ప్రతిఘటన చేయాలని తీర్మానించారు. పి నంబర్ మార్పులకు లంచం అడిగితే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. గత 40 సంవత్సరాలుగా పి నెంబర్ మార్పుల కోసం ఎదురు చూస్తున్న రైతుల సమస్యలకు స్పందించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సూచించినా, అధికారులు మాత్రం లంచాలకు మరిగి రైతులకు సకాలంలో పనులు చేసివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారుల ధోరణి మారాలని డిమాండ్ చేశారు. క్షలు తెలిపి ఆయన సేవలను కొనియాడారు. వర్షానికి తెగిన విద్యుత్ తీగ.. ఆర్టీసీ ఉద్యోగి బలి శ్రీనివాసపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి కేఎస్ ఆర్టీసీ ఉద్యోగి మరణించిన ఘటన ముళబాగిలు తాలూకా రాజేంద్రహళ్లి గ్రామంలో జరిగింది. రెడ్డప్ప (58) తెల్లవారుజామున తోటకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. రాత్రి కురిసిన వానకు నేలకూలిన విద్యుత్ స్తంభాల వల్ల విద్యుత్ తీగలు పడిపోయాయి. వాటిలో ఇంకా కరెంటు ప్రసారమవుతోంది. రెడ్డప్ప చీకట్లో చూసుకోకుండా అడుగు వేయడంతో కరెంటు తీగ తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. కొంతసేపటికి గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. రెడ్డప్ప ముళబాగిలు డిపోలో ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. ఘటనా స్థలానికి విద్యుత్ శాఖ సిబ్బంది వెళ్లి పరిశీలన జరిపారు. ముళబాగిలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు. -
వాయుపుత్ర.. జయహనుమా
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే హనుమాన్ మూలవిరాట్టుకు అభిషేకాలు, పూజలు నిర్వహించిన అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ గావించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గోపూజ చేసి గోమాతకు నూతన వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో 108 కలశాలను ఏర్పాటు చేసి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మండపంలో నెట్టికంటి ఆంజనేయస్వామి వారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి తులసీదళముతో లక్షార్చన పూజను నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వాయుపుత్రున్ని దర్శించుకున్నారు. కసాపురం క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలు -
యువకుడి మృతి
రాయచూరురూరల్: యువకుడు హత్యకు గురైన ఘటన రాయచూరు నగరంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. జహిరా బాద్‌కు చెందిన సాధిక్ (27) అనే వ్యక్తి నగరంలోని జాకీర్ హుసేన్ చౌక్‌లో ఇడ్లీ తినేందుకు వచ్చాడు. ఆ సమయంలో కరీం(28), అతని మిత్రులతో వాగ్వాదం జరిగింది. దీంతో సాధిక్‌పై కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో ఉన్న సాధిక్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సదర్ బజార్ సీఐ ఉమేస్ కాంబ్లే తెలిపారు. డీఎస్పీ శాంతవీర ఘటన స్థలాన్ని పరిశీలించారు. అరు నెలల క్రితం వాహనం విషయంలో సాధిక్, కరీం మధ్య గొడవ జరిగిందని డీఎస్పీ తెలిపారు. పాతకక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. పాతకక్షలతోనే అంటున్న పోలీసులు -
రైతులకు హక్కు పత్రాలు అందించాలి
హొసపేటె: రైతులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హొసపేటెలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనిబసప్ప విలేకరులతో మాట్లాడుతూ విజయనగర జిల్లా మరియమ్మనహళ్లి హోబ్లీ ప్రాంతానికి చెందిన రైతులు తుంగభద్ర నది వరదల కారణంగా ఇళ్లు, మఠాలను కోల్పోయాన్నారు. సుమారు 70 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూములను రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. కానీ కొంతమంది రైతులకు హక్కు పట్టాలు అందించలేదన్నారు. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే స్పందించి హక్కు పత్రాలు అందించి వారి జీవనోపాధిని మెరుగు పరచాలని కోరారు. విజయనగర జిల్లా హగరిబోమ్మనహళ్లి తాలూకాలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు నేతలు గంటి సోమశేఖర్, మహబూబ్ బాషా, హుస్సేన్ సాబ్, కనివియప్ప, నగేష్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. -
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
రాయచూరురూరల్: రాయచూరును రెండేళ్లలో అదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని నగరసభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో అన్నారు. నగరసభ పరిధిలోని భరత్‌నగర్‌లో ఆదివారం ఆయన బీ ఖాతాలు పంపిణీ చేసి మాట్లాడారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తామన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకారం అందించాలన్నారు. నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, అంజినేయ్య ,శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎస్పీకి అవార్డురాయచూరురూరల్: రాయచూరు జిల్లా ఎస్పీ పుట్ట మాదయ్య, బళగనూరు ఎస్ఐ ఏరియప్ప, హెడ్ కానిస్టేబుల్ రామణ్ణలు డీజీ ఐజీపీ కమాండేషన్ అవార్డులకు ఎంపికయ్యారు. 2024– 2025 సంవత్సరానికి ఈ అవార్డులను అందజేయనున్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి రాయచూరు రూరల్: నగరంలో కాంగ్రెస్‌ను బలిష్టం చేయాలని ఆ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సూచించారు. షియ తలాబ్‌లో ఆదివారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించాలన్నారు. బంజారాలు విద్యావంతులు కావాలి హొసపేటె: బంజారా సముదాయ ప్రజలు తమ పిల్లలను విద్యావంతులను చేయడం ద్వారా అన్ని రంగాల్లో రాణించవచ్చని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. నగరంలోని బంజారా స్నేహ జీవి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆ సముదాయ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కార ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పిల్లలు విద్యావంతులైతే ఆ సమాజం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం పది, పీయూసీలో ఉత్తమ ఫలితాన్ని సాధించిన విద్యార్థులను సన్మానం చేసి గౌరవించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భీమానాయక్, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ దాదాగిరి హుబ్లీ: డిప్యూటీ తహసీల్దార్ తన కార్యాలయంలో ఓ వ్యక్తి పై దాదాగిరికి పాల్పడ్డారు. ఈఘటన గదగ్‌లో జరిగింది. అక్షయ్ బొలుల్లి అనే యువకుడి మిత్రుడి బైక్‌కు డిప్యూటీ తహసీల్దార్ ఎస్డీ వాల్మీకికి పరిచయస్తుడి కారు ఢీకొంది. నిందితులను గుర్తించేందుకు అక్షయ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్షయ్ అడిగిన ప్రశ్నకు కోపంతో ఉగిపోయిన సదరు ఎస్డీ వాల్మీకి, ఆయన అనుచరులు అక్షయ్‌పై దాడి చేశారు. పోలీస్ అధికారులు ఇరువర్గాల మద్య రాజీబేరం కుదేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అశ్వవాహనంపై నృసింహుడు ఉరవకొండ రూరల్: ెపన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం మహామంగళహారతులు, దీక్షా హోమమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినరసింహుడు అశ్వవాహనంపై విహరించారు. -
డెంగీపై జాగృతి ర్యాలీ
హొసపేటె: ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించి డెంగీ జ్వరాలకు దూరంగా ఉండాలని కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. డెంగీపై ప్రజలను జాగృతి చేసేందుకు కూడ్లిగి పట్టణంలోని ఆదివారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇంటివద్ద డ్రమ్ములు, ట్యాంకులు, ఇతర ప్రదేశాలలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నూత కార్యవర్గం ఎంపిక రాయచూరురూరల్ : అఖిల కర్ణాటక బ్రాహ్మణ సంఘం రాయచూరు జిల్లా కర్యవర్గం ఎన్నికై ంది. కార్యధ్యక్షుడిగా వెంకటేష్ దేశాయి, సంచాలకుడిగా వేణుగోపాల్, యువ సంచాకుడిగా శ్రీనివాస్ దేశాయి, నగర సంచాలకుడిగా విజేయేంద్రను నియమిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ కులకర్ణి ఆదేశాలు జారీ చేశారు. -
ఊపందుకున్న ఖరీఫ్ వ్యవసాయ పనులు
రాయచూరు రూరల్: ఖరీప్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో పొలాలను దుక్కి దున్నడం, చదును చేయడంలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. రోజూ ఏ పొలంలో చూసినా రైతుల సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో వేకువజామునే రైతులు నాగళ్లు తీసుకొని పొలాలకు బయల్దేరుతున్నారు. మరో వైపు ఖరీఫ్‌లో పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆమేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాకు తెప్పించడంలో బిజీగా ఉన్నారు. 84 వేల హెక్టార్లలో నీటి పారుదల సదుపాయాలు ఉన్నాయి. మిగిలిన భూముల్లో ఏక దళ, ద్వి దళ ధాన్యాలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాకు 1.71లక్షల మెట్రిక్ టన్నుల ఏరువులు అవసరం కాగా ఖరీఫ్‌లో పంటల సాగుకు అవసరమైన ఎరువులు ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బసవరాజ తెలిపారు. జిల్లాలోని 35 రైతు సంపర్క కేంద్రాలలో రైతులకు ఏరువులు, క్రిమిసంహర క మందులు నిల్వ వున్నాయని వివరించారు. రైతులు సద్వినియెగ పరుచుకోవాలని కేంద్రం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు. 3.44 లక్షల హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం ఎరువుల కొరత లేదు రైతు సంపర్క కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ -
ఇందిరా కట్టకు కొత్త రూపు
హొసపేటె: నగరంలోని జిల్లా పునీత్ రాజ్‌కుమార్ క్రీడామైదానంలో ఇందిరాగాంధీ కట్ట కొత్త రూపు సంతరించుకుంది. 1980లో ఇందిరా ఈ కట్టపైనుంచి నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పటి నుంచి ఈ కట్టను ఇందీరాగాంధీ కట్టగా పిలుస్తారు. ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రెండేళ్ల సాధన సమావేశం నేపథ్యంలో ఈ కట్టకు మెరుగులు దిద్దారు. నూతన పాలరాయితో ఇందిరా విగ్రహాన్ని తయారు చేయించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. -
మహిళా ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం
బళ్లారి రూరల్ : మహిళా స్వయం సేవా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించనున్నట్లు దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. జెడ్పీ, గ్రామీణ జీవనోపాయ అభియాన్, వ్యవసాయ, ఉద్యానవన, కౌశల్యాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గ్లాస్‌హౌస్‌లో పీఎంఎఫ్ఎంఈ లబ్ధిదారుల సమాలోచన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటగా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముద్రా యోజనలోని ప్రయోజనాలను స్వయం సేవా సంఘాలు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 1,20,227 మంది స్వయం సేవా మహిళా సంఘం సభ్యులు ఉన్నారు. వీరు తయారు చేసిన బెడ్షీట్లు, దుప్పట్లు, శాలువాలు, విద్యార్థి వసతి నిలయాలు, సీజే జిల్లాసుపత్రి కొనుగోలు చేయాలని తెలిపారు. సంఘాల ఉత్పత్తులకు గ్లాస్‌హౌస్‌లో మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు తయారు చేసిన సాంబారు, చట్నీ పొడులు, ఊరగాయలు, అప్పడాలు తదితరాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ డాక్టర్ సురేశ్ బి.హిట్నాళ్ మాట్లాడుతూ పీఎంఎఫ్ఎంఎస్ యోజనలో 184 మంది లబ్ధిపొందారన్నారు. ఉద్యానవన శాఖ ఉపసంచాలకుడు రాఘవేంద్ర ప్రసాద్, జెడ్పీ యోజన డైరెక్టర్ కౌసర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ముందే ముప్పును పసిగట్టి..
● పరిశ్రమల్లో భద్రతపై డ్రిల్ దొడ్డబళ్లాపురం: ఫ్యాక్టరీలలో భద్రతపై పలు నగరాల్లో మాక్ డ్రిల్స్‌ను నిర్వహించారు. బయో మాస్ బాయిలర్లు, గ్యాస్ ట్యాంకర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలపై బెళగావి, ధార్వాడలో పోలీసులు, ఫైర్ సిబ్బంది, ప్రకృతి విపత్తుల నివారణ దళం విన్యాసాలను నిర్వహించారు. బెళగావి ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలో డ్రిల్ జరిపారు. మంటలను ఆర్పడం, గాయపడినవారిని త్వరగా ఆస్పత్రులకు తరలించడం విన్యాసాలను ప్రదర్శించారు. ధార్వాడలో గ్యాస్ ట్యాంకర్ లీకై తే నివారణ చర్యలు తీసుకోవడం తదితర విన్యాసాలను నిర్వహించారు. -
వైభవంగా హులిగమ్మ దేవి రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా అరోలిలో వెలసిన హులిగమ్మ దేవి రథోత్సవం వైభవంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం శాంతమల్ల శివాచార్య స్వామీజీ, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ వేడుక సందర్భంగా వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు. హత్యాయత్నం కేసులో జీవిత ఖైదురాయచూరు రూరల్: పొలం తగాదా విషయంలో విషం సేవింప చేసి హత్యాయత్నం చేసిన కేసులో 10 మందికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ రాయచూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. జిల్లాలోని లింగసూగూరు తాలూకా హనుమగుడ్డ హోసూరులో 2019 జనవరిలో అమరేష్ అనే వ్యక్తికి క్రిమి సంహారక మందును సేవింప చేసిన బసప్ప, హులిగప్ప, శరణప్పగౌడ, అమరేష్గౌడ, దేవప్ప గౌండి, శంకరమ్మ గౌండి, యల్లమ్మ, శరణప్ప బోవి, హనుమవ్వ, శరణప్ప, వినోద్‌లపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి బీజీ జకాతి పైమేరకు తీర్పునిచ్చారు. అనాథ నిరాశ్రయ అవ్వాతాతలకు అవకాశం హుబ్లీ: ఽదార్వాడ జిల్లాలో అనాథ నిరాశ్రయులైన అవ్వతాతలకు ఓ చక్కటి అవకాశం లభించింది. శ్రీశారద ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ హుబ్లీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాశ్రమ నిర్వహణకు సంబంధించి తగిన అనుమతులు ఇస్తూ ఆదేశాలు వెల్లడించింది. ఆ మేరకు వృద్ధాశ్రమంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరాశ్రయ వృద్ధులు, అనాథలకు సుమారు 25 మందికి ఉచిత ఆశ్రయం లభించనుంది. ఈ ఆశ్రమంలో వృద్ధులకు ఉచిత వసతి భోజనం, ఔషధోపచారంతో పాటు వినోద, భక్తి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వృద్ధాశ్రమంలో చేరదలచిన అవ్వాతాతలు ఫోన్ నెంబర్: 9742959152, 8747094269 లలో సంప్రదించాలని జిల్లా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ అధికారి జగదీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మంత్రిని పదవి నుంచి తొలగించండి రాయచూరు రూరల్: దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం శ్రమించిన బెళగావి కోడలు లెప్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషిని అవమాన పరిచే విధంగా మాట్లాడిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ శాస్పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టి సెల్ జిల్లాధ్యక్షుడు సయ్యద్ ఫయాజుద్దీన్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాది అని బహిరంగ సభలో వ్యాఖ్యానించిన మంత్రి శాస్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంరాయచూరు రూరల్ : అసంఘటిత కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నగర విధానసభ సభ్యుడు శివరాజ్ పాటిల్, గ్రామీణ విధానసభ సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. శనివారం నగరంలోని కార్మిక శాఖాధికారి కార్యాలయం వద్ద, గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయం వద్ద సంచార ఆరోగ్య వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. కార్మికుల ఆరోగ్యం కోసం వారి వద్దకే వెళ్లి సేవలు అందించాలన్నారు. కార్మిక శాఖాధికారి ఆరతి మాట్లాడుతూ జిల్లాలో లక్షా 13 వేల 286 మంది కార్మికులకు 13 రకాల వైద్య సేవలు లభిస్తున్నాయన్నారు. సంచార వాహనాలకు ఆరు మందిని నియమించామన్నారు. అధికారులు మంజునాథరెడ్డి, నాగరాజ్, తన్వీర్ కౌశిక్, మహ్మద్ ఉమర్ అబ్దుల్లున్నారు. -
గొడవపడి.. బైక్‌ను కారుతో ఢీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సిటీలో ఇటీవల కొందరు ఎందుకు గొడవపడుతున్నారో, ఎందుకు హత్యలు చేస్తున్నారో తెలీని అయోయం నెలకొంది. ట్రాఫిక్‌లో వాహనాలు టచ్ అయినా రోడ్డుమీదే కొట్టుకుని,కత్తులతో పొడుచుకుంటున్నారు. సిగరెట్ తెచ్చివ్వలేదని ఓ కారు ఓనరు ఇద్దరి మీదకు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. వివరాలు... మే 10వ తేదీన తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నిందితుడు ప్రతీక్ భార్యతో కలిసి క్రెటా కారులో కోణనకుంట క్రాస్‌కు వచ్చాడు. కారు దిగకుండానే రోడ్డుపక్కన టీకొట్టు ముందు సిగరెట్ కాలుస్తున్న చేతన్, సంజయ్ అనే ఇద్దరినీ పిలిచి సిగరెట్ తెచ్చి ఇవ్వమని అడిగాడు. నువ్వే తీసుకో అని వారు చెప్పడంతో వాగ్వాదం జరిగింది. తరువాత చేతన్, ప్రతీక్‌లు తమ బైక్‌పై బయల్దేరారు. ప్రతీక్ వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా కారుతో ఢీకొట్టాడు. ఈ రభసకు సంజయ్, చేతన్ బైక్‌తో పాటు రోడ్డుపక్కన షాపులోకి ఎగిరిపడ్డారు. సంజయ్ మృతిచెందగా చేతన్ మృత్యువుతో పోరాడుతున్నాడు. సంజయ్ టెక్కీగా పనిచేస్తాడని తెలిసింది. సుబ్రమణ్యపురం పోలీసులు ఉన్మాది ప్రతీక్‌ను అరెస్టు చేశారు. టెక్కీ మృతి, మరొకరికి గాయాలు సిగరెట్ తెచ్చివ్వలేదని గొడవ -
రైతుల హామీలు తుంగలో తొక్కారు
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రైతు సమాజానికి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ తళవార్ ఆరోపించారు. శనివారం హొసపేటె ప్రెస్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చెరుకు పంట సాగు చేసే రైతులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, హామీలను నెరవేర్చలేదన్నారు. ఇంతవరకు నగరంలో చెరుకు కర్మాగారం ఏర్పాటుపై స్పష్టత లేదన్నారు. ఈ భాగంలో చెరుకు పండించే రైతులు నష్టాల్లో కూరుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఈనెల 20న నగరంలో జరిగే సాధన సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. జహీరుద్దీన్, ఖాజా హుస్సేన్ నియాజీ, జడియప్ప, తాయప్ప, దొడ్డ గాళెప్ప, బంతి బసవరాజ్, సునక్‌కి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
అవ్వా తాతకు మళ్లీ లగ్నం
చింతామణి: హిందూ సంప్రదాయం ప్రకారం దంపతులకు 60 ఏళ్లు నిండితే సంతోషం కోసం షష్టి పూర్తి వేడుకను నిర్వహిస్తారు. తాలూకాలోని బుక్కనహళ్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి (85), సతీమణి వెంకటమ్మ (80)కు ఈ వయసులో కుటుంబీకులు మళ్లీ పెళ్లి జరిపించారు. బుక్కమహళ్లి గ్రామంలో శనివారం పురోహితులు వేదమంత్రాల మధ్య అవ్వా తాతల లగ్గం సందడిగా సాగింది. వధూవరులు నూరేళ్లు చల్లగా బతకాలని అతిథులు దీవించారు. పెళ్లి తరువాత విందు భోజనం జరిగింది. వసంత వల్లభ దర్శనం బనశంకరి: సిలికాన్ సిటీలోని వసంతపురలో వెలసిన వసంత వల్లభరాయస్వామి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. వసంతపురలో వెలసిన వసంత వల్లభరాయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున సుప్రభాతసేవ తరువాత ఆలయ ప్రధాన అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ వసంత వల్లభరాయస్వామి మూలవిరాట్‌కు అభిషేకం, అర్చనలు, పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. రూ.7 కోట్లు గోల్మాల్, అధికారిణి సస్పెండ్ శివాజీనగర: బెంగళూరులో ఇందిరా క్యాంటీన్ భోజన బిల్లుల చెల్లింపుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిన కేసులో నగర దక్షిణ ఉప ఆరోగ్యాధికారిని సస్పెండ్ చేశారు. వివరాలు.. డాక్టర్ పి.కల్పన నిందితురాలు, క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసినందుకు ఓ సంస్థకు రూ.2.27 కోట్లు చెల్లించాలి, కానీ కల్పన రూ. 9.72 కోట్లను మంజూరు చేసింది. ఇలా రూ. 7 కోట్ల స్వాహా అయ్యింది. ఇది బయటపడడంతో పాలికె ప్రత్యేక కమిషనర్.. ఆమెను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. బలిగొన్న యాక్సిడెంట్లు ●● నగరంలో నలుగురు మృతి దొడ్డబళ్లాపురం: ఉద్యాన నగరిలో రోడ్డు ప్రమాదాలు రక్తం చిందిస్తున్నాయి. వేర్వేరు యాక్సిడెంట్లలో నలుగురు చనిపోయారు. శుక్రవారం రాత్రి యలహంక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జక్కూరు ఫ్లై ఓవర్ రోడ్డులో యలహంక వైపు వెళ్తున్న ఆటోను క్యాంటర్ వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలోని ప్రియ (26) అనే యువతి మృతిచెందగా ఈమె తల్లి తీవ్రంగా గాయపడింది. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. డెలివరీ బాయ్.. అలాగే దొడ్డబళ్లాపురం రోడ్డులోని అనంతపుర గేట్ వద్ద బైక్‌పై వెళ్తున్న గౌరీబిదనూరు వాసి సునీల్ (28) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించాడు. ఇతడు బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. హిట్ అండ్ రన్.. ఇద్దరు మృతి హిట్ అండ్ రన్‌కు ఇద్దరు బలైన సంటన దేవనహళ్లి తాలూకా విజయపుర బైపాస్‌లో చోటుచేసుకుంది. బైపాస్‌లోని సిల్క్ ఫ్యాక్టరీ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి, మరో మహిళ మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలిసిరాలేదు. -
సాధన సమావేశానికి జోరుగా సన్నాహాలు
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 20న సాధన సమర్పణ సంకల్ప సమావేశాన్ని విజయనగర జిల్లా హొసపేటెలోని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు విజయనగర, బళ్లారి జిల్లాల ఇన్చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహమ్మద్ ఖాన్ తెలిపారు. శనివారం ఆయన అమరావతి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి సంబంధించిన అన్ని సన్నాహాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే పనులు పూర్తి దశకు చేరాయన్నాపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. అన్ని పార్టీల నాయకులు, ప్రతిపక్ష నేతలతో సహా ప్రతి ఒక్కరినీ ఆహ్వానించామన్నారు. ఈ సాధన సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఆహారం, పార్కింగ్, భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప, డీసీసీ అధ్యక్షుడు శిరాజ్ షేక్, ఏఐసీసీ కార్యక్రమ పరిశీలకుడు రవి బోసురాజు, హుడా చైర్మన్ ఇమాం నియాజీ తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా భూగర్భ డ్రైనేజీలు
సాక్షి,బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. పేరుకే బళ్లారి స్టీల్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటారే కాని పాలకులు, అధికారులు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఒక వైపు రోజు రోజుకు జనాభా పెరుగుతుంటే మరోవైపు రోజురోజుకు నగరంలోని సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుని భూగర్భ డ్రైనేజీ లీకేజీలు నిరంతరంగా కొనసాగుతుండటం నగర వాసులకు శాపంగా మారింది. భూగర్భ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్ల మీద మురుగునీరు లీకయినప్పుడు వర్షం నీరులా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. అనంతపురం రోడ్డులోని బైపాస్ సర్కిల్‌కు వెళ్లే రోడ్డులో ఇటు వైపున మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున యూజీడీ మ్యాన్‌హోల్ నుంచి మురుగు నీరు లీకవుతూ రోడ్డు మీదకు పారుతోంది. అటు, ఇటు వాహనాలు వచ్చేటప్పుడు ఆ మురుగునీరు జనం మీదకు పడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు మరింత ఇబ్బందులు గురి అవుతున్నారు. రోడ్డు గుండా దుర్వాసన వెదజల్లుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు బయటకు ప్రవహిస్తోందని తెలిసినా మహానగర పాలికె అధికారులు, సిబ్బంది, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు కూడా తోడైంది.. ఇటీవల భారీ వర్షం కురవడంతో వర్షం నీటితో పాటు మురుగునీరు కలిసి ప్రవహించడం మరింత సమస్యగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నగరంలో ఏదో ఒక కాలనీ, రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి మురుగునీరు లీకవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. లీకేజీ అయిన చోట మహానగర పాలికె అధికారులు తూతూమంత్రంగా మరమ్మతు పనులు చేసి చేతులు దులుపుకోవడంతో సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. వందలాది కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి పనులకు మూలుగుతున్నా వాటిని సద్వినియోగం చేసుకుని నగరంలో పేరుకున్న సమస్యలను తీర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఇప్పటిది కాదు, గతంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత నగరంలో వేగవంతంగా అభివృద్ధి కావడంతో డ్రైనేజీ సిస్టంను సరి చేయాల్సిన అవసరం ఉందని పాలకులు, అధికారులు చెబుతున్నారే కాని ఆ దిశగా అడుగులు వేయక పోవడంతో స్టీల్ సిటీగా గొప్పలు చెబుతున్నారే కాని నగరంలో ఇంకా అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీలు దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ లీకవుతున్న వైనం దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీరు పట్టించుకోని పాలికె యంత్రాంగం -
కారు, ట్రాక్టర్ ఢీ.. నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కారులో వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో పాటు అత్తా కోడళ్లు నలుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా చిత్రహళ్లి వద్ద జరిగింది. ప్రమాదంలో గంగమ్మ(50), కావ్య(30), హన్సిక(4), మనస్వి(2) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రముఖ వ్యాపారి తిప్పేస్వామి కుటుంబ సభ్యులని తెలిసింది. ఆయన కుమారుడు యశ్వంత్‌తోపాటు కారులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే హొళల్కెరె పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలను సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యశ్వంత్‌ను చికిత్స నిమిత్తం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు చిన్నారులు మృతి చెందడంతో చిత్రహళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై హొళల్కెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు -
ఆటంకాల నడుమ ఎస్సీ కులగణన
కోలారు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ రిజర్వేషన్లలో జనసంఖ్య ప్రాతిపదికన ఏబీసీడీలుగా వర్గీకరించేందుకు చేపట్టిన ఎస్సీ జనగణన ఆటంకాల మధ్య సాగుతోంది. కోలారు జిల్లాలో సాంకేతిక సమస్యలు వివిధ కారణాల వల్ల మందగతిలో ఉంది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మే 5వ తేదీ నుంచి మొదటి దశ సమీక్ష ప్రారంభమైంది. జిల్లాలో 4 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎస్సి సముదాయం కుటుంబాలు సుమారు 1.32 లక్షలు ఉన్నాయి. సమీక్ష కోసం 1,538 బూత్‌లు గుర్తించారు. ఉపాధ్యాయ సిబ్బందిని నియమించి, రోజుకు 37 వేల కుటుంబాల సమీక్ష చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఒక్కో ఇంటి సర్వేకు 20 నిమిషాలు కేటాయించారు. పరిశీలకులకు ఇచ్చిన యాప్‌లో ఉన్న 42 ప్రశ్నలు ఉన్నాయి, కుటుంబీకుల నుంచి సమాచారం తీసుకుని యాప్‌లో నమోదుకు కనీసం ఒక గంట పడుతోందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. ఈ ఆలస్యం వల్ల ముందుకు సాగడం లేదని వాపోయారు. అదీకాక యాప్ సమస్యలు, సర్వర్ డౌన్ ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో కొత్త యాప్ అందించినా అందుకు ఇంకా ఎన్యుమరేటర్లు అనుసరించడం లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు 60 రోజుల్లో కులగణన పూర్తవుతుందా అనేది సందేహంగా మారింది. పరిశీలకుల గైర్హాజరు చాలామంది పరిశీలకులు సర్వేకు ముఖం చాటేస్తున్నారు. కొంతమంది సెలవులు పెట్టి వెళుతుంటే, మరికొంతమంది ఇంకా లాగిన్ కాలేదు. ప్రతి రోజు 6.30 గంటలకు సర్వేని ప్రారంభించాలి. అయితే రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలవుతోందని తెలిసింది. మొదటి దశ ఇంటింటి సమీక్ష ఈ నెల 17 వరకు జరుగుతుంది. మే 19 నుంచి 21 వరకు ఆయా గ్రామ పంచాయతీలలో విశేష శిబిరాలను నిర్వహిస్తున్నారు. కూలి కార్మికులు, వలస వెళ్లిన వారిని నమోదు చేస్తారు. 3వ దశలో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. యాప్‌లో అనేక సమస్యలు ఒక్కో కుటుంబం నమోదుకు గంట సమయం ఉసూరుమంటున్న పరిశీలకులు సమస్యలు ఉన్నాయి: జేడీ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ స్పందిస్తూ మొదట ఇచ్చిన యాప్‌ను కాదని కొత్త యాప్‌ను అందించాం. దీనికి ఎన్యుమరేటర్లు అనుసరించడం ఆలస్యం అవుతోంది. 42 ప్రశ్నలను 20 నిమిషాలలో పూర్తి చేయాలని లక్ష్యం ఇచ్చాం. కొన్నిసార్లు ఇది సాధ్యం కావడం లేదు. ఎన్యుమరేటర్లకు మరింత శిక్షణ నివ్వాలని అనుకుంటున్నాం. -
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించండి
బళ్లారిఅర్బన్: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గ్రాచ్యుటీ చెల్లింపుతో పాటు ఉద్యోగ విరమణ ఒప్పందాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తక్షణమే అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి అర్కాణి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని స్థానిక అధికారి తహసీల్దార్‌కు అందజేశారు. అనంతరం అర్కాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శిశు అభివృద్ధి శాఖ, సమగ్ర బాల వికాస పథకం ద్వారా నిరుపేద శిశువులు, బాలింతలు, గర్భిణి మహిళల సమగ్ర ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న అంగన్వాడీ, రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఉద్యోగులకు అన్వయించేలా గ్రాచ్యుటీ సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ.మంగమ్మ, సీడీ మీనాకుమారి, డీ.ఎర్రమ్మ, టి.ఇందిరా, పుష్పావతి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు బృహత్ రాజయోగ ధ్యానంహుబ్లీ: గదగ్‌లోని సిద్దరామేశ్వర నగర ఆధ్యాత్మిక సాంస్కృతిక భవనంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఒత్తిడి లేని జీవితం కోసం బృహత్ రాజయోగ ధ్యాన కార్యక్రమాన్ని చేపడతామని బ్రహ్మకుమారి జయంతి తెలిపారు. గదగ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ అబు పర్వతం రాజయోగిని బ్రహ్మకుమారితో సహా ముఖ్యపాలనాధికారి డీకే.సుదేశ్ జీ ప్రారంభించే ఈ కార్యక్రమంలో ప్రముఖులు డీఆర్ పాటిల్, ప్రసన్నకుమార్ శాబాది మఠ, సవిత సిగ్లి, రాజశేఖర్ బళ్లారి, తాతనగౌడ పాటిల్ తదితరులు పాల్గొంటారన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈశ్వరీయ జ్ఞానంతో పాటు సహజ రాజయోగ శిక్షణ ద్వారా ప్రపంచంలో సుమారు 140 దేశాల్లో ఈ ఏడాది పూర్తిగా ప్రపంచ ఐక్యత, నమ్మకం కోసం యోగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆ మేరకు ప్రజా కార్యక్రమాలు, సదస్సులు, సమ్మేళనాలు, ఎగ్జిబిషన్ ర్యాలీలను దేశ నలుమూలలా ఏర్పాటు చేసి ప్రజల్లో ఆధ్యాత్మిక జాగృతి కల్పించి మనిషి మనసును సద్భావన, సన్మార్గం వైపు మళ్లించేందుకు కృషి చేస్తామన్నారు. ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడిరాయచూరు రూరల్: నగరంలో వివిధ చోట్ల కాలువల్లో, వీధుల్లో ప్లాస్టిక్ కవర్లు అధికం కావడంతో నగరసభ అధికారులు దుఖాణాలపై దాడులు జరిపారు. శనివారం కమిషనర్ జుబీన్ మహాపాత్రో ఆదేశాల మేరకు దాడులు జరిపి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు బేకరీలు, రెండు దుఖాణాలపై దాడులు చేసి లైసెన్సులను రద్దు చేసినట్లు ఆరోగ్య అధికారి శాకీర్ తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను ఉత్పత్తి చేసే యూనిట్లపై కూడా దాడులు చేస్తామన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదానికి 19వ గేట్ డిజైన్హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 19వ గేట్ వర్కింగ్ డిజైన్‌ను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదానికి సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిపుణులు తుంగభద్ర బోర్డుకు తెలియజేశారు. తుంగభద్ర జలాశయంలో 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ను తొలగించి క్రస్ట్‌గేట్ ఏర్పాటు చేసే టెండర్‌ను గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూర్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీ దక్కించుకుంది. ఈ కంపెనీ సమర్పించిన డిజైన్ పరిశీలించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిపుణులు డిజైన్‌ను ఆమోదించారు. అయితే కేంద్ర జల సంఘం నుంచి అనుమతి పొందిన తర్వాతే పని చేపట్టాలని వారు సూచించారు. కనుక బోర్డు ఇప్పుడు పని డిజైన్‌ను సమర్పించడానికి సిద్ధమవుతోంది. ఈలోగా 32 గేట్ల టెండర్ ఏ కంపెనీ దక్కించుకుంటుందనే విషయం సోమవారం బయట పడవచ్చని మండలి వర్గాలు తెలిపారు. హత్యాచార దోషులపై చర్యకు డిమాండ్ హొసపేటె: ఇటీవల రామనగరలో అమాయక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర దివ్యాంగుల సంఘం డిమాండ్ చేస్తూ శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ గ్రామానికి సమీపంలోని రైలు పట్టాల దగ్గర 14 ఏళ్ల మైనర్ బాలికపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన రామనగరలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ ఆశిష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా లోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
మురిసిన మువ్వన్నెల జెండా
సాక్షి,బళ్లారి: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై భారత్ సైనికులు వీరోచితంగా పోరాడి, ఉగ్రవాదులకు, అందుకు సహకరిస్తున్న పాకిస్థాన్‌ను వణుకు పుట్టించి భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో నగరంలో భారత సైనికులకు జేజేలు పలికారు. శనివారం నాగరిక పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరంగయాత్ర ర్యాలీ చేపట్టారు. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం నుంచి రాయల్ సర్కిల్, బెంగళూరు రోడ్డు, బ్రూస్‌పేట పోలీసు స్టేషన్, తేరువీధి తదితర కాలనీల గుండా మూడు రంగుల జెండాలు పట్టుకుని, భారత సైనికులకు జేజేలు, జిందాబాద్‌లు పలుకుతూ ముందుకు కదిలారు. మహిళలకు ఒకరికొకరు నుదిటిపై సిందూరాన్ని పెట్టుకుని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక భూమిక పోషించిన సైనికుల త్యాగాలు ఈ దేశం ఎన్నటికీ మరవదన్నారు. వారి వెంట తామందరం ఉన్నామని గుర్తు చేశారు. పాకిస్తాన్‌కు వణుకు పుట్టించారు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో అమాయకులైన భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు, అందుకు సహకారం అందిస్తున్న పాకిస్థాన్‌కు 23 నిమిషాల్లో వణుకు పుట్టించారన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేశారన్నారు. వందలాది మంది ఉగ్రవాదులను హతం చేశారన్నారు. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ సైన్యం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, సురేఖ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయచూరులో... రాయచూరు రూరల్: నగరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం మహాత్మాగాంధీ క్రీడా మైదానం నుంచి తిరంగ యాత్రను చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ మాట్లాడుతూ భారత దేశంలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి కశ్మీర్‌లోని పహల్గాంలో దాడికి పాల్పడి భారతీయులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో మన సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అపరేషన్ సిందూర్ చేపట్టి విజయవంతమైనందుకు తిరంగ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదులను ఎన్నటికీ క్షమించరాదన్నారు. శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, మాజీ ఎమ్మెల్యే బసవనగౌడ బ్యాగవాట్, మాజీ అధ్యక్షుడు రమానంద యాదవ్, సభ్యులు శంకరరెడ్డి, చంద్రశేఖర్, మల్లికార్జున, పాటిల్, లలిత, నాగరాజ్ భాల్కి, ఆంజనేయ, రవీంద్ర, సుమ, నాగవేణి, రవిలున్నారు. విజయనగరలో... హొసపేటె: ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో భారత సైన్యానికి అభినందనగా శనివారం హొసపేటె చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నేతృత్వంలో హొసపేటెలో తిరంగయాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వడకరాయ ఆలయం వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించి అంబేడ్కర్ సర్కిల్ వరకు చేపట్టారు. ర్యాలీలో ప్రజలు మన దేశ సైన్యం సాహసాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ర్యాలీలో వివిధ సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు అశ్విని కోత్తంబరి, కాకుబాళు రాజేంద్ర, భూపాల్ ప్రహ్లాద్, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, నందిపురమఠం గడ్డికెరె చరంతేశ్వర శివాచార్య మహాస్వామి, హగరిబొమ్మనహళ్లి హాల శంకర మఠం హాల శంకర మహాస్వామి, నగరసభ అధ్యక్షుడు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు రమేష్ గుప్లా, కే.రాఘవేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గనినాడులో ఆకట్టుకున్న తిరంగయాత్ర నగరంలో జాతీయ పతాకాలతో ఊరేగింపు దారి పొడవునా సైనికులకు జయజయధ్వానాల నినాదాలు -
పుల్లయ్య కుటుంబానికి పరామర్శ
సాక్షి.బళ్లారి: అనంతపురం లోక్‌సభ మాజీ సభ్యుడు దరూరు పుల్లయ్య మృతి తీరని లోటని అనంతపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే.రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని దరూరు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం దరూరు పుల్లయ్య గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో కుమారుడు రమేష్, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పానన్నారు. దరూరు పుల్లయ్య సర్పంచ్ స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, రెండు సార్లు అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలుపొందారని గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. హంద్రీనీవా పథకం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారని, ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. 90 ఏళ్లు దాటినా ఎంతో ఉల్లాసంగా ఉండేవారన్నారు. పొలానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఆయన వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటూ చక్కని జీవితాన్ని సాగించారన్నారు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులన్నారు. ఈసందర్భంగా బళ్లారి జిల్లా సీపీఐ నాయకులు కామ్రేడ్ ఆదిమూర్తి, అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు కామ్రేడ్ సీ.జాఫర్, అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ గోపాల్, కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ కేశవరెడ్డి, సీపీఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శులు కామ్రేడ్ పీ.నారాయణస్వామి, కామ్రేడ్ సీ.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీలకు నిధుల కొరత లేదు
హొసపేటె: హామీ పథకాలు తగినంతగా చేరడం లేదని ప్రజలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం హామీ పథకాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పునీత్ జిల్లా క్రీడా మైదానంలో ఈనెల 20న నిర్వహిస్తున్న సాధన సమావేశపు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతేడాది లానే ఈ ఏడాది బడ్జెట్లోనూ హామీలకు నిధులిచ్చామన్నారు. గత ఏడాది కన్నా ఈసారి అదనంగా రూ.3 వేల కోట్లను అదనంగా బడ్జెట్లో కేటాయించామన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై ఇతర రాష్ట్రాల్లో కూడా కాపీ కొడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 20న విజయనగర జిల్లా హొసపేటెలో ప్రభుత్వం సాధన సమావేశం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం పక్కాగా ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదే రోజు సుమారు 1 లక్ష 3 వేల మంది పేదలకు హక్కు పత్రాలను అందిస్తామన్నారు. అతిరథ మహారథుల రాక కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, కేబినెట్ మంత్రులు, మొత్తం ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. గ్రేటర్ బెంగళూరుకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ విమర్శలపై ప్రతిస్పందిస్తూ, అప్పటి బీజేపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేష్‌కుమార్ బెంగళూరు చాలా పెద్దదిగా పెరిగినందున, విభజన చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత బెంగళూరు నగరానికి మూడు లేదా అంత కంటే ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు జమీర్ అహమ్మద్ ఖాన్, శివరాజ్ తంగడిగి, బోసురాజు, కృష్ణబైరేగౌడ, హెచ్‌కే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సాధన సభ సర్కారు కార్యక్రమం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడి -
తుంగభద్ర పూడిక తొలగింపు కష్టసాధ్యం
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో పేరుకు పోయిన పూడికను తొలగించడం కష్టసాధ్యం. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈనెల 20న జరుగనున్న సాధన సమావేశం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లు, వేదికను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర జలాయంలో పూడికతో వృథా అవుతున్న నీటిని తిరిగి పొందేందుకు ప్రత్యామ్నాయంగా నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 25 టీఎంసీల వరకు నీటి సరఫరాకు సంబంధించి ఒక ప్రతిపాదన ఉందన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో దీనిపై చర్చిస్తామన్నారు. నీటిపారుదల శాఖ నుంచి కూడా తమకు ప్రతిపాదన అందిందన్నారు. దానికి ఎటువంటి కాల పరిమితి లేదని ఆయన స్పష్టం చేశారు. తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతులు కూడా చేస్తామన్నారు. దీని కోసం ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గేట్ల మార్పునకు నిధుల కొరత లేదన్నారు. దీనిపై మూడు రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. 2023 మే 13న రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించి అధికారం అప్పగించారన్నారు. ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో ఉండటంతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 138కి పెరిగిందన్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా రాష్ట్రంలో మేమే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఓటు వేశారన్నారు. తమ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తి కావడంతో తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామన్నారు. ఈ నెల 20న హొసపేటెలో జరుగునున్న సాధన సమావేశం సందర్భంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా పేద ప్రజలకు హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. చాలా ఏళ్లుగా రెవెన్యూ శాఖ పరిధిలోకి రాని తండాలను, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా మారుస్తామన్నారు. అదే విధంగా నివాసులకు పట్టాలకు అందిస్తామన్నారు. ఈ సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారన్నారు. సమావేశానికి బీజేపీ, జేడీఎస్ పార్టీల వారిని కూడా ఆహ్వానించామన్నారు. మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, శివరాజ్ తంగడిగి, చెలువరాయస్వామి, హెచ్‌కే పాటిల్, బైరేగౌడ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు. 20న హొసపేటెలో సాధన సమావేశం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బేకరీ దగ్ధం
హొసపేటె: కూడ్లిగి పట్టణంలో ఉన్న హసన్ బేకరీలో గురువారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బేకరీలోని వస్తువులు, ఫ్రిజ్‌లు, ఇతర పరికరాలు పూర్తిగా కాలి పోయాయి. ఆ భవనం యజమాని సచిన్ గురువారం రాత్రి 10.30 గంటలకు ఎప్పటిలాగే బేకరీ తలుపు మూసివెళ్లారు. కొన్ని గంటల అనంతరం భవనం యజమాని బాల్‌రాజ్, వైర్లు కాలిపోతున్న వాసన వస్తోందని గమనించాడు. అతను ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి, బేకరీ నుంచి పొగలు రావడం చూశాడు. పాక్షిక సర్క్యూట్ అయి ఉండవచ్చని తెలుసుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే కూడ్లిగి అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి లోపల ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేసినట్లు కూడ్లిగి అగ్నిమాపక సూపరింటెండెంట్ శరణబసవరెడ్డి తెలిపారు. అప్పటికే బేకరీలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.లక్ష పెట్టుబడి పోయిందని, మొత్తం రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బేకరీ యజమాని సచిన్ తెలిపారు. రూ.30 లక్షల వరకు నష్టం -
చోరీ సొత్తు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
రాయచూరు రూరల్: చోరీ చేసిన వస్తువులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. గత నెల 17న కల్మలలోని యంకణ్ణ నివాసంలో జేగర్కల్కు చెందిన ఈరేష్(21)ను అరెస్ట్ చేశామన్నారు. ఎల్బీఎస్ నగర్లో నివాసమున్న ఈరేష్తో పాటు మహేష్ నాయక్, మహబూబ్‌లను విచారించగా, వారు చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించారన్నారు. 76 గ్రాముల బంగారం, 382 గ్రాముల వెండి, కెమెరా, గడియారాలను తొలగించారని, కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి, వారి వద్ద నుంచి రూ.7,89,272 విలువ చేసే సామగ్రిని సొంతదారులకు అప్పగిస్తామన్నారు. అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, సీఐ సాబయ్య, ఎస్ఐ ప్రకాష్ రెడ్డి డంబళలున్నారు. -
గాలివాన బీభత్సం.. వరి పైరుకు నష్టం
బళ్లారి రూరల్ : ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, ఆరుగాలం రైతులు కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి గాలివానకు నేలకొరిగి దిగుబడి తగ్గితే ఆ రైతు ఆవేదన ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. దావణగెరె పరిసర ప్రాంత రైతన్నలకు ఇలాంటి ఆవేదనే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం జడివాన కురిసింది. ఏకధాటిగా గంటకు పైగా నిరవధికంగా కురిసిన గాలివానకు వంకలు, వాగులు పారాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. ఈ జడివానకు కోతకు వచ్చిన వరిపైర్లు నేలకొరిగాయి. పంటపొలంలో ఒక్క అడుగు నీరు చేరాయి. వరికోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈనేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొంటున్నారు. పొలంలోనే రాలిన గింజలను చూసి బాధపడుతున్నారు. తడిసిన ధాన్యం రంగు మారితే ధర పలకదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నేలకొరిగిన చేతికొచ్చిన వరి తదితర పంటలు తడిసిన ధాన్యాన్ని ఆరపెట్టుకొంటున్న రైతన్నలు రంగు మారితే ధర పలకదని కర్షకుల దిగాలు -
బట్టలో వ్యక్తి మృతదేహం తరలింపు
రాయచూరు రూరల్: ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బట్టలో తీసుకెళుతున్న దృశ్యం బుధవారం సాయంత్రం యాదగిరి జిల్లాలోని యడహళ్లిలో చోటు చేసుకుంది.ట్రాక్టర్ వెనుక భాగానికి తగిలి గాయపడిన మల్లప్ప(33)ను ఆస్పత్రిలో చేర్పించారు. చివరికి ప్రాణాలు వదలడంతో గ్రామస్తులు బట్టలో శవాన్ని వేసుకొని తరలించి దహనం చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. ఈ విషయంలో గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హన్మంతు బంకలగికి తెలిపినా ప్రయోజనం లేకపోయింది. సహోదరులు శవాన్ని మోసుకెళ్లారు. 1.5 కి.మీ దూరంలోని హత్తికుణి ఆరోగ్య కేంద్రం నుంచి సకాలంలో అంబులెన్సు రాకపోవడంతో వారు శవాన్ని బట్టలో తీసుకెళ్లి శవ సంస్కారాలు జరిపారు. ఆక్రమణల తొలగింపునకు వినతి రాయచూరు రూరల్: నగరంలో నగరసభ కేటాయించిన గోశాల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టుకున్న ఇళ్లను తొలగించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయంలో కమిషనర్‌తో ఆయన మాట్లాడారు. 1942లో నగరసభ వార్షిక టెండర్లో గోశాల సమితికి 3.25 ఎకరాల భూమిని కేటాయించారు. 1965లో సమితికి పూర్తి అధికారంతో నేటి వరకు పన్నులు కట్టారన్నారు. రాజకీయ నాయకుల మద్దతుతో గోశాలలోని 2.25 ఎకరాల భూమి తమదే అంటూ గోపాల్ సింగ్ పుత్రులు ఆ ప్రాంతంలో నగరసభ, నగర ప్రాధికార, జిల్లాధికారి అనుమతి లేకుండా కట్టడాలను నిర్మించారన్నారు. నిర్మాణాలు చేపట్టడం తప్పని, వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
శ్రీగంధం చెట్లకు జియోటాగ్
బళ్లారి రూరల్ : అడవుల్లోను, ప్రభుత్వ భూముల్లో పెరుగుతున్న శ్రీగంధం చెట్లకు జియోటాగ్ వేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తెలిపారు. గురువారం అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. శ్రీగంధం చెట్ల్ల దొంగతనాలను నియంత్రించడానికి జియోటాగ్ వేయాలని సూచించారు. శ్రీగంధం చెట్లు అక్రమంగా తరలించకుండా గట్టి భద్రత కల్పించాలన్నారు. ఒక్క చెట్టు కూడా చోరీకి గురికాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో సెక్షన్– 4గా ఉన్న రెవిన్యూ భూమిని సెక్షన్– 17గా చేసి అటవీ భూములుగా ప్రకటించడానికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. మున్ముందు జరుగనున్న వనమహోత్సవ సందర్భంలో రోడ్లకు ఇరువైపులా ఎత్తైన చెట్లను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దావణగెరెలో వాయుకాలుష్యం అధికమైనట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు చేపట్టే క్రమంలో వాయుకాలుష్యాన్ని పరిశీలించి తగ్గించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. కలుషిత నీటి అవ్యవస్థ, మరణాలను అరికట్టాలని, ఇందుకోసం నీటి స్వచ్ఛతను పరిశీలించాలని తెలిపారు. వాయుకాలుష్య, నిఘా పరీక్ష ప్రయోగశాలను, నర్సరీలను పరిశీలించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులకు అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రే సూచన -
రైలు మార్గం నిర్మించవద్దని రైతుల ర్యాలీ
బళ్లారిటౌన్: నగర శివారులో హద్దినగుండు నుంచి బైపాస్ సైడింగ్ రైల్వే ట్రాక్‌ను రైల్వే శాఖ చేపడుతున్న నిర్మాణాన్ని రద్దు చేయాలని ఆయా ప్రాంత రైతులు శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించి జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. హద్దినగుండు నుంచి కుడితిని వరకు చాగనూరు, బీడీహళ్లి, సిరవార, కప్పగల్, శ్రీధరగడ్డ, బాలాజీ నగర్ క్యాంప్, లక్ష్మీనగర్ క్యాంప్ సోమసముద్ర తదితర గ్రామాల్లో నీటిపారుదల భూములు ఉన్నందున తాము వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుని సాగు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో బైపాస్ రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టడం వల్ల తాము రూ.కోట్లాది విలువైన భూములను కోల్పోతామన్నారు. తమ విలువైన భూముల్లో రైల్వే ట్రాక్ నిర్మించవద్దని రైతులు డిమాండ్ చేశారు.తొలుత స్థానిక కనక దుర్గమ్మ దేవస్థానం వద్ద నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం తమ వినతిపత్రాన్ని సమర్పించారు. ఊరేగింపులో ఆయా గ్రామాల నుంచి వందలాది సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
వీడియో కౌన్సిలింగ్ కూడా...
● టెలీ మానస్‌తో మనసు ప్రశాంతం ● సహాయవాణికి ఏటేటా పెరుగుతున్న కాల్స్ ● మానసిక అనారోగ్య సమస్యలకు కౌన్సిలింగ్ సాక్షి బెంగళూరు: ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది.. మనిషి ఈ ప్రపంచంతో పాటు పరుగులు పెడుతున్నాడు. తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయి పనిలో మునిగి తేలుతున్నాడు. దీంతో చివరికి ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నాడు. అనేక మానసిక సమస్యలకు గురవుతున్నాడు. ఇలాంటివారికి ఉపశమనం కలిగించేందుకు ‘టెలీ మానస్’ ఉపకరిస్తోంది. మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇదొక సహాయవాణి.. జాతీయ మానసిక ఆరోగ్య, న్యూరో సంస్థ (నిమ్హాన్స్) ఈ సహాయవాణిని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ నిమ్హాన్స్ సహాయవాణికి మానసిక అనారోగ్య సమస్యలతో పరిష్కారాల కోసం కాల్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. రోజూ సుమారు సగటున 3.5 వేల కాల్స్ ఈ సహాయవాణికి వస్తున్నాయి. ఉత్తమ స్పందన సహాయ వాణికి కాల్స్ చేసే రోగులకు వారి వివిధ రీతుల మానసిక అనారోగ్య సమస్యలకు ఉచితంగా పరిష్కారాలను, కౌన్సిలింగ్‌ను అందిస్తున్నారు. ఈ టెలీ మానస్‌కు అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ ఐఐఐటీ–బీ సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మానసిక సమస్యలు, ఒత్తిళ్లకు గురైన వారికి ఉచిత సలహాలు, సమాలోచనలు చేసేందుకు 2022 అక్టోబర్‌లో ఈ టెలీమానస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి టెలీ మానస్‌కు మంచి స్పందన వచ్చింది. మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా కాల్స్ ఈ సహాయవాణికి వచ్చాయంటే ఈ వినూత్న కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో అర్థం అవుతోంది.యువతలోనే ఎక్కువ మానసిక సమస్యలు వారంలో అన్ని రోజుల్లో 24 గంటల పాటు ఈ టెలీ మానస్ పని చేస్తోంది. 20 భాషల్లో కాల్స్ స్వీకరిస్తున్నారు. బాధలకు గురవుతున్నవారు, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్న వారు, చదువుల్లో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నవారు, మాదకద్రవ్యాల వ్యసనానికి బానిసైన వారు, జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వారు, ఆర్థిక ఒత్తిళ్లు కలిగిన వారు ఇలా వివిధ రకాల మానసిక సమస్యలు ఉన్న వారు సహాయవాణికి కాల్స్ చేస్తున్నారు. కాల్స్ వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి ఎంతో ఓపికతో వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని తగు విధంగా కౌన్సిలింగ్, పరిష్కార మార్గాలను బాధితులకు ఇస్తున్నారు. ఇటీవల టెలీ మానస్‌కు వస్తున్న కాల్స్‌లో ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత నుంచే ఉంటున్నాయి.నిద్ర, పరీక్షల ఒత్తిడి సమస్యల గురించి యువత ఎక్కువగా టెలీ మానస్‌ను ఆశ్రయిస్తున్నారు. తొలుత కేవలం కాల్స్‌కే పరిమితం అయిన టెలీ మానస్ ఆ తర్వాత గత ఏడాది నుంచి వీడియో కౌన్సిలింగ్ సేవలను కూడా ఇవ్వడం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభం అయిన వీడియో కౌన్సిలింగ్‌కు మంచి స్పందన రావడంతో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు నిమ్హాన్స్ ఆలోచనలు చేస్తోంది. ప్రతి టెలీ మానస్ కేంద్రంలో నలుగురు వైద్యుల బృందం, 8 మంది కౌన్సిలర్లు పని చేస్తున్నారు. తొలుత కాల్స్ రాగానే వారి మానసకి సమస్య తీవ్రమైనది అయితే వీడియో కాల్‌కు మార్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు,జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ సేవలను పరిచయం చేశారు. కాగా, ఇప్పుడిప్పుడే మానసిక అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, దీంతో సహాయవాణికి వచ్చే కాల్స్ సంఖ్య పెరిగిందని నిమ్హాన్స్ వైద్యులు చెబుతున్నారు. -
దేశ రక్షణే మనకు ముఖ్యం
సాక్షి,బళ్లారి: దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారని, భారత్‌పై దాడులకు తెగబడిన వారి అంతు చూడాల్సిందేనని, పాకిస్తాన్‌తో యుద్దం వద్దని తాను ఎప్పుడూ అనలేదని, తన మాటలను వక్రీకరించారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో గిణిగేరాలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో యావత్ భారతదేశం ఒకటిగా నిలిచిందన్నారు. యుద్ధానికి తాము పూర్తిగా మద్దతు ఇచ్చామన్నారు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో మన సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. ఉగ్రవాదుల అంతానికి మంచి అవకాశం ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం దొరికిందని, అయితే సమయం మళ్లీ వస్తుందన్నారు. యుద్ధం నిలుపుదల చేయడంపై మోదీ, విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు విధాలుగా మాట్లాడారన్నారు. గ్రేటర్ బెంగళూరు కాదు, క్వార్టర్ బెంగళూరు అని ప్రతిపక్ష నేత ఆశోక్ మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఆయనకు క్వార్టర్ ఎప్పుడూ గుర్తు ఉండటం వల్లే గ్రేటర్ కాదు, క్వార్టర్ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. బెంగళూరును మూడు కార్పొరేషన్లుగా విభజించే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. అయితే అది వారి వారి వ్యక్తిగతం అన్నారు. యుద్ధానికి ప్రతి భారతీయుడు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్ల సాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మంగళూరు పర్యటనకు వెళ్లిన సీఎం కొత్తగా ప్రజా సౌధ పేరుతో నిర్మించిన కలెక్టర్ భవనాన్ని ప్రారంభించారు. మనపై దాడి చేసిన వారిపై బదులు తీర్చుకోవాల్సిందే పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని నేనెప్పుడూ అనలేదు కొప్పళ జిల్లా గిణిగేరాలో సీఎం సిద్ధరామయ్య వెల్లడి -
లోకాయుక్తకు చిక్కిన అరణ్యాధికారిణి
చింతామణి: రైతు నుంచి లంచం తీసుకుంటూ అరణ్యాధికారిణి లోకాయుక్తకు పట్టుబడింది. శ్రీనివాస్ అనే రైతుకు శ్రీనివాసపుర రోడ్డులో పెట్రోల్‌బంకు ఏర్పాటుకు అనుమతి లభించింది. అయితే బంక్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని శ్రీనివాస్ పట్టణంలోని అరణ్యాధికారిణి శోభను సంప్రదించాడు. ఆమె రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం బాధితుడు లంచం ఇస్తుండగా లోకాయుక్త ఎస్పీ ఆంటోని, డీఎస్పీ వీరేంద్ర కుమార్‌లు దాడి చేశారు. అధికారిణి శోభను, ఆమె కారు డ్రైవర్ మణిని అరెస్ట్ చేశారు. సీఐపై సస్పెన్షన్ వేటు దొడ్డబళ్లాపురం: పవిత్ర గ్రంథాన్ని దుండగులు కాల్చివేసిన సంఘటనకు సంబంధించి సీఐను సస్పెండ్ చేసిన సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం బెళగావి తాలూకా సంతిబస్తవాడ గ్రామంలో ఒక మతానికి చెందిన గ్రంథాన్ని కొందరు తస్కరించి కాల్చివేశారు. ఈ సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో సీఐ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ తెలిపారు. ఈద్గా గోపురాన్ని ధ్వంసం చేసిన కేసులో కూడా సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. భార్యను కడతేర్చి ఠాణాలో లొంగిపోయిన భర్త బనశంకరి: భార్యను కడతేర్చిన భర్త పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈఘటన బాణసవాడిలో జరిగింది. జయలక్ష్మి పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రమేష్ మొదటి భార్యతో విడిపోయి కలైవాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలను రమేష్ కలిసిన విషయంలో శుక్రవారం తెల్లవారుజామున దంపతుల మధ్య గొడవ జరిగింది. ఓ దశలో రమేష్ కలైవాణిపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం నేరుగా బాణసవాడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. బాణసవాడి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపునకు అంగీకారం శివాజీనగర: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ప్రముఖ నగరాల్లో ప్రజల రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని ఢిల్లీలోని కార్యాలయంలో కలిసి చర్చలు జరిపారు. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు కుమారస్వామి భరోసా ఇచ్చారు. కర్ణాటకకు దశల వారీగా విద్యుత్ చార్జింగ్ బస్సులను పంపిణీ చేస్తామని భరోసానిచ్చారు. నగర ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ బస్సులు నడిపేందుకు కేంద్రం పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తోందన్నారు. టర్కీ సెలెబి ఏవియేషన్ సేవలు రద్దు దొడ్డబళ్లాపురం: పాకిస్తాన్‌కు మద్దతుగా నిలచిన టర్కీకి కెంపేగౌడ ఎయిర్‌పోర్టు అధికారులు షాక్ ఇచ్చారు. టర్కీ సెలెబి ఏవియేషన్ ఎయిర్‌పోర్టు సేవలను గురువారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో రోజూ 15 అంతర్జాతీయ విమానాలు, కార్గో విమానాలను సెలెబి ఏవియేషన్ నిర్వహిస్తుండేది. దేశంలోని 9 ఎయిర్‌పోర్టుల్లో ప్రాథమిక స్థాయి సేవలు అందిస్తున్న టర్కీ సెలెబి ఏవియేషన్ కంపెనీకి మంజూరు చేసిన సేఫా లైసెన్స్‌ను బీసీసీఎస్ రద్దు చేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
ఎస్సీ రిజర్వేషన్ సర్వే కాలావధి పొడిగింపు
శివాజీనగర: ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సర్వే కాలావధిని విస్తరించేందుకు తీర్మానించినట్లు ఏకపభ్య కమిషన్ అధ్యక్షుడు న్యాయమూర్తి హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ తెలిపారు. శుక్రవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ సర్వే సమయంలో ఉద్భవిస్తున్న కొన్ని సమస్యలను సరిచేసేందుకు సర్వే తేదీని విస్తరించాలని ఎమ్మెల్యేలు, పలు సంఘ సంస్థల నేతలు కోరారన్నారు. దీంతో ఈనెల 17వరకు చేపట్టాల్సిన ఇంటింటి సర్వేను ఈనెల 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రత్యేక శిబిరాలుఉ మే 26 నుంచి 28 వరకు పొడిగించినట్లు, ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకు మే 19 నుండి 28 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 73.72 శాతం ప్రగతి: మే 15 నాటికి ఇంటింటి సర్వేలో 73.72 శాతం ప్రగతి సాధించినట్లు హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ తెలిపారు. బీబీఎంపీ పరిధిలోని పరిధిలో 55,027 ఎస్సీ కుటుంబాలతో సహా 31 జిల్లాల్లో మొత్తం 18,96,285 ఎస్సీ కుటుంబాలను సర్వే చేశామన్నారు. 1,10,32,556 ఎస్సీయేతర కుటుంబాలను భేటీ చేశామన్నారు. 2011 కుల గణన ప్రకారం రాష్ట్రంలో 21,40,304 ఎస్సీ కుటుంబాలు ఉండగా, 2025 నాటికి సుమారు 25,72,050 కుటుంబాలు ఉండవచ్చని అంచనా వేశామన్నారు. అపార్ట్మెంట్లలో సర్వేను అడ్డగించినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. అడ్డు చెప్పినవారి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ సిబ్బంది వర్గపు ఉప కులాలపై సమాచారం ఇవ్వని శాఖలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. బీబీఎంపీ పరిధిలో ప్రారంభదశలో సర్వే ప్రగతి కుంటు పడిందని, ఈ విషయమై బీబీఎంపీ చీఫ్ కమిషనర్, జోనల్ కమినర్లతో ఈనెల 17న సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏకసభ్య కమిషన్ అధ్యక్షుడు న్యాయమూర్తి హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ -
జమ్మూ కశ్మీర్ భరతమాత సిందూరం
మైసూరు: నగరంలో జై భారత్ నినాదాలు మిన్నంటాయి. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. పవల్గాం ఊచకోతకు సంబంధించి పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడాన్ని పురస్కరించుకొని భారత జవాన్లకు జేజేలు పలుకుతూ శుక్రవారం వేలాది మంది ప్రజలు నగరంలో జాతీయ జెండాలను పట్టుకొని తిరంగాయాత్ర చేపట్టారు. భారత సైన్యానికి మద్దతుగా ప్రాణాలైనా ఇస్తాం కాని జమ్ముకశ్మీర్‌ను మాత్రం ఇవ్వబోమని నినాదాలు చేశారు. ఫీల్డ్ మార్షల్ కార్యప్ప సర్కిల్ వద్దకు జాతీయ జెండాలతో వచ్చిన రాజకీయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వివిధ పోరాట సంఘాల నాయకులు, పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు వివిధ ధర్మాల మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాగరికులు, మహిళలు, చిన్నారులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పహల్గాంమ్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సుమారు 26 మంది పర్యాటకులకు, ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళి అర్పించారు. పాల్గొన్న స్వామీజీలు, ప్రజాప్రతినిధులు అనంతరం వేదికపైకి వచ్చిన సుత్తూరు మఠానికి చెందిన పీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ, ఆదిచుంచనగిరి మఠానికి చెందిన సోమనాథ స్వామీజీ, అవధూత దత్తపీఠ శ్రీగణపతి సచ్చిదానంద స్వామితో పాటు అనేక మంది ధర్మగురువులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రజా ప్రతినిధులు సైతం జాతీయ జెండాలు పట్టుకొని వేలాది మందితో కలిసి మైసూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కిలో మీటర్ల దూరం వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను పట్టుకొని అడుగు ముందుకు వేశారు. మైసూరులో తిరంగా యాత్ర వేలాదిగా పాల్గొన్న నగరవాసులు 4 కి.మీ. మేర మువ్వన్నెల జెండాతో ర్యాలీ -
మాదకద్రవ్యాలపై కొరడా
బనశంకరి: మాదకద్రవ్యాలైన ఎండీఎంఏ క్రిస్టల్ విక్రయానికి పాల్పడుతున్న నైజీరియా పౌరుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.4 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను పరిశీలించిన అనంతరం విలేకరులకు కమిషనర్ వివరాలను అందించారు. నైజీరియాకు చెందిన పౌరుడు సూలదేవనహళ్లి అచ్యుత్నగర మంజునాథనగర నివాసి డ్యానియల్ ఆరెంజ్ ఒక్వోశా(40) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. అతడి వద్ద నుంచి కిలో 485 గ్రాముల బరువు గల తెలుపు రంగు ఎండీఎంఏ క్రిస్టల్ 1కిలో 100 బ్రౌన్‌కలర్ ఎండీఎంఏ క్రిస్టల్‌తో పాటు 2 కిలోల 585 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, ద్విచక్రవాహనం, ఐఫోన్‌తో పాటు రూ.4 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 14న సీసీబీ పోలీసులు సూలదేవనహళ్లి అచ్యుతనగర్లోని ఇంట్లో ఇద్దరు విదేశీయులు నివాసం ఉంటూ ఎండీఎంఏ క్రిస్టల్‌ను స్థానిక గిరాకీలకు, కాలేజీ విద్యార్దులకు, ఐటీ బీటీ కంపెనీ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం ఆధారంగా దాడి చేసి డ్యానియల్ ఆరేంజ్ ఒక్వోశాను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండగా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నైజీరియా పౌరుడి అరెస్ట్ రూ.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం -
హరే కృష్ణ మందిరం ఇస్కాన్–బెంగళూరుదే
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సేల్ డీడ్‌ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు. -
కుటుంబాన్ని చిదిమిన అప్పులు
యశవంతపుర: అప్పుల బాధను తట్టుకోలేక కుటుంబ యజమాని బావిలోకి దూకగా, కాపాడాలని భార్య, కుమారుడు కూడా దూకారు. ఈ హృదయ విదారక దుర్ఘటన ఉడుపి జిల్లా కుందాపురలో జరిగింది. తెక్కట్టి సమీపంలోని కంచుగారుబెట్టు గ్రామానికి చెందిన మాధవ దేవాడిగ (56), కుమారుడు ప్రసాద్ దేవాడిగ (22)లు చనిపోగా, మాధవ భార్య తార పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. మాధవ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం బ్యాంకులలో అధికంగా అప్పులు చేశారు. అప్పులు కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. అప్పులు తీర్చే మార్గం లేక, విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంటి సమీపంలోని బావిలోకి దూకాడు. తండ్రిని రక్షించడానికి కొడుకు, ఆపై తల్లి కూడా బావిలోకి దూకారు. ముగ్గురినీ గ్రామస్థులు, ఫైర్ సిబ్బంది బయటకు తీసేటప్పటికీ తండ్రీ కుమారుడు మరణించగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు. తండ్రీ కొడుకు ఆత్మహత్య తల్లి పరిస్థితి విషమం -
ఘనంగా వ్యవసాయ స్నాతకోత్సవం
శివాజీనగర: బెంగళూరు వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విద్య, పరిశోధనా, విస్తరణలో దేశంలోనే ప్రఽథమ స్థానంలో ఉందని, వ్యవసాయ రంగంలో హరితవిప్లవం ద్వారా ఆహార ధాన్యం ఉత్పత్తిలో సుస్థిరతకు నాంది పలికిందని వ్యవసాయ మంత్రి ఎస్.చెలువరాయస్వామి తెలిపారు. గురువారం వర్సిటీ 59వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో వర్సిటీ పట్టభద్రులు పెద్ద సంఖ్యలో నియామకం కావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ గెహ్లాట్ పట్టభద్రులకు పట్టాలను, పతకాలను అందజేశారు. 5 మంది బంగారు పతకాలను అందుకున్నారు. 311 మందికి పీజీ , 89 మందికి పీహెచ్డీ పట్టాలను బహూకరించారు. సోను నిగమ్‌పై చర్యలు వద్దు: హైకోర్టు శివాజీనగర: ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన గాన కచేరీలో కన్నడపాట పాడమన్నందుకు ఆయన పహల్గాం ఉగ్రదాడితో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ సోను నిగమ్ దాఖలు చేసిన అర్జీని గురువారం విచారణ జరిపిన హైకోర్టు, ఆయనపై పోలీసులు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. సుహాస్‌శెట్టి హత్యకేసులో ముగ్గురు అరెస్ట్బనశంకరి: మంగళూరులో రౌడీషీటర్, హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్యకేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు గురువారం అరెస్టు చేసినట్లు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. విలేకరులకు వివరాలను వెల్లడించారు. మంగళూరు నగరంలో నివసించే అజారుద్దీన్(29), అబ్దుల్ ఖాదర్ (24), బంట్వాళవాసి నౌషాద్ (39)లను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. వీరందరిపై ఇదివరకే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరు సుహాస్‌శెట్టి కదలికలపై సమాచారం అందించడం, హంతకులు కారులో పారిపోయేందుకు సహకరించారు. ఇంతకుముందే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి పేరు సింధూరి మండ్య: ఆపరేషన్ సిందూర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయన కొప్పలు గ్రామంలో తమకు జన్మించిన కూతురికి తల్లిదండ్రులు సింధూరి అని పేరు పెట్టారు. సోమశేఖర్, హర్షిత దంపతులకు ఇటీవల పాప పుట్టింది. దేశంపైన ప్రేమతో సింధూరి అని నామకరణం చేసినట్లు తెలిపారు. మండ్య రక్షణ వేదిక అధ్యక్షుడు శంకర్‌బాబు ఆ దంపతులను సన్మానించి, పాప పేరిట రూ.10 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. కారును కంటైనర్ ఢీ, డ్రైవర్ మృతి మైసూరు: కంటైనర్ లారీ అదుపు తప్పి కారును ఢీకొనడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన ఘటన నంజనగూడు–గుండ్లుపేటె హైవే –766లో సింధువళ్లిపుర వద్ద జరిగింది. వివరాలు.. మండ్యకు చెందిన బాధితులు చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వైపు కారులో వెళుతున్నారు. సింధువళ్లిపుర వద్ద ఎదురుగా అతి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్, అసోంవాసి దినేష్ దుర్మరణం చెందాడు, కారులో ఉన్న మండ్య నగరసభ సభ్యుడు శివప్రకాష్ కుమారుడు, టెక్కీ తేజస్ కుమార్, అతని సోదరుడు కుశాల్, ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం మైసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పులకించె.. పుష్ప పల్లకి
బనశంకరి: సిలికాన్ సిటీలోని యలహంకలో శ్రీ మహేశ్వరమ్మ దేవస్థానం కరగ మహోత్సవం, మహేశ్వరమ్మ పూలకరగ, వివిధ దేవతల పూల పల్లకీల ఉత్సవాలను రమణీయంగా నిర్వహించారు. బుధవారం రాత్రి మహేశ్వరమ్మ ఆలయంలో వేడుకలకు యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్.విశ్వనాథ్ హాజరై పూజలు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పూజారి అయ్యప్ప పూల కరగను ఎత్తుకుని యలహంక వీధుల్లో నాట్యమాడుతూ సంచరించారు. గ్రామదేవతలైన చౌడేశ్వరీదేవి, మహేశ్వరమ్మ, మద్దూరమ్మ, యల్లమ్మ, వేణుగోపాలస్వామి, ప్లేగమ్మ, గంగమ్మ, వీరచౌడేశ్వరి, వెంకటేశ్వరస్వామి, అన్నపూర్ణేశ్వరీదేవి, సత్యనారాయణస్వామి, అమర నారాయణస్వామి, బాలాంజనేయస్వామి, పుళేగలమ్మ, శనేశ్వరుడు, గణపతి, ముత్యాలమ్మ తదితర 25 గ్రామదేవతలు పూల పల్లకీలను సుందరంగా పుష్పారాశులతో అలంకరించి ఊరేగించారు. యలహంకలో గ్రామ దేవతల జాతర -
మైసూరు నుంచి
హిమాలయ పర్వత యాత్ర మైసూరు: హిమాయల పర్వతాలను చూసే భాగ్యం అందరికీ దక్కేది కాదు. దూరాభారం, ఆర్థిక సమస్యలే అందుకు కారణం. కానీ మైసూరులోని మావటీలు, పౌరకార్మికుల పిల్లలు హిమాలయ పర్వతాలను అధిరోహించి ఔరా అనిపిచారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న సుమారు 13,990 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ కువారి పాస్ అనే పర్వతాన్ని ఎక్కారు. ఎనిమిది మంది పిల్లలు, కొందరు అటవీ ఉద్యోగులు, మహిళలు, యువతీ యువకులు కలిసిన 24 మంది మైసూరులోని టైగర్ అడ్వెంచర్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవల హిమాలయ యాత్రకు వెళ్లారు. ఏప్రిల్ 27వ తేదీన తుగాసి బేస్‌క్యాంప్‌ను చేరుకొని ఆరోహణ సాగించారు. ఎన్నో సవాళ్లను ఓర్చుకుని ఓ ఎత్తైన పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించామని తెలిపారు. -
గ్రేటర్ బెంగళూరుకు శ్రీకారం
శివాజీనగర: సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ, ఐటీ హబ్ ఇలా పలు విధాలుగా పేరు ప్రఖ్యాతులున్న బెంగళూరు నగరానికి గ్రేటర్ అనే కిరీటం సిద్ధమైంది. విశాలమైన నగరంలో పరిపాలన, సౌలభ్యాలను కల్పించడం కోసం ఇది అవసరమని సర్కారు చెబుతోంది. గురువారం నుంచి గ్రేటర్ బెంగళూరు చట్టం అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, నేటి నుంచి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అమల్లోకి వచ్చింది. ఇకపై బీబీఎంపీ అనేది ఉండదు, జీబీఏ అవుతుంది. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రాధికారకు తాను అధ్యక్షునిగా ఉంటానని తెలిపారు. 3 కార్పొరేషన్లుగా విభజన? ప్రస్తుతమున్న బీబీఎంపీని 3 భాగాలుగా విభజించే అవకాశముంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర కార్పొరేషన్లుగా విడగొట్టనున్నారు. ప్రతి పాలికెలో 125 వార్డులు ఉంటాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నగరంలో అనేక పాలనాపర మార్పులు రాబోతున్నాయి. ప్రజలకు కొన్ని మార్పులు సౌకర్యంగా, కొన్ని భారంగా ఉండే అవకాశముంది. గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను 120 రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో పాలికెకు సరిహద్దులు, అధికారాలు నిర్ణయించవలసి ఉంది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి గా ఉన్న డీకే శివకుమార్ ఈ ప్రాధికారకు ఉపాధ్యక్షునిగా ఉంటారు. ప్రాధికార పరిపాలన ఎలా ఉంటుందోనన్న కుతూహలం ప్రజల్లోను, ప్రభుత్వంలోను నెలకొంది. సీఎం సిద్దరామయ్య వెల్లడి బీబీఎంపీ స్థానంలో జీబీఏ -
ఉద్యోగాలంటూ వసూళ్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఐటీ ఇంజినీరును గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. జేపీ నగర సారక్కి చెరువు నివాసి పత్నూర్ కలందర్ఖాన్ (43) వంచకుడు. కేరళ నుంచి గతేడాది ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చిన నిందితుడు బీటీఎంలేఔట్ డాలర్స్‌కాలనీలో ఓ కంపెనీలో హెచ్ఆర్ ట్రైనర్‌గా చేరాడు. ఉద్యోగాలకు వచ్చే యువతీ యువకులతో పరిచయం పెంచుకున్నాడు. మీకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 8 మంది నుంచి రూ.14.23 లక్షలు వసూలు చేసి ముఖం చాటేశాడు. తరువాత గీత అనే యువతి నుంచి రూ.2.70 లక్షలు గుంజాడు. బాధితులు సీసీబీకి ఫిర్యాదు చేయడంతో విచారించి కలందర్ఖాన్ ను అరెస్ట్‌చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, మొబైల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
లంచగొండ్లపై ఆకస్మిక దాడి
బనశంకరి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై లోకాయుక్త అధికారులు పంజా విసిరారు. బెంగళూరు, గ్రామాంతర, తుమకూరు, యాదగిరి, మంగళూరు, విజయపుర జిల్లాల్లో 7 మంది అవినీతి అధికారులపై లోకాయుక్త అధికారులు, ఏకకాలంలో దాడులు నిర్వహించి కోట్లాది రూపాయల విలువచేసే అక్రమాస్తులు కనిపెట్టారు. గురువారం తెల్లవారుజామున 7 మంది అధికారులకు చెందిన 40 చోట్ల సోదాలు చేపట్టి పెద్ద మొత్తంలో నగదు, బంగారు వెండి ఆభరణాలు, వాహనాలు, ఇళ్లు, స్థలాల పత్రాలతో పాటు కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తిపాస్తులను గుర్తించినట్లు సమాచారం. విచ్చలవిడిగా లంచాలు తీసుకోవడం, ఆదాయానికి మించి ఆస్తులు గడించారనే ఆరోపణలు రావడంతో బెంగళూరులో 12, తుమకూరులో 7, బెంగళూరు గ్రామాంతరలో 8, యాదగిరిలో 5, మంగళూరులో 4, విజయపురలో 4 చోట్ల సోదాలు జరిగాయి. సోదాలు ఇంకొ కానసాగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని లోకాయుక్త వర్గాలు తెలిపాయి. కలబురిగిలో కలబురిగి శహపుర తహశీల్దార్ ఉమాకాంత్హళ్లి ఇంటిపై దాడిచేసిన లోకాయుక్త అధికారులు అక్కమహాదేవి లేఔట్లో తహశీల్దార్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. మంగళూరు, యాదగిరి.. మంగళూరు సర్వే సూపర్వైజర్ మంజునాథ్, విజయపుర డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అభివృద్ది మండలి అధికారిణి రేణుకా, యాదగిరి శహపుర తాలూకా కార్యాలయం అధికారి ఉమాకాంత్ ఇళ్లు, కార్యాలయంపై లోకాయుక్త అదికారులు దాడిచేశారు. విజయపుర నగరలో సెయింట్ జోసెఫ్ పాఠశాల వెనుక అంబేడ్కర్ మండలి జిల్లా మేనేజర్ రేణుకా సాతార్లే నివాసంలో, ఆఫీసులోను గాలింపు జరిపారు. బెంగళూరు రూరల్.. బెంగళూరు గ్రామాంతర జిల్లా హొసకోటే తాలూకా బోదనహొసహళ్లి ఎస్డీఏ అనంత్ ఇంటిలో సోదాలు జరిగాయి. దేవనహళ్లి, హొసకోటేలో భూమంజూరు విభాగంలో పనిచేస్తున్న అనంత్, ఆదాయానికి మించిన ఆస్తులు గడించారనే ఆరోపణలున్నాయి. దాడులు జరిగిన అధికారులు ● రాజశేఖర్ – తుమకూరు నిర్మితి ప్లానింగ్ డైరెక్టర్ ● మంజునాథ్ – సర్వే సూపర్వైజర్ మంగళూరు ● రేణుక – అంబేడ్కర్ అభివృద్ధి మండలి అధికారి, విజయపుర ● మురళీ– అదనపు డైరెక్టర్, నగర గ్రామాంతర ప్లానింగ్ డైరెక్టరేట్, బెంగళూరు ● హెచ్ఆర్.నటరాజ్– తూనికలు కొలతల ఇన్స్పెక్టర్, బెంగళూరు ● అనంత్‌కుమార్– ఎస్డీఏ హొసకోటే తాలూకాఫీసు, బెంగళూరు రూరల్ ● ఉమాకాంత్– శహపుర తాలూకా కార్యాలయం, యాదగిరి 7 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో లోకాయుక్త సోదాలు అవినీతి ఆరోపణలే కారణం పెద్దమొత్తంలో ఆస్తుల గుర్తింపు -
కల్యాణ కర్ణాటక.. ఉత్తీర్ణతలో వెనుక
రాయచూరు రూరల్: విద్యా రంగంలో వెనుక బడిన కల్యాణ కర్ణాటక(క.క)లోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలు ఉత్తమ ఫలితాలు సాధించాలనే తపన తపనగానే మిగిలింది. బీదర్ జిల్లాలో హైస్కూళ్లలో 330, ప్రాథమిక పాఠశాలల్లో 497, కలబుర్గి జిల్లాలోని హైస్కూళ్లలో 450, ప్రాథమిక పాఠశాలల్లో 1640, యాదగిరి జిల్లాలో హైస్కూళ్లలో 661, ప్రాథమిక పాఠశాలల్లో 2363, రాయచూరు జిల్లాలో హైస్కూళ్లలో 826, ప్రాథమిక పాఠశాలల్లో 3304, కొప్పళ జిల్లాలో హైస్కూళ్లలో 489, ప్రాథమిక పాఠశాలల్లో 1852, బళ్లారి జిల్లాలో హైస్కూళ్లలో 396, ప్రాథమిక పాఠశాలల్లో 1250, విజయనగర జిల్లాలో హైస్కూళ్లలో 343, ప్రాథమిక పాఠశాలల్లో 760 ఉపాధ్యాయుల పోస్టులు, 2645 పీఈటీ, డ్రాయింగ్ ఉపాధ్యాయుల పోస్టులు, 398 విషయ పరిశీలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికే ఉపాధ్యాయుల బదిలీలు ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను పొందిన ఏడాదికే మైసూరు, తుమకూరు, విజయపుర, బాగల్కోటె, గదగ్, హాసన్, హావేరి, మండ్య, రామనగర, శివమొగ్గ, దావణగెరె జిల్లాలకు తిరిగి బదిలీలపై వెళ్లిన వారి స్థానంలో ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల నేడు టెన్త్ ఫలితాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదైంది. 48 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మంత్రులు ఉన్నా విద్యారంగంపై శ్రద్ధ చూపడం లేదు. నూతనంగా 14 బీఈఓ పోస్టులతోపాటు కార్యాలయాలను ప్రారంభించడానికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యదర్శి సుందరేష్ బాబు, విద్యా శాఖ కమిషనర్ ఆకాష్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. కలబుర్గి జిల్లాలో యడ్రామి, కాళగ, కమలాపుర, యాదగిరి జిల్లాలో గురుమిఠకల్, రాయచూరు జిల్లాలో అరకెర, మస్కి, సిరవార, కొప్పళ జిల్లాలో కారటగి, కుకనూరు, బీదర్ జిల్లాలో చిటగుప్ప, కమలానగర, బళ్లారి జిల్లాలో కురుగోడు, విజయనగర జిల్లా కొట్టూరులో బీఈఓ కార్యాలయాలను ప్రారంభించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి లేఖలు రాశారు. టెన్త్ ఫలితాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు ఏడు జిల్లాల్లో 17443 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ కొత్తగా 14 బీఈఓ ఉద్యోగాల సృష్టికి ప్రతిపాదనలు -
కుష్టగి–హుబ్లీ రైలుకు పచ్చజెండా
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలోని కుష్టగిలో గురువారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ కుష్టగి–హుబ్లీ రైలుకు పచ్చజెండా ఊపి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయన నూతనంగా నిర్మించిన కుష్టగి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కల్యాణ కర్ణాటకలోని గదగ్–వాడి రైలు మార్గంలో కుష్టగి నుంచి హుబ్లీ మధ్య రైలు సంచారానికి ప్రస్తుతం అవకాశం కల్పించామన్నారు. వాడి వరకు ఈ రైలు మార్గ నిర్మాణం పూర్తయితే హుబ్లీ, గదగ్, యలబుర్గా, ముదగల్, లింగసూగూరు, హట్టి గోల్డ్ మైన్స్, సురపుర, శహాపుర మీదుగా హుబ్లీ నుంచి కలబుర్గి, బీదర్, హైదరాబాద్ తదితర గమ్యస్థానాలకు ప్రయాణికులు తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలవుతుందన్నారు. గదగ్–వాడి రైలు మార్గంలో తళకల్ నుంచి కుకనూరు, యలబుర్గా మీదుగా కుష్టగి వరకు 58 కి.మీ. మేర మాత్రమే రైలు మార్గ నిర్మాణ పనులు ముగిశాయన్నారు. వ్యతిరేక దిశలో వాడి–శహాపుర మధ్య చేపట్టిన రైలు మార్గ నిర్మాణ పనులు ఈఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ మార్గం ద్వారా ముంబై కర్ణాటక నుంచి కల్యాణ కర్ణాటక ప్రాంతానికి రవాణా సదుపాయం మెరుగవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆలమట్టి–యాదగిరి, భద్రావతి–చిక్కజాజూరు మధ్య రైలు మార్గ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటి వల్ల యాదగిరి, విజయపుర, చిత్రదుర్గ, బాగల్కోటె, దావణగెరె, శివమొగ్గ జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కొప్పళ లోక్‌సభ సభ్యుడు రాజశేఖర్ హిట్నాళ్, మంత్రి శివరాజ్ తంగడిగి, సీఎం సలహాదారు, మాజీ మంత్రి బసవరాజ రాయరెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణ, శాసన సభ్యుడు దొడ్డనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. గదగ్–వాడి మార్గంలో రైలు సంచారం షురూ రెండు కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ ప్రధాని దూరదృష్టితోనే సిందూర్ విజయం హొసపేటె: దూరదృష్టి గల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆస్తి అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ తెలిపారు. దేశ హితం కోసం ఎప్పుడూ ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని శక్తిగా తీర్చిదిద్దారన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు నాయకత్వం వహించేది విద్యార్థులే, దానిని నిలబెట్టే పని వారు చేయాలన్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని తమ ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వీరశైవ విద్యావర్థక సంఘం నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి
సాక్షి,బళ్లారి: కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన గురువారం దావణగెరె జిల్లా హరిహర తాలూకా కడరనాయకనహళ్లి సమీపంలో జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న పల్లవి(26), సుమా (26) అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. సచిన్ అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మలెబెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్ఎల్ బస్సు, జేసీబీ ఢీకొని బోల్తా హొసపేటె: విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో గురువారం జాతీయ రహదారి–50పై వీఆర్ఎల్ ప్రైవేట్ బస్సు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టడంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న జేసీబీ వాహనాన్ని వెనుక నుంచి వీఆర్ఎల్ బస్సు ఢీకొని బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు జేసీబీ కూడా గుంతలోకి పడిపోయింది. ఫలితంగా బస్సు డ్రైవర్, ఆరుగురు ప్రయాణికులు, జేసీబీ డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సాధన సమావేశం ప్రభుత్వ కార్యక్రమం ● మంత్రి శివరాజ్ తంగడిగి హొసపేటె: హొసపేటె నగరంలో ఈనెల 20న జరగనున్న సాధన సమావేశం అనేది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించడం అధికారుల బాధ్యత అని మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. గురువారం కూడ్లిగి పట్టణంలో సాధన సమావేశంపై నిర్వహించిన ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధన సమావేశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు. రౌడీల ఇళ్లపై పోలీసుల మెరుపుదాడిసాక్షి,బళ్లారి: ఇటీవల దావణగెరె జిల్లాలో హత్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు పేట్రేగిపోతున్న తరుణంలో గురువారం దావణగెరె పోలీసులు మెరుపుదాడి చేశారు. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ విజయ్‌కుమార్, పోలీసు అధికారులు మంజునాథ్, శ్యామ్ వర్గీస్, శరణబసవేశ్వర తదితరులు రౌడీషీటర్ల ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపడితే గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ముంచెత్తిన వాన రాయచూరు రూరల్: జిల్లాలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన జడివాన ఎనిమిది గంటల వరకు కొనసాగి భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బురదగుంటలుగా మారాయి. రెండు గంటల పాటు కురిసిన వానతో గాంధీ చౌక్, మున్నూరు వాడి, కూరగాయల మార్కెట్లోకి నీరు చొరబడ్డాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెన గుండా నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రాయచూరు–హైదరాబాద్ రహదారిలో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ స్తంభంతో సహా ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. ఏపీఎంసీ మార్కెట్లోకి వర్షపు నీరు జొరబడి ఉల్లిగడ్డలు, వరి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. -
నిందితులను బంధించాలని వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరులో వివాహిత శాంతలా మృతికి కారకులైన నిందితులను బంధించడంలో పోలీసులు నిరక్ష్ల్యం వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ సంచాలకుడు రమేష్ ఆరోపించారు. లింగసూగూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత నెలలో శాంతలా భర్త సునీల్‌పై ఆమె తండ్రి దశరథ్ ఫిర్యాదు చేశారన్నారు. శాంతలాను మెట్టినింటి వారు అదనపు కట్నం తేవాలని చిత్రహింస పెడుతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు మౌనం వహించారన్నారు. వరకట్నానికి తోడు పిల్లలు పుట్టలేదంటూ మానసికంగా, శారీరకంగా హింసించారన్నారు. ఈ బాధలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి సునీల్ కుటుంబ సభ్యులు బాధ్యులని వారందరిని అరె్స్ట్ చేయడంలో సీఐ పుండలీక ఆమె భర్త నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. భీమానాయక్ క్షమాపణ చెప్పాలి హొసపేటె: తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ వివాహానికి మీరు ఎలా వెళ్లారు? అని అడుగుతూ మాదిగ సమాజాన్ని అవమానించిన మాజీ ఎమ్మెల్యే, కేఎంఎఫ్ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.భీమానాయక్ క్షమాపణ చెప్పాలని మాదిగ సంఘం నాయకుడు వీరాస్వామి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా సమాజానికి, మన సమాజానికి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా అన్ని సందర్భాల్లో వీరాభిమానాన్ని ప్రదర్శించడం ద్వారా వారు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే భీమానాయక్ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కాంగ్రెస్ సాధన సమావేశంలో ఆయనను అడ్డుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ, నింబగల్ రామకృష్ణ, సోమశేఖర్, వెంకప్ప, శేషు, కొటగినాళ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: కాంగ్రెస్ సర్కార్ ఽవిద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్ పేర్కొన్నారు. గురువారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. రైతులు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ కార్డు, డిజిటల్ మీటర్ ఏర్పాటు, రూ.10 వేల డిపాజిట్లను ఉపసంహరించుకోవాలన్నారు. అక్రమ, సక్రమ పథకంలో రైతులకు విద్యుత్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలని, ఆధార్ కార్డులను లింక్ చేయడం వంటి వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ ఇంజినీర్‌కు వినతిపత్రం సమర్పించారు. 15 మంది బాల కార్మికులకు విముక్తి రాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు పోలీస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా బాల కార్మికులను వ్యవసాయ పనులకు తీసుకెళుతున్న వాహనాలపై దాడి జరిపి 15 మంది బాల కార్మికులకు విముక్తి కల్గించారు. గురువారం దేవదుర్గ తాలూకాలో వివిధ ప్రాంతాల నుంచి వరి, ఇతర పంటల కోతకు బాల కార్మికులను ఐదు వాహనాల్లో తరలిస్తుండగా బాల కార్మిక శాఖ అధికారి మంజునాథరెడ్డి, అధికారులు రాకేష్, రాజనగౌడ, వెంకటేష్, శివకుమార్‌లు దాడిలో పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలకు కృషి చేయండి రాయచూరు రూరల్ : జిల్లా స్థాయిలో రెండో సారి పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్ పేర్కొన్నారు. గురువారం యరమరస్ ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాల్లో ఉత్తమ సాధన చేయాలన్నారు. ఈ సందర్భంగా తాలూకా విద్యాశాఖాధికారి ఈరణ్ణ, డయట్ ప్రిన్సిపాల్ ఇందిర, చంద్రశేఖర్‌లున్నారు. -
ముగ్గురు దొంగల అరెస్టు
హొసపేటె: విజయనగర జిల్లా హడగలి తాలూకాలోని ఇటగి గ్రామంలో గతనెల 30న జరిగిన ఇంటి చోరీ కేసు మిస్టరీని ఇటగి పోలీసులు చేధించారు. దొంగతనం కేసులో ముగ్గురు నిందితులు సాదిక్ (21), ముబారక్(21), జుబేర్(25)లను అరెస్టు చేసి జైలుకు పంపారు. దొంగతనం జరిగిన రోజు ఇంటి యజమాని రాజశేఖర్ ఎవరో ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులకు నిందితుల గురించి అందిన సమాచారం మేరకు ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, 80 గ్రాముల బంగారం, రూ.70 వేల నగదుతో సహా మొత్తం రూ.5.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిస్టరీ ఛేదనలో పోలీసుల కృషిని ఎస్పీ శ్రీహరిబాబు ప్రశంసించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సొంతదారులకు అప్పగించారు. 80 గ్రాముల బంగారం, రూ.70 వేల నగదు స్వాధీనం -
జూన్ నుంచి ఆన్లైన్లో రెవెన్యూ పత్రాలు
బళ్లారి రూరల్ : జూన్ నుంచి పాత రెవెన్యూ పత్రాలు ఆన్లైన్లో లభ్యం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకొన్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ భైరేగౌడ తెలిపారు. బుధవారం దావణగెరె జిల్లాధికారి కార్యాలయ సభామందిరంలో ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక భూ చట్టాన్ని అన్వయిస్తూ జనవసతి ప్రదేశాల్లో నివాసం ఉన్న వారసుదారులకు పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లాలో 1836 పట్టాలు ఆమోదం పొందగా, అందులో 1784 ఇ–పరిశీలనకు పంపినట్లు తెలిపారు. జిల్లాలో 193 లంబాణి తండాలను రెవిన్యూ గ్రామ పరిధిలోకి తీసుకోవడానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలిపారు. ఇందులో 156 తండాలు అనర్హత పొందినట్లు తెలిపారు. 10 నుంచి 49 ఇళ్లను ప్రత్యేక గ్రామాలుగా పరిగణించడానికి అవకాశం ఉందన్నారు. రెవెన్యూ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొన్న అర్జీదారులకు ఆన్లైన్లోనే పొందేలా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉద్యానవన, గనులు భూవిజ్ఞాన శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్, దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి, అదనపు జిల్లాధికారి పీ.ఎన్.లోకేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. త్వరలో గ్రామ రెవెన్యూ పత్రాల పంపిణీ చేపడతాం దావణగెరె జిల్లాలో 1836 పట్టాపత్రాలు ఆమోదం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ వెల్లడి -
సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర నిఘా
హుబ్లీ: సోషల్ మీడియా ద్వారా సామాజిక ఆరోగ్యానికి చేటు, అలాగే సమాజంలోని ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తూ హెచ్చరిక బెదిరింపులు చేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్న ఆరోపణలపై రౌడీషీటర్లతో పాటు వారి అనుచరులపై జంట నగరాల పోలీస్ కమిషనరేట్ పోలీసులు 28 కేసులను నమోదు చేసుకున్నారు. రౌడీషీటర్లు, వారి అనుచరులు ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ చానల్లలో సమాజానికి తప్పుడు సందేశాలను ఇస్తూ సంఘం భయభ్రాంత వాతావరణం కలిగేలా అభ్యంతకర విషయాలను పోస్టు చేస్తుండటంపై కమిషనరేట్ సోషల్ పర్యవేక్షణ యూనిట్ సిబ్బంది పరిశీలించగా వెల్లడి అయింది. దీంతో సదరు బాధ్యులపై వివిధ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మీడియాకు వివరించారు. తమను తాము గొప్పగా చెప్పుకుంటూ రౌడీషీటర్లు జన్మదినాన్ని రోడ్డు మధ్యలో ఆచరించి వాటి వీడియో ఫొటోలను అప్లోడ్ చేసేవారు. యువతపై దుష్ప్రభావ ప్రమాదం దీంతో యువత, విద్యార్థులు ఉద్వేగానికి, ఉద్రేకానికి గురై చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. రౌడీల గుంపుల మధ్య కక్షలు తదితర సందేశాలను అప్లోడ్ చేసేవారు పాఠశాల, కళాశాలల పరిధిలో రౌడీషీటర్ల బెడద, వారి ఫోటోలు, బ్యానర్లు, కనిపించేవి. దీంతో విద్యార్థుల మనసుపై దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందన్నారు. విద్యా సంస్థల తర్వాత ఆడ పిల్లలను వేధించడం, హింసించడం చేసే వారు కులమతాల పేరున ఆధిపత్యం చలాయించడం ద్వారా సామాజిక ఆరోగ్యానికి చేటు కలిగించే వారు ఇలా వివిధ రకాలుగా వీరిపై చర్యలు తీసుకున్నారు. ఇక 75 మంది రౌడీషీటర్లు, 700 మందికి పైగా వారి అనుచరులపై తీవ్ర నిఘా పెట్టామని కమిషనర్ వివరించారు. వీరిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. డీసీపీ రవీష్, ఏసీపీలు ఉమేష్ చిక్కమఠ, శివరాజ కటదావి, విజయ్‌కుమార్ తళవార తదితరులు పాల్గొన్నారు. బాధ్యులైన రౌడీషీటర్లపై కేసుల నమోదు జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ -
సిరుగుప్పలో కాల్పుల కలకలం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి తమ అదుపులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. గురువారం జిల్లాలోని సిరుగుప్ప పట్టణంలో పోలీసుల అదుపులో ఉన్న అమరేష్ అనే నిందితుడిని మహజరు కోసం పోలీసులు విరుపాక్షిగౌడ, మారుతీ అనే ఇద్దరు తీసుకొని వెళ్లినప్పుడు తప్పించుకునేందుకు అమరేష్ ప్రయత్నించి పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప గాల్లోకి కాల్పులు జరిపి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా అమరేష్ తప్పించుకునేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ అమరేష్‌పై కాల్పులు జరిపారు. దీంతో అమరేష్ కాలుకు గాయాలు కావడంతో ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, దోపిడీ దొంగ ఇద్దరికి గాయాలైన నేపథ్యంలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండటంతో ఎస్పీ శోభారాణి హుటాహుటిన ఆస్పత్రిని సందర్శించి పోలీసులతో పాటు, కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. కాగా అమరేష్‌పై 30కి పైగా వివిధ కేసులు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో మర్డర్, దోపిడీ, ఏటీఎం దొంగతనాలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దోపిడీ, హత్య నేరారోపణల వ్యక్తి పరారీ యత్నం పోలీసులపై దాడికి యత్నించడంతో సీఐ కాల్పులు -
గిట్టుబాటు ధర చట్టం కోసం బైక్ ర్యాలీ
బళ్లారి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన రాష్ట్యాక్షుడు హుచ్చవ్వనహళ్లి మంజునాథ్ తెలిపారు. గురువారం దావణగెరె జయదేవ సర్కిల్లో చేపట్టిన ప్రతిఘటన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రతి క్వింటాలు వరికి రూ.2320ని కనిష్టధరగా నిర్ణయించిందన్నారు. ఇందుకు ఎటువంటి చట్టబద్ధత కల్పించలేదన్నారు. కొనుగోలుదారులు, దళారులు, కంపెనీలు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆర్.ఎన్.ఆర్.సోనామసూరి వరి ధర రూ.1600గా ఉంది. రైతులు ఒక ఎకరానికి వరి పంట సాగుకు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ఖర్చు చేస్తున్నారు. వర్షాకాలంలో సగటున ఎకరాకు 25 క్వింటాళ్లు వస్తుంది. రూ.1600 ధరలో వరి రైతుకు రూ.40 వేలు మాత్రం వస్తుంది. ఎకరాకు ప్రతి రైతు రూ.6 వేలు నష్టాన్ని భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ మాదిరిగా ప్రతి క్వింటాలు వరికి రూ.1200లు ప్రోత్సాహధనం ఇవ్వాలని తెలిపారు. గిట్టుబాటు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, కంపెనీలకు 3 నుంచి 5 ఏళ్లు జైలుశిక్ష పడేలా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రతిఘటనలో భాగంగా రైతులు జయదేవ సర్కిల్ నుంచి ఏపీఎంసీ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. వచ్చే శనివారం రోడ్డులో రాకపోకలను స్తంభింపచేస్తున్నట్లు తెలిపారు. ప్రతిఘటనలో రైతు సంఘ ప్రముఖులు చిన్నసముద్రం భీమానాయక్, ఎలోదళ్లి రవికుమార్, చిక్కమల్లనహళ్లి చిరంజీవి, రాజనహట్టి రాజు, హూవినమడు నాగరాజు, చిక్కతోగలేరి నటరాజ, కెంచప్ప, నింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. -
సోఫియా ఖురేషీ అత్తింటిపై దాడి అంటూ వదంతులు
సాక్షి బెంగళూరు: కల్నల్ సోఫియా ఖురేషీ అత్తవారింటిపై ఆర్ఎస్ఎస్ వర్గాలు దాడి చేశాయని ‘ఎక్స్’లో వదంతులు వ్యాపించాయి. కర్ణాటకలోని బెళగావిలో సోఫియా భర్త ఇంటిపై దాడి జరిగినట్లుగా వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ బీమా శంకర్ స్పష్టంచేశారు. సోఫియా భర్త ఇంటిపై ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు దాడి చేసినట్లుగా ధ్వంసమైన ఒక ఇంటిని ఫోటోను అనీస్ ఉద్దీన్ అనే పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. అది ఫేక్ పోస్టు అని పోలీసులు తేల్చారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
కొడుకు కాదు.. కర్కోటకుడు
తుమకూరు: జిల్లాలోని కుణిగల్ పట్టణంలో ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ యజమాని మృతి కేసులో పెద్ద మలుపు. కుమారుడే హత్య చేసి, కరెంటు షాక్‌తో చనిపోయాడని నాటకమాడినట్లు వెల్లడైంది. వివరాలు.. యజమాని నాగేశ్ (58) మే 11న ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో ఉన్నాడు. ఈ సమయంలో కుమారుడు సూర్య (25) వచ్చాడు, డబ్బు ఇవ్వాలని అతడు తండ్రిని ఒత్తిడి చేయగా ఆయన ససేమిరా అన్నాడు. పైగా గొడవ జరిగి కొడుక్కి రెండు డెబ్బలు కూడా వేశాడు. కోపోద్రిక్తుడైన కుమారుడు సూర్య టవల్‌తో తండ్రి గొంతుకు బిగించి హత్య చేశాడు. సూర్యతో పాటు కూడా వచ్చిన మరో యువకుడు సహకరించారు. నాన్నకు కరెంట్‌షాక్ కొట్టి చనిపోయాడని సూర్య శోకాలు పెట్టాడు. గుట్టు బయటపడిందిలా మృతుని సోదరి సవితకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో గాలించారు. సీసీ కెమెరాలు ఉండడంతో పని సులువైంది. డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం జరిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. సీసీ కెమెరా చిత్రాలను చూడగా సూర్య ఘాతుకం బయటపడింది. సవిత కూడా నిందితున్ని గుర్తించారు. దండించాడని.. ఫ్యాక్టరీలోని డబ్బులను సూర్య తస్కరించేవాడు, పైగా సూర్య సోదరిని సంజయ్ అనే యువకుడు ప్రేమించాడు. ఇతని ప్రేమకు సూర్య సహకరించేవాడు. ఇవి నచ్చని తండ్రి అతన్ని తరచూ దండించేవాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని సంజయ్‌తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యం తండ్రినే హతమార్చి, కరెంటు షాక్ నాటకం పట్టించిన సీసీ కెమెరాలు -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్టు
బనశంకరి: ప్రజల నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, బ్యాంకు ఖాతాల ద్వారా నగదు జమచేసుకుని వంచనకు పాల్పడుతున్న 12 మంది అంతర్రాష్ట్ర వంచక ముఠాని బుధవారం బెంగళూరు ఆడుగోడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి 400 మొబైల్ సిమ్ కార్డులు, 140 ఏటీఎం కార్డులు, 17 చెక్‌బుక్‌లు, 27 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంకు పాస్‌బుక్స్, చిట్టాపద్దులు , రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ నగర నివాసి మొబైల్ నంబరు కు గతనెలలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి వర్క్ ఫ్రం ఉందని చెప్పాడు. అతని బ్యాంకు ఖాతాకు రూ.10,83,502 నగదు జమచేసినట్లు, అది విత్‌డ్రా చేసుకోవాలంటే రూ. 5 లక్షలు చెల్లించాలని మభ్యపెట్టి రూ.5 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితుడు ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కూలీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి పోలీసులు విచారణ చేపట్టగా యూపీ, ముంబైలో దుండగుల బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తేలింది. ముంబై కి వెళ్లి లేబర్ కాంట్రాక్ట్ పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కూలీల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి బాధితుల నుంచి సొమ్మును సైబర్ మోసగాళ్లు మళ్లించేవారు. కూలీలకు కమీషన్‌గా కొంత మొత్తం ఇచ్చేవారు. ఉత్తరప్రదేశ్‌లో మరో నిందితున్ని పట్టుకున్నారు. తరువాత ప్రయాగ్‌రాజ్‌లో అద్దె ఇంట్లో ఉండే 10 మంది నేరగాళ్లను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. ముంబై, యూపీలో పట్టివేత -
నాణెం మింగిన బాలిక
హోసూరు: రూపాయి నాణేన్ని మింగిన బాలిక అందరికీ టెన్షన్ పెట్టించింది. వివరాల మేరకు హోసూరుకు చెందిన నాలుగేళ్ల బాలిక సారా, 9వ తేదీన ఇంట్లో ఆటలాడుకొంటూ రూపాయి బిళ్లని మింగేసింది. అది తెలిసి తల్లిదండ్రులు వెంటనే బాలికను హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయించగా ఆహారనాళంలో రూపాయి నాణెం కనిపించింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స విభాగ డాక్టర్ల బృందంచే ఆధునిక వైద్య ఉపకరణాలను ఉపయోగించి సురక్షితంగా నాణేన్ని బయటకు తీశారు. చికిత్స చేసి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. -
కంపెనీ బస్సు పల్టీ, 35 మందికి గాయాలు
● ఎయిర్‌పోర్టు వద్ద ప్రమాదం దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు వద్ద ప్రైవేటు నిర్మాణ కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టగా, పెద్దసంఖ్యలో గాయపడిన సంఘటన మంగళవారంనాడు బేగూరు జంక్షన్లో జరిగింది. షిఫ్టు ముగిసిన ఉద్యోగులు మధ్యాహ్నం భోజనానికని కంపెనీ బస్సులో మెస్‌కు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ సర్కిల్లో డ్రైవర్ అతి వేగంతో ఎడమ వైపునకు తిప్పడంతో ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 35 మంది ఉండగా అందరికీ గాయాలైనట్లు తెలిసింది. బాధితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతున్ని యూపీ కి చెందిన సంతోష్ యాదవ్‌గా (35)గా గుర్తించారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డీకేశి కేసులో వాదనలు శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అక్రమార్జనకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన కేసు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేసిన రిట్ అర్జీ మీద బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. డీకేశి ప్రభుత్వంలో ప్రభావశీలమైన వ్యక్తి, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని వాదనలు సాగాయి. డీకే వకీలు వాదిస్తూ రిట్ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొన్నారు. డీకే మీద దాఖలైన ఎఫ్ఐఆర్ను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. వాదనల తరువాత జడ్జి విచారణను జూలైకి వాయిదా వేశారు. మరోవైపు పహల్గాం దాడి, సైనికుల పోరాటం నేపథ్యంలో నేడు గురువారం తన పుట్టినరోజు వేడుకలను ఎవరూ జరపరాదని డీకే శివకుమార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ఉండనని, ఎవరూ తనకోసం రావద్దని కోరారు. రమణీయం.. రోకలి కరగ కోలారు: నగరంలోని పిసి కాలనీలో ఉన్న రేణుకా యల్లమ్మ దేవి వసంత ఉత్సవంలో భాగంగా బుధవారం ఒనకె (రోకలి) కరగ ఉత్సవం కమనీయంగా సాగింది. వందల సంఖ్యలో భక్తులు చేరి రంగులు చల్లుకున్నారు. తరువాత కరగ పూజారి మంజునాథ్ తలపై పొడవైన రోకలిపై తామ్ర పాత్రను ఉంచుకుని నృత్యం చేశారు. పాత్రలోని నీళ్లు భక్తులపై పడడం శుభదాయకమని నమ్ముతారు. గంటకు పైగా జరిగిన ఒనకె కరగ ఉత్సవాన్ని చూసి భక్తులు తరించారు. దొంగ అని బాలుని హతం ● అథణిలో దారుణం ● ఆరుగురు అరెస్టు సాక్షి, బెంగళూరు: బాలున్ని అకారణంగా హత్య చేశారు. బెళగావి జిల్లా అథణి పట్టణం శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో మే 1న కుళ్లిపోయిన స్థితిలోఒక అపరిచిత బాలుని మృతదేహం కనిపించింది. పట్టణ పోలీసులే అంత్యక్రియలు కూడా చేశారు. తాజాగా కేసు మిస్టరీ వీడిపోయింది. బాలుడు అథణి తాలూకా అరళిహట్టి గ్రామానికి చెందిన వికాస్ శివదాస కోష్టి (16) గా గుర్తించారు. ఇది హత్య అని తేల్చారు. ఈ హత్య కేసులో ఆరు మంది నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. నిందితులు అబ్దుల్ బారీముల్లా (36), జుబేర అహ్మద్మౌల్వీ (34), బిలాల్ అహ్మద్ మౌల్వీ (25), హజరత్ బిలాల్ నలబంద్ (27), మహశ్ కాళే (36) అనేవారు. ఎలా జరిగింది అథణి పట్టణ శివార్లలోని మహష్ కాళేకు ఫర్నిచర్ షాప్ ఉంది. ఆ షాప్ వద్ద బాలుడు ఉండగా దొంగతనం చేసేందుకు వచ్చాడని పట్టుకుని నిందితులు హింసించారు. రాత్రి అంతా షెడ్లో కట్టేసి కొట్టడంతో అతడు మరణించాడు. హత్యను దాచేందుకు వికాస్ శవంపై యాసిడ్ పోసి ఆ తర్వాత డ్రైనేజీలో పడేశారు. ఈ దారుణంపై పట్టణవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఎయిమ్స్ కోసం మానవహారం
● రెండో రోజు కూడా కొనసాగిన ఆందోళన రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నాయని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస ఆరోపించారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో చర్చించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూడాలన్నారు. ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. మూడేళ్ల నిరంతర పోరాటానికి ఫలితం దక్కేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. బ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఎంపికరాయచూరు రూరల్ : అఖిల కర్ణాటక బ్రాహ్మణ సంఘం కార్యవర్గ ఎన్నికల్లో సంఘం జిల్లాధ్యక్షుడిగా గురురాజ్ ఆచార్ జోషి, కార్యదర్శిగా జయకుమార్ దేశాయి ఎంపికయ్యారు. అక్రమ రేషన్ బియ్యం లారీ బోల్తా రాయచూరు రూరల్: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం లారీ బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నభాగ్య బియ్యాన్ని లారీలో నింపుకొని మాన్వి నుంచి సకలేశపురకు తరలిస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ బియ్యాన్ని, లారీని వదిలి పరారైన ఘటన జరిగింది. పోలీసులు లారీని సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మాన్వి సీఐ తెలిపారు. వైభవంగా హిందూ ముస్లిం ఉత్సవాలు రాయచూరు రూరల్: గదగ్ జిల్లా శిరహట్టిలోని ఫక్కీరేశ్వర మఠంలో బుధవారం హిందూ, ముస్లిం సోదరులు ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గుర్రాలపై ఫక్కీరేశ్వరుడిని పెద్ద ఎత్తున ఊరేగించారు. హిందూ ముస్లిం సోదరత్వాన్ని చాటి చెప్పే సందేశాలను జాతికి వివరించేలా ఉత్సవాలను నిర్వహించారు. ఐదుగురు ఇంటి దొంగల అరెస్టు హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా చిగటేరి, అరసీకెరె పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల జరిగిన వేర్వేరు దొంగతనం కేసులకు సంబంధించి ఐదుగురు ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మణికంఠ, కుంట చంద్ర, భీమేష్, ముబారక్ అలీ, మనోజ్‌లను పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.11.99 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన వస్తువులు, వారు దొంగలించిన ద్విచక్ర వాహనం, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు, హరపనహళ్లి డీఎస్పీ వెంకటప్ప నాయక్ మార్గదర్శకత్వంలో సీఐ మహంతేష్ సజ్జన ఈ దాడి నిర్వహించారు. పీఎస్ఐ శంభులింగ హిరేమఠ, రంగయ్య, నాగరత్న, సిబ్బంది ముబారక్, రవి దాదాపూర్, మాలకాటి బిలిచోడ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఒకరు బలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, 10 పశువులు బలి కాగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. మస్కి తాలూకా పామన కల్లూరు ఫిర్కా పర్వతాపూర్‌కు చెందిన నింగప్ప(38) అనే రైతు మరణించారు. పొలంలో పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, ఎస్ఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే బసనగౌడ మృతదేహానికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల పరిహారధనం చెక్‌ను అందించారు. కాగా సింధనూరు తాలూకా సుల్తాన్‌పూర్‌లో హనుమంతు, తిప్పణ్ణ, నాగేష్, లక్ష్మణ్‌ల పొలాల్లో కుప్పవేసిన వడ్లు తడిచిపోయాయి. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. 10 పశువుల మృతి, ఇద్దరికి గాయాలు పొలాల్లో కల్లాల్లో తడిచిన వరిధాన్యం -
సమస్యల సుడిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు
బళ్లారి అర్బన్: నగర నడిబొడ్డున ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం స్థాపించి ఎన్నో దశాబ్దాలు గడిచినా ఆ ఆవరణలోని పరిస్థితులు మాత్రం కొంచెం కూడా మారలేదు. దీనికి నిదర్శనమే మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి ఈ కార్యాలయ ప్రాంగణం అంతా జలమయం అయింది. పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ఇది ఒక రోజు పరిస్థితి కాదు. కొద్దిపాటి వర్షానికే ఈ ఆవరణ అంతా బురదమయంగా మారుతుంది. దీంతో కార్యాలయానికి వచ్చే సామాన్యులు అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏటా తమ కార్యాలయ నిర్వహణ ఖర్చుల బాపతుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ కార్యాలయ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో తెలియదు కానీ గత 30 ఏళ్లుగా ఇదే దుస్థితి నెలకొందని అక్కడికి వచ్చే సామాన్యులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆ కార్యాలయ ఉన్నతాధికారులు సదరు ఆవరణను బాగు చేయడానికి ఈ వర్షాకాలానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే డీసీ, తహసీల్దార్ తదితర కార్యాలయాలు రాజ్‌కుమార్ రోడ్డులోని మినీ విధాన సౌధకు తరలించిన తరహాలోనే ఈ కార్యాలయాన్ని కూడా అక్కడికి తరలిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. రిజిస్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి కాసుల వర్షం దశాబ్దాలుగా మారని కార్యాలయ ఆవరణ తీరు -
20న సాధన సభకు రాహుల్, ఖర్గే రాక
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంఽధీ, రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి, డీకే.శివకుమార్ హొసపేటెలో జరిగే ప్రభుత్వ సాధన సదస్సుకు హాజరవుతారని జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. నగరంలో పునీత్ రాజ్‌కుమార్ జిల్లా మైదానాన్ని ఆయన సందర్శించి, వేదిక నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడారు. ఈ నెల 20న హొసపేటెలో జరగనున్న ప్రభుత్వ సాధన సమావేశంలో లక్ష మంది లబ్ధిదారులకు అర్హత పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. ఈ వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విజయనగర జిల్లాపై సీఎం సిద్దరామయ్యకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరిస్తారన్నారు. జిల్లా మైదానంలోకి వచ్చే ప్రజలకు వేదికతో సహా అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సమావేశానికి కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా అనేక మంది నాయకులు హాజరవుతున్నారని ఆయన అన్నారు. ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు హెచ్ఆర్.గవియప్ప, ఎమ్మెల్యే జే.గణేష్, కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, డీసీసీ అధ్యక్షుడు సిరాజ్ షేక్, రవి బోసురాజు పాల్గొన్నారు. రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ -
ఘనంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం
హుబ్లీ: ఽదార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 38వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌తో పాటు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఆ కళాశాల విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మీరు నేర్చుకున్న శాసీ్త్రయ విజ్ఞాన విషయాలన్నీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ రైతుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఆత్యాధునిక పద్ధతితో వ్యవసాయ రంగంలో భారత దేశం అన్నింటా ముందంజలో ఉండేందుకు ఇక్కడ పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి తమదైన శైలిలో తాము ఉన్న ఊరితో పాటు పరిసర గ్రామాల అన్నదాతలకు మేలు జరిగేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అధ్యాపక బృందం విద్యార్థులకు సాగు పాఠాలతో పాటు దేశంలోని అన్నదాతలు అప్పులు తదితర బాధలతో కుంగిపోకుండా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వారిలో ఎప్పటికప్పుడు మనోసైర్యం నింపేలా మేలైన సాగు పద్ధతులు వారికి వివరించాలని ఆయన సూచించారు. కాగా వివిధ విభాగాల్లో బంగారు తదితర పతకాలు అందుకున్న విద్యార్థులతో పాటు స్నాతకోత్సవ పట్టా పుచ్చుకున్న వారందరికీ సర్టిఫికెట్లను ముఖ్య అతిథులు ప్రదానం చేశారు. పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష హుబ్లీ: పోక్సో కేసులో నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో ధార్వాడ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి ఐదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. రాఘవేంద్ర వాసుదేవ బెళగుర్కి శిక్షకు గురైన దోషి. ఇక్కడి కసబాపేటె పోలీస్ స్టేషన్లో అతడిపై 2023లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ రాఘవేంద్ర హళ్లూర కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు వాద, ప్రతివాదనలు విన్న సదరు కోర్టు న్యాయమూర్తి రాజకుమార్ పైమేరకు శిక్ష విధించినట్లు, ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది శైల అంగడి తెలిపారు. మద్దతు ధర పెంపునకు ఒత్తిడి రాయచూరు రూరల్: ఽవాణిజ్య పంటలకు మద్దతు ధర పెంచాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎంసీ మార్కెట్‌కు రోజుకు వందలాది టన్నుల మేర వరి ధాన్యం వస్తోందన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన వరి, మిరప, జొన్నలు, కంది ధాన్యాలకు ధరలు లేక తల్లడిల్లి పోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం కల్పించుకొని వరి, మిరప, జొన్నలు, కంది ధాన్యాల కొనుగోలుకు మధ్యవరిత్త్వం వహించి రైతులను ఆదుకోవాలన్నారు. వానలకు కొట్టుకు పోయిన పంటలకు పరిహారం అందించాలన్నారు. వారం రోజుల్లో తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే జిల్లా ఇన్చార్జి మంత్రిని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని సీపీఐ(ఎంఎల్–రెడ్ స్టార్) అధ్యక్షుడు గంగాధర్ ఆరోపించారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలలో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రం సమర్పించారు. -
నలుగురి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
హుబ్లీ: కార్వార సమీపంలోని భట్కళ తాలూకాలోని ఆడువళ్లి ఓణిబాగిలు గ్రామంలో ఆస్తి విషయానికి సంబంధించి రెండేళ్ల క్రితం జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసుకు సంబంధించి నిందితుడికి ఆ జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కార్వార సెషన్స్ కోర్టు గత 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఉరిశిక్ష ప్రకటించిందని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సదరు సెక్షన్ల కింద ఉరి శిక్ష విధించిన అరుదైన కేసు ఇది. రెండు జంటలను దారుణంగా హత్య చేసిన నిందితుడిపై ఆ కోర్టు న్యాయమూర్తి బీఎస్ విజయ్‌కుమార్ ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. ఆడువళ్లి నివాసి వినయ్ భట్ ఉరి శిక్షకు గురైన వ్యక్తి. దీంతో పాటు 5 ఏళ్ల కారాగార శిక్ష, అలాగే రూ.10 లక్షల జరిమానా విధించారు. మరొక నిందితుడు శ్రీధర్ భట్‌కు యావజ్జీవ కారాగారవాసం, రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ న్యాయవాది తనూజా హొసమట్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 2023లో భట్కళ తాలూకా ఆడువళ్లి ఓణిబాగిలు నివాసి శంభు భట్(70), ఆయన భార్య మాదేవి భట్(60), కుమారుడు రాఘవేంద్ర భట్(40), కోడలు కుసుమా భట్(35) హత్యకు గురయ్యారు. ఆస్తి విషయానికి సంబంధించి వినయ్భట్, ఆయన తండ్రి శ్రీధర్ భట్ ఈ హత్య చేసినట్లు పోలీసులు ఛార్జిషీట్ సమర్పించారు. ప్రత్యేక సాక్షులు, శాసీ్త్రయ సాక్షులతో కేసు విచారణ చేపట్టారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు మరొక నిందితునికి యావజ్జీవ కారాగారవాసం హత్యలు ఎలా జరిగాయంటే... ఈ హత్యలకు 8 నెలల క్రితం శంభు భట్ పెద్ద కుమారుడు వ్యాధితో మరణించారు. మృతుడి భార్య విద్యా భట్ కుటుంబ ఆస్తిలో వాటా కోసం ఘర్షణ పడ్డారు. చర్చల తర్వాత శంభు భట్ తన కోడలు విద్యకు ఆస్తిలో వాటా పంచారు. అయితే సదరు ఆస్తిని చూసుకుంటున్న విద్యా భట్ సోదరుడు హళియాళ నివాసి వినయ్భట్ కోపంతో రాఘవేంద్ర భట్‌ను హత్య చేశాడు. ఈ క్రమంలో అడ్డుపడిన కుసుమా భట్‌ను కూడా హత్య చేశారు. ఈ రెండు హత్యలు చూసి శంభు భట్ దంపతులు గ్రామస్తులను పిలవడానికి పారి పోతుండటంతో వారిని వెంబడించిన వినయ్ భట్ ఇంటికి కొంచెం దూరంలో శంభు భట్‌ను హత్య చేశాడు. కాగా మాదేవి భట్‌ను శ్రీధర్ భట్ హత్య చేసినట్లు విచారణలో రుజువు అయింది. హత్యలు జరిగిన వేళ రాఘవేంద్ర దంపతుల పదేళ్ల కుమారుడు పక్క ఇంట్లో ఉండగ, నాలుగేళ్ల మరో బిడ్డ ఆ సమయంలో నిద్ర పోయింది. -
సెల్‌ఫోన్‌కు బానిస కావొద్దు
కోలారు : యువత, విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిస కావద్దని, వేసవి శిబిరాల్లో పాల్గొని ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి ముజఫర్ మాంజరి సూచించారు. రాష్ట్ర బాలభవన సొసైటీ బెంగళూరు, జిల్లా యంత్రాంగం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని జిల్లా బాలభవన సొసైటీలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వేసవి శిబిరాన్ని జడ్జి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో ఎన్నో విషయాలను పిల్లలకు అవగాహన కల్పిస్తారని, మానసికంగా, దైహికంగా పెరుగుదలకు శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ చిత్రకళ, కౌశల్యాలు, యోగా, కరాటే, సంగీతం, నృత్యం తదితరాలలో శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా పిల్లల రక్షణాధికారి నాగరత్న , వంశీకృష్ణ, కేజీఎఫ్ తాలూకా క్షేత్ర శిక్షణాధికారి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కరువు.. వలస దరువు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర నగరాలకు వలస వెళుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో రబీలో కూడా కరువు నెలకొంది. వ్యవసాయ కూలీలకు పనులు దొరకక బతుకు తెరువు కోసం బెంగళూరు, ముంబై, షోలాపూర్, గోవా, మహారాష్ట్ర, చైన్నె, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారు. వానలు లేక పంటలు పండక పోవడంతో జీవనోపాధికి వలస వెళుతూ రైతులు మూటా ముల్లె సర్దుకుంటున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజు వందలాది మంది బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్నారు. వారిని కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామాల్లో వయస్సు పైబడిన వారిని వదిలి పిల్లా పాపలతో కట్టుబట్టలతో వలస వెళుతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు వలసల నివారణకు ఎలాంటి పథకాలను ప్రారంభించాలనే తపన ఏ ఒక్కరిలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న ఈతిబాధలను పరిష్కరించడంలో మౌనం వహిస్తున్నారు. బతుకు తెరువు కోసం తరలి వెళుతున్న కూలికార్మికులు సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
మోదీ ఇంటిపై పాక్ దాడి చేయాలి.. నవాజ్ అరెస్ట్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ వీడియోలో మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో గురించి తెలిసి పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
ప్రధానిపై అనుచిత పోస్టు
యశవంతపుర: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకున్ని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. వీడియో గురించి తెలిసి పోలీసులు నిందితున్ని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. యల్లమ్మ కరగ కోలారు: నగరంలోని పిసి కాలనీలో ఉన్న రేణుకా యల్లమ్మ దేవి కరగ ఉత్సవాన్ని సోమవారం రాత్రి రమణీయంగా నిర్వహించారు. కరగ పూజారి బివి మంజునాథ్ కరగను, జాతీయ జెండాను పట్టుకుని నృత్యం చేయడం ముగ్ధుల్ని చేసింది. సోమవారం రాత్రి 8 గంటలకు కరగ వేడుక ఆరంభమై అర్ధరాత్రి దాటే వరకూ కొనసాగింది. వివిధ దేవుళ్ల పల్లకి ఉత్సవం అలరించింది. ఇద్దరు బాలల జలసమాధి దొడ్డబళ్లాపురం: కావేరి నదిలో ఈత కొట్టడానికి దిగిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందిన సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకా నాపోక్లు వద్ద జరిగింది. కూరుళి గ్రామం వద్ద ప్రవహిస్తున్న కావేరి నదిలో ఈతకొట్టడానికి 8 మంది బాలలు దిగారు. వారిలో గిరీష్ (16), అయ్యప్ప (17) నదిలో మునిగిపోయి చనిపోయారు. వీరు సమీప చేరంబాణె ప్రాంతానికి చెందినవారు. నాపోక్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రి లిఫ్టు ఆగి నరకం దొడ్డబళ్లాపురం: కల్బుర్గిలోని ప్రభుత్వ జిమ్స్ ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్‌లో 8 మంది చిక్కుకోగా వారిని అతి కష్టం మీద రక్షించిన సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది. కింది అంతస్తు నుంచి 6వ అంతస్తుకు వెళ్లడానికి 8మంది సిబ్బంది లిఫ్ట్‌లో ఎక్కారు. అయితే లిఫ్ట్ మూడవ అంతస్తుకు చేరుకోగానే నిలిచిపోయింది. అక్కడ తలుపులకు బదులు గోడ ఉంది. దీంతో 8మంది లిఫ్ట్‌లోనే చీకటి, గాలి ఆడక హాహాకారాలు చేశారు. కొన్ని గంటలపాటు శ్రమించిన ఆస్పత్రి సిబ్బంది గోడను పగలగొట్టి వారి రక్షించారు. బాధితులు అస్వస్థతకు గురికావడంతో వారికి వైద్యచికిత్సలు అందజేశారు. కశ్మీర్ నుంచి రాకశివాజీనగర: భారత–పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కశ్మీర్లో చిక్కుకొన్న కన్నడ విద్యార్థులు మంగళవారం బెంగళూరుకు చరుకొన్నారు. 6 నెలల క్రితం కశ్మీర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివేందుకు 13 మంది కన్నడ విద్యార్థులు వెళ్లారు. యుద్ధం వల్ల కాలేజీకి సెలవు ఇవ్వగా, బయటకు రాలేక, అక్కడ ఉండలేక అవస్థలు పడసాగారు. ఎట్టకేలకు బెంగళూరుకు చేరుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. అక్కడ భయం భయంగా గడిపామని హరీశ్, నూతన్ అనే విద్యార్థులు తెలిపారు. కిలాడీ దొంగ.. 88 చోరీ కేసులు బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39) అనే దొంగను అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్‌కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఎన్నిసార్లు అరెస్టయి జైలుకు వెళ్లినా తిరిగి వచ్చి మళ్లీ హస్తలాఘవాన్ని ప్రదర్శించేవాడు. ఇతడిపై ల్యాప్‌టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. -
హాస్యనటుడు రాకేశ్‌కు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: టీవీ షోలు, సినిమాలలో రాణిస్తూ ఉన్న వర్ధమాన హాస్యనటుడు రాకేశ్ పూజారి (33) కి సోమవారం సాయంత్రం పుట్టిన ఊరు ఉడుపిలో అంత్యక్రియలు జరిగాయి. ఆదివారం రాత్రి మంగళూరు వద్ద తన స్నేహితుని పెళ్లి వేడుకలో పాల్గొని అక్కడే కుప్పకూలి మరణించడం తెలిసిందే. కన్నడ సినీ రంగం విషాదానికి లోనైంది. ఉడుపిలో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్వతం అయ్యారు. రాకేశ్ పాల్గొనే కామెడి కిలాడీ షోలో సహనటులు నయన, శివరాజ్ కేఆర్ పేట, అనీశ్, హీతేశ్, ప్రవీణ, వాణితో పాటు ప్రముఖ నటి రక్షిత తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మల్పెలో రాకేశ్ ఇంటి వద్ద జనసాగరంలా మారింది. ఒక ప్రతిభావంత నటుడిని పోగొట్టుకున్నట్లు అనేక మంది ఆవేదన చెందారు. రాకేశ్ తండ్రి ఏడాది క్రితం మృతి చెందగా, అమ్మ, చెల్లెలుతో కలిసి ఉడుపిలో ఉంటున్నారు. కుటుంబ పోషణ రాకేశ్‌పై ఉండింది. నటన ద్వారా వచ్చే డబ్బులే ఇంటికి ఆధారం. దర్శకుడు యోగరాజ్ భట్ కూడా తుది నివాళులు అర్పించారు. ఉడుపి హొడెలోని హిందు రుద్రభూమిలో భిల్లవ సంప్రదాయం ప్రకారం రాకేశ్ చితికి మామ నిప్పు పెట్టారు. -
కొత్త జంట.. బైక్ ప్రమాదం
● నవ వరుడు దుర్మరణం మండ్య: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృత్యువాత పడగా, వధువు తీవ్రంగా గాయపడింది. పెళ్లింట శోకం నెలకొంది. శ్రీరంగపట్టణ తాలూకాలోని అల్లాపట్టణ గ్రామానికి చెందిన కాళేగౌడ కుమారుడు విజయ్ (28)కు, నెలమనెకి చెందిన అశ్వత్ కుమార్తె రక్షిత (20)తో ఈ నెల 1వ తేదీన వివాహమైంది. ఆదివారం ఉదయం నవ జంట ఇద్దరూ బైక్‌పై విహారానికి శింషా పర్యాటక స్థలికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం కొడగహళ్లి సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్నారు. ప్రమాదంలో విజయ్ తలకు, కాలుకు, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్ర గాయాలైన రక్షితను మైసూరులోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. విజయ్ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం తాలూకాలోని అల్లాపట్టణ గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నెరవేర్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ఘటనపై బన్నూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
మన చెట్లు లేక ఇక్కట్లు
బనశంకరి: ఉద్యాననగరిగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో టబూబియా, రోసియా, కాపర్వుడ్, రైన్ ట్రీ, సిల్వర్‌ఓక్, గుల్మొహర్ లాంటి విదేశీ చెట్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. నగర అందాలకోసం పెంచిన మొక్కలు మొత్తం చెట్లలో 60 శాతం వరకూ చేరాయి. వేగంగా పెరిగే ఈ చెట్లకు వేర్లు మాత్రం గట్టిగా ఉండవు. భూమి లోపలి వరకూ చేరుకోవు. ౖపైపెన వేర్లతో పెద్ద చెట్టుగా పెరిగి వర్షాల సమయంలో విరిగి జనం మీద పడుతున్నాయి. ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది. ఫలితంగా ఆస్తి, ప్రాణనష్టాలు సాధారణమయ్యాయి. ఏయే వృక్షాలు.. బెంగళూరు నగరంలో టబూబియా, రోసియా, కాపర్వుడ్, రైన్‌ట్రీ, సిల్వర్‌ఓక్, గుల్ మొహర్ లాంటి విదేశీ చెట్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. వీధులకు శోభనిస్తాయని బీబీఎంపీ అటవీ శాఖ అధికారులు వీటిని ఎక్కువగా పెంచుతారు. ఇప్పటికీ పార్కుల్లో, రోడ్ల పక్కన విదేశీ మొక్కలను అధికంగా పెంచుతున్నారు. రెండు నెలల్లో ఇద్దరు మృతి ఈ ఏడాదిలో మార్చి 22 , మే 1వ తేదీన గాలివానలకు పలుచోట్ల ఈ చెట్లు నేలకూలి మరణాలు సంభవించాయి. ఈ రెండు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 93 చెట్లు, 163 చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయని బీబీఎంపీ అధికారులు తెలిపారు. పులకేశినగరలో మార్చి 22వ తేదీన తండ్రితో కలిసి ద్విచక్రవాహనంలో కూర్చుని వెళుతున్న మూడేళ్ల బాలిక, కత్రిగుప్పెలో మే 1వ తేదీన ఆటో రిక్షాపై విదేశీచెట్టు కూలిపోవడంతో డ్రైవరు చనిపోయారు. ఇలాంటి ఘటనలతో నగరవాసులు చెట్ల కింద నుంచి వెళ్లాలంటే గుబులు పడుతున్నారు. కారణాలున్నాయి విదేశాల్లో, బెంగళూరులో నేల స్వభావాలు వేర్వేరు. విదేశీ చెట్లు నగరానికి సరిపడవు. చెట్ల చుట్టూ నీరు ఇంకిపోకుండా సిమెంటు ఫుట్‌పాత్‌లు, తారు రోడ్లు ఉండడం వల్ల చెట్టు బలహీనపడుతుంది. అలాగే వయసు మీరిన చెట్లు, తెగుళ్లు వచ్చి, వేరు కుళ్లు వల్ల కూకటివేళ్లుతో కూలిపోవడానికి కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. దేశీయ చెట్లే ఉత్తమం బెంగళూరు లో వెదురు, బూరుగ, రాణి పువ్వు చెట్లు, పారిజాత, అల్ల నేరేడు, పనస, తెల్లనంది, వేప, తామ్ర, గుళిమావు, కదంబ, కానుగ లాంటి చెట్లు నీడతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. కార్బన్ డైఆకై ్సడ్‌ను పీల్చుకుని కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అలాంటి చెట్లను ఎక్కువగా నాటాలని పర్యావరణవాదులు, విశ్రాంత సస్యశాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ కేపీ శ్రీనాథ్ తెలిపారు. చెట్ల పెంపకంలో శాసీ్త్రయత పాటించాలని సూచించారు. తరచూ దుర్ఘటనలు వాతావరణ మార్పులతో వరద పరిస్థితులు, నీటికొరత ఎదుర్కొంటున్న రాజధానిలో చిన్నపాటి గాలివర్షానికి సైతం తట్టుకోలేక చెట్లు పడిపోతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా విదేశీ చెట్లు ప్రమాదకంగా మారాయి. రాజాజీనగర, బసవనగుడి, జయనగర, జేపీ.నగర, ఎన్ఆర్.కాలనీ, చామరాజపేటే, త్యాగరాజనగర, గాంధీనగర, శివాజీనగర, మల్లేశ్వరం, చిక్కపేటే, విజయనగర తదితర పాత ఏరియాలు, వ్యాపార ప్రదేశాల్లో చెట్లు కూలిపోవడం, కొమ్మలు విరిగిపడుతున్న ఘటనలు ఎక్కువ. ఉద్యానవనాల్లో, విశాలమైన ప్రదేశాల్లో కంటే రోడ్లు, ఇంటి కాంపౌండ్లు, డ్రైనేజీల మీద కూలిన ఘటనలు అధికం. దీని వల్ల ప్రాణనష్టం కూడా ఉంటోంది. వర్షాకాలంలోనే కాదు, మిగతా కాలాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగళూరు నిండా విదేశీ వృక్షాలే టబూబియా, గుల్ మొహర్ల కనువిందు చిన్న గాలివానకే కూలి ఆస్తి, ప్రాణనష్టాలు బీబీఎంపీ తీరుపై నగరవాసుల అసంతృప్తి కొత్తొక వింత, పాత ఒక రోత అన్నట్లు నాణ్యమైన మన దేశీ చెట్లు బెంగళూరులో కనిపించేది తక్కువ. రంగు రంగు పూలతో విదేశీ వృక్షజాతులు కనువిందు చేస్తాయి. కానీ అందం మాటున అపాయం దాగి ఉంది. తరచూ విరిగిపడే ఈ విదేశీ చెట్లు నగరవాసులకు భయం పుట్టిస్తున్నాయి. -
ఉవ్వెత్తున వర్షాలు
బనశంకరి: నైరుతి రుతు పవనాలు వచ్చేశాయా? అన్నట్లుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బెంగళూరు నగరంలో మంగళవారం కూడా వర్షం కురిసింది. అతి దట్టంగా మేఘావృతమైంది. అక్కడక్కడ వడగండ్లు పడ్డాయి. మాన్యతా టెక్‌పార్కు రోడ్డు పూర్తిగా జలమయమైంది, ఇక్కడ సిటీ బస్సులోకి నీరు చేరింది. కావేరి జంక్షన్ వద్ద చెట్టుకొమ్మ విరిగిపడింది, విండ్సర్ మ్యానర్ అండర్‌పాస్ నుంచి ప్యాలెస్ మైదానం వరకు వెళ్లే మార్గంలో కొన్ని చెట్లు విరిగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శేషాద్రిపురం రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహించింది. కళ్యాణ నగర బాణసవాడి చుట్టుపక్కల వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. బాణసవాడి రోడ్డులోనూ చెట్లు పడిపోయాయి. మరికొన్ని జిల్లాల్లో మైసూరు, చిక్కమగళూరు, బెళగావి, ధార్వాడ, బళ్లారి తదితర ప్రాంతాలలో మంగళవారం జోరువానలు పడ్డాయి, రోడ్లు వాననీటితో నిండిపోయాయి. వేసవి ఎండల స్థానంలో చల్లని వాతావరణం ఏర్పడింది. బెంగళూరు సహా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వానలు -
నందికొండకు రోప్ వే అండ!
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, టూరిస్టులు, ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన నంది కొండకు నిత్యం వేలాదిమంది వస్తుంటారు. నేల మీద నుంచి కొండ మీదకు రోప్ వే ను వేసి కేబుల్ కార్లను నడపాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో పథకానికి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది, అటవీ సంపదకు భంగం కలగకుండా రోవ్ వే వేసుకోవచ్చని, నిర్మాణంలో జేసీబీలను వాడరాదని, ఎలాంటి రోడ్లు వేయరాదని షరతులతో ఆమోదం వచ్చింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎంసి సుధాకర్, కలెక్టర్ రవీంద్ర మంగళవారం తెలిపారు. రోప్ వేకు సరైన స్థలం కోసం నందిహిల్స్ మీద పరిశీలన జరిపారు. 2.93 కిలోమీటర్ల రోప్‌వే సుమారు 2.93 కిలోమీటర్ల పొడవైన రోప్ వే అవసరమని, ఇందుకు 7 ఎకరాల భూమి కావాలని తెలిపారు. పథకానికి రూ. 93.40 కోట్లు ఖర్చవుతుందని, పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు. రెండు సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రోప్ వే ఏర్పాటైతే కొండ మీదకు వాహనాల రద్దీ తగ్గనుంది. కొత్త పర్యాటక సౌకర్యం కూడా అవుతుంది. మాటలకే పరిమితం కాకుండా పథకం ఎప్పుడు పూర్తవుతుందా అని టూరిస్టులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అటవీశాఖ అనుమతి మంత్రిచే స్థల పరిశీలన -
సమాజంలో గురువుల పాత్ర కీలకం
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు చేస్తున్న సర్వకర్మలను కడిగేవారు గురువులని సీనియర్ ఆడిట్ అధికారి సుబ్రమణ్యం పేర్కొన్నారు. మంగళవారం వేదాంత పాఠశాలలో వేసవి శిబిరం ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి గురువు తల్లి అయితే రెండో గురువు ఉపాధ్యాయుడని అన్నారు. పాప కర్మలను తొలగించుకోవడానికి గురువుల అండదండలు ఉండాలన్నారు. విద్యారంగంలో విద్యార్ధులను ఉత్తమ ప్రజలుగా తీర్చిదిద్ది వారికి సంస్కారం, ఆచార విచారాల గురించి తెలపడంలో గురువుల పాత్ర ప్రధానమన్నారు. పిల్లలు యోగా, ధ్యానం, సత్సంగం, ప్రాణాయామం, సంగీతం, నృత్యం, సంతోష జీవనశైలితో జీవితాన్ని గడపాలన్నా రు. కార్యక్రమంలో వేదాంత పాఠశాల ప్రధానోపాధ్యాయిని గౌరీ, రామచంద్ర, రాజేష్ రాజలబండి, ప్రమీల, వినూత, స్మృతిలున్నారు. -
అకారణంగా రైలులో ప్రయాణికులపై దాడి
బళ్లారిఅర్బన్: వారంతా అమరావతి రైల్లో సాధారణంగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వినుకొండ రైల్వేస్టేషన్ వద్ద అక్కడి కొందరు యువకులు బళ్లారి, కంప్లి తదితర ప్రాంత నివాసులైన మహిళా ప్రయాణికులు యథేచ్చగా దాడి చేసి చెంపలు వాయించి నానా బీభత్సం సృష్టించి వచ్చిన దారినే పని ముగించుకొని హుటాహుటిన వెళ్లిపోయారు. కాగా ఆ రైలు ప్రయాణంలో బాధితులైన బళ్లారి శిరీష, వీరేష్, కంప్లి నాగలక్ష్మి తదితర 6 మందిపై స్థానిక మీడియాతో తమపై జరిగిన అమానుష దాడి గురించి ఆవేదనతో వివరించారు. తాము విజయవాడ నుంచి బళ్లారికి అమరావతి రైల్లో ప్రయాణిస్తున్నామన్నారు. ఈక్రమంలో వినుకొండ వద్ద రైలు ఆగినప్పుడు దుండగుల మాదిరిగా వచ్చిన యువకులు తమపై దాడి చేసినట్లు వాపోయారు. సీటు కోసం గొడవే దాడికి కారణం విజయవాడలో వినుకొండకు చెందిన ముగ్గురు మహిళలు సీటు కోసం గొడవ పెట్టుకొని వినుకొండకు రైలు చేరుకోగానే తమ వారికి ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు రైలులోకి జొరబడి దాడి చేసి పరారయ్యారని శిరీష వాపోయారు. ఇలాంటి దాడులను ఎవరూ సహించరాదని తక్షణమే సీసీ కెమెరాల ద్వారా ఆ యువకుల గుంపును గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా తమకు న్యాయం చేయాలన్నారు. ఆ మార్గంలో అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు సదా మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండి ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమాయక మహిళలపై మళ్లీ దాడులు జరగకుండా ఆర్పీఎఫ్ పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శిరీష తదితర బాధితులు డిమాండ్ చేశారు. వినుకొండ వద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బాధితుల వినతి -
భారీ వర్షం.. ఇబ్బందుల్లో జనం
సాక్షి,బళ్లారి: వాతావరణంలో ఆకస్మిక మార్పులతో మండు వేసవిలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముందుగానే వర్షాలు ప్రారంభమైనా ఇంత పెద్ద వాన కురవడం తొలిసారి కావడంతో ఒక్కసారిగా ప్రజలకు ఓ వైపు సంతోషం, మరోవైపు దుఃఖం కలిగించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అల్లాడిపోయారు. విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లోకి నీరు ప్రవహించడంతో రాత్రంతా జనం జాగరణ చేశారు. దాదాపు 18 గంటలకు పైగా నగరం మొత్తం విద్యుత్ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లను యథాస్థానంలో ఏర్పాటు చేసి, మళ్లీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఖరీఫ్ పదునుకు అదును ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో భారీ వర్షం కురవడంతో రైతన్నలకు సేద్యం పనులు చేసుకునేందుకు వీలైందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పదును కావడంతో వర్షాధారిత భూముల్లో ఒకటి రెండు రోజుల్లో సేద్యం పనులు జోరుగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని రైతులు పేర్కొంటున్నారు. కాగా వర్షం వచ్చినప్పుడల్లా బురదమయంగా మారే ఏపీఎంసీ కూరగాయల మార్కెట్ మళ్లీ అస్తవ్యస్తంగా తయారైంది. బురదలోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయించారు. ఇటు రైతులతో పాటు వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీఎంసీ మార్కెట్‌ను బాగు చేయడంపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చొరబడడంతో ఇళ్లలో ఉన్న తిండిగింజలు, ఇతర ఆహార సామగ్రి తడిచిపోయి ఆయా కాలనీల్లో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ కోత ఇళ్లలోకి నీరు చేరి జనం పాట్లు అస్తవ్యస్తంగా ఏపీఎంసీ మార్కెట్ -
గోశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలి
రాయచూరు రూరల్: నగరంలో నగరసభ కేటాయించిన గోశాల స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న కట్టడాలను తొలగించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1942లో నగరసభ వార్షిక టెండర్ ప్రక్రియలో గోశాల సమితికి అప్పగిస్తూ 3.25 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. 1965లో సమితికి పూర్తి అధికారంతో పన్నూలు వసూలు చేశారన్నారు. ఇంత వరకు కూడా పన్నులు కట్టారన్నారు. కొంత మంది రాజకీయ నాయకుల మద్దతుతో గోశాలలోని 2.25 ఎకరాల భూమి తమదే అంటూ గోపాల్ సింగ్ పుత్రులు ఆ ప్రాంతంలో నగరసభ, నగర ప్రాధికార, జిల్లాధికారి అనుమతి లేకుండా కట్టడాలను నిర్మిస్తున్నారన్నారు. ఈ విషయంలో కలబుర్గి హైకోర్టు, జిల్లాధికారి కోర్టులో కేసు విచారణలో ఉండగా నిర్మాణాలు చేపట్టడం తప్పని వాటిని నిలుపుదల చేయాలని అధికారులను ఒత్తిడి చేశారు. రిజర్వేషన్లను రద్దు చేయబోం● కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి స్పష్టీకరణ హుబ్లీ: రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారన్న దుష్ప్రచారం జోరుగా సాగుతోందని, ఇలాంటి ఏ నిర్ణయం తీసుకోలేదని, రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలో తొలగించబోమని, అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగం– 75 మార్చింది ఎవరు, పటిష్ట పరిచింది ఎవరు? అనే అమూల్య గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యధిక పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించింది, దేశానికి అన్యాయం చేసిన వారే నేడు రాజ్యాంగాన్ని మారుస్తారన్న దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితిలోను రాజ్యాంగాన్ని మార్చబోమని కేంద్ర మంత్రిగా ఖరాఖండిగా చెప్పారు. అలాగే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు తొలగించడం కాదు, అసలు వాటిని ముట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదని, సామాజిక న్యాయమే లక్ష్యంగా రిజర్వేషన్లు యథావిఽధిగా కొనసాగుతాయన్నారు. వాటిని తొలగించే ప్రసక్తే ఉండదన్నారు. ఏబీవీపీ ప్రముఖులు ప్రవీణ్ బీ రాజ్, చిత్రదుర్గ బసవమూర్తి, మాదార చెన్నయ్య స్వామి, ఆనంద హోసూర్, సచిన్ కుళగేరి, అమృత కొళ్లి తదితరులు పాల్గొన్నారు. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణంరాయచూరు రూరల్: భీమా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు దుర్మరణం పాలైన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా గురుసణిగి వద్ద సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వేసవిలో ఎండలు అధికం కావడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోయి షకీల్(18), మహబూబ్(20) మృత్యువాత పడ్డారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక స్పృహ, వ్యక్తిత్వం పెంపొందించుకోవాలి హుబ్లీ: సాధన చేయడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. జీవితంలో దొరికే అవకాశాలను సరైన రీతిలో అందిపుచ్చుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని అఖిల భారత ఆకాశవాణి నాటక కళాకారుడు డాక్టర్ శశిధర్ నరేంద్ర సూచించారు. కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం మీటింగ్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన అంతర్ డివిజన్ యువజనోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు సంస్కారం, సంస్కృతి, సహనం, ఓర్పు వంటి ఉత్తమ లక్షణాలను ఇంట్లోనే తల్లిదండ్రులు చక్కగా వివరించి చెప్పాలన్నారు. సంస్కారం నేర్పించకపోతే దుర్ఘటనలు సంభవిస్తాయని హెచ్చరించారు. సప్తస్వరాలను సుశ్రావ్యంగా పాడాలంటే కఠినమైన అభ్యాసం చేయాలన్నారు. భారత దేశం కళలను పోషించే దేశం. ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన దేశం మనది అన్నారు. వీరయోధులైన వైభవ సూర్యవంశీ, డీ.గుకేష్, సోఫియా ఖురేశి, వ్యోమికా సింగ్ సాధనలను యావత్ ప్రపంచం ప్రశంసించిందన్నారు. మనసు పెడితే ఎవరైనా గొప్ప కార్యాలను సాధించవచ్చన్నారు. మన జీవితాలను సుసంస్కృత వాతావరణంలో చక్కగా తీర్చుదిద్దుకోవాలని ఆయన సూచించారు. సంస్కారం నేర్చుకోవడానికి యువజనోత్సవం దోహపడుతుందన్నారు. ఆ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీ.బసవరాజు మాట్లాడుతూ నేడు సమాజం విచ్ఛిన్నం అవుతోందన్నారు. ఉత్తమ సమాజ నిర్మాణ గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాఠాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించాలని, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు మనిషిలో పరివర్తనకు దారి దీపాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రణతి, రీమా, భూమిక, హర్షిక తదితరులు పాల్గొన్నారు. -
భగవాన్ బుద్ధ.. ప్రపంచానికి స్ఫూర్తిదాత
బళ్లారిటౌన్: భగవాన్ బుద్ధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాత అని బాబూ జగ్జీవన్‌రామ్ చర్మ పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్న తారతమ్య ధోరణికి విరుద్ధంగా కొత్త వ్యవస్థ కోసం పోరాడిన మహనీయుడన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా బుద్ధ జయంతిని జరపడం శ్లాఘనీయం అని కొనియాడారు. ఏసీ ప్రమోద్, హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వెంకటగిరి దళవాయి, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజు, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు కమలరత్న, అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల ముందు నుంచి జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు. -
పౌర కార్మికులకు కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్: నగరంలో పారిశుధ్య పని చేసే పౌర కార్మికులకు దుస్తుల కిట్లను పంపిణీ చేశారు. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద కమిషనర్ జుబిన్ మహాపాత్రో పౌర కార్మికులకు కిట్లను అందించి మాట్లాడారు. చలికాలం, వేసవి కాలంలో పౌర కార్మికులకు ఆరోగ్య రక్షణకు దుస్తుల కిట్, పలుగు, పార తదితర పనిముట్లు, చేతులకు గ్లౌజ్, మాస్క్, షూను అందించారు. ఎయిమ్స్‌పై సవతి తల్లి ప్రేమరాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నాయని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస ఆరోపించారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ఆందోళనకు మద్దతు పలికారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గళం విప్పాలన్నారు. మూడేళ్ల పోరాటానికి ఫలితం లభించేలా చూడాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం సమర్పించారు. ప్లాస్టిక్ బెడద అరికట్టండి రాయచూరు రూరల్: నగరంలో అధిక భాగం ప్లాస్టిక్ కప్పులతో టీ, కాఫీలను తాగుతుండటాన్ని అరికట్టాలని క్రాంతి వీర బెళవడి యువక సంఘం జిల్లాధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ కప్పులతో టీ, కాఫీలను తాగడం వల్ల మానవుడి దేహంలోకి 75 వేలకు పైగా సూక్ష్మమైన జీవులు ప్రవేశిస్తాయన్నారు. వాటి వల్ల క్యాన్సర్ తదితర వ్యాధులు సంక్రమిస్తున్నందున నగరసభ, ఆరోగ్య శాఖ అధికారులు ప్లాస్టిక్ కప్పులను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరుతూ తహసీల్దార్ సురేష్‌వర్మకు వినతిపత్రం సమర్పించారు. మదీనా యాత్రికులకు ఆత్మీయ వీడ్కోలుహుబ్లీ: హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ నవాజ్ కిత్తూరు, సతీమణి సహీరాబాను, కుమారుడు అహ్మద్ రజాక్ కిత్తూరు, కుమార్తె అమరాన్ బాను, అలాగే వందలాది మంది ఇటీవల బెంగళూరు హజ్భవన్ నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు మక్కా మదీనా యాత్రకు వెళుతున్న అల్తాఫ్ కుటుంబ సభ్యులకు అత్మీయంగా వీడ్కోలు పలికారు. షౌకత్ కిత్తూరు లియాఖత్, రఫీక్, అల్లాబకాష్, మహమ్మద్ యూసఫ్, దావల్సాబ్ మున్నా, సాధిక్ యూసఫ్, మహమ్మద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ తరలింపును వ్యతిరేకిస్తూ నిరసన హొసపేటె:విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిక్కజోగిహళ్లి ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఉన్న బీడీసీసీ బ్యాంకును తరలించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. సహకార సంఘం ఉపాధ్యక్షురాలు సుమంగళమ్మ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న డైరెక్టర్లు రైతు వాటాదారులకు తెలియజేయకుండా బీడీసీసీ బ్యాంకును తరలించడం తగదని తెలిపారు. గతంలో కొత్త బ్యాంకు నిర్మించేటప్పుడు రుణం కోసం ఆమోదించిన ప్రతి రైతు నుంచి రూ.2000 వసూలు చేశారన్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో స్థాపించిన ఈ కొత్త బ్యాంకులో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. 2019లో అసోసియేషన్ ప్రాంగణంలో ప్రారంభించిన బ్యాంకు, ప్రకృతి సంఘం మధ్య 15 సంవత్సరాల ఒప్పందం ఉందన్నారు. సహకార సంఘం నేతలు కోదండ రామన్న, మాజీ ఉపాధ్యక్షులు ఎస్పీ ప్రకాష్, గ్రామ పంచాయతీ అధ్యక్షులు అశోక్ నాయక్, మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
డ్యాం గేట్ల మార్పునకు ఏజెన్సీల నుంచి బిడ్లు
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 32 గేట్ల మార్పు కోసం పిలిచిన ఈ–టెండర్‌కు నాలుగు ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర బోర్డు సాంకేతిక బిడ్‌ను తెరిచింది. బిడ్‌ను దక్కించుకున్న వారిని మే 17న ప్రకటిస్తారు. రిజర్వాయర్ 19వ గేటు నిర్మాణ పనులను ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. మిగిలిన 32 గేట్ల భర్తీకి టెండర్ పిలిచారు. నాలుగు ఏజెన్సీలు ఇప్పుడు దరఖాస్తులు సమర్పించాయని, తుది టెండర్ విజేతను మే 17న ప్రకటిస్తామని మండలి వర్గాలు తెలిపాయి. 19వ గేట్ వర్కింగ్ డిజైన్‌ను ఆంఽధ్రప్రదేశ్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌కు కూడా సమర్పించగా ఆమోదం లభించింది. త్వరలో 19వ గేట్ అమరిక పనులు ప్రారంభమవుతాయి. -
నేత్రపర్వం.. వడకరాయ రథోత్సవం
హొసపేటె: విజయనగర సామ్రాజ్య రాజుల కాలం నాటి చారిత్రక వడకరాయ ఆలయ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హొసపేటెలోని మెయిన్ బజార్‌లోని వడకరాయ ఆలయంలో జరిగిన రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు వడకరాయ స్వామిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వడకరాయ స్వామి రథాన్ని ఆలయం వద్ద నుంచి పాదగట్టె ఆంజనేయ స్వామి ఆలయం వరకు లాగారు. ఘనంగా మరడి దుర్గమ్మ రథోత్సవం బుద్ధ పూర్ణిమ రోజున సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తులతో మరడి దుర్గమ్మ దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం ప్రారంభం కాగానే దుర్గాదేవికి మొక్కులు తీర్చుకునే భక్తులు కోళ్లను రథంపైకి విసిరి తమ భక్తిని అర్పించారు. మిగిలిన భక్తులు అరటిపండ్లు విసిరి అమ్మవారికి పూజలు చేశారు. విజయనగర జిల్లా కొట్టూరులోని బిక్కిమరడిలో దుర్గమ్మ దేవి రథోత్సవంలో మాత్రమే ప్రత్యక్షంగా కోళ్లను విసిరే సంప్రదాయం ఉంది. రథోత్సవం వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చి మధ్యాహ్నం నుంచే గంటల తరబడి ఎదురు చూశారు. రథోత్సవానికి ముందు దుర్గమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ప్రతిష్టించి, అమ్మవారి పల్లకీ ఉత్సవాన్ని శుభ వాయిద్యాల ఊరేగింపుతో తీసుకువచ్చి, రథం చుట్టూ ప్రదక్షిణ చేసి, రథంలో ప్రతిష్టించిన తరువాత రథోత్సవం నిర్వహించారు. -
ఏం కష్టం వచ్చిందో..?
కృష్ణరాజపురం(కర్ణాటక): విదేశాల్లో చదువుకుని ఇటీవలే ఇంటికి వచ్చిన యువకుడు ఏం కష్టం వచ్చిందో కానీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటిలో ఉన్న సింగిల్ బ్యారెల్ గన్‌తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు గ్రామీణ జిళ్లాలోని హోసకోటె నియోజకవర్గం పరిధిలోని దేవిశెట్టిహళ్ళి గ్రామంలో జరిగింది. గ్రామవాసి బైయేష్ (28) తుపాకీతో తలలో కాల్చుకోవడంతో తల ఛిద్రమై చనిపోయాడు. ఇంటిలోవారు ఆందరు ఆదివారం తిరుపతికి వెళ్లారు. అతడు ఒక్కటే ఇంట్లో ఉన్నాడు. సోమవారం కుటుంబీకులు తిరుపతి నుంచి తిరిగి వచ్చి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే తిరుమలశెట్టిహళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్షేమంగా వెళ్లిరా నాన్న.!
● సైనికుడికి కుటుంబ సభ్యుల వీడ్కోలు హుబ్లీ: సాధారణ సెలవుల కోసం ఇంటికి వచ్చిన తమ సైనిక సంతానానికి ఆయా కుటుంబ సభ్యులు, ధైర్య వచనాలు బోధించి విధులకు సాగనంపారు. బెళగావి జిల్లాలోని బైలహొంగల సమీపంలో ఒకే కుమారుడు ఉన్నా తాము దేశభక్తితో ఉన్న ఒక్క కుమారుడిని దేశ సేవకు పంపించామని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న యువజవాన్కు తల్లిదండ్రులు వీరతిలకం దిద్ది ఆశీర్వచనాలు అందించి విధులకు సాగనంపారు. ఆ తాలూకాలోని సిరులూరు కన్నడనాడు ఒంకుంద గ్రామంలో 21 ఏళ్ల వీరజవాన్ బసవంతప్ప రుద్రప్ప కల్లి ఆదివారం రాత్రి తాను విధులు నిర్వహించే రాజస్తాన్‌లో జైసల్మేర్‌కు పయనం అయ్యారు. సైనిక వాహనం డ్రైవర్‌గా బసవంతప్ప బసవంతప్ప సైనిక వాహనం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి రుద్రప్ప ఒంకుంద గ్రామ పంచాయతీలో నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్నారు. తల్లి నిర్మల ఆ గ్రామపంచాయతీ చైర్ పర్సన్. వీరికి ఒకే కుమారుడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బసవంతప్ప మాట్లాడుతూ ప్రస్తుతం సెలవులపై వచ్చానని అయితే తమ ఉన్నతాధికారులు ఫోన్ చేసి తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించడంతో అర్ధంతరంగా సెలవులను రద్దు చేసుకొని విధులకు బయలుదేరి వెళుతున్నానన్నారు. తల్లి నిర్మలతో పాటు సోదరి నాగరత్న తదితరులు వీర జవాన్‌కు ఘనంగా హారతులు ఇచ్చి విధుల నిర్వహణకు సాగనంపారు. -
తూటా పేలి యువకుడికి గాయాలు
రాయచూరు రూరల్: నగరంలో తూటా పేలి యువకుడు గాయాపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేస్ కాంబ్లే కథనం మేరకు వివరాలు.. నగరంలోని హెచ్ఆర్బీ కాలనీలో నివాసమున్న జియా సౌదాగర్ అనే యువకుడు ఈ నెల 3న తన స్నేహితుడు మహ్మద్ సోహైల్‌ను ఇంటిికి తీసుకెళ్లి పిస్తోల్‌ను చూపించాడు. తూటాలున్న పిస్తోలు ఉన్నఫళంగా పేలడంతో సోహైల్ కాలికి గాయమైందన్నారు. ఈ విషయం ఎవరికై నా చెపితే చంపుతానని సౌదాగర్ సోహైల్‌ను హెచ్చరించాడు. దీంతో గాయపడ్డ సోహైల్ మిన్నకుండి పోయి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదగిరిలో గర్భిణి మృతి రాయచూరు రూరల్: యాదగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణి మృతి చెందింది. తల్లీ బిడ్డల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు చూలాలు బలి అయింది. ఈ నెల 3న గర్భిణి మహిళ సంగీత(20) ప్రసవం కోసం తల్లీ బిడ్డల ఆస్పత్రిలో చేరారు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని గర్భిణి మృతితో ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా తనువు చాలించింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ సంగీత కుటుంబ సభ్యులు ఆస్పత్రి అంబులెన్సు వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వడదెబ్బకు కండక్టర్ బలి రాయచూరు రూరల్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికమైన నేపథ్యంలో వడ దెబ్బకు గురై ఆర్టీసీ కండక్టర్ ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని మస్కి తాలూకా హసమకల్కు చెందిన మల్లయ్య(45) అనే వ్యక్తి బెంగళూరులోని బీఎంటీసీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన మల్లయ్య మస్కిలో సంతకు వచ్చి వడ దెబ్బకు గురై ప్రాణాలు వదిలాడు. మస్కి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. డిమాండ్ల సాధన కోసం ధర్నాచెళ్లకెరె రూరల్ : వివిధ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘం, హసిరు సేనె కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డిహళ్లి వీరణ్ణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఆశ చూపి రైతులను సోలార్ కంపెనీలకు తాకట్టు పెట్టడం ఖండనీయమన్నారు. వ్యవసాయ క్షేత్రాలను కార్పొరేట్ కంపెనీలకు మార్పు చేయడం క్షమించరాని విషయమన్నారు. 2022–23లో ఉన్న అక్రమ, సక్రమ చట్టం ప్రకారం రైతులకు అందించాల్సిన సౌకర్యాలను అందించాలన్నారు. రైతులు విద్యుత్‌ను తమ స్వంతానికి వాడడం లేదు. పైగా పంటలను పండించడానికి వాడుతున్నారు. అలాంటి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేయాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు నాయకులు తిప్పేస్వామి, శివకుమార్, ఓబయ్య, రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు. వీరయోధుడికి అశ్రునివాళిహొసపేటె: జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ బంజార కమ్యూనిటీ యోధుడు మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం గంగావతి తాలూకా బంజార సమాజ్ విరుపాపుర తండాలోని సేవాలాల్ సర్కిల్ వద్ద అశ్రునివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. పురపాలక సంఘం మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, వ్యవసాయ అధికారి ప్రకాశ్ రాథోడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సేవాలాల్ మహారాజ్, పాండునాయక్ మేసీ్త్ర, హనుమంత మేసీ్త్ర, వెంకటేష్ జాడ, కృష్ణప్రకాష్, ఠాకు నాయక్ మేస్త్రి, రాజు మేసీ్త్ర, వెంకటేష్, వెంకన్న లోకేష్, మంజునాథ్, ఉమేష్ పాల్గొన్నారు. -
శాంతికి రాయబారి బుద్ధుడు
హొసపేటె: చాలా మంది ఇళ్లలో బుద్ధ విగ్రహాలను ఉంచుతారు. కానీ ప్రస్తుత కాలంలో, అశాంతి, హింసాత్మక వాతావరణాలు ప్రబలుతున్నందున ఇళ్లలో, మనస్సుల్లో శాంతి, అహింస ప్రజ్వరిల్లాల్సిన అవసరం ఉందని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన బుద్ధ జయంతిలో బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రపంచ శాంతిని కోరుకున్న గౌతమ బుద్ధుని తత్వాలను స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక అసమానత, అంటరానితనం, హింసాత్మక దోపిడీ, హత్య, రక్తపాతం, క్రూరత్వ మనస్తత్వాన్ని నిర్మూలించే దిశగా మనం ముందుకు సాగాలన్నారు. విజయనగర హంపీ బుద్ధ విహార నిర్మాణ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు నగరంలోని శ్రీగురు పీయూ కళాశాల సమీపంలోని సర్కిల్‌కు సిద్ధార్థ గౌతమ బుద్ధ సర్కిల్‌గా పేరు పెట్టాలని, సర్కిల్ అభివృద్ధికి హైమాస్ట్ విద్యుత్ దీపాల వ్యవస్థను అందించాలని జిల్లాధికారిని అభ్యర్థించారు. జయంతిలో ప్రగతిశీల ఆలోచనపరుడు, రచయిత బీ.పీర్ భాషా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, కన్నడ సంస్కృతి శాఖ అధికారి సిద్దలింగేష్ రంగన్ననవర్ పాల్గొన్నారు. సిద్ధార్థ గౌతమ బుద్ధ సర్కిల్ ప్రారంభం బుద్ధ పూర్ణిమ సందర్భంగా హంపీ విజయనగర బుద్ధ విహార నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నగర శివార్లలో శ్రీగురు పీయు కళాశాల సమీపంలో నాలుగు రోడ్లు కలిసే సర్కిల్‌కు సిద్ధార్థ గౌతమ బుద్ధ సర్కిల్ అని నామకరణం చేశారు. ట్రస్ట్ నేత బణ్ణద సోమశేఖర్ మాట్లాడుతూ బుద్ధ బసవ అంబేడ్కర్ ఆశయాలను మన జీవితాల్లో అమలు చేసుకుంటూ అందరూ ముందుకు సాగాలని తెలిపారు. హొసపేటె నగరం శాంతికి ప్రసిద్ధి చెందిన నగరం. హొసపేటె ఈ సర్కిల్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ప్రపంచానికి శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసిన గౌతమ బుద్ధుని పేరు మీద ఉన్న వృత్తం. అతని పేరు మీద ఉన్న వృత్తం గుండా నగరంలోకి మొదట ప్రవేశిస్తే అది ఈ నగరానికి మంచి సంకేతం అని మేం భావించాం. తరువాత ప్రపంచ నాయకుడు, సాంస్కృతిక నాయకుడు అయిన బసవణ్ణ వృత్తం వస్తుంది. ఆ తర్వాత ప్రపంచ పండితుడు, సామాజిక శిల్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ సర్కిల్ వస్తుంది. ఈ ముగ్గురు గొప్ప నాయకుల వృత్తాలు ఒకే రోడ్డుపై కలిసి రావడం మరో ప్రత్యేకత అని తెలిపారు. చిన్నస్వామి సూసలె, జంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా బుద్ధ జయంతి ఉత్సవం రాయచూరు రూరల్: అలనాటి మహాభోది వృక్షం వద్ద తపస్సులు చేసి జ్ఞానాన్ని పొందిన మహా మానవతా వాది గౌతమ బుద్ధుడు అని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామి అన్నారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి, సాంఘీక సంక్షేమ శాఖ, బుద్ధ జయంతి ఆచరణ సమితి ఆధ్వర్యంలో బుద్ధుడి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. సమాజంలో మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించి మానవత్వంతో జీవించాలన్నారు. ఆశలను అదుపులో పెట్టుకోని ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలన్నారు. సమాజం జిల్లాధ్యక్షుడు రవీంద్రనాథ్ పట్టి, జగన్నాథ్ సుంకారి, మల్లేష్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీ పుట్టమాదయ్య, తహసీల్దార్ సురేష్ వర్మ, సంతోష్, భాస్కర్, తిమ్మారెడ్డి, విశ్వనాథ్, రాజు పట్టీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ ఘనంగా బుద్ధ జయంతి వేడుక -
మంత్రాలయంలో తారల సందడి
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి వారిని బహుభాషా నటుడు ఉపేంద్ర కుటుంబం, సినీ నటి తార కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. సోమవారం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ వారికి శాలువా కప్పి జ్ఞాపికను అందించి సన్మానించి ఆశీర్వదించారు. వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలు మంత్రాలయంలో ఘనంగా సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ 13వ ఏడాది వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో మూల విరాట్్కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేక ఉత్సవ వేడుకల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు. -
20న లక్ష పేద కుటుంబాలకు ఇంటి పట్టాల పంపిణీ
బళ్లారిఅర్బన్: రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించి పూర్తిగా అమలు చేస్తున్నా కూడా ప్రయోజనం చేకూరని జనవసతి ప్రాంతాల్లోని లక్ష పేద కుటుంబాలకు పట్టా హక్కు పత్రాల ద్వారా పరిపూర్ణ రెవెన్యూ గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శతాబ్దాల నుంచి కొన్ని తాండాల్లోని ప్రజలకు నివాసం ఉన్న దాఖలాలు కూడా లేని కారణంగా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లభించలేక పోయిందన్నారు. ప్రస్తుతం వాటన్నింటిని గుర్తించామన్నారు. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో ఈ పథకం అమలు చేశామన్నారు. 36 వేల కుటుంబాలకు హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. అయితే గత బీజేపీ సర్కారు వీటి ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. 70 వేల కుటుంబాలకు బీజేపీ హయాంలో హక్కు పత్రాలు పంపిణి చేసింది. ప్రస్తుతం తమ సర్కారు హయాంలో సుమారు 1.50 లక్షల కుటుంబాలకు పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నెల 20న లక్ష కుటుంబాలకు హొసపేటెలో జరిగే సాధన సమావేశంలో హక్కు పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పోడి అభియాన్, ఫౌతి అభియాన్లను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. వీటిని ఆయా జిల్లా, తాలూకా కేంద్రాల్లో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల పేజీల రికార్డులను ఇప్పటికే డిజిటలీకరణ చేశామని మంత్రి అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ -
ఎండిన చెరువు.. చేపల మృత్యువు
రాయచూరు రూరల్: ప్రతి ఏడాది చెరువులో నీరు నిల్వ ఉండేవి. మత్స్యకారులు చేపలను పట్టి అమ్ముకుని పొట్టపోసుకునేవారు. నగరానికి 13 కి.మీ. దూరంలోని మర్చేడ్ సమీపంలోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో లక్షలాది చేపలు వేసవి తాపానికి మరణించాయి. చనిపోయిన చేపలను తినడానికి పక్షులు వస్తున్నాయి. చెరువులో మరణించిన చేపలతో గ్రామంలో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి ఏడాది నీరు పుష్కలంగా ఉండేవి. ఆ సమయంలో పక్షులు వలస వచ్చేవి. చెరువులో నీరు ఇంకిపోయి చేపల మృతితో వలస పక్షులు చేపలను తింటున్నాయి. అభివృద్ధి పనులకు శ్రీకారంహొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో 80 శాతం పనులు త్వరలో పూర్తవుతాయని ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్ తెలిపారు. సోమవారం మరియమ్మనహళ్లి పట్టణంలో రూ.9 కోట్ల ఖర్చుతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పాఠశాల కాంపౌండ్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. పట్టణంలోని 15 వార్డులకు కేకేఆర్డీహెచ్, డీఎంఎఫ్ గ్రాంట్ల కింద పాఠశాలల ప్రాంగణానికి కాంపౌండ్, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి దాదాపు రూ.9 కోట్ల గ్రాంట్ మంజూరైందన్నారు. అదనంగా పట్టణంలోని దుర్గాదాస్ థియేటర్ కోసం ప్రేక్షకుల గ్యాలరీ నిర్మాణానికి సుమారు రూ.50 లక్షల గ్రాంట్ అందిస్తారన్నారు. రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.25 లక్షలు, 12వ వార్డు అభివృద్ధికి రూ.1 కోటి నిధులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి మలప్రభ కుడి కాలువకు నీరు విడుదల హుబ్లీ: మలప్రభు కుడిగట్టు కాలువ పరిధిలో జిల్లాలోని నవలగుంద, అణ్ణిగేరి, హుబ్బళ్లి, కుందగోళ తాలూకాల్లోని వివిధ గ్రామాలకు తాగునీటి అవసరాల నిమిత్తం సంబంధిత చెరువులకు నీటిని నింపుకొనే ఉద్దేశంతో బెళగావి డివిజన్ కమిషనర్ మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు నవిలుతీర్థ జలాశయం నుంచి మలప్రభ కుడిగట్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి ఆదేశాలిచ్చారు. నీటిని సద్వినియోగం చేసుకోవడానికి నిఘా వహించాలని జిల్లా స్థాయి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు జిల్లాధికారిణి దివ్యప్రభు తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియాకు వివరాలు తెలిపారు. సదరు ఆదేశం మేరకు ప్రజలకు, పశుపక్షాదులకు తాగునీటి కోసం, నరగుంద, రోణ తాలూకాల్లోని బహుగ్రామ తాగునీటి పథకాలు, చెరువులను నింపడానికి నరగుంద ఉప కాలువ, సంబంధిత ప్రాంతాలకు నవిలుతీర్థ జలాశయం నుంచి నీటి విడుదలకు సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు ఆదేశాలిచ్చినట్లు ఆమె తెలిపారు. నీటి పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని, నోడల్ అధికారులను నియమించామన్నారు. నాటక, సాహిత్య, గమక కళల్లో మేటి దొడ్డనగౌడ బళ్లారిఅర్బన్: నాటకాలు, సాహిత్యం గమక కళల్లో మేటి డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ కళా సేవలు చిరస్మరణీయం అని విశ్రాంత అధ్యాపకులు ఎన్.బసవరాజ్ తెలిపారు. రాఘవ కళా మందిరంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ 30వ వర్ధంతిలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. నాటకాలు, సాహిత్యం, గమక తదితర కళల్లో దొడ్డనగౌడ నైపుణ్యం అపారమైందన్నారు. దొడ్డనగౌడ మాతృమూర్తి రుద్రమ్మ, తండ్రి పంపనగౌడల కుమారుడిగా 1910 జూలై 27న జన్మించారు. జోళదరాశిలోని అయ్యన్నవర పాఠశాల, అలాగే గుడిబడిలో నాలుగవ తరగతి వరకు చదివారు. అనంతరం ఆయన నాటక రంగం సేవలకే అంకితం అయ్యారన్నారు. ఆంధ్ర సరిహద్దులోని ఈ ప్రాంతం కన్నడ, తెలుగు భాషలలో నాటకాల్లో అభినయించి సాహిత్య రచన కూడా చేపట్టి 40 గ్రంథాలను రచించారన్నారు. ముఖ్యంగా గమక కళకు ఆయన చేసిన సేవలు అజరామరం అన్నారు. బళ్లారి రాఘవచార్య శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. 1994 మే 10న ఆయన స్వర్గస్థులయ్యారని బసవరాజ్ తెలిపారు. -
మంచి వ్యక్తిత్వం అలవరచుకోవాలి
హొసపేటె: నిరంతరం నేర కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు జీవితంలో అన్ని రకాల కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పోలీసు కేసుల్లో నమోదై దోషులుగా తేలిన వారు తరువాత మనసు మార్చుకుని మంచి పౌరులుగా జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే జీవితాంత అపరాధ భావనలో మునిగి పోవాల్సి ఉంటుందని విజయనగర జిల్లా అదనపు ఎస్పీ సలీం పాషా తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్లో 8 పోలీస్ స్టేషన్ల రౌడీ పరేడ్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన మార్గదర్శనం చేశారు. ఏదో కారణంతో నేరస్తులుగా నమోదైన నిందితులు శాశ్వతంగా నేరపూరిత చర్యల్లో కొనసాగకుండా నిజాయితీపరులు, సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మారడానికి పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఎవరైనా ద్వేషంతో నేరపూరిత చర్యకు పాల్పడి, ఆ తర్వాత దానిని కొనసాగించకూడదని నిర్ణయించుకుని నాయకుడిగా మారితే పోలీసు సీనియర్ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ దొడ్డమని మాట్లాడుతూ ప్రతి పౌరుడు పోలీసులతో స్నేహ పూర్వకంగా ఉండాలని పోలీసు యంత్రాంగం కోరుకుంటుందన్నారు. దీనికి తోడు సమాజం స్పందించి ఎలాంటి నేర సంఘటనలు జరగకుండా శ్రద్ధ వహించాలని అన్నారు. నిందితులు తమ భవిష్యత్తు గురించి, తమ కుటుంబ గురించి ఆలోచించి నేరపూరిత మనస్తత్వం నుండి బయటపడాలన్నారు. నేరాలు చేస్తూనే ఉంటే, వారికి ఎప్పటికీ శాంతి, ప్రశాంతత దొరకదన్నారు. నిందితులు దీనిపై దృష్టి సారించి, సత్పౌరులుగా మారాలని ఆయన అన్నారు. -
గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి
సాక్షి,బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య(95) గుండెపోటుతో మృతి చెందారు. బళ్లారి జిల్లా కంప్లి వద్ద తన పొలాలను చూసుకునేందుకు వెళ్లిన నేపథ్యంలో కారు దిగుతూ గుండెపోటుకు గురి కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దరూరు పుల్లయ్య సొంత ఊరు ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం కాగా, సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సర్పంచ్ పదవీ కాలం ముగిసిన తర్వాత 1969లో ఉరవకొండ సమితి ప్రెసిడెంట్‌గా, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తుండటంతో ఇందిరాగాంధీ ఆశీస్సులతో 1977లో అనూహ్య పరిణామాలతో అనంతపురం లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ టికెట్ సంపాదించారు. 1977 నుంచి 1979 వరకు రెండేళ్ల పాటు లోక్‌సభ సభ్యునిగా సేవలందించారు. అనంతరం 1982 నుంచి 1985 వరకు రెండోసారి అనంతపురం లోక్‌సభ సభ్యునిగా కొనసాగారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి అప్పట్లో అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడుగా, జిల్లాలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేయడంలో దరూరు పుల్లయ్య తనదైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గ రాజకీయాల్లో, అభివృద్ధి చేయడంతో దరూరు పుల్లయ్య చిరస్థాయిగా నిలిచిపోయారు. హంద్రీనీవా సాధించుకోవడానికి ఆయన చేసిన కృషిని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటారు. సొంతూరు ఛాయాపురం అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. సాగు, తాగునీరు సాధించుకోవడానికి కృషి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు భార్య సత్యవతమ్మ కుమారుడు రమేష్, కోడలు నీలిమ, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. అనంతపురం రాజకీయాల్లో, రైతుగా గుర్తింపు పొందిన ఆయనకు బళ్లారితో కూడా విడదీయరాని అనుబంధం ఉంది. బళ్లారిలో సొంత ఇల్లుతో పాటు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన మృతి వార్త తెలుసుకుని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి బళ్లారికి వచ్చి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దరూరు పుల్లయ్య మృతి తీరని లోటు అని, ఆయన రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో హంద్రీనీవా పథకాన్ని సాధించడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బళ్లారి నగర మేయర్ ముల్లంగి నందీష్ తదితరులు కూడా నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి, సంతాపం హంద్రీనీవా పథకం సాధనలో పుల్లయ్య పాత్ర మరవలేనిది వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి -
బుద్ధుని బోధనలే మోక్షమార్గం
తుమకూరు: నేడు అధికారం, ఆస్తుల కోసం ఘర్షణలు ప్రతి చోట సర్వసాధారణం. కానీ 2600 సంవత్సరాల క్రితం అధికారం, ఆస్తులు, కుటుంబాన్ని వదిలేసి, మోక్షాన్ని కోరుతూ భగవాన్ బుద్ధుడు అన్వేషణ సాగించారు. ప్రజలకు ప్రశాంతమైన, సంపన్నమైన జీవితాన్ని అందించడానికి పాటు పడ్డారని వక్తలు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్రమంతటా బుద్ధ పూర్ణిమ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. తుమకూరు నగరంలోని డాక్టర్ గుబ్బివీరణ్ణ కళాక్షేత్రం జిల్లా యంత్రాంగం ద్వారా బుద్ధ జయంతిని ఆచరించారు. మన దేశంలో పుట్టిన బౌద్ధమతాన్ని నేడు మనం ఇతరుల నుంచి నేర్చుకోవలసిన పరిస్థితి రావడం విచాకరమన్నారు. మనిషిని విముక్తివైపు నడిపించే ఎనిమిది మార్గాలను బుద్ధ భగవానుడు బోధించారని పేర్కొన్నారు. ఆ మార్గాలను నేడు ఆసియాలో ఈశాన్య దేశాల్లో బోధిస్తున్నారని తెలిపారు. మంచి వాక్కు, మంచి పనులు, మంచి ప్రణాళిక, ప్రయత్నాలు మానవులను ముక్తి వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. బెంగళూరులోని మహాబోధి సొసైటీ బుద్ధుని ప్రతిమలకు విశేష పూజలు జరిపారు. పలు దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, భక్తులు పాల్గొన్నారు. బుద్ధుని బాట ఉత్తమం భగవాన్ బుద్ధుని తత్వ సిద్ధాంతాలను మనం ప్రతి ఒక్కరం జీవితంలో అలవాటు చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సిద్దార్థ విద్యాసంస్థలలో బుద్ధ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన తత్వ సిద్దాంతాలు, ఆచార విచారాలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ఆయన మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి మనిషికి దుఃఖం, కష్టం, సంతోషం అనేవి వస్తుంటాయి, పోతుంటాయని, వాటిలో పడి కొట్టుకుపోకుండా బుద్ధుని మార్గంలో సాగాలని అన్నారు. ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు -
పెళ్లివేడుకలో హాస్యనటుని విషాదాంతం
యశవంతపుర: హాస్య నటనతో అందరినీ నవ్వించే వర్ధమాన నటుని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కన్నడంలో వస్తున్న కామెడీ కిలాడీలు సీరియల్లో గుర్తింపు పొందిన హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) హఠాన్మరణం చెందారు. దక్షిణ కన్నడ జిల్లా కార్కళ నిట్టె సమీపంలోని మియ్యారిలో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి మెహందీ వేడుకలో పాల్గొన్న రాకేశ్ వేదిక మీదే కుప్పకూలారు. అతిథులతో మాట్లాడుతూ ఉండగా నేలకు ఒరిగిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయాడు. కార్డియాక్ అరెస్టే కారణమని వైద్యులు పరిశీలించి తెలిపారు. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్–1లో రాకేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ కోసం ఉడుపిలో ఉండిపోయాడు. షూటింగ్లో పాల్గొని, పెళ్లి వేడుకకు వెళ్లినట్లు తెలిసింది.నటనలో రాణిస్తూ ఉండగానేరాకేశ్ ఉడుపిలో దినకర్ పూజారి, శాంభవిలకు జన్మించాడు. 2018లో జీ కన్నడ చానెల్ కార్యక్రమం ద్వారా టీవీ నటునిగా వచ్చారు. తరువాత అనేక తుళు, కన్నడ సినిమాలలో నటించారు. విలక్షణమైన తమాషా నటనతో అలరించేవాడు. రియాలిటీ షోలు, కన్నడ సీరియళ్లలో నటన ద్వారా ప్రజల మనస్సులో స్థానం సంపాదించారు. రాకేశ్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాకేశ్ లేడని తెలిసి చాలా బాధగా ఉందని కన్నడ నటి రక్షిత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కరోనా వైరస్ తరువాత మధ్యవయస్కులు, యువకులు ఆకస్మాత్తుగా గుండెనొప్పితో చనిపోవడం పెరిగిందని సమాచారం. -
తోటలో నల్ల పునుగు
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా నాగసంద్ర గ్రామంలో అరుదైన నల్ల పునుగు పిల్లి కనిపించింది. బసవరాజు అనే రైతుకు చెందిన తోటలోకి వచ్చిన పునుగుపిల్లి ఓ చోట నక్కి ఉంది. అదృష్టం కొద్దీ అది కుక్కల కంట్లో పడలేదు. రైతు చూసి స్థానికులకు చెప్పడంతో అందరూ దానిని ఆసక్తిగా చూశారు. పట్టుకోవడానికి వెళ్తే అమాంతం కరవడానికి మీదకెగురుతోంది. ఇది నల్లరంగు పునుగుపిల్లి అని, ఇలాంటిది ఇక్కడ మొదటిసారి కనిపించిందని కొందరు తెలిపారు. బైక్‌ను టెంపో ఢీ, ఇద్దరు మృతి కృష్ణరాజపురం: ఆదివారం రాత్రి వేగంగా వచ్చిన టెంపో, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన హొసకోటె తాలూకాలోని చిక్క ఉళ్లూరు వద్ద జరిగింది. ఒడిశాకు చెందిన రుశికేశి (28), భక్తబందు (22) మృతులు. ముగ్గురూ బెంగళూరుకు వచ్చి కూలి పనులతో జీవించేవారని తెలిసింది. బైక్‌లో వస్తుండగా టెంపో ఢీకొట్టింది. బైకు మొత్తం నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హోసకోటె ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి తనయుడు హత్య యశవంతపుర: ఆస్తి వివాదంలో తల్లీ కొడుకును దారుణంగా హత్య చేసిన ఘటన బాగలకోట జిల్లా ఇల్కల్ తాలూకా నందవాడగి గ్రామంలో జరిగింది. సంగమ్మ గోనాళ (45), పుత్రుడు సోమప్ప (26)ను కొడవలితో నరికి హత్య చేశారు. ఆస్తికి సంబంధించి అదే గ్రామానికి చెందిన సణ్ణ సోమప్పతో గొడవలు ఉన్నాయి. సోమప్ప కక్షగట్టి హత్యలు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంకా మాసిపోని కుల జాఢ్యం ● ఆలయంలో పూజ చేయరాదని గొడవ తుమకూరు: దళిత యువకుడు దేవాలయంలో పూజ చేయడానికి వెళ్లగా కొందరు అడ్డుకుని దూషించారు. ఈ ఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డేరి వద్ద కవణగాల గ్రామంలోని శ్రీరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. స్వామినాథ అనే దళిత యువకుడు సోమవారం ఆలయంలోకి వెళ్లాడు, అక్కడ ఉన్న కొంత మంది యువకులు స్వామినాథ్‌ను అడ్డుకుని బయటకి తీసుకెల్లి, ఇకపై గుడిలోకి రావద్దని బెదిరించారు. ఈ గొడవను కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఊరిలో గొడవలు జరకుండా పోలీసులు, తహసీల్దార్ చేరుకుని శాంతి సమావేశం జరిపి, గుడిలో దళితులు పూజలు చేయవచ్చని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని, ఎలాంటి భేదభావాలు వద్దని, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగరాదని చెప్పారు. తహసిల్దార్ శిరిన్ రాజ్, అదనపు ఎస్పీ గోపాల్, డీఎస్పీ మంజునాథ్, అధికారులు పాల్గొన్నారు. రౌడీలూ.. నేరాలు చేయొద్దు దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పోలీస్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్‌తో పోలీసులు పరేడ్‌ను నిర్వహించారు. దొడ్డ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ–2 నాగరాజు ఆధ్వర్యంలో సాగింది. చుట్టుపక్కల ఊర్ల నుంచి మొత్తం 248 రౌడీషీటర్లు ఉండగా 118 మంది హాజరయ్యారు. కొందరు అనారోగ్యం వల్ల, మరి కొందరు జైల్లో ఉండడం వల్ల రాలేదు. ఇటీవల రాష్ట్రంలో నేరాలు పెరుగుతండడం వల్ల పోలీసులు రౌడీల మీద దృష్టి సారించారు. ఏఎస్పీ నాగరాజు మాట్లాడుతూ నేరాలకు పాల్పడితే తోకలు కత్తిరిస్తామని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే జైల్లో పెడతామని హెచ్చరించారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లను తొలగిస్తామని చెప్పారు. డీవైఎస్పీ రవి, పోలీసులు పాల్గొన్నారు. -
మామూలు నేరాల కంటే ఎక్కువ
బనశంకరి: సైబర్ నేరాల బాధితులకు, వయసుకు సంబంధం ఉందా అని ప్రశ్నిస్తే, అశ్చర్యం కలిగించే సమాధానం వస్తుంది. సైబర్ నేరాల గురించి రాష్ట్ర సీఐడీ పోలీసుల నివేదికలో ఇలాంటి కుతూహలం కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు నిత్యం ప్రజలకు గాలంవేసి లక్షలాది రూపాయలను దోచేస్తున్నారు. అన్ని వయసులవారు బాధితులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ వయసు వారు ఎక్కువగా ఎలాంటి మోసానికి గురయ్యారో సీఐడీ విశ్లేషణ చేసి, జాగృతి అభియాన చేపడుతోంది. వయసును బట్టి మారే మోసం ● సైబర్ వంచకులు 16 ఏళ్ల వయసు వారికి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపెట్టి , మధ్య తరగతికి పెట్టుపెడి పేరుతో మోసం చేస్తున్నారు. వృద్ధులను డిజిటల్ అరెస్ట్ ద్వారా బెదిరించి నగదు దోచేస్తున్నారు. ● 18–20 వయస్సు– ఈ వయస్సులో బాధితులు చాలావరకు విద్యార్థులు ఉంటారు. సోషల్ మీడియాలో శ్రమలేకుండా డబ్బు సంపాదించవచ్చునని నమ్మించి సైబర్ మోసగాళ్లు వలలో వేసుకుంటారు. నకిలీ లింక్ పంపించి నగదు దోచేస్తున్నారు. ● 30–45 వయసు– ఈ వయసువారికి సంపాదించాలని ఆశ ఎక్కువ. పెట్టుబడిపెట్టి అధిక ఆదాయం పొందాలని ప్రలోభ పెడతారు. షేర్‌మార్కెట్, అధిక వడ్డీ ఇచ్చే క్రిప్టో కరెన్సీ అని చెప్పి డబ్బు కాజేస్తారు. ● 50–70 ఏళ్లు – ఈ వయసువారు సంపాదించిన డబ్బును బ్యాంకులో పెడతారు. ఖాతాల్లో బాగా డబ్బున్న వారిని గుర్తించి డ్రగ్స్ కేసు, అశ్లీల వీడియోలు, ఫోటోలు, మనీ లాండరింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్టు అని బెదిరించి దోచేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు, టాస్కులు, షేర్లలో పెట్టుబడి, గిప్టులు, డిజిటల్ అరెస్ట్ తరహా కేసులు హెచ్చుమీరుతున్నాయని సీఐడీ డీజీపీ డాక్టర్ ఎంఏ.సలీం తెలిపారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, దీనికోసం కొత్త యాప్‌లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సైబర్ సురక్షత పట్ల జాగృతం చేస్తున్నామని, సైబర్ వంచకులు బెదిరించిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్లు దోచేస్తారిలా సీఐడీ విశ్లేషణలో కొత్త నిజాలు ప్రస్తుతం దోపిడీలు, హత్యలు లాంటి భౌతిక నేర కార్యకలాపాల కంటే వైట్‌కాలర్, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సైబర్ నేరాల మీద నిత్యం 100 నుంచి 200 ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. దేశంలో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చి తో పాటు మహానగరాల్లో జరిగే నేరాల్లో 20 శాతం కంటే ఎక్కువగా సైబర్ నేరాలు ఉంటున్నాయి. కన్నడనాట గత నాలుగేళ్లలో 52 వేల కేసులు నమోదైతే, పరిష్కరించినవి చాలా తక్కువ. యుద్ధం చాటున సైబర్ క్రైమ్స్ నకిలీ లింక్‌లతో జాగ్రత్త పోలీస్ కమిషనర్ సూచన శివాజీనగర: భారత్– పాకిస్తాన్ల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో సైబర్ వంచకుల గురించి జాగ్రత్తగా ఉండాలని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ ప్రజలకు సూచించారు. యుద్ధ వార్తలపై సామాన్య ప్రజల కుతూహలాన్ని వినియోగించుకునే సైబర్ వంచకులు తప్పుడు వార్త, ఫిషింగ్, నకిలీ లింక్‌ల ద్వారా మోసగించే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఇండో–పాక్ యుద్ధాల ప్రత్యేక దృశ్యాలు, వైరల్ వీడియోలు, ఆఫర్లు అంటూ ప్రలోభపెడతారన్నారు. అలా వచ్చే మెసేజ్‌లను నొక్కితే మీ ఫోన్లలో మాల్వేర్ చొరబడవచ్చు. నకిలీ లింక్‌ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాలను సైబర్ నేరగాళ్లు దొంగిలించవచ్చు. అత్యవసరంగా ఆర్మీ నియామకాలు అని వచ్చే మెయిల్స్‌ను, లింక్‌లను ఓపెన్ చేయకూడదన్నారు. వాట్సాప్‌తో పాటుగా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా స్వీకరించే అపరిచిత మెసేజ్‌ల జోలికి వెళ్లరాదని తెలిపారు. వచ్చినవాటిని డిలిట్ చేయాలని సూచించారు. కాగా, యుద్ధం దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. -
సిందూర్ కీర్తి సైనికులదే
● సీఎం సిద్దరామయ్య మైసూరు: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, ఏ కేంద్రం అడుగు వేసినా మద్దతుగా ఉంటామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. సోమవారం మైసూరు జిల్లాలోని హెచ్డి కోటెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య యుద్ధ విరమణ జరిగిందని, దీనిపై ఏమీ చెప్పలేమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని, ఈ కీర్తిని భారత సైన్యానికి వ్వాలి తప్ప ఏ పార్టీకి కాదని చెప్పారు. 1971లో జరిగిన యుద్ధానికి, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి చాలా తేడా ఉందని అన్నారు. దాని గురించి మాట్లాడలేమని, అప్పుడు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేర్వేరని చెప్పారు. తాము గ్యారెంటీ పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధిని కూడా చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉందని సీఎం అన్నారు. ఆర్థిక సమానత్వంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. బుద్ధుడు, బసవన్న, అంబేడ్కర్లు గొప్ప మానవతాదులు, వారు చూపిన మార్గంలో నేటి యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచానికి వెలుగు భగవాన్ బుద్ధుడు కోలారు: జగత్తులోని మహాన్ మానవతావాది బుద్ధుడు, ఆయన జగత్తుకు వెలుగులను నింపిన మహనీయుడు అని జిల్లాధికారి ఎం ఆర్ రవి కొనియాడారు. సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో నిర్వహించిన భగవాన్ బుద్ధ జయంతిలో పాల్గొని మాట్లాడారు. జగత్తులో ఏదైనా వైజ్ఞానిక ధర్మం ఉందంటే అది కేవలం బౌద్ధ ధర్మం అని ప్రఖ్యాత విజ్ఞాని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలిపారన్నారు,. జీవితంలో సహనం ఎంతో ముఖ్యమని భగవాన్ బుద్ధుడు బోధించారన్నారు. మంచిని గురించి తెలియజేసేదే బౌద్ధ ధర్మమన్నారు. పండిత్ మునివెంకటప్ప మాట్లాడుతూ ఆసియాలో అధిక భాగంలో ఆచరిస్తున్న మతం బౌద్ధ ధర్మమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, విధాన పరిషత్ సభ్యుడు ఎం ఎల్ అనిల్‌కుమార్, కన్నడ సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రెండు మూడురోజుల్లో గ్రేటర్ బెంగళూరు
శివాజీనగర: మరికొన్ని రోజుల్లో గ్రేటర్ బెంగళూరు అమల్లోకి రానున్నది. ఆ తరువాత పరిశుభ్రత అభియాన ద్వారా నగరంలో చెత్త తొలగించి స్వచ్ఛ బెంగళూరుకు కొత్త రూపం ఇస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం నగరంలో పులకేశినగర అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఎంఎల్డీ సామర్థ్యం నీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా సుమారు 30 వేల ఇళ్లకు నీరు అందుతుందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో రోడ్లకు రూ.130 కోట్లు, ఫ్లై ఓవర్‌కు రూ.43 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రేటర్ బెంగళూరు ద్వారా బెంగళూరుకు కొత్త రూపం ఇవ్వబడుతోంది. రెండు మూడు రోజుల్లో ఇది ప్రారంభమవుతుంది. ఆ తక్షణమే బెంగళూరులో స్వచ్ఛతా అభియానా చేపడతామని, ప్రజలు సహాయవాణికి కాల్ చేసిన వెంటనే చెత్తను తొలగించి శుభ్రం చేస్తారని తెలిపారు. గత బీజేపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి, ఆదాయం పాతాళానికి పడిపోయిందని ఆరోపించారు. కావేరి ఐదో దశ పథకం అమలులో ఉంది, బెంగళూరుకు నీటి కొరత ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు ఏ.సీ.శ్రీనివాస్, రిజ్వాన్ హర్షద్, ఎమ్మెల్సీ నాగరాజ్, ఆర్.సంపత్‌రాజ్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజధానిలో స్వచ్ఛ అభియాన డీసీఎం శివకుమార్ వెల్లడి -
భార్య ప్రసవం కోసం వచ్చి
యశవంతపుర(కర్ణాటక): ఎంతో కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశప్రజల ప్రాణాలు కాపాడుతున్న జవాన్లు సెలవుల్లో ఇళ్లకు వచ్చారు. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ నుంచి పిలుపురావడంతో ఉన్నఫళంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. చెల్లెలు పెళ్లి కోసం వచ్చిన జవాన్‌కు ఆర్మీ అధికారుల నుంచి అత్యవరసమైన పిలుపు రావటంతో కుటుంబసభ్యులు జవాన్‌కు సింధూరం దిద్ది విధులకు పంపించారు. ఈ ఘటన బీదర్‌లో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా భాల్కీ తాలూకా చందాపుర గ్రామానికి చెందిన బసవకిరణ బీరుదార పంజాబ్ అమృత్‌సర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 27న చెల్లెలు పెళ్లి కారణంగా సెలవుపై చందాపుర వచ్చాడు. ప్రస్తుతం భారత్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కారణంగా సెలవులు రద్దు చేసుకొని విధులకు రావాలని ఆర్మీ అధికారులు అత్యవసరమైన సందేశం పంపారు. దీంతో చందాపుర గ్రామస్తులు జవాన్ బసవకిరణకు సింధూర తిలకరం దిద్ది, హారతి పట్టి విధులకు సాగనంపారు. భారత సైన్యంలో పని చేస్తున్న జవాన్లకు అక్కా చెల్లెళ్ల అశీర్వాదం ఉంటుందని బసవకిరణ చెల్లెలు వచనశ్రీ తెలిపారు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసి హతం చేయటం విజయంగా భావిస్తున్నట్లు వచనశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. భార్య ప్రసవం కోసం వచ్చి భార్య ప్రసవం కోసం స్వగ్రామానికి వచ్చిన జవాన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో తిరిగి విధులకు వెళ్లాడు. కలబురిగికి చెందిన హనమంతరాయ సీఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్నేహ ప్రసవం తేదీ దగ్గర పడటంతో ఏడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్య పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ సంతోషంలో ఉండగానే కశీ్మరు నుంచి పిలుపు వచ్చింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వెంటనే విధులకు రావాలని చెప్పారు. దీంతో బాలింతగా ఉన్న భార్య, ఏడు రోజుల నవజాత శిశువునుంచి వీడ్కోలు తీసుకొని దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశసరిహద్దులకు బయల్దేరి వెళ్లాడు. స్నేహితులు, బంధువులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు. -
పసికందుపై లైంగిక దాడి
రాయచూరురూరల్: పసికందుపై మృగాడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సింధనూరు తాలూకా జవుళగేర వద్ద చోటు చేసుకుంది. సీఐ వీరారెడ్డి, ఎస్ఐ యర్రప్ప అంగడి తెలిపినమేరకు నాలుగేళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అజ్మీర్ సాబ్(25) అనే యువకుడు ఆ చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక బాధపడుతుండగా తల్లిదండ్రులు గమనించి ఏమైందని ఆరా తీశారు. సున్నిత భాగాల్లో రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించగా లైంగిక దాడి జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బైక్‌లు ఢీ... మహిళ మృతి రాయచూరురూరల్: రెండు బైక్‌లు పరస్పరం ఢీకొని మహిళ మృతి చెందింది. ఈఘటన సిందనూరు తాలూకా తుర్విహళ్లో చోటు చేసుకుంది. హత్తిగుడ్డకు చెందిన బైరమ్మ అనే మహిళ తన భర్త శరణప్పతో కలిసి చిక్కబేరిగి నుంచి స్వగ్రామానికి బైక్‌లో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో బైరమ్మ(40) గాయపడింది. ఎస్ఐ సుజాత నాయక్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బైరమ్మ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది. దొంగ అరెస్టు, బైక్‌లు స్వాధీనం●హొసపేటె: వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న హనుమంత అనే నిందితుడిని విజయనగరం జిల్లాలోని కొట్టూరు పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ.3 లక్షల విలువైన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఇతర కేసులతో సంబంధం ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది . కొట్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 13న ఉచిత కంటి వైద్య శిబిరం హుబ్లీ: క్యాటరాక్ట్ బ్లూడే సందర్భంగా పాతకోటసర్కిల్ వాసన్కంటి ఆస్పత్రిలో ఈనెల 13న ఉచిత సమగ్ర కంటి పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్చంద్రకాంత్ పూజార తెలిపారు. ఆయన ఆదివారం హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ అదే రోజు ఉదయం 9 నుంచి సాయంకాలం ఐదు గంటలు వరకు శిబిరం జరగనుందన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 9900 282644లో సంప్రదించాలన్నారు డాక్టర్ ప్రీతి,వినయ్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం కణేకల్లు: కణేకల్లులోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మంగళారతిల నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలను పఠిస్తూ కళ్యాణోత్సవాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. సిలిండర్ల దందా.. ఆరుగురి అరెస్ట్ కోలారు: అక్రమంగా సిలిండర్లు నింపుతున్న ఆరుమందిని ఉరిగాం పోలీసులు అరెస్టు చేశారు. బిజిఎంఎల్‌కు చెందిన పాత డిఎంఎస్ కార్యాలయం హోటళ్లు, గృహాలకు సరఫరా చేసే సిలిండర్లను సేకరించి వాటినుంచి ఇతర సిలిండర్లకు గ్యాస్ నింపి విక్రయిస్తున్న నాగాలాండ్‌కు చెందిన కోర్నాలిక్, అసోంకి చెందిన ఇషాక్, జార్ఖండ్‌కు చెందిన సుధీర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజీం, శేఖ్ ఇనావర్, రాజస్థాన్‌వాసి కబీర్ పుల్వాలి లను పోలీసులు అరెస్టు చేశారు. సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యంత్రాలు, గ్యాస్ సిలిండర్లు రవాణా చేయడానికి ఉపయోగిస్తున్న క్యాంటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శాంతరాజు తెలిపారు.